Sunday, 15 March 2015

ద్రాక్షారామం





ద్రాక్షారామ చుట్టుపక్కల శివాలయాలు

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని, ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారంలో ఉంటాయని, ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.

విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలులో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు…. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది…..

గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట …….

మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం……
మేష రాశి మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. ……
అశ్విని నక్షత్రం పాదం ———-స్థలం ——– దేవీ దేవతల నామాలు

మొదటి———బ్రహ్మపురి——-శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
రెండవ ——- – ఉట్రుమిల్లి ——-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
మూడవ—— కుయ్యూరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ దుగ్గుదూరు శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

భరణి నక్షత్రం మొదటి——కోలంక———శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ——-ఎంజారం——-శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
మూడవ——పల్లిపాలెం——శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ——ఉప్పంగళ——-శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కృత్తికా నక్షత్రం మొదటి——-నేలపల్లి———శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

వృషభ రాశి ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.

కృత్తికా నక్షత్రం రెండవ——అదంపల్లి——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మూడవ—–వట్రపూడి——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ—–ఉండూరు——శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

రోహిణీ మొదటి—–తనుమల్ల——–శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
రెండవ——-కాజులూరు——-శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ——ఐతపూడి——–శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ —– చీల ———శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మృగశిర మొదటి——–తాళ్ళరేవు——శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ———గురజానపల్లి——శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

మిధున రాశి. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.
మృగశిర మూడవ——– అంద్రగ్గి——-శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ——–జగన్నాధగిరి—— శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
ఆరుద్ర మొదటి——-పనుమళ్ళ——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ——–గొల్లపాలెం——శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మూడవ—-వేములవాడ—–శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
నాలుగవ——కూరాడ———-శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి
పునర్వసు మొదటి——-గొర్రిపూడి (భీమలింగపాడు)—-శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
రెండవ——–కరప———-శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ——ఆరట్లకట్ల—— శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి


కర్కాటక రాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
పునర్వసు నాలుగవ——యెనమాడల——–శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
పుష్యమి మొదటి——–కాపవరం——-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ———సిరిపురం——-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మూడవ——-వేలంగి———-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
నాలుగవ——–ఓడూరు——–శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
ఆశ్లేష
మొదటి——– దోమాడ——–శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
రెండవ———పెదపూడి——-శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ——-గండ్రాడు——–శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ——-మామిడాడ——-శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి

సింహ రాశి ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
మఖ నక్షత్రం మొదటి——నరసరావుపేట——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
రెండవ——–మెల్లూరు————శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ——అరికిరేవుల———-శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ——కొత్తూరు————శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి
పుబ్బ నక్షత్రం మొదటి——–చింతపల్లి———శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
రెండవ———వెదురుపాక——శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మూడవ——–తొస్సిపూడి——-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
నాలుగవ——–పొలమూరు—–ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
ఉత్తర నక్షత్రం మొదటి———-పందలపాక——–శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

కన్యా రాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర ఆలయం



Friday, 13 March 2015

అరుణాచలం





అరుణాచలం.. శివమయాచలం!

స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం. స్వయంభువుగా కొలువైన అక్కడి శివుడు అరుణాచలేశ్వరుడు. ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాల్లో కూడా అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులు, సంహితలు అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి.

శివరాత్రితో ముడిపడిన క్షేత్ర పురాణం!
అరుణాచలానికి ఎన్నో పేర్లున్నాయి. ప్రధానంగా శోణాద్రి (ఎర్రని కొండ)గా ప్రాశస్త్యం పొందింది. ఈ పేరు రావడానికీ, అరుణాచలానికీ- శివరాత్రికీ ఎంతో సంబంధం ఉంది.
దీనికి సంబంధించిన కథ ఇది.

బ్రహ్మ విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప?’ అనే వాదం తలెత్తింది. అది వివాదంగా మారింది. యుద్ధానికి దారితీసింది. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్రాల ప్రయోగానికి వారు సిద్ధమవుతున్న సమయంలో- బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభంగా పరమ శివుడు ఆవిర్భవించాడు. ఇదీ క్లుప్తంగా కథ.

అలా ఆవిర్భవించింది శివుడని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ప్రార్థించడంతో శివుడు సాక్షాత్కరించాడు. ‘‘త్రిమూర్తులలో ఎక్కువ, తక్కువలకు తావు లేదు. సృష్టి-స్థితి-లయాలకు ప్రతీకలుగా ముగ్గురినీ పరాశక్తి సృష్టించింది. ఆమె సంకల్పాలను నిర్వర్తించడమే మన కర్తవ్యం’’ అని హితబోధ చేశాడు.

శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి- అర్ధరాత్రి. ఆ రోజును మహా శివరాత్రి పర్వదినంగా యావద్భారతదేశం పాటిస్తోంది. మహాదేవుడికి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, నిర్వహిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శివనామాన్ని జపిస్తారు. శివాలయాలకు వెళ్తారు. రాత్రి జాగరణం చేసి, లింగోద్భవ సమయంలో (అర్ధరాత్రి) శివుడిని దర్శించి, అనుగ్రహ పాత్రులవుతారు.

