Saturday, 14 June 2014

అహోబిలం


అహోబిలం
నవ నారసింహ క్షేత్రాలు
హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

జ్వాలా నరసింహ క్షేత్రము
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి
నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశంలో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.అహోబిలం - నవ నారసింహక్షేత్రంఅహోబిలం - నవ నారసింహక్షేత్రంఆంధ్రదేశంలోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్రకృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

స్థలపురాణం:
“ఇందుగల డందు లేడని సందేహము వలదని,హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.

ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చిసంహరించిన సమయంలో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ---- अहोवीर्यं अहोशौर्यं अहोबाहुपराक्रमं नारसिंहं परं दैवम् अहोबिलं अहोबलं!అని కీర్తించారట.

అప్పటి నుంచి ఈ క్షేత్రం “అహోబలం” అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలంలోని గుహలో స్వయంభువుగా వెలసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యానుభూతికి లోనైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో!బిలం అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం.

హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపంతో నరసింహుడు అరణ్యంలోగర్జిస్తూ, క్ష్వేళిస్తూ, పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయనలో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవనారసింహ రూపాలని భావించబడుతోంది.

వీర రసావతార రూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మిగా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ చెంచెతను స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యంతో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పుకుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మిగా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరంఅరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లోదర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు నునరసింహ రూపుని గాదర్శన మీయ వేడుకున్నాడు.ఆనాడుగరుడునికి స్వామిసాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

ज्वालाङोबिल मालोल क्रोड करंज भार्गव योगानंद छत्रवट पावन नवमूर्तय: !!

జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావననార సింహ అను తొమ్మిది రూపాలుగా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలంలో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యైభక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధిలో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు.

నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడవేరు వేరుగా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చునన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయాల ప్రత్యేకత :
శ్రీ భార్గవనరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరంలో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే ”అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని”కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి: వీరు దిగువ అహోబిలానికితూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు.స్వామిప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లనునేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది.కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తేస్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామిఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లోవట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలనుఅభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామినవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలుమతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామిఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నేక్రోడ నరసింహ స్వామిఅని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి:ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మిమా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము. ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ, పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామిఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరంలో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్లతో చీల్చి చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈ స్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురుతాయి. కార్తీకమాసంలో నేతి దీపాన్ని స్వామి సన్నిథిలో వెలిగించి ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమతో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం“ అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్య కశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామిఎగువ అహోబిలానికి 6 కిమీ దూరం లో పావన నదీ తీరాన ఈ స్వామి కొలువు తీరిఉన్నాడు. నవ ఆలయాల్లోఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయనకే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీకరంజ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కిమీ దూరంలో ఈ స్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితంలో అభివృధ్ధిని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయనిచెపుతారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;--ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు. ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలుగా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకుగల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి : దిగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయంతో అలరారుతుంటుంది. ముఖ మండపం, రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తోనయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాల మీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు, వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరికనువిందు చేస్తాయి. ఈ శిల్పాకృతులను చూస్తుంటే అహోబిలం! అనడమేకాదు అహోశిల్పం! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైటకూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నంగా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వంగా దర్శించవచ్చు. కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహునకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు ఈ ఆలయంలో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధిలోఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవితో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలంలో స్వామి ఉగ్రరూపుడై ఉండటంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తిగా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం :
ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరంలో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీని నుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీని దర్శనం, స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుకలో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!! అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.ఉగ్ర స్థంభం


ప్రహ్లాదమెట్టు: 
ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికిమధ్య లోని ఒక గుహలో ప్రహ్లాదుని రూపందర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొనియాడబడుతున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిల మఠం:
ఆథ్యాత్మిక వికాసం కోసం, వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్ర శాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒక మఠం స్థాపించబడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు. అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను, దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యునిగా స్వీకరించాడు. ఈ బాలునికి సాక్షాత్తు స్వామియే యోగిరూపంలో వచ్చి, అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యునిగా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతిగా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యంలో వివిధ సేవా, అభివృద్ధి మత ప్రచార, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తంగా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచుగా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చటగా ఉంటుంది.పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం

పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం
లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మిని మనువాడిన క్షేత్రం!


