Wednesday, 9 September 2015

శ్రీ రంగం – శ్రీ రంగనాధ స్వామి దేవాలయం

108 శ్రీ వైష్ణవ దేవాలయాలలో అతి ముఖ్య మైనది శ్రీ రంగ క్షేత్రం. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశ రాజుల వల్ల బ్రహ్మ దేవుని వల్ల లభించిన విమానం శ్రీ రాముడు విభీషణుడికి ప్రసాదించాడని పురాణ కధనం ఈ విగ్రహాన్ని తీసుకొని విభీషణుడు అయోధ్య నుండి లంకకు వెడుతుండగా కావేరి నది దారిలో వచ్చింది. సమయోచిత కార్య క్రమాలు నిర్వహించటానికి ఆగాడు. తలపై నున్న శ్రీ రంగ విమానాన్నిదించి, దగ్గరలోని చంద్ర పుష్కరిణిలో స్నానం వగైరా ముగించుకొన్నాడు. శ్రీ రంగనాదునికి మధ్యాహ్న పూజ చేశాడు విభీషణుడు. అక్కడ శయనించాలని శ్రీ రంగ నాధుడు భావించాడు. ఇంతలో మునులు దేవతా గణం శ్రీ రంగ నాధుడు అక్కడ శయనించి ఉండటం చూసి నమస్కరించి ఆనందం పొందారు. రాజు ధర్మవర్మ వచ్చి తామందరి కోసం శ్రీ రంగ విమానాన్ని ఇక్కడే ఉంచమని విభీషణుడిని ప్రార్ధించాడు. మర్నాడు బ్రహ్మోత్సవం జరిపించాలనే తొందరలో విభీషణుడు వెంటనే బయల్దేరటానికి సిద్ధ మైనాడు. కాని రాజు ఆ బ్రహ్మోత్సవాన్ని ఇక్కడే బ్రహ్మాండంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. విభీషణుడు అంగీకరించటంతో వైభవంగా బ్రహ్మోత్సవాన్ని ఇక్కడే నిర్వహించారు. 
 
మర్నాడు విభీషనుడు శ్రీ రంగ విమానాన్ని నెత్తికి ఎత్తుకొని ప్రయాణం అవుదామను కొని ప్రయత్నిస్తే అది కదలలేదు. రంగానాదునితో తన బాధ వెల్ల బుచ్చుకొన్నాడు. ప్రత్యక్ష మైన శ్రీ రంగడు తాను ఈ కావేరి తీరాన్నే స్తిరపడాలని అనుకొంటున్నట్లు తెలిపాడు. ఇక్కడ నుండే దక్షిణ దిశ వైపు చూస్తూ అతన్ని, లంకను కాపాడతానని అభయమిచ్చాడు. నిశ్చింతగా విభీషణుడు లంక చేరి రాజ్య పాలన చేశాడు. కావేరి, కొల్లడం అనే రెండు నదుల మధ్య శ్రీ రంగ క్షేత్రం వెలసింది. ఈ రెండు కలలనై వద్ద తూర్పు దిశలో కలిసి పోయాయి. ఈ నదులు రంగ నాదునికి పూలదండలాగా అమరాయి. 

 images (1) images
 శ్రీ రంగ నాధుడు

 images (4) images (2) images (3)


శ్రీరంగ నగరం మధ్యలో నాలుగు చుట్టల ఆదిశేషుని పాన్పు పైనల్ల రాతి శ్రీ రంగ నాద స్వామి శయనించి కనీ పిస్తాడు. కుడి చేతితో కిరీటాన్ని చూపుతూ అన్ని లోకాలకు, సమస్త దేవతలకు తానే నాదుదానని తెలియ జేస్తున్నట్లుంటాడు. ఎడమ చేతితో జీవులందర్నీ తన్నే ఆశ్రయించి ఊరట చెండి స్వర్గాన్ని పొందమన్నట్లు కటాక్ష దృష్టితో కనిపిస్తాడు. కుడి చేత ప్రయోగ చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరో కుడి చేతితో అభయ ముద్ర, మరో ఎడమ చేతిలో గద ధరించి చిరునవ్వు చిలకరిస్తుంటాడు. శ్రీ రంగం విమానం పై పర వాసు దేవుని ఆకారం కన్పిస్తుంది. విమానం అంతా బంగారు రేకు తాపడమే. రంగ మండపాన్ని గాయత్రి మండపం అనీ అంటారు. విమాన కళాశాలు గాయత్రి తల పాగాగా, మండపంలోని 24 స్తంభాలు అర్చకులకు ప్రతి బింబాలుగా భావిస్తారు. 

