Monday, 14 September 2015

కంచి - కామక్షి ఆలయం


కంచి(Kanchi) మన వాళ్ళందరికి సుపరిచితమే, తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు. మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల లిస్ట్ చేత పట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు. వార్కొ 150 ఇస్తే కంచిలో ఉన్న కామక్షి ఆలయం(Kamakshi Temple),  ఏకాంబరేశ్వర దేవాలయం, వామన మూర్తి ఆలయం, వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి ) చూపిస్తారు .
గుర్రం బండి వాళ్ళు  కూడా ఉంటారు (80 /-). నిజానికి  వరద రాజ స్వామి ఆలయం తప్ప మిగిలినవి 1కి.మి. లోపు దూరంలోనే  ఉంటాయి .

కాంచీపురం( Kanchipuram), కంచి(kanchi) లేదా కాంజీపురం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |
భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్ధానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.

శ్రీ కామాక్షి అమ్మవారిగుడి :
అమ్మవారి గుడి బస్సు స్టాండ్ కి దగ్గరలోనే కలదు. "కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి" అంటే "కన్ను". కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవిని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో  శ్రీ కామాక్షి దేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.
అమ్మవారి గుడిలోకి అడుగు పేట్టిన  వేంటనే మనకి సాదారంగ  ఏనుగు స్వాగతం పలుకుతుంది.
ఆలయ ప్రవేశానికి టికెట్ ఏమి లేదు.  మీరు ఆలయంలోకి వేళ్ళేముందు అమ్మవారి వాహనన్ని ఒకసారి చూసి వేళ్ళండి . ఒక కాలు పైకి ఎత్తి యుద్దానికి సిద్దంగా ఉన్నాను అని అమ్మవార్కి చెప్తున్నట్టు కనిపిస్తుంది .

అమ్మవారి గర్బగుడి దగ్గరవుతున్న సమయంలో వరుస రెండుగా విడిపొతుంది. మీరు లోపలి వరసలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్న వాళ్ళని  బ్రతిమిలాడితే (కస్తా ముట్టచెప్తే) అనుమతి  ఇస్తారు. ఖాళీగ ఉంటే  ఏ  సమస్య లేదు . మీరు అమ్మవారి దర్శనం అయిన తరువాత వెనక్కి వచ్చి మేట్లు ఏక్కితే మీరు అమ్మవారి ఉత్సావ మూర్తులు ఉన్నచోటికి వస్తారు. ఆక్కడ నుంచి అమ్మవారు చాల చక్కగ కనిపిస్తారు. మీరు ఎంతసేపైన  చూడవచ్చు . ఆక్కడ మీరు కాసేపు కుర్చునే వీలు ఉంటుంది. మీరు క్రిందకు దిగిన వేంటనే ఆదిశంకరుల దర్శనం  చేస్కోనవచ్చును. మీరు కాస్త గమనిస్తే ఆదిశంకరుల ఆలయం పక్కన (మీకు కుడిచేతివైపు అరుగు మీద - కాస్త పైకి ఏక్కితె) ఆది శంకరుల చరిత్ర బొమ్మలతో వివరించి ఉంటుంది . మీరు గుడిలో కాశి విశాలాక్షి అమ్మవార్ని కూడా చూడవచ్చు .
బయటకి వచ్చిన తరువాత  వేనకవైపు ఉన్న కోనేరు - వేపచెట్టు - అమ్మవారి గుడి - పెద్ద మండపం  చూడవచ్చు.


శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)      
అమ్మవారి ఆలయం కి అతి సమిపంలోనే వామనమూర్తి గుడి ఉంది (ఆలయానికి ఎదురుగ నడిచి కుడిచేతివైపుకు తిరగాలి.) . ఆలయంలో లోపల  చీకటిగ ఉంటుంది. మనం జాగ్రత్త చూడలి వామనముర్తి ఆకాశం  వైపు ఒకకాలు పేట్టి మరోకాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామన మూర్తిని మనం దర్శించవచ్చు.దర్శనానికి టికెట్ ఏమిలేదు.
ఆదిశేషునికి ప్రత్యేకమైన సన్నిధి కలదు.