నమ్మిన భక్తుల పాలిట కొండంత అండగా... దుష్టసంహారం చేయాల్సి వచ్చినప్పుడు పరమ రౌద్రంగా... దర్శనమిచ్చే స్వామి లక్ష్మీనారసింహుడు. నరమృగ శరీరంతో శత్రువులను చీల్చిచెండాడడమేకాదు ధైర్యంగా తనముందు నిలుచున్న అమ్మవారిని వలచి వరించడమూ స్వామికి వెన్నతో పెట్టిన విద్యే. ఇందుకు నిదర్శనమే నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం.

పెంచలకోన... చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారిందని చెబుతారు. తూర్పుకనుమల మధ్య సుందరమైన పర్వత శ్రేణుల్లో, సముద్రమట్టానికి సుమారు మూడువేల అడుగుల ఎత్తులో, నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. దక్షిణభారతదేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయం భక్తులకే కాదు ప్రకృతిప్రేమికులకు కూడా ఇష్టమైన ప్రదేశమనడంలో సందేహంలేదు. చెంచులక్ష్మిని వలచి వరించిన ఉగ్రనారసింహుడు ఈ ప్రాంతంలోనే లక్ష్మీనారసింహుడిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు, కులమతాలకు అతీతంగా ముస్లింలు సైతం అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకోవడం విశేషం.

ఇదీ కథ...
దశావతరాల్లోని నాలుగో అవతారమే లక్ష్మీనరసింహస్వామి అవతారం. దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వధించి, భక్త ప్రహ్లాదుడిని రక్షించిన అనంతరం వెలిగొండ కీకారణ్యంలో గర్జిస్తూ, సంచరిస్తూ ఉంటాడు ఉగ్రనారసింహుడు. ఆ సమయంలోనే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ ఉంటుంది. స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పరుగులు తీయగా చెంచులక్ష్మి మాత్రం నారసింహుడి ఉగ్రరూపాన్ని చూస్తూ అలా నిలబడిపోతుంది. దీంతో ఆమె ధైర్యసాహసాలకూ అందచందాలకూ నారసింహుడు ముగ్ధుడౌతాడు. చెంచురాజుకు కప్పం చెల్లించి మరీ చెంచులక్ష్మిని వివాహమాడతాడు. అటుపై వారిద్దరూ పెనవేసుకుని ఉన్న శిలావిగ్రహం ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణకథనం.

ఈ కారణంగానే ఇక్కడ కొలువైన స్వామి పెనుశిల లక్ష్మీనరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ పర్వతశ్రేణుల్లో కొలువైన నారసింహుడి జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచీ అధికసంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ సేవ చేసిన వారికి సర్వగ్రహ దోషాలూ పోతాయని ఒక నమ్మకం. స్వామివారికి వరపడు సేవచేయిస్తే సంతానం లేని దంపతులకు తప్పక సంతానం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