రామానుజా చార్య – నమ్మాళ్వార్ – పెరియాళ్వార్ – గోదా దేవి 
పన్నిద్దరు ఆళ్వారులు ఇక్కడ స్వామిని అర్చించి తరించారు. ఇక్కడి గోపురాలు వేదాలతో కూడిన దేవతలని, అక్కడి వస్తువులన్నీ సకల శాస్త్రాలని అంటారు. ఆలయానికి ఉన్న ఏడు ప్రాకారాలు సప్త లోకాలకు ప్రతిబింబం అనీ అంటారు. పంచ రాధా పద్ధతిలో దక్షిణ సంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి. శ్రీ రంగాన్ని భూలోక వైకుంఠం  అంటారు. శ్రీ భగవద్రామానుజ సాంప్రదాయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కవి సార్వ భౌమడు కంబర్ కంబ రామాయణం ఇక్కడే రాసి స్వామికి వినిపించాడు. దిల్లీ పాదుషా కుమార్తె  తురక నాచ్చియార్ రంగ నాధుని ప్రేమించి, సేవించి ఆయనలో ఐక్యమైందిట. అర్జున మండపంలో ఈమెకు ఒక సన్నిధి ఉంది. రంగానాదునికి ఉదయం మొదటి సారిగా రొట్టె పాలు నైవేద్యం పెట్టటం సాంప్రదాయం. తిరుమంజనం సమయంలో స్వామికి గళ్ళలుంగీ అలంకారంగా తొడుగుతారు. పెరుమాళ్ వారికి తాంబూల సేవనంలో తమల పాకు పై సున్నంతో పాటు ముస్లిం పద్ధతిలో ఉప్పు కూడా రాస్తారట.

చోళరాజు ధర్మవర్మ కుమార్తె చోలకుల వల్లి అనే ఉదయూర్ నాచ్చియార్, కులశేఖర్ రాజు గారి కుమార్తె సెర కుల వల్లి శ్రీ రంగానిపై మరులుగొని ఐక్యమైన విశేష స్థలం శ్రీ రంగం. చోళ, పాండ్య, మహారాజులు స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే వారు. నవగ్రహ క్షేత్రాలలో శ్రీ రంగం శుక్ర గ్రహ క్షేత్రం అని పించుకొంటుంది. స్వామికి బంగారు వెండి హంసలు, పల్లకీలు కల్పవృక్షం, శేషవాహనలు, చంద్రప్రభ, గరుడ, అశ్వ హనుమంత వాహనాలున్నాయి. బ్రహ్మాండమైన రధం ఉంది.
Kulasekhara_Alwar
కులశేఖరాల్వార్ 
 i-5147461955636354593-5147465829696856498-(150x1000)

శిల్ప కళా విలాసం
శ్రీ వేణు గోపాల స్వామి సన్నిధి రంగ విలాస మండపంలో గోదాదేవి అయిన అందాళ్ల్ సన్నిధి ఉంది. కళా వైభవంతో స్తంభాలు ఎనిమిది వెయ్యి కాళ్ళ మండపం, శేషశాయర్ మండపంలో ఉన్నాయి. దశావతార చిత్రాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. ప్రసిద్ధ తెల్ల గోపురం ఇక్కడే దగ్గరలో ఉంది. దేవస్థానం ఎదురుగా గల ప్రదర్శన శాలలో పురాతన శిల్పాలు, నాణాలు, రాగి పాతరాలు తాళాలు విచిత్రమైన బొమ్మలు ఉన్నాయి. ఆసియాలోనే అతి ఎత్తైన గోపురం అని చెప్పబడే రాజ గోపురం ఎత్తు 236 అడుగులు. వెడల్పు 192 అడుగులు. శ్రీ సింగర్ స్వామి కట్టించిన గోపురమిది దీనిలో 13 ద్వారాలున్డటం విశేషం.

