Friday, 20 November 2015

అడుగు తడబడితే... అగాథంలోకే..!

'మంచునదిమీద అడుగులేయాలి. కొండల అంచుల్లో ప్రయాణించాలి. లోయల్లో ప్రవహించే నదులను దాటాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే కొండలమీద నుంచి వీచే చలిగాలులను తట్టుకుంటూ ముందుకు సాగడం మరో ఎత్తు. అయితేనేం, ఆ కష్టనష్టాలన్నీ ఆ అద్భుత దృశ్యాన్ని చేరుకునేవరకే. గంగమ్మ దివి నుంచి భువికి దిగిన ఆ ప్రదేశాన్ని చూడగానే అన్నీ మరచిపోతాం... ఆ అద్భుత ప్రకృతిలో మైమరిచిపోతాం...' అంటూ గంగోత్రి నుంచి గోముఖ్ వరకూ సాగిన తమ సాహస ప్రయాణం గురించి చెప్పుకొస్తున్నారు వ్యాసకర్త.

ఉత్తరాఖండ్‌లో ఉన్న చార్‌థామ్‌లో ఒకటైన గంగోత్రి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ముందుగా రుషీకేశ్ నుంచి సుమారు ఆరు గంటలు ప్రయాణం చేసి ఉత్తరకాశీ చేరుకున్నాం. అక్కడ నుంచి మరో ఆరు గంటలపాటు గంగానది వెంబడే ప్రయాణించాక గంగోత్రికి చేరుకున్నాం. ఇది సముద్ర మట్టానికి సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉంది. గంగానదీ జన్మస్థానమైన గోముఖ్, గంగోత్రికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన యాత్ర. అందరూ అక్కడకు వెళ్లలేరు. అక్కడకు కాలినడక తప్ప మరో మార్గం లేదు. అందుకేనేమో శంకరాచార్యులవారు ఆనాడే గంగామాత మందిరాన్ని గంగోత్రిలో కట్టించారేమో అనిపించింది. అయినప్పటికీ కొందరు ఆధ్యాత్మిక భావనతోనూ మరికొందరు సాహసం కోసమూ అన్నట్లు గోముఖ్ ట్రెక్‌కు వెళుతున్నారు. 

మంచునదిమీద ప్రయాణం!
గోముఖ్ ట్రెక్‌కు వెళ్లేవాళ్లు ఉత్తరకాశీలోగానీ గంగోత్రిలోగానీ అనుమతి తీసుకోవాలి. దీనికి ముందు 'ఈ యాత్రకు సంబంధించిన అన్ని ప్రమాదాలకూ నేనే బాధ్యుడను' అన్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ట్రెక్‌కు అవసరమైన ఉన్నిబట్టలూ గ్లౌజులూ మంకీక్యాప్‌లూ జెర్కిన్లూ బూట్లూ రెయిన్‌కోట్లూ చేతికర్రలూ గ్లూకోజులూ ఆహారమూ మందులూ అన్నీ సర్దుకున్నాం. ఉదయం ఆరుగంటలకే బయలుదేరి ఓ కిలోమీటరు ప్రయాణం చేశాక గంగోత్రి జాతీయపార్కుకి చేరుకున్నాం. అక్కడ భద్రతాసిబ్బంది అనుమతి పత్రాలను చూసి యాత్రకు సంబంధించిన కొన్ని హెచ్చరికలు చేసి, అనుమతిని ఇచ్చారు. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణించి బోజ్‌బసకు చేరుకున్నాం. ఈ ప్రయాణం దాదాపు ఎనిమిది గంటలు సాగింది. ఈ మార్గంలో ఆహారంకానీ ఇతర తినుబండారాలుకానీ ఏమీ లేవు. పూర్తిగా అటవీప్రాంతం. జలపాతాల వద్ద నీళ్లను బాటిళ్లలో నింపుకున్నాం. కానీ ఆ నీళ్లు తాగలేనంత చల్లగా ఉన్నాయి. వాటిల్లో కాస్త గ్లూకోజ్ కలుపుకుని కొంచెం కొంచెంగా తాగుతూ మందుకు వెళ్లాం. దారంతా కొండలూ లోయలతో అత్యంత ప్రమాదభరితంగా ఉంది. వాటిని ఎక్కుతూ దిగుతూ జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. కొన్నిచోట్ల ఈ మార్గం కొండల అంచుల్లో అడుగున్నర మాత్రమే ఉంటుంది. ఈ మార్గం పక్కనే వందల అడుగుల లోతులో కనిపించే లోయల్ని చూడగానే ఒక్కోసారి గుండెల్లో దడ పెరిగిపోయేది. దీనికి తగ్గట్లు మరోపక్క విపరీతమైన చలిగాలులు వీచేవి. ఎలాగోలా ఆ మార్గం దాటి కాస్త ముందుకు వెళ్లాం. అసలు కష్టం అప్పుడే కనిపించింది. అదే గ్లేసియర్(హిమనీనదం) మీద ప్రయాణం. ఈ గ్లేసియర్ కింది నుంచి నీరు విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ గంగానదిలో కలుస్తుంటుంది. కానీ నీరు మాత్రం కనిపించదు. నీటి ప్రవాహ శబ్దం మాత్రం వినిపిస్తుంది. కొండల్లో ఏర్పడ్డ గ్లేసియర్స్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఏమాత్రం ఆదమరిచినా గ్లేసియర్స్ నుంచి జారి గంగానదిలో పడే అవకాశం ఉంది. వాటిమీద నడిచేటప్పుడు మన చేతిలోని కర్రను గ్లేసియర్‌మీద గట్టిగా గుచ్చాలి. ఈ కర్రకు కిందిభాగాన కొనదేలిన ఇనుపరేకు ఉండటంవల్ల గ్లేసియర్ పై భాగాన ఉన్న మంచులో ఏమాత్రం మెత్తదనం ఉన్నా అది అందులోకి తేలికగా దిగిపోతుంది. అప్పుడు అది ప్రమాదకర ప్రదేశం అని గ్రహించాలి. ఆదమరిచి అక్కడ అడుగుపెడితే మనం కూడా గ్లేసియర్ పై నుంచి మెత్తటి మంచులో నుంచి కిందకు జారి గ్లేసియర్ కింద ప్రవహించే నీటిలో కలిసిపోతాం. మెత్తని మంచుతో మూతబడిన వూబిలాంటిది అన్నమాట. ఈ విధంగా ప్రతీ అడుగునూ పరీక్షించుకుంటూ ఓ కిలోమీటరు మేర గ్లేసియర్ మీద ప్రయాణించి దాన్ని దాటాం. దానిమీద ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడ వీచే విపరీతమైన చలిగాలులవల్ల చేతివేళ్లూ కాళ్లూ మొద్దుబారిపోయి స్పర్శను కోల్పోయే ప్రమాదం ఉంది. గ్లేసియర్‌మీద ప్రయాణం చేసిన మార్గం కొంతసేపటికి కరిగే మంచు కారణంగా మూసుకుపోయి, అంతకుముందు అసలక్కడ మార్గం లేనట్లే అనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ ప్రయాణించాల్సిందే. 

నదులూ దాటాం!
తరవాత గంగానదిని కలిసే ఉపనదుల్లో ప్రయాణించడం కూడా క్లిష్టంగానే ఉంటుంది. ఇవి కొండమార్గానికి కొన్ని వందల అడుగుల కిందనున్న లోయలో ప్రవహిస్తూ ఉంటాయి. ముందుగా కొండ మార్గం నుంచి లోయలోకి దిగాం. ఈ లోయమార్గం పూర్తిగా బండరాళ్లతో నిండి ఉంది. ఇక్కడ మార్గం అంతా రాళ్లతో నిండి ఉంటుంది. ఉపనదిని దాటడానికి సుమారు ఇరవై అడుగుల పొడవుగల రెండు కర్రల్ని నది ఉపరితలానికి సుమారు పది అడుగులపైన కట్టి ఉంచారు. ఈ కర్రలపై ఒకరు ఆ ఉపనదిని పూర్తిగా దాటాక మాత్రమే మరొకరు వెళ్లాలి. అలా జాగ్రత్తగా ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ నుంచి మళ్లీ బండరాళ్లమీద ప్రయాణం చేస్తూ లోయ నుంచి కొండమార్గానికి చేరుకున్నాం. ఆ మార్గానికి చేరడానికి ముందు రెండుమూడుచోట్ల సుమారు నాలుగైదు అడుగుల ఎత్తులో నిటారైన గోడలా ఉంది. ఈ మార్గం కొంతవరకూ సురక్షితమే. కొన్ని ప్రాంతాల్లో అడుగున్నర వెడల్పు ఉన్న రాళ్ల దారిలో ప్రయాణించాం. అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే మాత్రం ఓ సెకనులోనే కాలు ఏ రాయికో తగిలి లోయలో పడే అవకాశం ఉంటుంది. అలా చూడాలనుకుంటే నిలబడి మాత్రమే చూడాలి. ఇక్కడున్న నునుపైన ఏటవాలు రాళ్లమీద నడిచేటప్పుడు కాళ్లు జారుతూ ఉంటాయి. ఇలా కొంత దూరం ప్రయాణించాక గంగాప్రవాహానికి కొన్ని వందల అడుగుల ఎత్తున కొండ అంచున రెండు అడుగుల మార్గంలో ప్రయాణించాం. ఈ కొండలన్నీ మట్టికొండలే. ప్రతి యాత్రికుడూ ప్రాణాలకు తెగించి ఈ మట్టికుప్పలపైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ బోజ్‌బస అనే ప్రాంతానికి చేరతాం. ఇక్కడ నుంచి గోముఖ్ సుమారు నాలుగు కిలోమీటర్లు. కొండప్రాంతాల్లో మధ్యాహ్నం తరవాత వాతావరణం క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. మబ్బులు మూసుకురావడం, చలిగాలులు వీస్తూ ఉండటం, మంచు కురవడం, వర్షం పడుతూ ఉండటం... లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆరోజు బోజ్‌బసలోనే బస చేశాం. ఇక్కడ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. వీటిల్లో బాహ్య ప్రపంచంతో సంబంధం లేని బాబాలు ఉంటారు. వాళ్లలో ఒకరైన నిర్మలదాస్ బాబా గత ఇరవైఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. మేం ఈయన ఆశ్రమానికే వెళ్లాం. ఆయన ఎంతో ఆదరాభిమానాలతో మా యోగక్షేమాలు తెలుసుకుని కేవలం ఐదు నిమిషాల్లో మాకు తాగడానికి వేడినీళ్లూ తినడానికి కొన్ని పండ్లూ ఇచ్చారు. ఆ రాత్రికి ఆయనే మాకు భోజనం ఏర్పాటుచేశారు. భోజనానికి ముందు ఆయన మాతో సుమారు మూడుగంటలపాటు అనేక భక్తి గీతాలను భజన చేయించారు. మైనస్ డిగ్రీల చలిలో పడుకోవడానికి వెచ్చని పడకను కూడా ఏర్పాటుచేశారు. మర్నాడు ఉదయం ఐదుగంటలకు ఆయనే మమ్మల్ని లేపి తాగడానికి వేడినీళ్లూ పొగలు కక్కే బ్లాక్ టీ లాంటి పానీయాన్ని ఇచ్చారు. 

