Thursday, 10 September 2015

తంజావూరు బృహదీశ్వరాలయం 090

తంజావూరు బృహదీశ్వరాలయం


ఇది వేయి సంవత్సరాల పురాతనమైనక్షేత్రం ...
భారతదేశంలోని అతిపెద్ద శివలింగంఉన్న క్షేత్రం..
దక్షిణకాశీగా పేరొన్నికగల క్షేత్రం...
ఈ ఆలయంలో చాలా మిస్టరీ/వింతలు దాగి ఉన్నాయి..
పదమూడు అంతస్థుల గోపురం కలిగిఉన్న ఏకైక పురాతన క్షేత్రం..

ఒక మిస్టరీ
ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడినది..
ప్రస్తుతం రాతికి సంబంధించి గ్రానైట్ కన్నా ధృఢమైనది లేదు... కానీ ఈ కట్టడం వేయి సంవత్సరాల క్రితమే... ఎనభై టన్నుల ఏక శిలతో చేసిన గోపుర కలశం పదమూడు అంతస్థులపైన ఎటువంటి వాలు లేకుండా నిలబెట్టడం ఒక మిస్టరీ!!

మిట్ట మధ్యాహ్నం ఈ గోపురపు నీడ ఎక్కడా పడదు..

ఇలా అన్ని కాలాలలోను మనం చూడవచ్చు.. గోపుర ఆకారం.. కలశ ఆకారం.. ఎనభై టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడ మోపడం చాలా నైపుణ్యానికి ప్రతీక...
ఈ ఆలయ ప్రాంగణం దాదాపు ఒక పర్లాంగు దూరం ఉంటుంది.. చాలా సువిశాలం... అయినా మనం మాట్లాడుకునే శబ్దాలు ప్రతిధ్వనించవు.. అంతటి శబ్ధ పరిజ్ఞాన నైపుణ్యంచే నిర్మించబడినది ఆలయం...
ఆలయం లోపల చాలా సొరంగ మార్గాలున్నాయి.. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులను కలిగిఉన్నాయని.. అన్ని దారులను మూసి వేశారు... ఇవి ఈ ఆలయాన్ని నిర్మించిన రాజ రాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం అలా చేసారని ఒక వినికిడి..
ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి.మి. కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు వారి డ్రిల్లింగ్ పరిజ్ఞానానికి మచ్చుతునక..

అందుకే ఈ గుడికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది... వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడు పడిన స్థితిలో ఉంటాయి.. కానీ ఈ గుడి చాలా అద్భుత ఆకర్షణతో... ఇంకా క్రొత్త గా నిర్మించినట్లు ఉంటుంది..
ఇలా ఎన్నో ఆకర్శణలు.. ఈ ఆలయంలో ఉన్నాయి.

No comments:

Post a Comment