తొలిపూజ భక్తుడికే
పూర్వం గోనుపల్లి గ్రామానికి సమీపాన ఉన్న అరణ్యంలో ఆవులను మేపుకొనే గొల్లబోయుడికి స్వామివారు మొదటగా దర్శనమిచ్చి, తను ఈ ప్రాంతంలోనే శిలా రూపంలో వెలసి ఉన్నానని చెప్పి, ఈ విషయాన్ని గ్రామంలోనివారికి తెలియజేసి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. అయితే వెనుతిరిగి చూడకుండా గ్రామానికి వెళ్లమని చెప్పగా, గొల్లబోయుడు కుతూహలాన్ని ఆపుకోలేక  మార్గమధ్యంలోనే వెనుదిరిగి చూశాడు. తన మాటను ధిక్కరించినందుకు ఆగ్రహించిన నారసింహుడు శిలగా మారమని బోయుడుని శపించాడు. దీంతో తను చేసిన తప్పును తెలుసుకున్న గొల్లబోయుడు మన్నించి, అనుగ్రహించమని ప్రార్థించాడు. భక్తసులభుడైన ఆ స్వామి శాంతించి, ‘నన్ను దర్శించడానికి వచ్చే భక్తులు మొదటగా నిన్ను దర్శిస్తారు. ఆ తర్వాతే నా దర్శనానికి వస్తారు’ అని వరమిస్తాడు. ఈ గొల్లబోయుడి ఆలయం గోనుపల్లి గ్రామం సమీపంలోనే ఉంది. సప్త రుషుల నామాలతో ఏడు గుండాలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. ఈ క్షేత్రానికి 5 కి.మీ. దూరంలో భైరవకోన ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడి కొండల్లోని గుండంలో స్వామివారి విగ్రహానికి చక్రస్నానం చేయిస్తున్న సమయంలో సప్తరుషులు దివ్యఛత్రం పడతారని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఇక్కడి స్వామికి ఛత్రవటి నారసింహస్వామి అనే పేరు వచ్చింది.

ఇలా చేరుకోవచ్చు...
పెంచలకోన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచీ నెల్లూరుకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పెంచలకోన దేవస్థానానికి బస్సు సదుపాయం ఉంది. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. రైలు మార్గంలో వచ్చే భక్తులు నెల్లూరు స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి రాపూరు మీదుగా రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

- కోదాటి కిరణ్‌రెడ్డి 

శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామిశ్రీ నవ నారసింహ పుణ్యక్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్దమయినది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలము, గోనుపల్లి గ్రామమునకు 7 కీమీ దూరమున, నెల్లూరు పట్టణమునకు పశ్చిమభాగమున 80 కీమీ దూరంలో ఉంది . ఇక్కడ లక్ష్మి నారసింహ ఒకరిగా పిలవబడుతున్నారు . శ్రీ స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అల్లంత దూరాన ఆదిలక్ష్మి అమ్మవారునూ స్వయంభువుగా వెలిసి ఈ దేవ దేవేరుల భక్తాభిష్టఫలప్రదులై బ్రోచవారలను కరుణించి వారి కోరికలు నెరవేర్చుచున్నారు.

దశవతారాలలో మేటియై, కౄతయుగంలో అవతరించిన నాల్గవ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణలు అనగా దుష్ట రాక్షసుడయిన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లద రక్షణ చేసి తనచే సృజించబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమయినారు. ఇట్టి క్షేత్రాలలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రం అత్యంత మహిమాన్వితమయింది. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు 'సర్వం విష్ణుమయం జగత్' అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవ్యాప్తియే భక్తుల అభీష్టం మేరకు అచ్చటచ్చట అవతరించినారు. కృతయుగంలో, వైషాఖమాసంలో, స్వాతినక్షత్రంలో సాయంసంధ్య సమయంలో స్వామివారు ఆవిర్భవించారు.

ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడయిన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించి చెంచు రాజులకు కప్పము చెల్లించి, చెంచుపట్టిని చేపట్టి వివాహం చేసుకుని, ఆ సుందర వనితను పెనవేసుకుని నిరాకార శిలరూపమున ఇక్కడ స్థిరమయినట్లు చరిత్ర వలన తెలుస్తోంది.

శిలరూపంలో కుడి భాగమంతా నారసింహస్వామిగానూ, ఎడమ భాగమంతా చెంచులక్ష్మి అమ్మవారిగానూ, వక్షస్థలంలో బిలరూపంలొ ఉన్న రంధ్రం వైకుంఠానికి మార్గంగాను, ఆ మార్గం గుండా రాత్రాది కాలలందు దేవతలు వచ్చి స్వామివార్లను అర్చిస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం. స్వామివారు ఉగ్రరూపం దాల్చి కిందకు వచ్చినందుకు గుర్తుగా చంద్రాయుధం గీచినటువంటి గీం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.