దివి నుంచి భువికి!
ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసరికి కొండంతా రాత్రి కురిసిన మంచుతో నిండి ఉంది. అక్కడ నుంచి గోముఖ్‌కు బయలుదేరాం. ఆ అడవి ప్రాంతంలో మాకిచ్చిన ఆతిథ్యానికి ఆయన మా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మాకు ప్రయాణం గురించి సూచనలు చేస్తూ బయటకు పంపించారు. ఇక్కడ నుంచి గోముఖ్‌కు వెళ్లే మార్గం కాస్త సురక్షితంగా ఉన్నప్పటికీ ఓ కిలోమీటరు మాత్రం చాలా క్లిష్టంగానే సాగింది. ఎట్టకేలకు గోముఖ్ చేరుకున్నాం. మంచుతో కప్పబడిన గోముఖ్ పర్వత శిఖరాలపై భానుడి లేలేత కిరణాలతో కనిపించే అందాలను చూడగానే మేం పడ్డ శ్రమ అంతా మరిచిపోయి ఆనందించాం. అక్కడి జలప్రవాహాన్ని చూస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని జటాఝూటం నుంచి గంగ ప్రవహిస్తున్నట్లే అనిపించింది. గోముఖం ఆకారంలో ఉన్న పర్వతం నుంచి గంగ ఉద్భవించిన ప్రాంతమే ఈ గోముఖ్. ఈ పర్వత శిఖరాలను మేఘాలు తాకుతూ ఉంటే దివి నుంచి భువికి దిగడం అంటే ఇదేనేమో అనిపించింది. అలా చూస్తూ ఉంటే స్థలపురాణం గుర్తుకొచ్చింది. కపిల మహారుషి కోపాగ్నికి భగీరథుని పూర్వికులు భస్మమైపోతారు. భగీరథుడు వాళ్ల పాపవిముక్తికోసం తాను గంగలో స్నానమాచరించడం ఒక్కటే మార్గమని తెలుసుకుని ఆమెకోసం కఠోరమైన తపస్సు చేయగా, స్వర్గంలో ఉండే గంగామాత కరుణించి నదీప్రవాహంగా మారి, భూమిమీదకు దిగి వస్తుంది. అందులో భగీరథుడు స్నానమాచరించి తన పూర్వికుల పాపాలను ప్రక్షాళన గావించడమేగాక, వారికి స్వర్గప్రాప్తి కలిగించాడట. అలాంటి పవిత్ర గంగ దివి నుంచి భువికి దిగిన ప్రాంతమే గోముఖ్. ప్రచండవేగంతో ప్రవహించే గంగను పరమేశ్వరుడు తన శిరస్సుపైకి తీసుకొని, ఉద్ధృతమైన ఆ ప్రవాహవేగాన్ని సాధారణ స్థాయికి తగ్గించి గంగకు 'భగీరథీ'± అని నామకరణం చేసిన ప్రాంతం కూడా ఈ గోముఖే. పురాణాల్లో శివుని శిరస్సుమీద గంగ ఉన్నట్లే శివుని నివాసస్థలమైన కేదార్‌నాథ్‌కు పైనే ఈ గోముఖ్ ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుచేసుకుంటూ అత్యంత శీతలమైన గంగానదీ జలాల్లో స్నానం చేసి అక్కడకు కొద్దిదూరంలో ఉన్న శివాలయానికి వెళ్లాం. ఆలయం లోపల నిర్మల్‌దాస్ బాబా ధ్యానంలో ఉన్నారు. మేం దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడుగానీ దైవదర్శనం చేసుకున్నప్పుడుగానీ ఆయన మమ్మల్ని గమనించనంతగా ధ్యానంలో ఉన్నారు. గంభీరమైన ముఖవర్ఛస్సుతో ఉన్న బాబాను చూస్తుంటే ఈయనేనా మాకు రాత్రి ఆతిథ్యమిచ్చిన వ్యక్తి అనిపించింది. ఆయనకు మరోసారి నమస్కరించి వెనుతిరిగాం.

Eenadu Sunday - 15 November 2015

Monday, 16 November 2015

అయ్యప్ప - 18 మెట్లు

అయ్యప్ప 18 మెట్లు

గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులూ, దిగే భక్తులూ మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్‌ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచీ దీనికి ‘పొన్ను పదునెట్టాంబడి’గా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు.

1998లో, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్య ఇచ్చిన మూడున్నర కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు. అప్పుడే ఆలయానికి ఉత్తర, దక్షిణ గోడల మీద సుమారు పదహారు చదరపుటడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు. గర్భగుడి ప్రధాన ద్వారానికీ, తలుపులకూ, హుండీకీ కూడా బంగారు పూత పూయించారు.

అరిగిపోయిన పద్ధెనిమిది మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్యే చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పులా రేకులు అమర్చారు. ఈ మెట్లు అయిదడుగుల పొడవు, తొమ్మిది అంగుళాల వెడల్పు, ఒకటిన్నర అడుగుల మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి రెండువైపులా పోలీసులుంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలినవారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు.

అయ్యప్ప వాహనం పులి కాదా?
అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు. పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు.

18 అయ్యప్ప మెట్ల కథ
శబరిమల అయ్యప్పస్వామి దీక్షలో ‘పదునెట్టాంబడి’ (పద్ధెనిమిది మెట్ల)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ మెట్లను ఎక్కి, స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు! పవిత్రమైన ఆ మెట్ల వెనుక ఎంతో కథ ఉంది..

శబరిగిరి శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న పద్ధెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ లేదా ‘పదునెట్టు త్రిపాడికల్‌’ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికే ప్రతి భక్తుడూ విధిగా మండల దీక్ష (41 రోజులు) తీసుకుంటారు. ఈ మెట్లు అఖండ సాలగ్రామ శిలతో, పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని ‘పరశురామ క్షేత్రం’ అని కూడా అంటారు. ఈ మెట్లు మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీక.

ఆ 18 మెట్లు ఎందుకంటే ...
అసలు ఈ పద్ధెనిమిది మెట్లు ఎందుకున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్న సహజమైనదే. హరిహరసుతుడైన అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తరువాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం- దేవతా రూపాలు దాల్చి పద్ధెనిమిది మెట్లుగా అమరాయనీ, అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారనీ చెబుతారు. పట్టబంధాసనంలో ఆయన కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చారనీ, యోగసమాధిలోకి వెళ్ళి, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారనీ పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని ‘సన్నిధానం’ అని వ్యవహరిస్తారు.

మెట్టుకో దేవత!
అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ 41 రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్ష పాటించాలి. ఇరుముడి కట్టుకొని (స్వామివారి నెయ్యాభిషేకానికి అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి) మాత్రమే ‘పడి’ని ఎక్కాలి. ‘పదునెట్టాంబడి’ గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి...

పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు: 1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి

వదిలేయాల్సింది వీటినే!
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద... ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు. అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు.

ఆ మాయోపాయాలు ఏమిటంటే: 

 1. అష్ట రాగాలు - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దర్పం, అహంకారం
 2. పంచేంద్రియాలు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 
 3. త్రిగుణాలు - సత్వ గుణం, రజో గుణం, తమో గుణం 
 4. సంస్కార రాహిత్యం అంటే మంచి నడవడిక లేకపోవడం 
 5. చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం.

18 మెట్ల పేర్లేమిటంటే...
ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అవి: 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక

అయ్యప్ప విడిచిన అస్త్రాలు
అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. ఆ అస్త్రాలు: 1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం

పద్ధెనిమిది కొండలు
శబరిగిరి చుట్టూ ఉన్న 18 కొండలకు ఈ మెట్లు ప్రతీకలంటారు. అవి: 1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల

పవిత్ర ఆహుతి
‘పడి’కి ముందు భాగంలోని పవిత్ర ‘ఆహుతి’ సుమారు 70 రోజుల పాటు (ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకూ) అఖండంగా మండుతూనే ఉంటుంది.
ముద్ర టెంకాయలు (స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు) పగులగొట్టి, నెయ్యిని స్వామివారికీ, కొబ్బరి చిప్పలను ఈ ఆహుతికి సమర్పిస్తారు. ఇటువంటి పవిత్ర ఆహుతి మరే ఇతర దేవాలయాల్లోనూ లేదు. అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవదర్శనం చేసుకొనే ఆలయం కూడా మరొకటి లేదు.

