Tuesday, 8 September 2015

కంచి – శ్రీ సంజీవ రాయ దేవాలయం

తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కంచి పట్టణానికి సమీపంలో పాలార్ నదిని దాటగానే అయినా కులం గ్రామంలో విజయనగర రాజుల మంత్రి శ్రీ తాతాచార్యుల వారు స్వయంగా నిర్మించిన శ్రీ సంజీవ రాయ దేవాలయాన్ని అత్యద్భుతంగా, నభూతోగా అనేక ప్రత్యేకతలతో నిర్మించి తన ఆంజనేయ భక్తిని చాటుకొన్నారు.

సాధారణంగా ఏదైనా దేవాలయానికి చిన్న కోనేరు లేక పుష్కరిణి ఉంటుంది. ఇక్కడి సంజీవరాయ కోనేరు 136 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండటం మొదటి ప్రత్యేకత. మామూలుగా స్వామి గర్భగుడి చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్దదిగా ఉండటం రెండో విశేషం. పుష్కరిణి దగ్గరుండి చూస్తుంటే ఆలయం పుష్కరిణిలో తేలియాడుతునట్లున్డటం మరో ప్రత్యేకత. అంత పరమాశ్చర్యంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ కోనేరు నీరు వ్యవసాయానికి కూడా ఉప యోగించటం మరో వింత.

సరస్సుకు దక్షిణాన తాతాచార్యుల వారు శ్రీ సంజీవరాయ ఆలయాన్ని నిర్మించారు. రాజ గోపురం కోనేరు ముఖంగా ఉంటుంది. ఇతర దేవాలయాల్లో కాకుండా ఈ దేవాలయ ప్రవేశం చేయాలంటే 24 స్తంభాలున్న విశాల మడపంలో నుంచి వెళ్ళాలి ఇది ప్రత్యేకతల్లో ప్రత్యేకత. మండపంలో ఆచార్యల ఋషుల సుందర విగ్రహాలు కమనీయం, రమణీయంగా ఉంటాయి. ఇక్కడి శిల్పకళ పరమ రామణీయకంగా ఏకైక ప్రత్యెక తరహాలో కనువిందు చేస్తుంది. ఈ విశాల మండపాన్ని దాటి వెడితే శ్రీ సంజీవరాయ స్వామి పవిత్ర గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. స్వామి అంజలి ఘటించి దర్శన మిస్తారు. వెనుక శంఖు చక్రాలుంటాయి. కృపా దాక్షిణ్య నేత్రాలతో భక్తులను అనుగ్రహిస్తున్నట్లు స్వామి కనీపిస్తారు. స్వామి ఆలయానికి కుడిప్రక్క శ్రీ లక్ష్మీ అమ్మ వారి దేవాలయం. సుమత్రా, సియాం దేశాల వర్తకులు ఇక్కడికి వచ్చి భక్తితో స్వామికి కానుకలు సమర్పించినట్లు ఆలయ గోడల మీద శాశనాలున్నాయి.

ఆగ్నేయ, వాయవ్య మూలల్లో రెండు పెద్ద మండపాలున్నాయి. శ్రీ రామనవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామివారు  తన ఇష్టదైవం కళ్యాణ శోభను తిలకించి పులకిన్చుతాడు. కంచి వరదరాజ స్వామి చ్చైత్ర పౌర్ణమి నాడు ఈ సంజీవరాయ దేవాలయానికి విచ్చేసి సంజీవరాయనికి దర్శనమివ్వటం ప్రత్యేకత సంతరించుకొంటుంది. ఆ రోజే శ్రీ హనుమజ్జయంతి.

శ్రీ తాతాచార్యుల వారి గురించి కొంత తెలుసు కొందాం.
క్రీ.శ.1584 -1614 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వెంకటపతి మహారాజు ఆస్థానంలో శ్రీ నేట్టూర్ తాతాచార్యుల వారు మంత్రిగా ఉన్నారు. తాతా చార్యుల వారు అనేక దేవాలయాలను నిర్మించారు. కోటి కన్యాదానాలు జరిపించారని ప్రతీతి. అందుకే వారికి నేత్తూర్ర్ కోటి కన్యాదాన లక్ష్మీకుమార తాతా చార్యులు అనే పేరొచ్చింది. శ్రీ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఆచార్యుల వారి మీద అపారంగా ప్రసరించటం వాళ్ళ ఇది సాధ్యమైనదని చెబుతారు. ధనలక్ష్మీ కటాక్షం ఉన్నందు వల్లనే ఇన్ని కన్యాదానాలు చేయించారు అందుకని ఆయన్ను లక్ష్మీదేవి పుత్రునిగా భావిస్తారు. ఉభయ వేదాంతాచార్యులు అని వారికి గౌరవ నామం ఉంది. వీరు తిరు నంబి వంశీకులు. నేట్టూర్ నుండి విజయనగర రాజధాని అయిన అనే గొందికి కుటుంబం మారింది. విజయనగర పాలకుడు విరూపాక్ష మహారాజును సందర్శించి అనేక సన్మానాలు పొందారు. మహాభారతం పై అనేక ప్రదేశాలలో మహోపన్యాసాలు చేసిన ధన్యజీవి శ్రీ ఆచార్యులవారు.

No comments:

Post a Comment