ఈ క్షేత్రం తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్వయమవాతారమూర్తి వెనుక భాగంలో మహాశిలగిరి (గొప్ప పర్వతరాజం) ఉంది. ఇది పన్నగాకృతిగా నెల్లూరూ, కడప జిల్లాల మధ్యభాగంలొ, హిమగిరి తూర్పూ పశ్చిమ సముద్రాలకు కొలబద్దమానముగ ఉన్నట్లు, ఉత్తర దక్షిణముగా, శ్రీశైల వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్ద వలె కనిపిస్తుంది. ఈ సర్పాకృతి గల పర్వతముల యొక్క శిరోభాగంలో వరాహ క్షేత్రమున వేంకటేశ్వరుడు వెలిశాడు. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రం) చత్రవటి నారసింహుడు వెలసి, స్థితికారకుడై తనను ఆరాధించు భక్తులకు వరాలను ఇస్తూ, లయచక్రవర్తి అయిన పార్వాతీశుడు శ్రీశైల క్షేత్రమున వాల (అంత్య) భగమున వెలిసి ఆర్తులను ఆరాధింపచెయుచున్నడు.

మంగళగిరి - త్రి నారసింహ క్షేత్రంమంగళగిరి త్రి నారసింహ క్షేత్రంనవ నారసింహ క్షేత్రాలలో మంగళాద్రి క్షేత్రం ప్రముఖమైంది. అత్యంత ప్రాచీనమైంది. దీనిని త్రి నారసింహ క్షేత్రంగా కూడా చెబుతుంటారు. ఇక్కడి కొండపై స్వయంభువుగా వెలిసిన స్వామిని యుగయుగాల దేవుడిగా పరిగణిస్తున్నారు. మంగళగిరి పట్టణానికి ఈశాన్యంగా హ్రస్వశృంగి పర్వతం పేరుతో ఉన్న కొండకు దక్షిణ నైరుతికి మధ్యస్తంగా శ్రీ పానకాల నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. కొండకు దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం, కొండకు పూర్తి పైభాగంలో జ్వాలా నృసింహస్వామి పేరుతో శిఖరం లేని గూడు మాదిరి ఆలయం ఉన్నాయి. దీంతో మంగళగిరిని త్రి నారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తరువాత రెండో అతిపెద్ద ఆలయం మంగళాద్రి క్షేత్రమే. రాజధానికి అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద వైష్ణవ క్షేత్రం ఇదే. ప్రస్తుతం జిల్లాలో పెదకాకాని శివాలయం తరువాత ఎక్కువ ఆదాయం కలిగిన క్షేత్రం మంగళాద్రే. మరో రెండేళ్లలో జిల్లాలో మిగతా అన్ని ఆలయాలకన్నా మంగళగిరి నృసింహుని ఆదాయమే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

పానకం ఒలికినా..
భక్తులు భగవంతునికి నివేదించే ద్రవ్యాన్ని స్వయంగా ఆరగించే లీలా విన్యాసం భువి పై ఒక్క మంగళగిరి క్షేత్రంలోనే చూడగలుగుతాము. పానకాల నృసింహస్వామికి భక్తులు మొక్కుబడి ప్రకారం నివేదించే పానకం ఎన్ని బిందెలయినప్పటికీ అందులో సగ భాగాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. మిగతా భాగాన్ని తన ప్రసాదంగా కక్కివేస్తారు. ఇదే ఈ క్షేత్ర విశిష్టత. స్వామికి నివేదించే పానకాన్ని ఆలయ సన్నిధిలోనే ప్రత్యేక మండపంలో రోజూ డ్రమ్ముల కొద్దీ విరివిగా తయారు చేస్తారు. ఇక్కడ ఎంత పానకం ఒలికిపోయినా ఈగ వాలదు, చీమ కనిపించదు. ఇక్కడ ఆలయ దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే. ఆ తరువాత ఆలయ ద్వారం బంధనం చేస్తారు. అప్పటి నుంచి తిరిగి తలుపులు తెరిచేంత వరకు దేవతలు స్వామివారిని అర్చిస్తుంటారని ప్రతీతి.