విగ్రహ పునఃప్రతిష్ఠ
శబరిమలలో పరశురాముడు, పందళరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండూ రాతివే. 1910 మార్చి 27న ప్రభాకరన్‌ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తరువాత దేవాలయం అగ్నికి ఆహుతైన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952లో మరోసారి అగ్నిప్రమాదంలో విగ్రహం ఆహుతైంది. 1953లో తిరిగి ఒకటిన్నర అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంథరుర్‌ శంకర్‌ మేల్‌ తంత్రి చేతులమీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకు చెందిన అయ్యప్పన్‌, నీలకంఠన్‌. హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో, కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్‌లో ప్రతిష్ఠాపన చేశారు.Saturday, 14 November 2015

శివుని ‘ఆత్మలింగ’ క్షేత్రం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శివ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. కర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం గురించి రామాయణం, మహాభారతాలలో చూడలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది.

పురాణ కథ :
పూర్వం రావణాసురుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమ్మని చెబుతాడ. దాంతో రావణాసురుడు ఒక ఆత్మలింగం కావాలని కోరాడు. అయితే శివుడు ఆత్మలింగాన్ని నిబంధన ప్రకారం రావణాసురుడికి ఇచ్చాడు. ఆ నిబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై వుంచకూడదు.

ఈ నిబంధనను ఒప్పుకుని ఆత్మలింగాన్ని తీసుకొని రావణాసురుడు లంకదారి పట్టాడు. కానీ ఆత్మలింగం రావణాసురుడి దగ్గర వుంటే లోకాలన్నీ అల్లకల్లోమైపోతాయని కలత చెందిన దేవతలు... తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకుంటారు. అప్పుడు గణపతి చిన్నపిల్లాడి వేషంలో రావణాసురుడి మార్గమధ్యంలో చేరుకుంటాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రయుధాన్ని ఉపయోగించి సూర్యుడికి అడ్డంగా పెడతాడు. దీంతో సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. కానీ అతని చేతిలో వున్న శివలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి ఆలోచనలో పడతాడు.

అప్పుడు అదే మార్గంలో బాలరూపంలో వచ్చిన వినాయకుడ్ని చూసి రావణాసురుడు తన ఆత్మలింగాన్ని పట్టుకోమని చెబుతాడు. అయితే.. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు.. తనని కేవలం మూడుసార్లు మాత్రమే పిలుస్తానని.. అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తానని చెబుతాడు. వేరేదారిలేక రావణాసురుడు వినాయకుని షరతును అంగీకరిస్తాడు. ఆ తరువాత రావణాసురుడు సంధ్యవందనం చేసుకోవడానికి వెళతాడు.

అదే అదునుగా తీసుకొని, రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వినాయకుడు గబగబా మూడుసార్లు పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆ సంఘటనకు గోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకునిపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ తరువాత ఆత్మలింగాన్ని పైకి లేపడానికి రావణాసురుడు ఎంతో ప్రయత్నిస్తాడు... కాని ఫలితం లభించదు.

మొదటగా ఆత్మలింగాన్ని తెచ్చినపెట్టెను ఉత్తరంవైపు నుండి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.

పురాతన ప్రాశస్త్యం :
కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు.

కోటితీర్థం :
గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది.

మహాబలేశ్వరాలయం :
రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి.

తామ్రగౌరీ ఆలయం :
మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం :
రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకుంటాడు. దాంతో పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

జ్యోతిర్లింగాల స్థల పురాణముజ్యోతిర్లింగాల స్థల పురాణము


ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది శైవమతం. పరమశివుని పంచముఖాల నుండి పంచభూతాలు పంచతన్మాత్రలు పుట్టి సృష్ఠి ప్రారంభమైనదని చెప్తారు. శివతత్వం అతి సూక్ష్మమైనందువల్ల ఆత్మకు మాత్రమే అనుభవపూర్వకముగా తెలుస్తుందని శైవాగమాలు చెబుతున్నాయి. పరమేశ్వరుని యోగులు, మహాఋషులు మొదలగువారు మాత్రమే ఆత్మజ్యోతిగా సందర్శిస్తారు. మిగిలిన వారందరికీ పరమేశ్వరుడు లింగరూపధారియై దర్శనమిస్తాడు. అందుకే లింగం శివునికి ప్రతీక. ఇట్టి శివ లింగములు ఆగమశాస్త్రాన్ని అనుసరించి 84 కాగా అవి కలియుగంలో 64 రకాలని వర్ణింపబడినవి. వీటిలో ద్వాదశ (12) జ్యోతిర్లింగ క్షేత్రములు మిక్కిలి ప్రాముఖ్యత నొందినవి. సకల కోరికలను తీర్చి మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడినవి.

వేలాదిగా వున్న శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు మిక్కిలి ప్రాశస్త్యత పొందినవి. జ్యోతిర్లింగములు అనగా ఎవరితోను ప్రతిష్ఠాపనము పొందక స్వయముగా పరమేశ్వరుని ఆత్మజ్యోతితో ఆవిర్భవించినదని చెప్పబడినది. ఈ జ్యోతిర్లింగములు పవిత్ర భారతదేశము నందు నలుమూలలా అవతరించి భక్తులచే ఆరాధించబడుతూ వారి వారి కోరికలను తీర్చుచున్నది. భారతదేశానికి పవిత్రత, ఔన్నత్యము కలుగుటకు ఈ భూమి ప్రజలతో ఆధ్యాత్మిక చింతన, దయ, ధర్మములు ఇంకనూ వున్నవి అనుటకు, ఈ జ్యోతిర్లింగ క్షేత్రములే కారణము కనుకనే ఈ జ్యోతిర్లింగ క్షేత్రములను దర్శించినా, పూజించినా అనంతమైన పుణ్యము కలిగి ఈతి బాధలన్నియూ తొలగి సుఖ సంతోషాదులు కలుగును.

శ్రీ సోమనాథేశ్వర స్వామి (సోమనాథ్‌, గుజరాత్‌)
సోమనాధ్‌ గుజరాత్‌ రాష్ట్రములోని ప్రభాస పట్టణమునకు సుమారు 4 కి.మీ.ల దూరములో వున్నది. ఇక్కడ పరమశివుడు సోమనాధేశ్వరస్వామిగా వెలసియున్నారు. విజయవాడ నుండి కాజ్‌పేట, వార్థ, సూరత్‌, అహ్మదాబాద్‌ మీదుగా వీరావల్‌ స్టేషన్‌లో దిగవలెను. అక్కడి నుండి 7 కి.మీ. దూరంలోని సోమనాధ క్షేత్రానికి బస్సులో వెళ్ళవచ్చును.

దక్ష ప్రజాపతికి అశ్వని భరణాదిగా గల 27 మంది పుత్రికలు కలరు. తన కుమార్తెలకు సరిజోడు సౌందర్యమూర్తి అయిన చంద్రుడేనని భావించి వారినిచ్చి వివాహము చేసెను. చంద్రుడు తన భార్యలందరిలోకెల్లా రోహిణిపై ఎక్కువ ప్రేమను ప్రకటించుతూ మిగిలినవారికి నిర్లక్ష్యపరచసాగెను. ఇది చూసిన మిగిలిన 26 మంది భార్యలు ఈర్ష్యతో తండ్రి దగ్గరకు వెళ్ళి తమ బాధను తెలియపరచగా దక్ష ప్రజాపతి చంద్రుని పిలిచి చంద్రులందరునూ సమానమైన ప్రేమతో చూడమని పలు విధముల నచ్చచెప్పెను. కానీ చంద్రుడు మామగారి మాట లక్ష్యపెట్టక మునుపంటికంటే ఎక్కువగా రోహిణిపై అనురాగమొసంగసాగెను. దానితో దక్షుడు ఆగ్రహించి చంద్రుని క్షయరోగములో పీడించబడెదను గాక అని శాపమిచ్చెను. ఆ శాప కారణముగా చంద్రుడు తన కళలను కోల్పోయి రోజురోజుకీ క్షీణించసాగెను. చంద్ర కిరణములు నీరసించి పోవుట వలన అమృతమే అమారముగాగల దేవతలు హాహాకారములు చేయసాగారు. ఔషదులు వాడిపోయినవి. చరాచర జగత్తు స్తంభించిపోయినది. అంత దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలన్నింటిని రక్షించమని ప్రార్ధించితిరి. అపుడు బ్రహ్మదేవుడు చంద్రునితో పవిత్రమైన ప్రభాస తీర్థమునకు వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగా అందువల్ల సమస్త శుభములు కలుగునని హితవు చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రమును ఉపదేశించినాడు. పిమ్మట చంద్రుడు దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి ఆరుమాసాల కాలం ఘోరమైన తపంబొనర్చెను. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించెను. చంద్రుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా చంద్రుడు పరమశివుని పరిపరి విధముల స్తుతించి తనను అనుగ్రహించమని తనకు శాప విమోచనం కోరగా పరమేశ్వరుడు కృష్ణ పక్షములో కళలు క్షీణించే విధంగా, శుక్ల పక్షములో కళలు దినదిన ప్రవర్ధమానమయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడిగా విరాజిల్ల గలడని వరము ప్రసాదించెను. అంతట చంద్రుడు, బ్రహ్మాది దేవతలు ప్రార్ధించగా వారి కోరికపై మహేశ్వరుడు పార్వతీ సమేతుడై ఈ ప్రభాస క్షేత్రమునందు సోమనాధేశ్వరునిగా అవతరించి భక్తుల కోరికలను తీర్చుతూ వారిని అనుగ్రహించుచున్నారు.

ఈ పట్టణమునకు చుట్టు పురాతనమైన కోట కలదు. ఇక్కడకు సమీపమున బాలక్‌ తీర్థ, త్రివేణి సంగమము (కపిల, సరస్వతి, హిరణ్య నదుల సంగమము) కలవు. శ్రీ కృష్ణ భగవానుడు అవతారము చాలించిన ప్రదేశము ”దేహస్వర్గ” ఈ క్షేత్ర సమీపములోనే కలదు.

