Sunday, 13 September 2015

ఒంటిమిట్ట - అదిగో బద్రాద్రి ఇదిగో ఒంటిమిట్ట

ఇనవంశ తిలకుడైన శ్రీరాముడు విలంబి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించాడని ప్రతీతి. స్వామి జన్మించిన రోజునే ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కల్యాణం జరిపించడం అనాదిగా ఆనవాయితీ. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. భద్రాద్రిలో కల్యాణాన్ని వీక్షించిన భక్తులు అశ్వమేధ యాగాన్ని చేసిన ఫలాన్ని పొందుతారని బ్రహ్మపురాణం చెబుతోంది. ఇక్కడి కల్యాణ ముహూర్తమే దేశంలోని అన్ని రామాలయాలకూ ప్రామాణికంగా ఉంటోంది.అయితే ఈ సారి తెలుగు రాషా్టల్రు రెండుగా విడిపోయాక భద్రాద్రి రాముడికి దీటుగా ఒంటిమిట్టలో శ్రీరాముడికి అధికారికంగా పూజలు చేయ సంకల్పించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

నిజాంకాలంనాటి ఆనవాయితీ:
కల్యాణం వేళ స్వామివారికి నిజాం నవాబుల కాలం నుంచే పట్టు వసా్తల్రు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇవి కాక అంబసత్రం, చినజీయర్‌ మఠం, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తరపున పట్టు వసా్తల్రు అందజేస్తారు. తమిళనాడులోని శ్రీరంగం నుంచి పట్టు పవిత్రాలు, శేషమాలికలు తెస్తారు. తిరుచానూర్‌ పద్మావతి అమ్మవారి తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం 12 అడుగుల చీరను సమర్పిస్తుంది. తాడేపల్లిగూడెంకు చెందిన భక్తులు ఏటా ముద్ద కర్పూరంతో చేసిన దండలను బహూకరిస్తారు. రామనామాలతో ఉన్న ఈ దండలను సీతారాముల మెడలో వేస్తారు. వేసవిలో వడదెబ్బ నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా పానకం అందజేస్తారు. బెల్లం పానకంలో యాలకులు, మిరియాలు వేయడం వల్ల దాహార్తి తీరుతుంది. వడపప్పు ప్రసాదం తేలికగా జీర్ణం అవుతుంది. అద్భుత శిల్పకళతో అలరారే స్వామివారి కల్యాణ మండపాన్ని 1960లో గణపతి స్థపతి ఆధ్వర్యంలో నిర్మించారు.

శ్రీరామ నవమి వేడుకలకు కడప జిల్లా ఒంటిమిట్ట అత్యంత సుందరంగా ముస్తాబయింది. కోదండరాముని కళ్యాణం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికార లాంఛనాలతో చూడముచ్చటగా నిర్వహించేందుకు కడప జిల్లా ఒంటిమిట్టలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. రాష్ర్ట ప్రభుత్వం 50 లక్షలు, టీటీడీ 50 లక్షలు మంజూరు చేయటంతో పనులు శరవేగంగా సాగాయి. ఐదేళ్ల మాస్టర్‌ ప్లాన్‌తో భవిష్యత్‌ పనులను కూడా చేపడుతున్నారు. అధికారులు ఎక్కడా రాజీపడకుండా పనులను రాత్రింబవళ్లు చేయడం విశేషం.

పట్టు వసా్తల్రు, ముత్యాల తలంబ్రాలు:శ్రీ రామనవమి వేడుక సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం పట్టు వసా్తల్రు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనుంది. శ్రీరామనవమి రోజున డిప్యూటీ సీఎం కెఈ కృష్ణ్ణమూర్తి ఒంటిమిట్ట కోదండరామునికి ప్రభుత్వం తరపున పట్టువసా్తల్రు సమర్పించనున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువసా్తల్రు సమర్పించాల్సి ఉండగా ఆయనకు మనుమడు పుట్టినందున కొందరు సాధువుల సూచన మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కళ్యాణానికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పట్లు చేస్తున్నారు. కళ్యాణం నిర్వహించేందుకు 30 ఎకరాలకు పైగా చదును చేసి దాదాపు లక్షమంది భక్తులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలో నివాసం ఉన్న 86 కుటుంబాలను ఇళ్లను ఖాళీ చేయించి వాటిని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద వంకను కూడా పూడ్చివేశారు.

బ్రహ్మోత్సవాలు: 
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పూజలు, వేడుకలు, కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, తదితర కనువిందు చేసే కార్యక్రమాలతో పాటు ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. బ్రహ్మోత్సవాల దృష్టా్య ఒంటిమిట్టలో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఆరోజు ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు. ఉదయం 9 గంటలకు నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 నుంచి 10 గంటల వరకు వాహనసేవ, అదే సమయాల్లో కూచిపూడి, రామదాసు కీర్తనలు, జాంబవతి పరిణయం, బాలనాగమ్మ, కోలాటం, రామదండు, చెక్కభజన, కత్తిసాము, కేరళ కళాకారులచే వాయిద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