రామనాధ స్వామి ఆలయం :
తిరిగి అమ్మవారి ఆలయనికి చేరుకుని అమ్మవారి ఆలయానికి కుడిచేతివైపు  నడిస్తే మనకి మైన్ రొడ్డు వస్తుంది. మళ్ళి మనం ఏడమచేతివైపు కి నడిస్తే   శంకర మఠం  దాటిన తరువాత  ఏకాంబరేశ్వర దేవాలయం కనిపిస్తుంది . ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగ రామనాధ స్వామి ఆలయం కనిపిస్తుంది.   రామేశ్వరం  వెళ్ళకుండానే   ఇక్కడే మీరు శివయ్య గార్ని దర్శించుకోవచ్చు  .

ఏకాంబరేశ్వర దేవాలయం:
ఇక్కడ మీకు కనిపిస్తున్న గాలిగోపురం ఎత్తు 192 అడుగులు
పంచభూతలింగక్షేత్రము లలో  కంచి లో పృధ్వీ లింగం  ఉంది. ఈ పంచభూత లింగములు వరుసగా
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం

మీకు పర్వతి దేవి శివుని కన్నులు మూయడం , అందువల్ల  జరిగిన పరిణామలు వళ్ళ పార్వతి దేవి తపస్సుకు బయలు దేరడం , ముందుగా కాశీ లో తప్పస్సు చేయడం , అక్కడనుంచి కంచి వచ్చి  మామిడ చెట్టు క్రింద సైకిత లింగం చేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం తత్ఫలితంగా  కంపానది పోంగడం పార్వతి దేవి ఇసుకతొ చేసిన లింగ కొట్టుకుని పొకుండా  ఆలింగనం చేసుకోవడం ..  శివుడు సంతొషించి అనుగ్రహించడం అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అరుణాచలం  లో  ఆర్దనారీశ్వరులుగా ఏకమవడం ఉండడము చూడగలము  .

మనం  గాలిగోపురం వద్దకు వెళ్ళగానే  ఆలయం వేనకవైపు అమ్మవారు తపస్సు చేసిన మామిడ చేట్టు మనం చూడవచ్చు. ఏకాంబరేశ్వరాలయం అని పిలుస్తున్నాం కదా నిజానికి  ఏకాంబరేశ్వరాలయం కాదు  ఏకామ్రేశ్వర దేవాలయం. ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు.
ఏకామ్రేశ్వరస్వామి ఆంటే  మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు .
ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం .
ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. 
ఈ మామిడి వృక్షం క్రింద పార్వతి పరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.
మీకు కంపనది .. కంపనది అంటే మన గోదారిలా ఉంటుంది అనుకోకండి. కోనేరులా ఉంది లోపల. ఇప్పుడు నీరు ఎం లేదు అక్కడ. మీరు వెళ్ళినప్పుడు నీరు ఉంటె చూసిరండి. మనం గాలిగోపురం దాటిన తరువాత  ఈ ఆలయానకి మధ్యలో మనకి కంపనది కనిపిస్తుంది .
మధ్యాహ్నం భోజనం కుడా (అన్నదానం) ఉంది .. కాకపోతే తక్కువ మందికి పెడతారు(50). ఆ టైం లో మీరు అక్కడ ఉంటె ప్రసాదం స్వీకరించి రండి .

కంచి కామకోటి పీఠం ;
సాక్షాత్తు ఆదిశంకరచార్యుల వారే పిఠాదిపతిగా ఉన్న పీఠం కంచి పీఠం. కాంచిపురంలో ఆలయాలు అన్ని తిరిగివచ్చి కంచిమఠంలో పీఠాదిపతులను దర్శించుకున్న తరువాత ఒక 2 గంటల పాటు శంకరేంద్ర సరస్వతి వారి బృందావనం దగ్గరలో గడపడం అంటే  చాల ఇష్ఠం. మీరు మధ్యాహ్నం 12-1  సమయంలో వేల్లితే పీఠాది పతుల  చేసే పూజమీరు చూడవచ్చు. పూజ అయిన తరువాత పీఠదిపతులు మనకి దర్శనం ఇస్తారు. కంచి మఠంలో మనం పీఠాదిపతుల ఇద్దరిని (Sri Jayendra Saraswati & Sri Sankara Vijayendra Saraswati ) దర్శించవచ్చు.