శ్రీ మల్లిఖార్జునస్వామి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌)
ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 460 మీటర్ల ఎత్తులో వున్నది. విజయవాడ నుండి 260 కి.మీ.లు దూరంలో శ్రీశైల క్షేత్రమున్నది. రహదారి మార్గమున గుంటూరు, వినుకొండ, డోర్నాల్‌ మీదుగా రైలు మీద అయినచో మార్కాపురం వరకు వెళ్ళి అక్కడి నుండి బస్సులో శ్రీశైలమునకు వెళ్ళవచ్చును. పరమేశ్వరుడు ఇచ్చట మల్లిఖార్జున స్వామిగా అవతరించియున్నాడు. శిలాదుడు అనే మహర్షి గొప్ప శివభక్తుడు. సంతానం కొరకు శివుని గురించి ఘోర తపస్సు చేసెను. ఆయన తపమునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఇద్దరు పుత్రులను అనుగ్రహించెను. వారే పర్వతుడు, నందికేశుడు. వీరిద్దరు తండ్రి కంటే గొప్ప శివభక్తులై శివుని గూర్చి తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. నందికేశుడు తనని స్వామివారి వాహనముగా అనుగ్రహించమని వేడుకొనెను. పర్వతుడు స్వామివారిని ఎల్లప్పుడూ తన మీదే నివసించమని కోరెను. వారి కోర్కెను స్వామివారు మన్నించి నందికేశుని తన వాహనముగా (నందీశ్వరునిగా) చేసుకొనెను. పర్వతుని కోరిక ప్రకారం పరమేశ్వరుడు మల్లిఖార్జున లింగరూపమున పర్వతునిపై స్వయం భూ జ్యోతిర్లింగముగా వెలసినారు. ఈ స్వామివారు వెలసినప్పటి నుండి ఆ పర్వతమునకు శ్రీశైలం అని పేరు వచ్చింది. (శైలము అనగా పర్వతము) ఇచ్చటనే అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయము కలదు. ”శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే” అని యుగయుగాల నుండి అఖండకోటి భక్తావళి నమ్మకము. అనగా శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయ శిఖరాన్ని శిఖరేశ్వరస్వామి పర్వతము నుంచి దర్శించి కలిగినచో పునర్జన్మ ఉండదు. శ్రీ మల్లిఖార్జునస్వామి వారి లింగము సుమారు ఆరు అంగళముల ఎత్తు ఎనిమిది అంగుళముల వెడల్పుతో సాలిగ్రామ శిలతో పానుమట్టం మీద దర్శనమిస్తున్నారు.

శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళు దారిలో 4 కి.మీ. ముందుగా పాలధార, పంచధార, హటకేశ్వరము దర్శించుకొనవలెను. ఇక్కడ నుండి 2 కి.మీ. సాక్షి గణపతి ఆలయము కలదు. శ్రీశైలము వచ్చినవారు తప్పక సాక్షి గణపతి స్వామివారి దర్శనము చేసుకొనవలెను. ఇచ్చటికి సమీపములో పాతాళగంగ, శ్రీశైలం డ్యామ్‌ కలవు. ఛత్రపతి శివాజీని గురించి తెలిపే మ్యూజియం కలదు.

శ్రీ మహాకాళేశ్వర స్వామి (ఉజ్జయినీ, మధ్యప్రదేశ్‌)
సప్తపురీ మోక్షములలో ఒకటైన ఉజ్జయినీ నగరము క్షిప్రానదీ తీరమున అలరారుచున్నది. ఇచ్చటనే పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా అవతరించియున్నాడు. అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైనటువంటి మహాకాళికాదేవి ఆలయము కూడా ఇచ్చటనే కలదు.

పూర్వము అవంతి (ఉజ్జయిని) నగరమున వేదప్రియుడను బ్రాహ్మణోత్తముడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అను నలుగురు కుమారులతో నిత్యనైమిత్తిక వైదిక కర్మల ననుష్ఠించుచు పార్ధివలింగార్చన చేయుచుండెను. వారి పుణ్యప్రభావము వలన నగర ప్రజలందరు సుఖ సంతోషాలతో అలరారుచుండిరి. అదే కాలము రత్నమాల పర్వతము మీద దూషణుడు అను రాక్షసరాజు ధర్మద్వేషియై ఎన్నియో అకృత్యములు చేయుచుండెను. ఒక్క ఉజ్జయినీ నగరము తప్ప రాక్ష గణముతో ఉజ్జయినీ నగరములోనికి ప్రవేశించి బ్రాహ్మణుల, భక్తుల కార్యక్రమాలను స్తంభింపచేసి వారిని బాధించుచుండెను. అయినను వేదప్రియుడు, అతని కుమారులు పరమేశ్వరుని మీద నమ్మకముతో, అకుంఠిత దీక్షతో స్వామివారి మీద భారము మోపి పార్ధివ లింగారాధన చేయుచుండిరి. దూషణుడు వేదప్రియుడు తదితరులను ఎప్పుడైతే బాధించుటకు వచ్చెనో అక్కడ వున్న ఒక గుంట నుండి పరమేశ్వరుడు మహాకాలుని రూపంలో ప్రత్యక్షమై దూషణుడిని, వాని అనుచరులను భస్మమొనర్చెను. మహాకాలుడు ఆ బ్రాహ్మణ కుటుంబమును, భక్తులను వరము కోరుకోమనగా భక్తులందరు ముక్త కంఠముతో స్వామిని అచ్చటనే జ్యోతిర్లింగ రూపమున నివసించమని ప్రార్ధించగా వారి కోరిక మన్నించి పరమేశ్వరుడు మహాకాళ జ్యోతిర్లింగముగా అవతరించెను.

ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయములు చాలా వున్నవి. విక్రమాదిత్య మహారాజు ప్రతిరోజు దర్శించి, పూజించిన హరసిద్ధి మాతా మందిరము అందులో ఒకటి. స్వామివారి ఆలయమునకు 5 కిలోమీటర్ల దూరములో కాళికాలయము వున్నది. అష్టాదశ శక్తిపీఠములలో ఇది ఒకటి. ఉజ్జయిని క్షేత్రములోనే సాందీపముని వద్ద శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు విద్యను అభ్యసించిరి. ఆయన పేరుతో సాందీపుని ఆశ్రమము వున్నది. ఈ క్షేత్రములో వేంచేసియున్న కాలభైరవ స్వామికి మద్యమును నైవేద్యముగా సమర్పించి తిరిగి దానినే భక్తులకు తీర్థముగా ఇచ్చుట విశేషము. విగ్రహము పెద్దది. స్వామివారి నోటివద్ద మత్తు పానీయములు ఒక పాత్రలో యుంచి పెట్టిన ఆ పాత్ర ఖాళీ అగును. ఇది మనం కళ్ళారా చూడవచ్చును. క్షిప్రా నదిలో స్నానమాచరించి మహాకాళేశ్వరుని దర్శించిన సర్వ పాపములు పటాపంచలగునని భక్తుల విశ్వాసము.

శ్రీ అమలేశ్వరస్వామి (ఓంకార్‌, మధ్యప్రదేశ్‌)
మధ్యప్రదేశ్‌లోని ఓంకార్‌లో అమలేశ్వర జ్యోతిర్లింగంగా పరమశివుడు అవతరించినాడు. నర్మదానది ఒడ్డును కుడి ప్రక్కన ఓంకారేశ్వరుని ఆలయము. ఎడమ ప్రక్కన అమలేశ్వరుని మందిరము భక్తకోటి సందర్శనతో అలరారుతున్నది. ఓంకారేశ్వరుని, అమలేశ్వరుని ఒక జ్యోతిర్లింగంగా పరిగణించుచున్నారు.

ఒకానొక పర్యాయము నారద మహర్షి వింధ్య పర్వతమునకు వెళ్ళగా విధ్యుడు నారదుని తగు సముచిత రీతిన గౌరవించెను. ఆ సమయంలో వింధ్యుని మనస్సులో తనతో సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు డమేకాక రత్న, మణి, వైఢూర్యాది సర్వంబులు కలవు కనుక తనకేమియూ కొరత లేదనుకొనుచుండెను. వింధ్యుని మనస్సులోని ఆలోచన గమనించి, నారదుడు నీయందు అన్నీ వున్నవి కానీ నీకంటే మేరు పర్వతము ఎత్తైనది మరియూ దేవతలలో మేరువుకు స్థానమున్నది. కానీ నీకట్టి యోగము లేదుకదా అని అనెను. అపుడు వింధుడు తనకంటే వేరొకరు గొప్పవారుగా నుండుట సహించలేక శివుని ఆరాధించి కృతార్ధుడు కావాలన్న పట్టుదలతో ఓంకార క్షేత్రమునకు వెళ్ళి పరమేశ్వరుని పార్ధివ లింగమును తపస్సుతో, నిశ్చల భక్తితో ఆరాధించెను. అంతట పరమేశ్వరుడు వింధుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా వింధ్యుడు స్వకార్యమును సాధించు శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకొనెను. పరమేశ్వరుడు నీ ఇష్ట ప్రకారమే చేయుదునని వరమిచ్చెను. అప్పుడు దేవతలు, మునులు, స్వామివారిని ఓంకార క్షేత్రములో నిసించమని ప్రార్ధించెను. వారి కోరిక మన్నించి ప్రణవాకారముగా ఓంకారేశ్వరుడనియూ, పార్ధివ లింగాకారముగా అమలేశ్వరుడనియూ అవతరించెను.

ఈ ఆలయము ఒక చిన్న పర్వతము మీద వున్నది. మందిరము చాలా మనోహరముగా వుండును. స్వామివారి జ్యోతిర్లింగము గర్భగుడి మధ్యలో నుండక గోడకు దగ్గరగా వుండును. స్వామివారి జ్యోతిర్లింగ మధ్య భాగమున చిన్న చీలిక వున్నది. అభిషేక జలము ఆ చీలిక ద్వారా నర్మదా నదిలోనికి పోయి నర్మదానది పవిత్రత మరింత ఎక్కువ చేసిని. కావేరి అనే నది నర్మదా నదిలో కలిసే ఉపనది. కావేరి నది మాంధాత పర్వతమును చుట్టి వచ్చి నర్మదానదిలో కలియును. ఈ కలయిక ఓం ఆకారములో చుట్టి వచ్చి కలయును. పైనుండి చూసినచో ‘ఓం’ ఆకారములో ఆ ప్రవాహము వుండును.