ఆధ్యాత్మిక రమణాచలం!
మహాశివరాత్రి అనగానే తమిళనాడులోని అరుణాచలం గుర్తుకొస్తుంది. అరుణాచలం అనగానే భగవాన్‌ శ్రీ రమణ మహర్షి స్మరణకు వస్తారు. పధ్నాలుగేళ్ళ వయసులో అరుణాచలం వచ్చిన వెంకటరామన్‌ (రమణ మహర్షి) జీవితాంతం అరుణగిరి సానువులలోనే గడిపారు. అరుణాచలానికీ, రమణ మహర్షికీ మధ్య అంత విడదీయరాని బంధం ఉంది. ‘‘అరుణాచలాన్ని పాషాణాలు, ముళ్ళ పొదలతో కూడిన మామూలు పర్వతంగా భావించవద్దు. ఇది పరమేశ్వరుని ప్రతిరూపం. అరుణం అంటే శక్తి- పార్వతి, ప్రకృతి, అచలం అంటే నిశ్చలాత్మ, శివుడు, పురుషుడు. ప్రకృతీ పురుషుల సమ్మేళనం... సగుణ నిర్గుణా ఏకత్వ రూపం ఇది!’’ అని ఆయన అనేవారు.

హిమాలయాల కన్నా పురాతనం!
పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అరుణగిరి గొప్పతనాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. సృష్టికి పూర్వమే అరుణగిరి ఉందనీ, సూర్యుడి నుంచి విడివడిన భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుంచి ప్రకృతిలో సహజ సిద్ధమైన మార్పులు పొందుతూ చల్లబడి ఏర్పడిన తొలి పాషాణమయ స్థానం అనీ, ఇది ఆసియా ఖండంలో భాగం కాదనీ, అప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండంలో భాగమనీ, హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమనీ ధ్రువపరిచారు.

దీనికి సంబంధించి-
గంగాచ మూలభాగస్థా
యమునా గగనస్థితా!
సోమోద్భవ శిరోభాగే
సేవంతే శోణ పర్వతః!!
అని స్కాంద పురాణం స్పష్టంగా చెబుతోంది.

సాధారణంగా పర్వతాలు చెట్లూ, పుట్టలతో పచ్చగా ఉంటాయి. కాని అరుణగిరి ఆ పేరులోనే ఉన్న వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ‘‘అరుణగిరి అగ్నితత్త్వానికి సంకేతం. ఇది ధరిత్రికి హృదయం వంటిది. సత్య స్వరూపం. జ్ఞాన తేజస్సు. శ్రేష్టతమం’’ అని ఋగ్వేదం కీర్తించింది.

ముక్తిదాయకం గిరిప్రదక్షిణం
అరుణాచలేశ్వరుని దేవేరి అపీత కుచాంబ. నలుదిశలా ఎత్తైన ప్రాకారాలతో, అరుణగిరి సానువులో నెలకొన్న అతి విశాలమైన అరుణాచలాలయంలో శివ కుటుంబంలోని గణపతి, కుమారస్వామి ఆలయాలున్నాయి. ఈ గిరి చుట్టూ ముక్కోటి దేవతలు శివలింగాలను ప్రతిష్ఠించారు. అరుణగిరిపై దక్షిణామూర్తి కొలువు తీరాడు. బ్రహ్మాది దేవతలందరూ అరుణగిరి ప్రదక్షిణం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరమణ మహర్షి కూడా అరుణగిరి ప్రదక్షిణం చేయాల్సిందిగా భక్తులకు చెప్పడమే కాదు- ఆయన కూడా భక్తులతో కలిసి ప్రదక్షిణం చేసేవారు.

వైభవంగా శివరాత్రి
అరుణాచలంలో సంవత్సరంలో ఎన్నో పండుగలు, పర్వాలు జరుగుతాయి. అన్నిటిలో ప్రధానమైనది శివరాత్రి. ఆ రోజున దివారాత్రాలు అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. శంఖనాదాలు మిన్నుముడతాయి. కర్పూర హారతి ప్రకాశిస్తూ ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. ‘‘అరుణాచల శివా! అరుణాచల శివా!’’ అనే శరణు ఘోష దశదిశశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనూ దర్శించి భక్తులు తన్మయులవుతారు.

అత్యద్భుతమైన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు మంటపాలను, గోపురాలను నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ‘అరుణగిరి వాసం, ఇక్కడ మరణం ముక్తిదాయకం. ఇది గొప్ప తీర్థక్షేత్రం. స్మరించిన మాత్రాన ముక్తి కలుగుతుంది’ అని శివపురాణం ఉల్లేఖించింది. శివభక్తికి ప్రధాన క్షేత్రమైన అరుణాచలంలో ఈశ్వరుని, అపీత కుచాంబను, అరుణగిరిని దర్శించినవారికి ఆ ఆది దంపతుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఏ.సీతారామారావు