Tuesday, 8 September 2015

కుంభకోణం - శ్రీ ఆది కుమ్భేశ్వర స్వామి దేవాలయం

తమిళనాడులో సుబ్రహ్మణ్య, వినాయక, శివాలయాలు లెక్కకు మించి ఉన్నాయి. ఆ తర్వాతనే వైష్ణవాలయాలు వస్తాయి. కుంభకోణం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఏడు మహా నగరాలలో ఒకటిగా భావిస్తారు. ఇక్కడున్న మహామాహం కొలనులో మహామాఘి  రోజున భక్తులు లక్షలాదిగా పవిత్ర స్నానాలు చేసి పాపాలను దూరం చేసుకొంటారు. మాఘ మాసంలో పన్నెండేళ్ళ కోసారి ఈ పవిత్ర మైన మహా మాఘి వస్తుంది. ఈ పుష్కరంలో అమృత బిందువు చిందటం వల్ల అంత పవిత్రమైనదని చెబుతారు. భారతదేశంలోని ఏడు పవిత్ర నదులు ఈ సరస్సులో ఆ రోజున దర్శనమిస్తాయని నమ్మకం. ఇక్కడ ఉన్న దేవాలయాలలో ముఖ్యమైనది ఆది కుమ్భేశ్వర దేవాలయం. దీని తర్వాత చెప్పా దగినది సారంగ పాణి దేవాలయం. ఆ తర్వాతా చూడ దగినవి రామస్వామి దేవాలయం నాగేశ్వర స్వామి దేవాలయాలు.
   adikumbheshvara_temple
7వ శతాబ్దంలో కుంభకోణం చోళ రాజులకు రాజదానిగా ఉండేది. కావేరి నది, అరసలార్ నదుల మధ్య ఈ క్షేత్రం ఉంది. శైవులకు అతి ముఖ్య మైన దేవాలయాల్లో అది కుమ్భేశ్వరదేవాలయం ఒకటి. కుంభకోణం పట్టణానికి మధ్యలో ఈ దేవాలయం ఉన్నది. దీనికి మూడు పెద్ద ప్రాకారాలు, మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురంకు తొమ్మిది అంతస్తులు ఉన్నాయి. దీని ఎత్తు 128 అడుగులు.  ఇక్కడి శివలింగపేరు ఆది కుమ్భేశ్వర లింగం. అమ్మవారు మంగలామ్బికా దేవి. 51 శక్తి పీఠాలలో ఇది ఒకటిగా భావిస్తారు. శివలింగం పై భాగాన ఎడమ వైపుకు కొంచెం వంగి ఉన్నట్లు కన్పిస్తుంది అందుకే దీనికి కుంభకోణం అనే పేరు వచ్చింది. కుంభం అంటే కుండ. కోణం అంటే వంపు. మరి కుంభం అనే పెరెండుకోచ్చిందని పూజారిని అడిగితే ఆయన - గరుత్మంతుడు అమృత భాండం(కుండ) తీసుకొని వెడుతుండగా ఇక్కడ ఒక అమృతపు చుక్క జారిపడిపోతుంటే శివుడు స్వయంగా అక్కడి ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృత బిందువు పడేట్లు చేశాడట. తర్వాత తానే ఆ కుండలో స్వయంభు లింగంగా ఉండిపోయాడట. అది తయారు చేస్తున్నప్పుడు పైన ఎడమ వైపు కొంచెం వంగి నట్లుగా వచ్చిందట. అందుకే కుంభ కోణం అని చెప్పాడు. ఇక్కడి నవరాత్రి మండపంలో 27 నక్షత్రాలు, ద్వాదశ రాశి చిత్రాలు, నవగ్రహాలు నల్ల రాతి స్థంభంపైన శిల్పీకరించి ఉండి, చూపరులకు సంభ్రమం కల్గిస్తాయి. స్వాముల ఊరేగింపుకు వెండి వాహనాలున్నాయి. ఆలయానికి పెద్ద ఏనుగు ఉంది. స్తంభాల పై శిల్పాలు మనోహరంగా ఉంటాయి.