ఉత్సవ విశేషాలు
ప్రతి దినం ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది. చైత్ర మాసంలో విరుప్పాన్ ఉదయార్ జరిపించిన ఉత్సవం పది రోజులు జరుగుతుంది. తొమ్మిది రోజులు రధోత్సవం నిర్వ హిస్తారు. పౌర్ణమి నాడు కావేరి నదిలో గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని చేస్తారు. వైశాఖంలో సుదర్శన చక్ర దేవాలయంలో వసంతోత్సవం జరుపుతారు. శ్రావణంలో జేష్టాభిషేకం అనే తిరు మంజనం చేస్తారు. కవచాలు తీసేసి చేస్తారు. ఈ రోజు నుంచి నలభై రోజులు మూల విరాట్ ముఖ దర్శనం మాత్రమే ఉంటుంది. తిరు మంజనం జరిగిన మర్నాడు తిరుప్పావడై చేస్తారు. అనేక బస్తాల బియ్యం అన్నం వండి, రంగానాధుని సన్నిధి ద్వారం వద్ద రాశి పోసి అన్నభిషేకం చేస్తారు. తర్వాతా దీన్ని అందరికి ప్రసాదంగా ఇస్తారు. ఆషాడంలో 18, 28 రోజుల్లో శ్రీ వారితో కావేరికి వెళ్లి అమ్మా మండపంలో రెండు గంటలు తిరుమంజనం చేసి కావేరికి పసుపు, కుంకుమ రవికె సమర్పిస్తారు. దీన్ని ఆడి అంటారు. శ్రావణమాసంలో చేసే దాన్ని ఆవణి అంటారు. తొమ్మిది రోజులు జరుపుతారు. రంగానాదునికి చిన్న చిన్న పవిత్రాలు సమర్పిస్తారు. చివరి రోజు తీర్ధ వారి జరిగి ఆ రాత్రికి భక్తులకు వాటిని అందిస్తారు. భాద్రపదంలో పురట్టాషి చేస్తారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి విజయ దశమి వరకు గుర్రం వాహనం మీద సింగర్ తోపుకు తీసుకొని వచ్చి వాల్మీకి వృక్షానికి పూజ చేసి నాలుగు దిక్కులా వైపు బాణాలు వదులుతారు ఇదే నవరాత్రి. ఆశ్వయుజంలో ఐప్పషి ఉత్సవం చేస్తారు. ఇదే ఊయల ఊపటం. తొమ్మిది రోజుల వేడుక. ఇది తొమ్మిదో రోజు తిరు కొట్టారంలో జరిగే ధాన్యం కొలతలను శ్రీ రంగన్ద్దునికి చూపిస్తారు. ఈ నెలలో కావేరి పవిత్ర జలాన్ని బంగారు బిందెతో ఏనుగు మీద తీసుకొని వస్తారు. కార్తీక మాసంలో జరిగే దాన్ని కార్తికై అంటారు. కార్తీక గోపుర ద్వారంస్వామిని కూర్చో పెట్టి వద్ద ఎత్తైన ప్రదేశంలో టపాకాయలు కాలుస్తారు. తర్వాతా విగ్రహాలను ఆలయంలోకి చేరుస్తారు. ఏకాదశి నాడు తిరుమంజనం, రాత్రికి అర్జున మండపానికి తెచ్చి పచ్చకర్పూరంతో ఆరాధనా నైవేద్యం చేస్తారు. వెంటనే కార్తీక దీపారాదన శోభాయ మానంగా చేస్తారు. నమ్బెరు మాలలు అనే రంగనాద స్వామికి 365 దుప్పట్లు సమర్పిస్తారు. తర్వాతా రెండు గంటలకు శ్రీ పట్టార్ స్వాములతో కౌశిక పురాణ వ్యాఖ్యానం చేస్తారు. ద్వాదశి తెల్ల వారుజ్హామున పడసి ఎట్ట సేవ నిర్వహిస్తారు. అనేక రకాల పుష్పాలను, కర్పూరాన్ని స్వామి పై చల్లుతారు. దీన్ని దర్శించే జనం ఆనంద పరవశులవుతారు. ఈ పది ఎట్ట సేవను దర్శించటానికి కుటుంబంతో వచ్చిన విజయ రంగ చొక్కానాద రాజు అనే నాయక రాజు, పై ఏడాది కూడా దర్శించాలన్న కాంక్షతో ఇక్కడే ఉండి పోయాడట. 