శ్రీ వైద్యనాథేశ్వర స్వామి (బైద్యనాథ్‌, జార్ఖండ్‌)
వైద్యనాధేశ్వరుడు నూతనంగా ఏర్పడిన జార్ఖండ్‌ రాష్ట్రంలోని జస్ధి అనే చిన్న పట్టణములో అవతరించెను. జ్యోతిర్లింగం సుమారు 12 అంగళముల వెడల్పు పొడుగులో గుంటగా, వాలుగా వుండును. జ్యోతిర్లింగం శిరస్సుపై ఉన్న నొక్కును రావణాసురుని బొటన వేలు నొక్కు అందురు.

పూర్వము రావణ బ్రహ్మ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొనుటకు ఘోరతపము చేసెను. ఒక వృక్షము క్రింద అగ్నిగుండము ఏర్పరచి పార్ధివ లింగము ప్రతిష్ఠించి శివపంచాక్షరీ మంత్రముతో హవన కార్యక్రమముతో నిష్ఠతో చేసిననూ పరమేశ్వరుడు కరుణించలేదు. అంత రావణాసురుడు ఆ అగ్ని గుండములో తన తొమ్మిది తలనను ఒక్కో దానిని ఖండించి హవనము చేసెను. అయిననూ పరమేశ్వరుడు కరుణించలేదు. చివరకు తన పదవ తలని కూడా ఖండించుకొనుటకు సిద్ధమవగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని తొమ్మిది తలలను తిరిగి ప్రసాదించి వాని కోరిక ప్రకారము అసమానమైన బలము నొసంగెను. స్వామిని రావణాసురుడు లంకా నగరమునకు నివసించమని ప్రార్ధించగా స్వామి రావణునికి తన ఆత్మ లింగమును ప్రసాదించి లంకా నగరమందు తీసుకొని వెళ్ళమని చెప్పి ఈ లింగమును భూమికి తాకించిన అచ్చటమే స్థిరపడునని హెచ్చరించెను. రావణ బ్రహ్మ లంకా నగరమునకు తిరుగు ప్రయాణములో నిత్యనైమిత్తిక కర్మలాచరించుటకై ఆత్మలింగమును ఒక గోపబాలునికిచ్చి పట్టుకోమనగా ఆ బాలుడు ఆ దివ్యలింగమును చితా భూమినందు ఉంచెను. ఆ లింగము అచ్చటనే స్థిరపడెను. రావణాసురుడు తన శక్తినంతయు వుపయోగించిననూ ఆ లింగము కదల్చలేకపోయెను. ఆ విధముగా వైద్యనాథేశ్వరుడు లంకా నగరమందు కాక చితా భూమినందు కొలువై భక్తుల కోరికలను తీర్చుచున్నాడు. సర్వదేవతలు ఆ చితాభూమి కేతించి పూజాభిషేకాలతో జ్యోతిర్లింగమును అర్పించినారు.

వైద్యనాథ్‌లో సుమారు 20 పేరు పొందిన ఆలయములు వున్నవి. అందు ముఖ్యముగా వైద్యనాథ స్వామి ఆలయము, శివగంగా ఆలయము, భగవతీ జగదాంబ, బైద్య భక్త మందిరము తప్పక దర్శించతగిన ఆలయములు.

శ్రీ భీమ శంకర స్వామి (భీమశంకర్‌, మహారాష్ట్ర)
ఈ క్షేత్రము మహారాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. విజయవాడ నుండి పూణె నగరమునకు చేరిన అచ్చట నుండి బస్సులో భీమ శంకరమునకు వెళ్ళవచ్చు. పూణు నుండి భీమశంకర్‌ 120 కి.మీ. దూరములో వున్నది. ఈ క్షేత్రములో స్వామివారు భీమేశ్వరస్వామిగా అవతరించి భక్తులచే పూజలందుకొనుచున్నారు.

పూర్వము కుంభకర్ణునికి కర్కటి అనే రాక్షసికి పుట్టినవాడే భీమాసురుడు. తన తండ్రిని నారాయణుని అంశకల శ్రీరామచంద్రుడు సంహరించెనని తెలుసుకుని నారాయణునిపై పగ సాధించదలచి బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరముల ఘోర తపస్సు చేసెను. అంత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో తనతో సమానమైన బలవంతుడు వుండరాదని కోరుకొనెను. బ్రహ్మదేవుడు అటులనే అని వరమిచ్చెను. తదుపరి భీమసురుడు, ఇంద్రుడు మొదలగు దేవతలను జయించి నారాయణుని కూడా జయించెను. భీమాసురుడు మూడు లోకములలో ఎచ్చట యజ్ఞయాగాదులు జరుగకుండా చేయుచూ అందరూ తననే పూజించవలెనని భక్తులందరిని బాధించుచుండెను. కాని కామరూపేశ్వరుడు, అతని భార్యయైన సుదక్షిణాదేవి మానసపూజా విధమున పరమేశ్వరుని ప్రణవ సహిత శివపంచాక్షరితో పూజించుచుండెను. పరమేశ్వరుడు కామరూపేశ్వర దంపతుల వద్ద పార్ధివ లింగ రూపములో వుండి వారి పూజలను స్వీకరించసాగెను. రోజురోజుకీ పాతాళరాజు పూజలు అధికమైనవి. అది చూసి భీమాసురుడు నీవు చేయు పూజలు ఆపెదవా లేక శివ లింగమును భిన్న మొనర్చెదనని అనగా పాతాళరాజు భయపడక పరమేశ్వరునిపై నమ్మకముతో నీ చేతనైనని చేసుకొమ్మని పూజలు కొనసాగించెను. భీమాసురుడు తన చేతిలోని ఖడ్గముతో శివ లింగమును తాకెను. రాక్షసుని కత్తి తగిలిన వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓరీ అసురా! నా భక్తులను రక్షించుటే నా కర్తవ్యమని భీమాసురుని సంహరించెను. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్ధింప స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా వుండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా వెలయునని కోరుకొనెను. అంతట పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహాద్రి పర్వతములలో వెలసెను. కృష్ణానది ఉపనది అయిన భీమనది ఇచటనే పుట్టి స్వామివారి సేవకు ఉపయోగపడుచున్నది.

భీమ్‌శంకర్‌ చిన్న కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు. పర్వ దినములలో వసతి దొరకుట కష్టము. చిన్న భోజనం హోటల్‌ మరియు కాఫీ హోటళ్లు కలవు.

శ్రీ రామనాథ స్వామి (రామేశ్వరి, తమిళనాడు)
ఈ క్షేత్రము తమిళనాడులోని రామేశ్వరంలో కలదు. విజయవాడ నుండి చెన్నై – తిరుచ్చి – తిరుమయం – కరైకుడి – రామనాధపురం – మీదుగా రామేశ్వరమునకు వెళ్ళవచ్చు రైలులో ప్రయాణము చేయవలెనన్న విజయవాడ నుండి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ అక్కడి నుండి (ఎగ్మోర్‌) ఎగ్‌మోర్‌ రైల్వేస్టేషన్‌కి వెళ్ళి రామేశ్వరమునకు వెళ్ళవచ్చు. ఇచ్చటనే స్వామివారు రామలింగేశ్వరస్వామిగా అవతరించియున్నారు.

శ్రీరామచంద్రుడు రావణబ్రహ్మను సంహరించిన అనంతరం బ్రహ్మహత్యాదోష నివారణార్ధం రామేశ్వరములో శ్రీ శివదేవుని లింగ ప్రతిష్ఠకు నిర్ణయించినారు. అందుకుగాను ఆంజనేయస్వామివారు హిమాలయములలోని కైలాస పర్వతము దగ్గర నుండి శివలింగమును తెచ్చుటకు వెళ్ళెను. కానీ సుముహూర్త సమయమైనను ఆంజనేయస్వామి రానందున సీతామహాసాధ్వి సైకత (ఇసుక) లింగమును తయారుచేసెను. ఈ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఆంజనేయస్వామి కైలాస పర్వతము నుండి శివ లింగమును తెచ్చెను. శ్రీరాములవారు ఆ లింగమును కూడా ఆలయ ప్రాంగణములో ప్రతిష్ఠించినారు. రాములవారు ప్రతిష్ఠించిన లింగమును రామనాధస్వామిగాను, ఆంజనేయస్వామి తెచ్చిన లింగమును కాశీ విశ్వేశ్వర లింగముగా భక్తులచే పూజలందుకొనుచున్నవి. రామేశ్వరము బంగాళాఖాతంలో చిన్న ద్వీపము. శ్రీరామనాధస్వామి ఆలయము చాలా మనోహరముగా వుండును. ఆలయ ప్రాంగణము సుమారు 400 అడుగుల పొడవు 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు కలిగి సుందరమైన శిల్పములతో అలరారుచున్నది. దేవాలయ ప్రాంగణములో 22 తీర్థాలు మరియు ఇతర ప్రదేశములలో 21 తీర్థాలు కలవు. ఆలయములోని తీర్థములు మహాలక్ష్మి – సావిత్రి – గాయత్రి – సరస్వతి – మాధవ – గంధ మాధవ – గవాక్ష – గవాయ – నీల – శంక – శంకర – బ్రహ్మ హత్యా విమోచన – సూర్య – చంద్ర – గంగ – యమున – గయ – శివ – సత్యామృత – సర్వ తీర్థము – కోటి తీర్థముల పేర్లతో వున్నవి. స్వామివారు ఆలయమునకు 5 కి.మీ.ల దూరములో గంధ మాధవ పర్వతం కలదు. ఇచ్చట నుండే హనుమంతులవారు సీతాదేవుని వెతుకుటకు సముద్రమును లంఘించెనని చెప్పెదరు. ఈ పర్వతం మీదున్న రెండు అంతస్తుల దేవాలయము ఎక్కితే క్రింద నుండి రామేశ్వర ద్వీపము మనోహరముగా కనిపించును. రామేశ్వరం నుండి 2 కి.మీ. దూరంలో ధనుష్కోటి కలదు. ఇది ఒక ద్వీపము. రావణాసురుని తమ్ముడైన విభీషణుడు శ్రీరాముని శరణు పొందిన ప్రదేశము. ఇంకను రామేశ్వరాలయము, నంది నాయకి అమ్మన్‌, విల్లోరిని తీర్థము – భైరవ తీర్థము మొదలగునవి చూడదగిన ప్రదేశములు.

