Monday, 14 September 2015

మహాబలిపురం(Tamilanadu)


మహాబలిపురం(Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది.  మహాబలిపురం వెళ్తున్న దారిమధ్యలోనే మనకి crocodile పార్క్ కనిపిస్తుంది . మనం లోపలి ప్రవేశించగానే .. ముందుగా  మనకి పాములు , తాబేలులు  స్వాగతం పలుకుతాయి. బయట బోర్డు crocodile అని పెట్టి పాములను చూపిస్తున్నాడు ఏమిటి అనుకుంటూ లోపలి నడుస్తూ ఉంటే , ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి . వీటికి ఆహారం  మాంసపు ముక్కలు వేయడం  చేసారు .

మహాబలిపురం
7వ శతాబ్ధంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.

There are three temples of which two Shiva Temples face east and west respectively. The other one is the Vishnu Temple. The Vishnu temples were built by Narasimha Varman I and the other two were built by Narasimha Varman II. One can find the beautifully carved twin Dwarka Palaks (gate keepers) at the entrance of the east facing Shiva Temples. On both sides of the temple inside are the marvelous sculptures of Lord Brahma and Lord Vishnu with their better halves. The top part of the Shivalinga figure inside the temple is found damaged. There are sculptures of Somaskanda - lord Shiva with his better half, Parvati, and his sons, Skanda and Ganesha are found on the near wall. Apart from Lord Shiva’s sculpture, one can find the sculptures of Narasimha and Goddess Durgha also.

ఆ రోజుల్లోనే ఇలాంటి నిర్మాణాలు చేయడం అంటే మాటలా. ఎటువంటి టెక్నాలజీ లేకుండా రాయిని గుడిగా మార్చడం అంటే. ఇక్కడ సముద్రం చాల అందంగా కనిపిస్తున్నా కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయి. మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధా విగ్రహాలు , వినాయకుని విగ్రహాలు దొరుకుతాయ్.

Pancha Rathas :
బీచ్ దగ్గర నుంచి ఒక కిలోమిటర్ దూరంలో పంచరధాలు ఉంటాయ్. రధాలు అన్నారు కదా అని వీటికి చేక్రాలు ఉంటాయ్ అనుకోవద్దు. ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపతికి కుడా రధం ఉంటుంది. అవి వరుసగా ద్రౌపతి, భీమ, అర్జున, ధర్మరాజు, నకులుడు & సహదేవుడు రధం ఉంటుంది.

ద్రౌపతి రధం  (Draupadi ratha),
అర్జుని రధం Arjuna Ratha-ఇక్కడ ఏక శిలపై చెక్కిన ఏనుగు , సింహం ,నంది ఉంటాయి ..
భీముని రధం..Bhima Ratha--భీముడు అని అంటేనే పెద్ద శరీరం ఎలామనకు కనిపిస్తుందో అయన రధం కూడా అలానే ఉంటుంది .
ధర్మరాజుగారి రధం ..Dharma raju ratha ,-

దారిలో కొండపైన లైట్ హౌస్.. కనిపిస్తుంది .. వీటితోపాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు ... అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది.
మహాబలిపురం లో చూస్తున్నా కోద్ది.. ఇలాంటి విగ్రహాలు రోడ్ పక్కనే ఉంటాయ్.. అక్కడకు వెళ్ళిన వెంటనే వాతావరణం మరీపోతుంది .. మనవాళ్ళ టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు ..

పంచరాదాలు
ఈ లోపల లక్ష్మి దేవి మరియు వామనావతారం .. చెక్కిన శిల్పాలు ఉంటాయ్ .

వినాయక రధం
వినాయక రధం ఒకటే పూర్తీ అయి ఉన్నట్టు  కనిపిస్తుంది మనక

శ్రీ కృష్ణుని వెన్న ముద్ద ....
ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం.

త్రిమూర్తులు
బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ని చూసి అక్కడ  రధాలు ఉన్నచోటికి వెళ్ళండి  చూసాక అక్కడనుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలు ఉంటాయ్

No comments:

Post a Comment