మార్గశిరమాసంలో ఉదయం రెండు గంటలకే తిరుప్పల్లి, ఎలుచ్చి పడితిరువారాధన, అమావాస్యనాడు తిరు నేడుమ్చాన్దకం, రాత్రి అరయర్ వ్యాఖ్యానం అభినయం నిర్వ హిస్తారు. మోహినీ అలకారం వేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు మూల విరాట్ కు ముత్యాల అంగీ సమర్పిస్తారు. వజ్రాన్గిని నవరత్న కిరీటాన్ని అలకరిస్తారు. తెల్ల వారుజ్హామున నాలుగింటికే స్వామి వారు బయల్దేరి అయిదున్నరకు పరమ పద వాకిలి నుండి వేంచేసి, అల్వారులను కటాక్షించి, శ్రీ రంగ రాజ స్తవం విని, వెయ్యి స్తంభాల మండపానికి ఏడు గంటలకు వస్తారు. ఇక్కడ జరిగేది రావత్తు ఉత్సవం. అక్కడి నుండి తిరువని మండపంకు పదకొండింటికి చేరతారు. భక్తులు శ్రీ రంగా శ్రీ రంగా అని భక్తీ పులకితగాత్రాలతో పరవశంగా పిలుస్తారు. స్వర్గంలో శ్రీ మహా విష్ణువే దర్శనం ఇక్కడ ఇస్తున్నాడా అనే అనుభూతి పొందుతారు. వెయ్యి కాళ్ళ మండపంలో అరయర్ సేవ చేస్తారు. నమ్మాళ్వారుకు స్త్రీ అలంకారం చేసి స్వామి వద్దకు తీసుకొస్తారు. స్వామిని అర్చక స్వాములు చేతుల పై ఉంచుకొని భక్తులకు సేవ ను చూపిస్తారు. ఇదే తిరు కైత్తల సేవ. ఎనిమిదో రోజు అశ్వ వాహనం వేంచేసి చందన మండపం నుండి పట్టాభి రామ సన్నిధికి చేరతారు. దీనిలో ఉన్న అర్ధం ఏమిటంటే స్వామి వారిని ఆళ్వారులు దొంగి లించటానికి ప్రయత్నిస్తున్నట్లు, వారి నుండి తప్పించుకోవటానికి ఇసుకలో అటు ఇటు పరుగెత్తుతున్నట్లు చేయటం. పడవ రోజు నమ్మాళ్వార్ కు రంగనాధ స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తారు. పదకొండవ రోజు తీర్ధ గోష్టి తో వైకుంత ఏకాదశి ఉత్సవం పూర్తి. 

పుష్యమాసం లో చేసేది తై మకర సంక్రాంతి. మొదటి రోజున వెయ్యి కాళ్ళ మండపానికి ఎనభై కళశాలతో తిరుమంజనం కోసం తిరునాచ్చి అమ్మవారితో స్వామి వేంచేస్తారు. మాఘ మాసంలోమాశి తొమ్మిది రోజులు చేస్తారు. ఎనిమిదో రాజున ఇద్దరు దేవేరులతో స్వామి కోనేరు చేరి తెప్పోత్సవం చేయిన్చుకొంటాడు. కోనేరు ఉత్తర దిశలో ఉంది. మర్నాడు పండకాక్షి అనే 108 దివిటీలతో సూర్య ప్రభ ఉత్సవం చేస్తారు. నాల్గవ రోజు గరుడ వాహనం పై ఊరేగిస్తారు. మాఘ మాసంలో గరుడ సేవలో పాల్గొనటం కాశీకి వెళ్ళినంత పుణ్యం. ఫాల్గుణ మాస ఉత్సవాన్ని పంగుని అంటారు. పది రోజులు జరుగుతుంది పల్లకిలో శ్రీ రంగ నాధుడు ఉరయూర్ కు వెళ్లి అక్కడ తురక నాచ్చియార్ అనే చోళకుల వల్లిని స్వయంవర వివాహం చేసుకొని ఒకే సన్నిధిలో ఉభయులు ఉంటారు. తొమ్మిదో రోజు ఉత్తర ఫల్గునీ నక్షత్రోత్సవం రంగానాధుని ప్రధాన దేవి శ్రీ రంగ నాయకిని చూడటానికి చూడటానికి వచ్చే రోజుకు ముందే తురక నాచ్చియార్ తో కులికినందుకు ఈమెకు కోపం వచ్చి తన సన్నిధికి రావద్దని భర్త రంగ నాధుని శాశించిందట నమ్మాళ్వారు. నెమ్మదిగా నచ్చ చెప్పటం తో ఆమె శాంతించి ఇరువురు కలిసి దర్శన మివ్వటం ఇక్కడి ప్రత్యేకత. దీనినే శేర్తి సేవ అంటారు. సంవత్సరానికి ఈ ఒక రోజే ఈ సేవ జరుగుతుంది.

No comments:

Post a Comment