సారంగపాణి దేవాలయం
Aaravamudhu - Thirukkudandai - Kumbakonam 1ఆదికుమ్భేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా శ్రీ సారంగపాణి దేవాలయం ఉంది. దీని ప్రాకారం గోపురాలు కన్నుల పండువుగా ఉంటాయి. ముఖ్యమైన మూడు శ్రీ మహా విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి. శ్రీ రంగం, తిరుపతి తర్వాత వైష్ణవ భక్తులు ఎక్కువగా సందర్శించే ఆలయం ఇదే. పది హేనవ శతాబ్దంలో నాయక రాజులు దీనిని పునరుద్ధరించారు. దేవాలయ విమానం సభా మండపం, రధం(కారు వారై) పన్నెండు రాతి స్తంభాల మీద సుందర విలసిత శిల్పాలతో ముచ్చటగా ఉంటాయి. 150 అడుగుల ఎత్తైన గోపురం 5 ప్రాకారాలు ఉంటాయి. ఇక్కడి పుష్కరిణిని స్వర్ణ తామర కొలను అంటారు. లక్ష్మీ తీర్ధం అని కూడా పిలుస్తారు. అమ్మవారు శ్రీ కమలా లక్ష్మీ దేవి. విష్ణు మూర్తి అరవ ముద్హన్ అనే అవతారంలో ఇక్కడికి వచ్చి లక్ష్మిదేవిని వివాహం చేసుకొన్నట్లు ఐతిహ్యం. ఈ ఆలయాన్ని మహారాష్ట్ర రాజు షాహాజీ అత్యంత వైభవంగా నిర్మించాడని పూజారి వివరించారు. సుమారు రెండు వేల ఏళ్ళ నాటి దేవాలయం ఇది. గోపురం, రధం అన్నీ కనువిందు చేసేవే. ఇక్కడ సారంగాపాణి వెనుక అది శేషునిపై పవళించిన శ్రీ మహా విష్ణువు, వట పత్ర వృక్షం ఉంటాయి.

 
   

శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం
Sarangapani_Paramapathanathan
పన్నెండో శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించిన దేవాలయం ఇది. చోళ శిల్పకల ఉట్టి పడుతుందిక్కడ. ఆది శేషుడు, సూర్యుడు అర్చించిన స్వామి నాగేశ్వర స్వామి. ఒకప్పుడు ఆదిశేషుడు భూబారం మోయ లేక ఇక్కడికొచ్చి శ్రీ నాగేశ్వర స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాడట. శివ పార్వతులు ప్రత్యక్షమై ఆయనకు భూభారాన్ని అలసట లేకుండా మోసే శక్తి సామర్ధ్యాలను వరప్రసాదంగా ఇచ్చారట. చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో మూడు రోజులు సూర్యభగవానుని కిరణాలు నాగేశ్వర మహా లింగం పై పడి భక్తులకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. 
                         
 శ్రీ రామ స్వామి దేవాలయం
images (4)
220px-Airavateshwarar_full images (6)
ఒకే ఒక్క గోపురం ఉన్న దేవాలయం. మహా మండపం ఉంది, రాతి రాధమూ ఉంది. రామ కద చెక్క బడి ఉంటుంది రధం మీద. వామన కధా, మీనాక్షి సుందరేశుల వివాహ ఘట్టాలు చెక్క బడి ఉంటాయి. సుగ్రీవ పట్టాభిషేకం కూడా చెక్క బడి ఉండటం మరీ ప్రత్యేకత. శ్రీరాముడు సీతాదేవి ఒకే పీఠంపై కొలువు దీరి ఉండటం మరో విశేషం. హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లున్న విగ్రహం ఆకర్శనీయం.
                        