శ్రీ నాగనాథ స్వామి (నాగనాథ్‌, గుజరాత్‌)
సప్త మోక్షపురుషులలో ఒకటైన ద్వారకాపట్టణం పురాణ ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణ పరమాత్మ సామ్రాజ్య రాజధాని అయిన ద్వారకకు, శ్రీకృష్ణుని అంతఃపురమైన భేటీ ద్వారక మధ్యన వున్నదే నాగేశ్వర జ్యోతిర్లింగం. గుజరాత్‌ రాష్ట్రంలోని పోరుబందరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు.

పూర్వము పశ్చిమ సముద్ర (అరేబియా) తీరమున 16 యోజనములు కల ఒక వనము నందు దారుక అనే రాక్షసి తన భర్తతోను, ఇతర రాక్షసులతోను నివశించుచుండెను. దారుక పార్వతీదేవి గురించి ఘోరతపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నము చేసుకుని అనేక వరములు పొందెను. వర గర్వముచే దారుక ఆ వనమును గాలిలోకి లేపుచూ తన ఇష్టము వచ్చిన చోట దింపుచూ భక్తులను, మునులను వారు చేయు యజ్ఞయాగాదులను ధ్వంసము చేయుచూ, ప్రజలను భక్షించుచూ కాలము గడుపుచుండెను. భక్తులు, ప్రజలు, రాక్షసులు పెట్టు బాధలు భరించలేక ఔర్య మునిని రక్షించమని వేడుకొనగా ఆ ముని రాక్షసులు ఈ భూమి మీద ఎవరినైననూ బాధించినచో వెంటనే మరణించెదరు గాక అని శాపమిచ్చెను. ఆ శాప భయంతో రాక్షసులు నిస్సహాయులై వుండిరి. అప్పుడు దేవతలు వారిపై దండెత్తి రాగా దారుక ఆ వనమును గాలిలోకి లేపి సముద్రముపై ప్రతిష్ఠించెను. అచ్చటనే వుండి అటువైపు పడవలపై వచ్చు ప్రయాణీకులను బంధించిన భక్షింప మొదలు పెట్టినారు. అలా బంధింపబడిన వారిలో సుప్రియుడను వైశ్యుడు పరమేశ్వరుని భక్తుడు. అతడు చెరసాలలో వుండియు పరమేశ్వరుని పార్ధివలింగపూజను చేయుచూ తన తోటివారిని కూడా పూజలకు పురికొల్పెను. అందరును యధావిధిగా పంచాక్షరీ మంత్రముతో పరమేశ్వరుని ప్రార్ధించుచుండిరి. ఆ భక్తుల పూజలకు పరమేశ్వరుడు సంతసించి వారి పూజలను స్వీకరించెను. వారు చేయు పూజల గురించి తెలిసిన దారుక భర్త అయిన దారకాసురుడు సుప్రియుని సంహరించుటకు రాగా సుప్రియుడు భయపడక పరమేశ్వరుని ప్రార్ధించగా శివుడు ప్రత్యక్షమై దారకాసురుడిని, ఇతర రాక్షసులను సంహరించెను. వారి కోరికపై నాగేశ్వరస్వామిగా అవతరించి భక్తుల కోరికలను ఈదేర్చుచున్నాడు. ఈ ద్వారకలోనే శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులవారు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటి వున్నది. సముద్రపు ఒడ్డు నుండి 5 కిలోమీటర్ల బోటు మీద వెళ్ళినచో భేటీ ద్వారకను చూడవచ్చు. ఆసక్తి వున్నచో ఇక్కడి నుండి 80 కిలోమీటర్ల దూరములోగల పోరుబందరులో మహాత్మాగాంధీ జన్మస్థలము, మ్యూజియము చూడవచ్చును.

శ్రీ విశ్వనాథ స్వామి (వారణాసి, ఉత్తరప్రదేశ్‌)
సప్త మోక్షపురులలో ఒకటైన కాశీ నగరమందు పరమేశ్వరుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగముగా అవతరించెను. ఈ క్షేత్రము రాష్ట్రములో పవిత్ర గంగా నదీ తీరమున కలదు. విజయవాడ నుండి కాశీ పట్టణమునకు రైలు సౌకర్యము కలదు. స్వామి వారి ఆలయ గోపురము బంగారపు రేకుతో కప్పబడినది.

ప్రకృతి పురుషులు తమ తల్లిదండ్రులగు మాయా మహేశ్వరులను (శివ శక్తులను) చిరకాలము కాంచనందున మేమెచ్చట జన్మించెనని మా కర్తవ్యమేది అని చింతించుచుండెను. పరమేశ్వరుని నుండి ఎటు చూసినను ఐదు క్రోసుల నేలను సృష్టించి అందుండి తపస్సు చేయమని సందేశము వచ్చెను. ఆ ప్రకారంగా కాశీ పట్టణము నిర్మించబడినది. మహేశ్వరుడు తానునూ జ్యోతిర్లింగము రూపము ధరించి విశ్వేశ్వర నామధేయముతో కాశీపురమున అవతరించెను. ప్రళయ కాలమున ప్రపంచమంతయు మునిగిపోయినను కాశీ పట్టణమును మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలముతో పైకెత్తి పట్టుకొని రక్షించెను. అంత కాశీ పట్టణము అవినాశి అయ్యెను. విష్ణుమూర్తి చెమట బిందువు ఒకటి క్రిందపడి దిగుడు బావి అయ్యెను. అది చూసి పరమేశ్వరుడు ఆశ్చర్యముతో తల పంకించగా ఆ దేవదేవుని కర్ణ కుడి మణికుండలము ఒకటి క్రిందపడెను. అప్పటి నుండి ఆ ప్రదేశము మణికర్ణికా తీర్థముగా ప్రసిద్ధి గాంచెను. ఇక్కడ స్నానము చేసి కాశీ విశ్వేశ్వరుని ఆరాధించినచో కైలాస మార్గము సుగమము అగును. కాశీ క్షేత్రములో మరణించిన పశు, పక్షి, కీటక, మానవవాదులకు పునర్జన్మ రహిత శివసాయుజ్యము కలుగును. కాశీయందు మరణమునకు, జ్ఞానముగాని, భక్తిగాని, కర్మ, దానము సంస్కారము, ధ్యానము, నామస్మరణము, పూజకాని అవసరము లేదు. గంగానదికి ఉపనదులైన ”వరుణ” ”అశి” అనే నదులు ఇచ్చటనే సంగమిస్తాను. కనుక ఈ క్షేత్రమునకు వారణాశి అని పేరు కూడా వచ్చినది. హరిశ్చంద్ర మహారాజు, శ్రీరామచంద్రుడు, పాండవరాజులు, గౌతమబుద్ధుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులవారు మరెందరో మహానుభావులు ఈ క్షేత్రమును దర్శించి విశ్వేశ్వరుని సేవించి తరించినారు.

కాశీ మహానగరములో అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి ఆలయము కలదు. స్వామివారి ఆలయమునకు సమీపమున మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం వున్నది. కాశీ యాత్రలో ముఖ్యంగా ”గాడీ” అమ్మ అనబడే పరమేశ్వరి సహోదరి మందిరము తప్పక దర్శించవలెను. అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు తృప్తినొందడంటారు. కాలభెరవుడు శునక వాహనుడై క్షేత్ర పాలకుడుగా ప్రసిద్ధి పొందినారు. గంగానది ఇచ్చట ఉత్తర వాహినియై ప్రవహించుచూ 64 ఘాట్లతో విరాజిల్లుతున్నది. ఇంకనూ దుర్గాలయము, తులసి మానస మందిరము, భారత్‌ మాతా మందిరం, మాలవ్యాబ్రిడ్జి, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, అమృత కుండము, డూండీ గణపతి ఆలయము మొదలైనవి దర్శనీయములు.

శ్రీ త్య్రంబకేశ్వర స్వామి (త్య్రంబకం, మహారాష్ట్ర)
సహ్యాద్రి పర్వత శ్రేణులలో వెలసియున్న మరియొక జ్యోతిర్లింగమే త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగము. ఈ క్షేత్రము మహారాష్ట్రలో నాసిక్‌ నుండి 32 కి.మీ. దూరంలో కలదు.

బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యాదేవితో తపస్సు చేయుచుండిరి. అట్టి సమయములో ఆ పరిసరాల్లో భయంకరమైన కరువు ఏర్పడినది. అంత గౌతముడు వరణుని ప్రసన్నుడిగా చేసుకొని మూరెడు లోతు గుంటను త్రవ్వి దానిలోనికి తరుగులేనటువంటి దివ్యజమునిమ్మని కోరెను. వరుణుడు తథాస్తు అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను. ఆ నీటితో గౌతమ దంపతులు నిత్యనైమిత్తిక కర్మలు చేయుచూ ధాన్యములు, ఫలములను, పుష్ప వృక్షములను పెంపొందించుచుండెను. అది చూసి మిగిలిన ఋషులు వారి వారి సంసారములతో అక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకొని పుణ్య కార్యములు చేయుచుండిరి. ఒకరోజు గౌతముని భార్య అహల్యాదేవి ఋషిపత్నులను వారించి గౌతమ శిష్యులకు ప్రధమ జలము ఇప్పించెను. దానితో ఋషి పత్నులు ఆగ్రహించి గౌతమ దంపతులను ఏదో ఒక విధముగా అపకారము చేయవలెనని నిశ్చయించినారు. ఒకనాడు గౌతముడు పొలము నందు పంటను పరీక్షించుచుండగా ఋషులచే పంపబడిన ఒక మాయా గోవు అచటకు వచ్చెను. గౌతముడు ఆ ఆవు తినుటకు గడ్డి పరకలను విసిరెను. అవి తగిలి ఆ గోవు కిందపడి మరణించెను. ఇది అంతయు మునులకల్పన అని తెలియక తనకు గోహత్యాదోషము కలిగెనని నివారణా మార్గము తెలుపమని వారినే అడిగెను. వారు గౌతముని అనుష్ఠానము భంగము చేయుటకు కఠినమైన నిబంధనలు విధించిరి. అవి 1) భూమిని మూడుసార్లు ప్రదక్షిణ చేయుట 2) బ్రహ్మగిరికి 101 సార్లు ప్రదక్షిణ చేయుట 3) గంగానదిని బ్రహ్మగిరికి తెచ్చి అందులో స్నానము చేసి కోటి లింగాలకు ఒక్కోదానికి 1008 సార్లు అభిషేకం చేయుట. ఆ ఋషులు చెప్పినట్లు గౌతముడు ఆచరించినాడు. కోటి లింగాలకు భార్య సమేతముగా ఎప్పుడైతే గౌతముడు అభిషేకము చేసెనో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంతట గౌతముడు తన గోహత్యా దోషము తొలగించమని కోరెను. అప్పుడు శివుడు ఇది అంతయు మునులు కల్పనయే కాని నీకెట్టి దోషము లేదు అనెను. అంత గౌతముని కోరికపై అదే ప్రదేశములు త్య్రంబకేశ్వర స్వామిగా అవతరించినాడు.

చూడవలసిన ప్రదేశములు పుష్పక క్షేత్ర ఘాట్‌, పంచవటి, శ్రీకపాలేశ్వరస్వామి ఆలయము, సీతాదేవి గుహ, జటాయువు మోక్ష ప్రదేశము. ఇచ్చట సమీపములోనే గోదావరి నది జన్మస్థలము కలదు. దీనినే గంగాద్వార్‌ అంటారు.

శ్రీ కేదారనాథ స్వామి (కేదార్‌నాథ్‌, ఉత్తరాంచల్‌)
”ధన్యాస్తే పురషాలోకే పుణ్యాత్మనో మహేశ్వరీ |
యే వదం త్యపి కేదారమ్‌ గమిష్యామి ఇతిక్య చిత్‌” ||
కేదారమునకు వెళ్ళగలనని ఉచ్ఛరించనంత మాత్రముననే ధన్యాత్ములగుదురు. స్వయంగా యాత్ర చేసిన ఫలమెంతగలదోనని పురాణాలు పేర్కొంటున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో తొమ్మిదవ క్షేత్రముగా పేర్కొన్న కేదారనాధేశ్వరుడు సముద్రమట్టానికి 11,500 అడుగుల ఎత్తున నిరంతరం మంచుతో కప్పబడిన పర్వతముల మధ్య భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగములలో అతి పెద్దది కూడా ఇదే. పర్వత శిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుమట్టం లేదు. గర్భగృహాన్ని లింగాకారంలో వున్న పర్వతశిఖరం ఆక్రమించి ఉన్నదని చెప్పడం కంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మింపబడినదని భావించవచ్చు. ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల వెడల్పు, నాలుగు గజముల ఎత్తును గల పర్వత శిఖరమునే భక్తులు పూజింతురు.

కురుక్షేత్ర సంగ్రామమనంతరం పాండవులు సగోత్ర హత్యపాపము పోగొట్టుకొనేందుకు మహిషి రూపంలో దర్శనమిచ్చిన పరమశివుని గుర్తించి పట్టుకోవడానికి పాండవులు ప్రయత్నించగా పరమశివుడు భూమిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా పాండవులు మహిషి వీపు భాగమును స్పర్శించిరి. స్పర్శా మాత్రమునే వారి స్వగోత్ర హత్యాపాపమును పోగొట్టుకొన్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ స్వామిని కృతయుగంలో నర నారాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు, మహర్షి, ద్వాపరయుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. ఇచ్చట కూడా ఒక తత్వకుండము కలదు. ఆలయం వెనుక పర్వతముల గుండా పాండవులు ద్రౌపదితో కూడా నడిచి స్వర్గధామము చేరిన మహాప్రస్థాన మార్గము కలదు. వారి పాద చిహ్నములను దర్శించుకొనవచ్చును. ఆలయమున కుంతి ద్రౌపదులతో కూడిన పాండవుల విగ్రహులు కలవు. ఇచ్చట ఆరు మాసములు తలుపులు మూసివున్ననూ అఖండ జ్యోతి వెలుగుచుండును. ఆ జ్యోతిని దర్శించుటకు దేవాలయం తెరుచు సమయమునకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళెదరు.

కేదారనాధ క్షేత్రము ఉత్తరాంచల్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ నుండి గౌరీకుండ్‌ వరకు బస్‌లో వెళ్ళి అక్కడి నుండి పధ్నాలుగు కిలోమీటర్లు నడిచికానీ, గుర్రముల మీద కానీ డోలీలలో కానీ వెళ్ళవచ్చు. విజయవాడ నుండి న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడి నుండి హరిద్వార్‌ బస్సు లేదా రైలు మీద ప్రయాణము చేయవచ్చును. మే నెల నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయము తెరచి వుండును.

శ్రీ ఘృష్ణేశ్వ స్వామి (ఘృష్ణేశ్వర్‌, మహారాష్ట్ర)
దేవగిరి పర్వత శ్రేణులలో వేంచేసియున్న దివ్యక్షేత్రము ఘృష్ణేశ్వర్‌. ఘృష్ణేశ్వర స్వామి ఆలయము మహారాష్ట్రలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలకు అత్యంత సమీపమున కలదు.
సుధర్ముడను గొప్ప శివభక్తుడు సుదేహా అను ధర్మపత్నితో శివదేవుని వేదోక్త ధర్మముగా సేవించుచున్నారు. కానీ వారికి సంతానము కలుగలేదు. సుదేహ తనకి సంతానము కలుగదని నిశ్చయించుకుని తన చెల్లెలైన ఘృష్ణాదేవిని సంతానార్ధము వివాహము చేసుకోమని భర్తను బలవంతపెట్టగా సుధర్ముడు అంగీకరించి ఆమెను వివాహము చేసుకొనెను. ఘృష్ణాదేవి అక్కగారి అనుమతితో 101 పార్ధివ లింగములను తయారుచేసి పూజిలొనరించి తదుపరి చెరువులో నిమజ్జనము చేయుచుండెను. అటుల లక్ష పార్ధివ లింగములకు నిమజ్జనము చేసిన అనంతరం పరమేశ్వరుడు ఆమె శక్తికి మెచ్చి ఒక కుమారుని ప్రసాదించెను. కుమారుడు జన్మించిన అనంతరం ఘృష్ణాదేవికి సంఘములో విలువ పెరగసాగెను. అది చూసిన అక్క సుదేహకు అసూయ కలిగెను. కుమారుడు పెరిగి పెద్దవాడైన తదుపరి తండ్రియైన సుధర్ముడు వివాహ మొనర్చెను. ఆ కుమారుడు భార్యతో ఆనందముగా కాపురము చేయసాగెను. కాని ఘృష్మాదేవి మాత్రం ఏమియు పట్టక నిర్వికరముగా పరమేశ్వరుని భక్తితో ఆరాధించుచుండెను. కాని అక్క సుదేహకు మాత్రం రోజు రోజుకు అసూయ ఎక్కువై ఒకనాడు రాత్రి ఆ కుమారుని చంపి ముక్కలుగా కోసి పార్ధివ లింగములు నిమజ్జనము చేసిన చెరువులో పారవేసి ఏమీ తెలియని దానివలె నటించసాగెను. భర్తను కానిదై కోడలు ఏడవ సాగెను. అది వినిననూ ఘృష్మాదేవి ఏ మాత్రమే చలించక 101 పార్ధివ లింగముల పూజను చేయుచుండెను. పూజానంతరము మహేశ్వరుని స్మరించుచూ పార్ధివ లింగములను కోనేరులో నిమజ్జనము చేసి వెనుతిరిగిన వెంటనే కుమారుడు పునర్జీవితుడై కనిపించెను. ఆమె తన కుమారుడు మరణించినపుడు, తిరిగి పునర్జీవితుడైనపుడు నిర్వికారిగా వుండెను. ఆమె భక్తికి, నిగ్రహ శక్తికి సంతసించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంతట ఆమె శివభక్తుల కోరికలు తీర్చుటకు వారిని రక్షించుటకు తన పేరుతో జ్యోతిర్లింగ రూపముగా వెలయుమని కోరగా పరమేశ్వరుడు అందుకు అంగీకరించి అచ్చటనే శ్రీ ఘృష్ణేశ్వరస్వామిగా అవతరించెను. ఇచ్చటనే వున్న ఎల్లోరా గుహలు దర్శనీయమైనవి. ఇక్కడికి సమీపములో ఔరంగాబాద్‌, దౌలతాబాద్‌, దేవగిరి కోటలు కలవు. తాజ్‌మహల్‌ నకలు కూడా ఇచ్చటికి సమీపమున కలదు.

కంచి


కంచి

కాంచీపురం, కంచి లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురంఅనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేడన్ తాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది. కాంచీపురం జిల్లాకు ఉత్తరాన చెన్నై మరియు తిరువళ్ళూరు జిల్లాలు, పశ్చిమాన వెల్లూరు, తిరువన్నమలై, దక్షిణాన విల్లుపురం జిల్లా, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా కలవు.

కాంచీపురం చరిత్ర
పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి మధ్య యుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటి చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడ రేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్పవిద్వాంసుడు మరియు సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు మరియు దయగలవారని వర్ణించాడు.బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్దంలో aపతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉన్నది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. క్రీ.శ.మూడవ శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్ధం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణా నది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్ధం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురాన్ని, వెయ్యి స్తంభాల మండపాన్ని, వరదరాజ స్వామి దేవాలయంలోని శిల్పకళాచాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచిహిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం.

దేవాలయాలు
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః ||

భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం, అద్వైతవిద్యకు ఆధారస్థానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగరశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డాణము. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహవిముక్తి నందిన పుణ్యస్థలం.