శ్రీ విజయేంద్ర  సరస్వతి (Sri Sankara Vijayendra Saraswati) వారు ఇక్కడే మనకు దర్శనం ఇస్తారు ..
The 7Oth Pontiff His Holiness Sri Sankara Vijayendra Saraswati Swamigal
మీరు మఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (The 68th Pontiff His Holiness Sri Chandrasekharendra Saraswati Swamigal ) వారి బృందావనం కూడ ఛూడవచ్చు .
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తేజస్సు ఇప్పడికి మనం ఇక్కడ  చూడవచ్చు .. మీరు ప్రత్యక్షంగ ఏప్పుడు చూడకపోయిన ఇక్కడ చూస్తే మనకు ఆలోటు తీరుతుంది.
మీరు అక్కడ ఉన్న స్వామీ వారి ఫోటో లు కూడా చూడవచ్చు .

కంచి మఠం వారి అన్నదాన సత్రం :
కంచి మఠం దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది . ఎక్కడ అంటే మీరు ఏకామ్రేశ్వర ఆలయానికి వెళ్లారు కదా .. అక్కడకి దగ్గరలోనే ఉంటుంది . పెట్రోల్ బంక్ పక్కనే అంటే మీకు ఈజీ గా అర్ధం అవుతుంది . కంచి వెళ్లి బయట ఎక్కడో భోజనం చేయడం కంటే ఇక్కడ ప్రసాద్దాన్ని స్వీకరించడం ఉత్తమం అని నా అభిప్రాయం .
మీరు ఈ ఫోటో చూసి లోపలికి వేళ్తరేమో  .. పక్కనే ఒక బుల్డింగ్ కనిపిస్తుంది చూడండి.. అదే సత్రం.. బయట తమిళం లో బోర్డు ఉంటుంది ...
*మీరు పూజ చూసిన తరువాత ఇక్కడికి వచ్చి భోజనం చేసి మఠానికి వెళ్తే మీరు పీఠాదిపతులను దర్శించిన మీరు అక్కడే విశ్రాంతి తిస్కోవచ్చు . ఆ టైం లో ఏ దేవాలయం తెరిచి ఉండదు .

కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము

ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో ఉండదు . కంచి మఠం నుంచి దగ్గరలోనే ఉంటుంది . అక్కడ ఉన్న వార్ని కుమరకోట్టము అని అడిగితె వాళ్ళకి అర్ధం అవుతుంది . ఈ  ఆలయ శివాచార్యులు శ్రీ కచ్చియప్ప శివాచార్యులవారిచే తమిళ భాషలో కందపురాణాము రచించారు . ఈ  కందపురాణాము కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించడం జరిగింది అంట.

ఈ ఆలయ గోపురం పక్కనే ఆనాటి జరిగిన సంఘనట చిత్రీకరించి ఉంటుంది . మీరు చూడవచ్చు.  సుబ్రహ్మణ్య ఆలయం లోపల శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించిన  మండపం ఉంటుంది .

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము


శ్రీ కుమారస్వామి ఆలయమునుకు దగ్గరలోనే శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము  ఉంది . మీరు గుడి బయటకు వచ్చిన తరువాత కుడివైపుకు నడిస్తే ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది . ఈ ఆలయం గుడి ఆటో వాళ్ళు చూపించారు . చాల పెద్ద ఆలయం ఇది . బహుశా అందుకే ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో కనిపించదు మనకు .
ఈ ఆలయం కోసం చెప్పమంటారా .. ఈ ఆలయం లోనే శ్రీ మహా విష్ణువు పరమశివుణ్ణి తాబేలు రూపంలో పూజించినట్లు పురాణము. అందుచేత  కచ్ఛపేశ్వరుడు అనిపేరువచ్చింది. కచ్చ అంటే తాబేలు అని అర్ధం . చాల పెద్ద ఆలయం అని .
ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే రోగాలు నివృతి అవుతాయని చెప్తారు . చాల మంది స్నానం చేస్తారు కూడా . ఈ ఆలయం లో మనం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి , శక్తి గణపతి , దుర్గా ,సరస్వతి , సూర్యునికి ప్రత్యేక సన్నిది ఉంది .
ఈ ఆలయం లో పెద్ద రావి చెట్టు ఉంది.  రావి చెట్టు పక్కనే ఒక శివాలయం ఉంది పేరు తెలియదు .ఆ ఆలయం పైన దక్షిణామూర్తి ఉంటటారు  .

