Thursday, 3 September 2015

కంచి - అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి


కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది .ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు .సాధారణం గా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది .అయితె కంచిలో మాత్రం ,ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం లో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం .కామాక్షి ఆలయం లో ,అమ్మ వారి ఎదుట బీజాక్షరాల తో ఉన్న యంత్రం ప్రతిష్టించ బడి ఉంది. పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత . 

ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది .విష్ణు కంచి లో వరద స్వామి ఆలయం ఉంది .ఇక్కడి వెండి బల్లి ని తాకితె పాపాలు పోతాయని భక్తుల నమ్మకం . కామ కోటి అంటే కామం తర్వాత వచ్చే మోక్ష దశ్శ .అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం .

No comments:

Post a Comment