స్థల పురాణం ఇదీ..
మంగళాద్రి క్షేత్రాన్ని గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించారు. కృతయుగంలో నమూచి అనే రాక్షసుణ్ని సంహరించేందుకు మహావిష్ణువు సుదర్శన చక్ర రూపంలో వెంబడించగా ఆ రాక్షసుడు ఇక్కడి కొండపై ఉన్న ఓ చిన్న బిలంలో దాగినాడట! శ్రీ విష్ణువు సుదర్శన చక్రంలో సూక్ష్మ రూపాన్ని ధరించి బిలంలో ప్రవేశించి ఆ రాక్షసుడ్ని సంహరించినట్టు పురాణ కథనం. ఆనక ఉగ్రరూపంలో ఉన్న మహావిష్ణువును శాంతింపజేసేందుకు శ్రీమహాలక్ష్మితో కలిసి దేవతలందరూ స్తోత్రం చేస్తూ శ్రీవారికి అమృతాన్ని నివేదించారట. ఇక్కడ శ్రీ స్వామివారు ఉగ్రరూపంలో దర్శనమిచ్చి దేవతాది మునుల అభ్యర్థన మేరకు శాంతించి బిలం ముఖద్వారం వద్ద రెండువైపులా శంకుచక్రాలతో స్వయం వ్యక్తమై భక్తుల పూజలందుకుంటున్నట్టు బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది. శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపం నృసింహరూపమే అయినందున స్వయం వ్యక్తమై ఉన్న ఈ స్వామిని నృసింహస్వామిగా వ్యవహరిస్తున్నారు. త్రేతాయుగంలో ఆవుపాలు, ద్వాపర యుగంలో నేయి, కలియుగంలో బెల్లం పానకాన్ని స్వామివారు నైవేద్యంగా స్వీకరిస్తున్నట్టు చెబుతారు. ఆ కారణంగానే ఈ స్వామికి పానకాల నృసింహస్వామిగా పేరువచ్చింది.నవ నారసింహ క్షేత్రాలునవ నారసింహ క్షేత్రాలు


దశావతారాల్లో నాల్గవ అవతారమే నరసింహావతారం. వైశాఖ చతుర్దశి రోజున నరసింహజయంతిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటాము. నరసింహ జయంతి అనగా మహావిష్ణువు బాలభక్తుడైన ప్రహ్లాదుని మాట నిలపడం కోసం, క్రూరుడైన హిరణ్యకశ్యపుని చంపి మానవులను, విష్ణు భక్తులైన మునులనూ కాపాడటం కోసం, హిరణ్యకశ్యపుని వరాలకు అతీతమైన అవతారం ఎత్తాడు. అదే నరసింహావతారం.

హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి. హిరణ్యకశ్యపుడు సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలనూ, మానవులనూ, మునులను సైతం బాధిస్తూ, బలగర్వంతో భూమిని పైకెత్తి సముద్రంలో వేస్తాడు. మునుల ప్రార్ధనతో విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిని కాచి, అతడ్ని సంహరిస్తాడు. దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించీ తపస్సు చేసి నరులవలన, స్త్రీపురుషులవలనా, ఏ ఆయుధం వలనా, పగలు, రాత్రి, నేలపైనా, ఆకాశంలో ఎక్కడా మరణం లేనివరం పొందుతాడు. అందువలన విష్ణుమూర్తి, ఆ వరాలకు అతీతమైన అవతారం ఎత్తవలసి వచ్చింది. నడుం వరకూ సింహం రూపంతో ఉండే విధంగా అవతరించి పగలు రాత్రికాని సాయంసమయంలో, తనవడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకుని సింహం గోళ్ళతో కడుపుచీల్చి సంహరిస్తాడు. అందువలన మానవ+ సింహ రూపం గనుక నరసింహావతారంగా పేరు వచ్చింది.

 1. అహోబిలం నరసింహస్వామి దేవాలయం - అహోబిలం
  నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటయిన అహోబిల నరసింహ స్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిమీ దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపున్ని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరట. అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారంలో స్థంబం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు.

  దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తిగా వెలసిన క్షేత్రం ఇది. 8 KM ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు. హిరణ్యకసపుడిని సంవరించి వికటాట్టహాసాలు చేస్తూ అహోబిలం కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

  (1) భార్గవ నరసింహ స్వామి
  (2) యోగానంద నరసింహ స్వామి
  (3) చత్రపట నరసింహ స్వామి
  (4) ఉగ్ర నరసింహ స్వామి
  (5) వరాహ నరసింహ స్వామి
  (6) మాలోల నరసింహ స్వామి
  (7) జ్వాల నరసింహ స్వామి
  (8) పావన నరసింహ స్వామి
  (9) కారంజ నరసింహ స్వామి

  నవ నరసింహ క్షేత్రాలు. ఫాల్గుణ మాసంలో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .

 2. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - యాదగిరి గుట్ట
  నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఋష్యశృంగ మహర్షి, శాంతల కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హును మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది. ఇప్పుదు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దారట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది. గర్బగుడిలో జ్వాల నరసింహ, యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి. కొండపైన స్వామి వారి పుష్కరని కూడా ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం.

 3. మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - మాలకొండ
  అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిచ్చాడని, జ్వాల నరసింహునిగా కొండ పైన వెలిసారు అని పురాణం గాథ. మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డులో వలేటివారిపాలెం మండల పరిధిలో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం. జ్వాల నరసింహుని పూజించిన మారకందేయ ముని సమీపంలోని యేరులో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు.

 4. నరసింహ స్వామి దేవాలయం - సింహాచలం
  విశాకపట్టనానికి 16 కి మీ దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది.  ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దమలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామీ వారు వరాహ ముఖం, మానవాకారం, సింహపు తోక కలిగి ఉంటారు. వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనంలో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖ మండపంలో ఒక స్థంబం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం. అద్బుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.

  వరాహ పుష్కరిణి
  ఈ పుష్కరిణి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిణిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరం కొండకి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .

 5. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - ధర్మపురి
  ధర్మపురికి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు. రాష్ట్రములో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టాన కేంద్రానికి 75 కి మీ దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేస్వరలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉంది. అనాది నుంచి శైవ,వైష్ణవ,ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉంది . ఇక్కడ స్వామి వారు యోగానంద నారసింహ స్వామిగ భక్తుల అభిస్తములు నేరవేరుస్తున్నాడు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చింది అని పురాణాలూ చేబుతునంయి

 6. వేదాద్రి నరసింహ స్వామి దేవాలయం - వేదాద్రి
  నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంది . ఈ క్షేత్రంలో నరసింహ స్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు . జ్వాల నరసింహ స్వామి, సలిగ్రంహ నరసింహ స్వామి, యోగ నంద నరసింహ స్వామి, లక్ష్మి నరసింహ స్వామి, వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. అద్బుతమైన కట్టడాలు, యోగముద్రలో ఉన్న నరసింహ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా, కనుల పండుగగా జరుగుతాయి .

 7. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - అంతర్వేది
  పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవొచ్చు. చాల పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం. త్రేతా యుగంలో రావణ బ్రహ్మను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అంతర్వేది. మాగ మాసంలో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగ జరుగుతాయి .

 8. పానకాల నరసింహ స్వామి దేవాలయం - మంగళగిరి
  నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహ స్వామి దేవాలయం గుంటు జిల్లా మంగళగిరిలో ఉంది. చాల పురాతనమైన దేవాలయం. దెవలయ గురుంచి మనకు బ్రహమైథ వార్త పురాణంలో వివరించాదం జరిగింది. కొండ మీద వెలసిన పానకాల నరసింహ స్వామి ఎంత పాత్రాతో పానకం పోసిన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది. కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది. దీని ముందు ఎత్తైన గాలి గోపురం ఉంటుంది.

 9. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - పెంచలకోన
  నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయంభూగా వెలసిన క్షేత్రం. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోనలో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభూగా వెలసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలవేల్పు అయి, కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపంతో వెళ్తుంటే దేవతలు అందరు బయపదిపోయారు. అలా శేష చలం కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింప చేసింది . ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతంలో వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది.