Friday, 4 September 2015

మదురై - శివుడు రాజ్యమేలిన మదురై

శివుడు రాజ్యమేలిన మదురై

తమిళనాడు ను పాండ్య రాజులు పాలించే ట ప్పుడు కుల శేఖర పాండ్యన్ కుమారుడు మలయధ్వజుడు పరి పాలిస్తున్న సమయం లో జరిగిన విషయమే ఇది .అయన భార్య కాంచన మాల .సంతతి కోసం దంపతులు యజ్ఞం చేశారు ..యజ్న కుండం నుంచి వింత శిశువు ఆవిర్భవించింది .ఆ పిల్లకు మూడు కుచాలు ఉన్నాయి .వ్యాకుల పడిన దంపతులకు అశరీర వాణి విని పించింది ‘’తగిన వరుడు ఈ బాలికకు లభించ గానే మూడవ రొమ్ము మాయం అవుతుంది ‘’అని చెప్పింది .ఆమెను రాజ కుమారుడి లాగా పెంచారు ..యుద్ధ విద్యలన్నీ నేర్పారు . తండ్రి తర్వాతా ఆమె రాజ్యాధికారం పొంది అనేక రాజ్యాలను జయించి ,రాజ్య విస్తరణ చేసి కైలాసానికి చేరింది . శివుడు కంపించ గానే ఆమె మూడవ కుచం మాయ మై పోయింది .శివుడే తన భర్త అని గ్రహించింది .శివుడు ఆమె తో మదురై పట్టణం వచ్చేశాడు ..వారిద్దరి వివాహం దివ్యం గా జరిగింది .వారిద్దరుకలిసి మదురై నగరాన్ని పాలించారు .వారికి కుమారస్వామి అవతారం గా ఉగ్ర పాండ్యన్ జన్మించాడు .అతన్ని రాజ్యానికి పాలకుడిని చేసి శివ పార్వతులిద్దరు సుందరేశ ,మీనాక్షి దేవి గా  రూపాంతరం చెందారు . ..పాండ్య రాజైన కులశేఖరుడు మడురైను ముఖ్య పట్నం గా చేసుకొని నగరాన్ని దివ్యం గా తీర్చి దిద్ది ,మీనాక్షి సుందరేశు ల ఆలయాన్ని అత్యద్భుతం గా నిర్మించాడు
         
మీనాక్షి అమ్మ వారి విగ్రహం సర్వతో భద్రం గా సుందర వదనార విందం  గా కన్నుల పండువు గా కన్పించి భక్తులను తన్మయులను చేస్తుంది ..ఆలయానికి బంగారు ధ్వజ స్తంభం ఉంది .ఒక చేతి లో రామ చిలుక ,రెండో చేతిలో పూల చెండు ధరించి ,భక్తులను ఆద రించే చేప కన్నుల వంటి కనులతో ,ప్రసన్న వదనం తో ,దయా దాక్షిణ్యం కలిగించే చల్లని చూపులతో అమ్మ వారు దర్శనమిస్తుంది ..చేతి లోని చిలుక భక్తుల కోరికలను విని అమ్మవారికి నివేదించి సాఫల్యం చెం దేట్లు చేస్తుందని భక్తులు భావిస్తారు .
       
సుందరేశునికి పన్నెండు అడుగుల ఎత్తున్న ద్వార పాలకులు ఇరు వైపులా కాపలా ఉన్న విగ్రహాలు కని పిస్తాయి ..లోపల ‘’చొక్క నాధుడు ‘’అని పిలువ బడే సుందరేశ్వర లింగం మనకు సకల పాప హరం గా కని పిస్తుంది .’’హర హర మహా దేవశంభో శంకర ‘’నినాదాలతో భక్తులు నినదిస్తుంటే ,ఒళ్ళు పులకరించి కైలాసం లో ఉన్నామేమో నన్న అను భూతి కలుగు తుంది ..స్వామి సన్నిధి లో అరవైమూడు మంది నాయనార్లు ,ఉత్సవ మూర్తి ,కాశీ విశ్వేశ్వరుడు ,భిక్షాట నర్ ,సిద్ధార్ ,దుర్గ విగ్రహాలు అలరిస్తాయి .కదంబ వృక్షం ,,బంగారు సభ ,యాగ శాల కూడా ఉన్నాయి .తర్వాతి ప్రాకారం లో ‘’నటరాజ స్వామి ఆలయం ‘’ఉంది ..కుడికాలు పైకెత్తి ,తాండవ మాడే  నాట్య భంగిమ లో స్వామి దర్శనమిస్తాడు ..ఆవరణకు కాపలాగా64భూత గణాలు ,ఎనిమిది ఏనుగులు ,32సింహ విగ్రహాలు ఉన్నాయి .స్వామి దర్శనం చేసిన తర్వాతా ‘’వేయి స్తంభాల గుడి ‘’లోకి ప్రవేశిస్తాం ..పైకప్పు మీద 60 తమిళ సంవత్స రాలు ఉన్న చక్రం వర్ణనా తీత సౌందర్యం తో అబ్బుర పరుస్తుంది ..ఈ మండపం లో 985 శిలా స్తంభాలు ,వాటికి ఉన్న కళా సంపద చూడటానికి రెండు కళ్ళు చాలవు అని పిస్తుంది .’’కంబత్తడి మండపం ‘’లో అగ్ని ,వీర భద్ర ,అఘోర వీరభద్ర ,విగ్రహాలు భయం కల్గిస్తాయి .ఇదంతా ఒక కళా ప్రదర్శన శాల అని పిస్తుంది .
                       
