Tuesday, 15 September 2015

మావుళ్ళమ్మ - భీమవరం


బెజవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక తరువాత అంతటి మహిమగల తల్లిగా కొనియాడబడుతున్న భక్తుల పాలిటి కల్పవల్లి భీమవరం మావూళ్ళమ్మ. తొమ్మిది దశాబ్దాల క్రితం భీమవరం అనే గ్రామంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్టరూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఆ మహిమాన్విత కల్పవల్లి మావూళ్ళమ్మ విశేషాల.

-చారిత్రక నేపథ్య కోణం లో చూస్తే... మావుళ్ళమ్మకు శతాబ్దానికి మించిన చరిత్ర ఉంది. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరిందట. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెళ్ళి వెతకగా అమ్మవారి విగ్ర హం లభ్యమయ్యిందట. అప్పుడు వారు అక్కడ ఒక పాక వేసి అమ్మ వారిని నిలిపి ఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో ‘మామిళ్ళమ్మ’గా తదనంతరం ‘మావుళ్ళమ్మ’గా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.

ఇతర విశేషాలు...
-ఇప్పుడున్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూసేందుకు భయపడేవారు. ఆ తల్లి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రస్తుతం శాంతమూర్తిగా దర్శనమిస్తున్నారు. 1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు ద్వారా అమ్మవారి విగ్రహ పునర్నిర్మాణం జరిగింది. ఆయన గర్భాలయానికి నిండుగా అమ్మ వారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రళయ భీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూ పిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్ర క్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు. మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ... గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మ వారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.

ఉత్సవ విశేషాలు...
ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రదర్శ నలకు పిలుస్తూ తగిన పారితోషి కాలతో ప్రోత్సహించడం. ఇక్కడ తొలి రోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు జరుగుతుంటాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు. ఇలా అనేక ప్రదర్శనలు జరుపు తుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటిక ప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నట్టు అంచనా.

No comments:

Post a Comment