శ్రీ కైలాస నాధుని ఆలయము


శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము నుంచి సుమారు 2km దూరం లో కైలాస నాధుని ఆలయము ఉంది. ఆలయం పక్కనుంచే దారి ఉంది. నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడాని చేప్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది మనకు కనిపిస్తుంది. ఆలయం బయట పార్క్  లాగ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగ ఉంటుంది. శివును చుట్టు ప్రదిక్షణం చెస్తే జన్మరాహిత్యము కలుగుతుందని భక్తుల నమ్మకము . 
మనకు కంచి అనగానే గుర్తుకు వచ్చేది బంగారు బల్లి కదా! బంగారు బల్లి, వెండి బల్లి రెండు వరదరాజ స్వామి గుడిలో ఉంటాయ్. మీరు ఇక్కడ నుంచి  కచ్ఛపేశ్వరుని ఆలయము దగ్గరకు వస్తే ఆటోలు ఉంటాయ్.. ఇక్కడనుంచి సుమారుగా3  km ఉంటుంది .. మీరు అక్కడే బంగారు బల్లి ని చూడగలరు .

శ్రీ వరదరాజస్వామి  ఆలయము

 

కంచిలో ప్రతి ఆలయ గోపురం ఇలానే ఉంటాయ్. అందులో ఏకామ్రేశ్వరస్వామి ఆలయంలో మనం చూసిన గాలిపురం తరువాత ఈ ఆలయ గోపురమే పెద్దది. వాడుకలో కోయిల్  - తిరుమల - పెరుమాళ్ కోయిల్ అని పిలబడు 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో  మూడవ స్థానమును ఈ వరదరాజస్వామి వారిదే. కోయిల్ అంటే శ్రీ రంగం శ్రీ రంగనాధ ఆలయము, తిరుమల అంటే నేను చేప్పాల? పెరుమాళ్ కోయిల్ అంటే వరదరాజస్వామి వారి ఆలయము .
బ్రహ్మదేవుడు చేసిన యాగంలో యాగ-గుండము నుంచి శ్రీ మన్నారాయణుడు శ్రీ వరదరాజ స్వామి రూపంలో అవిర్భావించినట్లు స్థలపురాణము .

బల్లి కధ --
ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు.
ఇక్కడ అమ్మవారు పేరు పేరుందేవి. మహావిష్ణువు నిజస్వరూపాన్ని చూస్తున్నామ అన్నట్టుగా ఈ ఆలయంలో మనకు దర్శనం ఇస్తారు. అదో గొప్ప అనుభూతు నేను ఇక్కడ మీకు చెప్పడం కష్టం. స్వామివార్ని చుసిన తరువాత మనం బల్లి దగ్గరకు వెళ్తాం . బల్లిని చూడటానికి టికెట్ తీస్కోవాలి. ఇక్కడ కోనేరును  ఆనంద పుష్కరిణి అంటారు . ఈ ఆనంద పుష్కరిణి లో వరదుని ప్రాచీన మూలవిగ్రహాన్ని 40 సంవత్సరములకు ఒకసారి వెలుపలకు తీసి 40 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు . 2019 జూన్ నెలలో మరల స్వామి వార్ని బయటకు తీసుకుని వస్తారంట..

* కంచి నుంచి శ్రీపురం(golden temple) వెళ్ళడానికి బస్సులు కలవు . కంచి నుంచి 2 -3 గంటల ప్రయాణం . కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం.

No comments:

Post a Comment