మీనాక్షి మందిరానికి ఉత్తరం అంచున దక్షిణ ముఖం గా ‘’ముక్కురుని వినాయక విగ్రహం ‘’చూపరులను ఆకర్షిస్తుంది .’’కిలిక్కిట్టు మండపం ‘’లో మీనాక్షి దేవి వివాహ ఘట్టం ,పట్టాభిషేక ఘట్టం వర్ణ చిత్రాలు వర్ణనా తీతం గా కన్పిస్తాయి .కప్పు పై దేవతా చిత్రాల పని తనం ముక్కున వేలేసు కోనేట్లు చేస్తుంది ..మీనాక్షి సుందరేశ్వరుల మండపానికి బయట ‘’స్వర్ణ కమల తటాకం ‘’ఉంది .దీని సమీపం లో ‘’ఊయల మండపం ‘’ఉంది .శుక్రవారం స్వామి వారలకు ‘’ఊంజల్ సేవ ‘’జరుగు తుంది .ఉత్తర గోపురం వైపు అయిదు సంగీత స్తంభాలున్నాయి .ఒక్కో దాన్ని ఆనుకొని ,ఒకే రాతి తో చెక్క బడిన 22చిన్న స్తంభాలున్నాయి . .ఇవి నయనన్దాన్నిస్తాయి .వీటిని తట్టితే ‘’మధుర’’ సంగీత స్వరాలు విని పించి తన్మయులను చేస్తాయి .ఇదో విచిత్రానుభూతి .మదురై కాదు మధుర అని పిస్తుంది .తూర్పు గోపురానికి దగ్గర్లో పుదు(కొత్త )మండపాన్ని తిరుమల నాయకుడు కట్టించాదట .ఇది మీనాక్షి సుందరేశ్వరుల వేసవి విడిది ..ఆలయానికి నాలుగు వైపులా నాలుగు పెద్ద ప్రాకారాలు  నాలుగు చిన్న ప్రాకారాలు ఉండటం విశేషం .తూర్పు ప్రాకారం ద్వారా ఆలయం లోనికి ప్రవేశించి ముందుగా మీనాక్షి  అమ్మ వారిని దర్శించి ,ఆ తర్వాతే సుందరేశ్వరుని దర్శించటం సంప్రదాయం .
                
మదురై ప్రాచీన తమిళ సంస్కృతికి పుట్టి నిల్లు .వైగై నది అమ్మ వారి సేవలో తరించి నట్లు ఉంటుంది .ఇక్కడే మూక కవి ‘’మూక పంచ శతి ‘’రాశారు అది మీనాక్షి అమ్మ వారి అనుగ్రహమే .మూగ వాడికి మాటలు అమ్మ తాంబూలం రసం తి ని పిస్తే కవిత పెల్లుబికింది .ఆయనే తర్వాత కంచి పీఠాధీ  పతి అయారు .అద్భుత మైన సంస్కృత శ్లోకాలవి ‘అందులో ‘’ఆర్యా శతకం ‘’విశేష ప్రాచుర్యం పొందింది .కవి  సామ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ గారి’’ నవల ‘’ఏకవీర’’జరిగిన ప్రదేశం ఇదే .ఆ కధంతా ఈ  నది, అమ్మ వారి చుట్టూ తిరుగు తుంది .
        
మదురై చేనేత పరిశ్రమకు నిలయం .ఈ నగరాన్ని ‘’ఆలయ నగరం ‘’అని పిలుస్తారు .చిత్రి ,ఆవని ,తై మాసాలలో ఉత్సవాలు రంగ రంగ వైభవం గా అజరుగు తాయి .అందుకే మదురై కి ‘’ఉత్సవ పట్టణం ‘’అనే పేరు వచ్చింది .చైత్ర పౌర్ణమి నాడు ‘’మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణమహోత్సవం ‘’అత్యంత సుందరం గా వైభవం గా అట్టహాసం గా నిర్వ హిస్తారు .వైగై నది లో తెప్పోత్సవం దివ్యం గా ఉంటుంది .లక్షలాది ప్రజలు దర్శించి తరిస్తారు ..వాస్తు ,శిల్ప కళలకు నిలయం మదురై .చూస్తె చాలు మనస్సు ఆనంద మధుర మై పోతుంది ,జన్మ చరితార్ధం అని పిస్తుంది .

No comments:

Post a Comment