Thursday, 3 September 2015

నేర నిరూపణ చేసే శుచీంద్ర శివుడు

నేర నిరూపణ చేసే శుచీంద్ర శివుడు

  
తమిళనాడులో కన్యాకుమారి అగ్రానికి 12 కి.మీ. దూరంలో శుచీంద్రం వుంది. లింగరూపమైన శుచీంద్రుడు త్రిముత్ర్యాత్మక  స్వరూపుడైన స్వయంభు. అడుగున బ్రహ్మ, మధ్య విష్ణువు, పైన శివుడు వుంటారు. ఇది దత్తాత్రేయ క్షేత్రం. ఆయనకు "కోన రాయుడు" అని పేరు. శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా కన్నులారా తిలకిన్చారట. శివుడు ఆది శంకరుల వారికి "ప్రణవ మంత్రాన్ని" ఉపదేశించిన పవిత్ర స్తలం ఇది. ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడి స్వామిని అర్చిన్చాదట. కాగుతున్న నేతి లో మునిగి ప్రక్షాళన చేసుకోన్నాదట.స్వామి దయ వల్ల ఒళ్లంతా వున్న కళ్ళు అన్నీ పోయి మళ్ళీ మామూలు రూపాన్ని పొందాడని కధనం.
 
దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక శుచీంద్రం అని పిలువబడుతోంది. నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి, సభ పెట్టి, కాగుతున్న నేతి లో చేతులుంచి, బొబ్బలు రాక పొతే నిర్దోషి అని తేల్చటం ఈ మధ్య వరకు ఉందట. ముఖ మండపంలో ఒకే స్తంభం పై చెక్కిన పొడుగాటి వెదురు బొంగుల వంటి రాతి కర్రలలో నుంచి సంగీతం లోని సప్త స్వరాలు, వివిధ శ్రుతులతో వినిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఒకే స్థంభం మీద ముందు పురుషాకృతి, వెనుక స్త్రీ రూపం వుండటం మరో వింత.విభూతి తో అభిషేకం - తిరు చందూర్ 
తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరం లో సముద్రపు అంచున తిరు చందూర్ వుంది. ఇక్కడి సుబ్రహ్మన్యేశ్వర స్వామి  అత్యంత సంపన్నుడు. తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూర పద్ముడు పారి పొతే కుమార స్వామి వెంబడిస్తే, వాడు మామిడి చెట్టు గా మారి పోయాడు. స్వామి, బల్లెం తో చెట్టు నుంచి చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టు లో ఒక భాగ్సం నెమలి గా, రెండో భాగం కోడిగా మారాయి. ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధ మైన బల్లెం, ఆయనకు చిహ్నం గా పూజ లందు కొంటుంది ఇక్కడ. ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం.

తంజావూరు బృహదీశ్వరుడు
భారతీయ శిల్పకళా వైభవానికి గొప్ప ఉదాహరణ తంజావూరు. ఇక్కడి అతి ప్రాచీన "సరస్వతి మహల్" అనే పెద్ద గ్రంధాలయం వుంది. ప్రపంచ భాషల పుస్తకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పురాతన గ్రంధాలన్నీ ఇక్కడే దొరుకుతాయి. పరిశోధకుల పాలిటి కల్ప వృక్షం ఈ గ్రంధాలయం. ఇక్కడి బృహ దీశ్వరాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. బృహత్ అంటే చాలా పెద్దది అని అర్ధం.  బృహదీశ్వరలింగం నల్లరాతితో చేయబడి, 16 అడుగుల ఎత్తు, 21 అడుగుల కైవారం కలిగి  వుంటుంది.  ఆరు అడుగుల ఎత్తు పునాది మీద నిర్మించిన ఆలయమిది. ఇక్కడి నంది పందోమ్మిదిన్నర, ఎనిమిదిన్నర, 12 అడుగుల కొలతలతో 25 టన్నుల బరువుంటుంది. లేపాక్షి తర్వాత పెద్ద నంది ఇదే. నంది వున్న చోటు నుంచి 50 గజాల దూరం లో ఆలయం వుండటం మరీ విశేషం. ఆలయం వంద గజాల పొడవు, యాభై గజాల వెడల్పు వున్న పెద్ద ఆలయం. చాలా మండ పాలున్నాయి. విమానం ఎత్తు 216 అడుగులుతో 14 అంతస్తులతో వుండటం వింతల్లో వింత. చిట్ట చివరి శిఖరమే 20 అడుగుల ఎత్తు, 100 అడుగుల చుట్టు కొలతవున్న ఏకశిలగా ఉంటుందంటే, యెంత పెద్ద ఆలయమో ఇది అని ఆశ్చర్యమేస్తుంది.
Total area - 4 Acres.
Rajagopuram - 135 Feet.
Height of Giant Nandhi - 12 Feet.
Width of Southern area - 301 Feet.
Width of Northern area - 281 Feet .
Width of Western area - 244 Feet .
Width of Eastern area - 183 Feet.
No comments:

Post a Comment