Thursday, 3 September 2015

తిరువన్నా మలై - మూడు రోజులు వెలిగే అగ్ని గుండం

తిరువన్నామలై తమిళనాడులో ప్రసిద్ధ శైవక్షేత్రం. అరుణాచలేశ్వరుడు అగ్ని స్వరూప శివ లింగం. లింగోద్భవ కాలమ్ లో శివుని రూప రహశ్యం తెలుసుకోవాలని బ్రహ్మ , విష్ణువు ప్రయత్నిస్తారు. వారికి అంతు దొరకలేదు. అప్పుడు శివుడు తన అగ్ని స్వరూపాన్ని ఉప సంహరించు కోని, కొండ రూపంలో వారి ముందు వెలిశాడు. ఆలయానికి వెనుకగా ఈ కొండ ఉండటం మనం చూస్తాం. కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది భక్తులు అరుణాచలేశ్వరుని సందర్శించి తరిస్తారు. ఆ రోజు కొండ చివరి శిఖరం పై పెద్ద అగ్ని గుండాన్ని వెలిగిస్తారు. అది మూడు రోజులు దాకా వెలుగుతూ చుట్టూ యాభై కిలో మీటర్ల దూరం వరకు కనబడుతుంది.



అరుణాచలం కొండ మీద ఒక గుహలో శ్రీ రమణమహార్స్షి తపస్సు చేసి దివ్యానుభూతి పొందారు. కావ్య కంత వాసిష్ట గణపతి గారు వీరికి "శ్రీ రమణులు" అని పేరు పెట్టారు. ఇక్కడి రమణాశ్రమం ప్రశాంతతకు నిలయం. అందరు తప్పక సందర్శించ వలసినది .

No comments:

Post a Comment