దారాసురం
కుంభకోణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తంజావూర్ వెళ్ళే మార్గంలో దారాసురం ఉంది. ఇక్కడి శివుని పేరు ఐరావతేశ్వరుడు. ఆలయాన్ని పన్నెండవ శతాబ్దిలో రాజేంద్ర చోళ చక్రవర్తి కట్టించాడు. చాలా శిల్పసంపదకు నిలయంగా భాసిస్తుంది. ఇంద్రుని వాహనం అయిన ఐరావతం అనే తెల్ల ఏనుగు, యముడు ఈ స్వామి ని ఆరాధించి నట్లు ఐతిహ్యం. ముందున్న స్తంభాలు శిల్ప రమణీయంగా ఉంటాయి దీని ప్రత్యేకత వేరు అంటారు. ఇక్కడి కొలను పేరు యమ తీర్ధం అంటారు. ముందున్న మండపం గుర్రాలతో లాగుతున్న పెద్ద రాతి రధం ఉండటం విశేషం. ఇక్కడ స్వామిని అర్చించి వేడుకొంటే సంతానప్రాప్తి కలిగిస్తాడని పూజారి చెప్పారు.

స్వామి మలై
images (10) images (11) images (8)
 
కుంభకోణం – తంజావూర్ దారిలో దీనికి ఎనిమిది కిలో మీటర్లలో స్వామి మలై దేవాలయం ఉంది. ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర శివాలయం కింద భాగం లోను అరవై మెట్లు కొండ పైకి ఎక్కితే శ్రీ సుబ్రహ్మన్యేశ్వర దేవాలయం ఉన్నాయి. అరవై మెట్లు అరవై సంవత్సరాలకు ప్రతీకగా భావిస్తారు. శరవణభవుడైన ఆరుముగాల స్వామికి ఉన్న ఆరు దివ్య క్షేత్రాలలో స్వామిమలై ఒకటి. కావేరి తీరంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ కుమారుడైన(మురుగా) తండ్రి శివునికి ఓంకార రహస్యాన్ని బోధించాడట. అందుకే అంత ప్రసిద్ధి. దీనికి పురాణ ప్రసిద్ధ కద ఒకటి ఉంది. ఒకప్పుడు బాల మురుగన్ బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను సృష్టి ఎలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, ఆయన వేదంలోని మంత్రాలను, ప్రణవ మంత్రాన్ని పలికాడట. దాని అర్ధం చెప్పమని అడిగితే చెప్పలేక పోయాడు బ్రహ్మ. అప్పుడు కుమారస్వామి తానే బ్రహ్మ స్థానంలో ఉండి సృష్టి చేస్తూ బ్రహ్మ కంటే చాలా గొప్పగా జీవ సృష్టి చేస్తున్నాడట. చాలా కాలం దాకా ఈ రహస్యం తెలీదు. శివుడికి ఈ విషయం తెలిసి వచ్చి బ్రహ్మను నిర్బంధం నుండి వదిలెయ్యామని కోరాడు. బ్రహ్మకు ఓంకార రహస్యం తెలియనందు వల్లనే తాను అలా చేశానని తండ్రికి తెలిస్తే చెప్పమని అన్నాడు. తెలుసునంటే అందుకే త్రిమూర్తులలో నీకు అగ్రాసనాది పత్యం వచ్చింది అన్నాడు కుమారుడు. నీకు తెలుసా? అని కుమారున్ని ప్రశ్నించాడు తండ్రి. తెలుసునని చెప్పి ప్రణవ మంత్రం రహస్యాన్ని విశేషాలను మురుగన్ తెలియజేస్తే తాను కుమారుడికి శిష్యుడైనందుకు గర్వంగా ఉందని శివుడు అన్నాడట. అందుకని స్వామిమలై క్షేత్రానికి విశేష ప్రాధాన్యత కలిగింది.

No comments:

Post a Comment