భక్తులకు సదుపాయాలు: 
ఇక దేవాలయం చుట్టూ చలువ పందిళ్లు, భక్తులకు ఎండ తగులకుండా షామియానాలు వేస్తున్నారు. దాదాపు లక్షమంది భక్తులు వస్తుండటంతో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అధిక సంఖ్యలో మంత్రులు, ప్రముఖులు, అధికారులు, భక్తులు రానుండటంతో పెద్ద ఎత్తున పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారు. రోడ్లనూ మరమ్మతు చేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

రామయ్య పెండ్లికి భద్రాద్రి ముస్తాబు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడపట సంస్కారం వేడుక వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత రామాలయం సమీపంలో ఉన్న జియర్‌మఠం నుంచి గరుడపటాన్ని మంగళవాయిద్యాల నడుమ అర్చక స్వాములు ఊరేగింపుగా రామాలయానికి తీసుకొచ్చారు. యాగశాలలో గరుడపటాన్ని ఉంచి ప్రాణప్రతిష్ట గావించి, ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ఆదివాసం జరిపి స్వామివారికి నివేదన సమర్పించారు.

మావూరి దేవుడు:రామయ్య పెండ్లి ఘడియలు దగ్గరపడుతుండటంతో భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కల్యాణ మండప ప్రాంగణాన్ని రూ.5 వేలు, రూ.3 వేలు, 2 వేలు టికెట్ల వారీగా విడదీశారు. సీఎం కేసీఆర్‌ కూర్చునే సెక్టార్‌లో ఏసీ, ఇతర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు కూడా ప్రాంగణంలో కూలర్లు, చుట్టూ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం రెండు లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేయించింది. ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల తయారీ కూడా జోరందు కుంది. బుధవారం గరు డాదివాహనం సేవ, రాత్రి తిరువీధిసేవ జరిపారు. 26న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ, 27న ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగాయి. 28న శ్రీ సీతారాముల కల్యాణం, 29న మహాపట్టాభిషేకం, 30న సదృశ్యం, 31న దొంగలదోపు, ఏప్రిల్‌1న ఊంజల్‌సేవ, 2న వసంతోత్సవం, 3న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీసీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువసా్తల్రు సమర్పించనున్నారు.

విశిష్టతలు.. 
విశేషాలు:భద్రాద్రిలో సీతారామ కల్యాణం సందర్భంగా ఆసక్తి కలిగించే కొన్ని సంప్రదాయాలు, విశిష్టతలు అనాదిగా కొనసాగుతున్నాయి. మండపేట (తూర్పు గోదావరి)కు చెందిన కె.వి.ఏ రామిరెడ్డి 20 ఏళ్లుగా కల్యాణ వేడుకలకు కొబ్బరి బొండాలు తెస్తున్నారు. కొబ్బరి చెట్టుకు కాయలు రాగానే పసుపు రాసిన గుడ్డ కట్టి పూజలు చేస్తారు. ఆ కాయలు 9 అంగుళాల పొడవు వచ్చేసరికి చెట్టు నుంచి కోసి, దీక్షతో నవమి నాడు స్వామికి సమర్పిస్తారు. ఈ కొబ్బరి బొండాలపై శ్రీరామ, జయరామ, జయజయ రామ, శ్రీరామరక్ష, జైశ్రీరామ్‌, సర్వజగద్రక్ష అనే అక్షరాలు రాస్తారు. వీటిని కల్యాణ మండపంలో ఉంచుతారు.

తూర్పుగోదావరి ఆనవాయితీ: 
కోరుకొండ (తూర్పు గోదావరి) నుంచి శ్రీకృష్ణచైతన్య భక్తమండలి సభ్యులు ఏటా రాముల వారి కల్యాణానికి కోటి ధాన్యపు గింజలను గోటితో ఒలిచి తలంబ్రాలను సమర్పిస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా తమ పొలాల్లో వరి పంట వేస్తారు. సేంద్రియ ఎరువులతో వరిని సాగు చేసి పంట చేతికొచ్చాక రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ, గోటితో ధాన్యం ఒలిచి పసుపు సంచుల్లో మూటలు కట్టి శిరస్సులపై ధరించి కల్యాణం సమయానికి తీసుకుని వస్తారు. ఈ సంప్రదాయం పాతికేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ కోటి బియ్యపు గింజలు స్వామివారికి తలంబ్రాలుగా వినియోగిస్తారు. భక్తులకు ఇచ్చే తలంబ్రాలు (అక్షతలు) ఇవికావు.

నిజాంకాలంనాటి ఆనవాయితీ: కల్యాణం వేళ స్వామివారికి నిజాం నవాబుల కాలం నుంచే పట్టు వసా్తల్రు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇవి కాక అంబసత్రం, చినజీయర్‌ మఠం, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తరపున పట్టు వసా్తల్రు అందజేస్తారు. తమిళనాడులోని శ్రీరంగం నుంచి పట్టు పవిత్రాలు, శేషమాలికలు తెస్తారు. తిరుచానూర్‌ పద్మావతి అమ్మవారి తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం 12 అడుగుల చీరను సమర్పిస్తుంది. తాడేపల్లిగూడెంకు చెందిన భక్తులు ఏటా ముద్ద కర్పూరంతో చేసిన దండలను బహూకరిస్తారు. రామనామాలతో ఉన్న ఈ దండలను సీతారాముల మెడలో వేస్తారు.

No comments:

Post a Comment