ఏకాంబరేశ్వర దేవాలయం
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర.ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం , ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.

బృహదీశ్వర ఆలయం

ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయం
దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం


ఇది ఆలయం కాదు విశ్వవిద్యాలయం
తమిళనాడు ఆలయాలలో తమిళ భాష వినిపించకుండా పోయిన రోజుల్లో... ముఖ్యమంత్రి కరుణానిధి చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఆలయాల్లో తమిళ ప్రార్ధలను పునరుద్ధరించారని, అలా తంజావూరు కేంద్రంగా దక్షణాదిని పాలించిన రాజరాజచోళుని అభిమతాన్ని కరుణానిధి నెరవేర్చారు.

బృహదీశ్వరాలయం సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా .. తమిళ సంప్రదాయానికి, కళా, సాహిత్యాలకు చోళరాజుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయం ఈ సదస్సును నిర్వహించింది.  క్రీ.శ.985లో అధికారంలోకి వచ్చిన రాజరాజచోళుడు అనతి కాలంలోనే చక్రవర్తులకు చక్రవర్తిగా ఎదిగాడు.

ఆయన పాలనలో తమిళ భూభాగం ఎన్నోవిధాలా అభివృద్ధి చెందిందనీ, నిజానికి ఆయన ఓ సింహమనీ అన్నారు. పరిపాలనాదక్షుడైన రాజ రాజచోళుని కాలంలో రాజ్యం అన్నివిధాలా అభివృద్ది చెందిందన్నారు. ఆ కాలంలోనే ఇక్కడ జైనమతం కూడా వృద్ధి చెందిందనీ, సమాజం సమతౌల్యంగా ఉండేదని అన్నారు. 1003లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 1010లో పూర్తయిందన్నారు.

ఇలా గత వేయి సంవత్సరాలుగా సమున్నతంగా నిలిచివున్న ఈ ఆలయ నిర్మాణం, శిల్పకళా వైవిధ్యం ఇప్పటికీ అపురూపమేనన్నారు. ఆలయ నిర్మాణ సారధి వీరచోళన్ కుంజరమాలన్ రాజరాజ పురంద చోళన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆలయమే ఓ విశ్వవిద్యాలయమనీ, ఇక్కడ నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనం, నాటకం వంటి అన్ని కళారంగాలు విలసిల్లాయన్నారు. అంతకు ముందు బృహదీశ్వ రాలయానికి సంబంధించిన పెయింటింగ్స్‌తో రూపొందించిన ఓ పుస్తకాన్ని  ఆవిష్కరిచారు.

అలరిస్తున్న కళారూపాలు...
బృహదీశ్వరాలయం సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న వివిధ కళరూపాలు సందర్భకులను అలరిస్తున్నాయి. 26వ తేదీన ముగుస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం దేశ, విదేశాలకు చెందిన మొత్తం వేయి మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నర్తకీమణి డాక్టర్ పద్మాసుబ్రమణ్యం సంగీతం సమకూర్చారు.

భరతనాట్య శాస్త్రాచార్యుడు భరతముని తెలిపిన 108 కరణ శిల్పాల్లో ఈ ఆలయంలో 81 శిల్పాలున్నాయి. బిగ్‌టెంపుల్ వేయి వసంతాల వేడుకలో భాగంగా తంజావూరునగరం అంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఆలయానికి మరమ్మతులు చేయిడమే కాక, రూ. 25 కోట్ల వ్యయంతో పట్టణంలో కూడా సౌకర్యాలను మెరుగు పరిచింది.

పందిళ్లు, మామిడాకు తోరణాలు, పూల హారాలు, విద్యుత్ దీపాలంకరణలతో తంజావూరు వెలుగులు విరజిమ్ముతోందని పలువురు సందర్శకులు అభిప్రాయపడ్డారు.

విదేశీ పర్యాటకులను అబ్బుర పరుస్తున్న తంజావూరు బృహదీశ్వరాలయం
'మా కళ్లను మేమే నమ్మలేకున్నాం, ఇటుక, కలప లేకుండా ఇంత పెద్ద ఆలయమా? ఈ క్షేత్రంలోని ప్రతి శిల్పంలోనూ జీవం ఉట్టిపడుతోంది. యంత్రాలు, ఆర్కిటెక్చర్లు, ప్లాన్లు, రోడ్లు అందుబాటులో లేని రోజుల్లో రాళ్లకు ప్రాణం పోశారేమోననిపిస్తోంది. నిజంగా మహాద్భుతం...' అంటూ విదేశీ పర్యాటకులు పరవశించిపోయారు. తమ జీవితంలో ఈ అనుభూతి మరువలేనిదంటూ కొనియాడారు. తంజావూరు పట్టణంలో రాజరాజ చోళ చక్రవర్తి వెయ్యేళ్ల క్రితం నిర్మించి, పూజలు చేసిన బృహదీశ్వరాలయ సహస్రాబ్ది ముగిం పు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వందలాది మంది విదేశీ పర్యాటకులు ప్రస్తుతం తంజావూరు వచ్చారు.

అక్కడ ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడి కళాకృతులను, ఆలయ ప్రాశస్త్యాన్ని, పుస్తకాలు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వారు ప్రత్యక్షంగా చూసి పులకించారు. 
ఆలయం ఎత్తు, వెడల్పు, పొడవు చూస్తుంటే, పూర్తిగా ఒండ్రుమట్టితో నిండిన ఆ ప్రాంతానికి 
ఇన్ని బండరాళ్లు ఎక్కడి నుండి వచ్చాయి?
ఏ వాహనా ల్లో ఎక్కించి ఇక్కడికి తరలించారు?
ఎంత మంది ఎన్ని రోజులు శ్రమించారు?
ఈ బండరాళ్లను శిల్పాలుగా మలచేందుకు ఎటువంటి పనిముట్లు ఉపయోగించారు? 
ఇనుముతో తయారైన ఉలితో శిల్పం చెక్కితే ఆ ఇనుమును పదును చేయగల హీట్ ట్రీట్‌మెంట్ వారికి తెలుసుండాలి. వేడిచేసిన ఇనుమును నీటిలోనో, నూనెలోనో ముంచి ఉండాలి. కణకణమనే నిప్పుల్లో కాలిన ఇనుము నూనెలో ముంచె కళ వెయ్యేళ్ల క్రితమే వాడుకలో ఉందా? 
ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, కళాకారు లు ఎంతమంది, వారికి భోజనం, బియ్యం, కూరగాయలు ఎలా సేకరించారు, వంట పాత్రలెన్ని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగైన స్థలాన్ని ఏర్పాటు చేశారా, మనుష్యులకు సాయంగా, ఏనుగులు, పశువులు, గుర్రాలు, గాడిదలు ఉన్నట్లయితే వాటికి మేత, పోషణ చూసుకున్న వారెందరు?
వారంతా పురుషులేనా, ఆలయ నిర్మాణంలో మహిళలు కూడా పాలుపంచుకున్నారా? 
ఊహకందని ఇలాంటి అనుమానాలు రావడంతో ఆ విదేశీయులు ముక్కున వేలేసుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే, గుడిలో కొలువుదీరిన రాతి ప్రతిమలు, ఒక రాతితో చెక్కిన 36 అడుగుల ఎత్తు స్థూపం, వేయి టన్నుల బరువుతో ఉన్న కొండరాళ్లను వందలాది మైళ్ల నుండి ఇక్కడికి ఎలా తరలించగలిగారు?
ఆలయ నిర్మాణం పనులు పూర్తయ్యాక దాని నిర్వాహక మెవరికి అప్పగించారు? 
ఇలాంటి వివరాలతో శిలాఫలకాలుంటాయేమోనని ఆలయం, ఆ పరిసరప్రాంతాలు మొత్తం వెదికారు. భారత పురావస్తుశాఖ నిపుణులే చెప్పలేని సమాధానం. 
వివరించజాలని శక్తికి, దైవానికి, తనవల్ల చేతనైన గుర్తుగా నిర్మించాడు ఆ చోళచక్రవర్తి. ఆ మరచిపోలేని గుర్తే బృహదీశ్వరాలయం.

ఈ ఆలయాన్ని అక్కడ శిల్ప సౌందర్యాన్ని, కొలువైవున్న వింతలను దర్శించుకున్న విదేశీయుల బృందాలు ధన్యులమయ్యామని ముక్త కంఠఃతో వ్యాఖ్యానించారు.

దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం
భారతదేశంలో దేవాలయం అన్నది మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. విగ్రహాన్ని నెలకొల్పిన ఆలయంలో భక్తులకు ప్రదక్షిణ, పూజచేయడానికి ఏర్పాట్లుండేవి. ఆలయం అనేది మనదేశంలో వివిధ దశల్లో రకరకాలుగా రూపొందుతూ వచ్చింది. ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి దేవాలయం మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఆలయాలను నిర్మించిన స్థపతులూ, శిల్పులూ ఒకే రకమైన శిక్షణ పొందినవారు. ఆయా దేవాలయాలలోని దేవుళ్లు, పూజాపద్ధతులు తెలిసిన పూజారులు, మతాధికారులు మొదలైన వారి ఆదేశాలనుసారం ఈ శిల్పులు ఆలయ నిర్మాణాలు చేశారు.ప్రధాన దేవతా విగ్రహాల రూపుౌౌరేఖలలో ఆలయాల శిల్పరీతులలో అలంకరణలలో మార్పులు చేశారు.వీటన్నిటి ఫలితంగానే మన శాస్త్రాలలో పేర్కొన్న వాస్తు శిల్ప, ఆగమ గ్రంథాలు, సూత్రాలు రూపొందాయి. ఈ కారణంగానే మన దేశంలోని వాస్తు శిల్పం అంటూ ఒక సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా గోచరిస్తుంది. అలాంటి శిల్ప, వాస్తు సౌందర్యాల మేళవింపే బృహదీశ్వరాలయం...
తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీ శ్వరాలయం. తంజావూరుకు ఈ పేరు ‘తంజన్‌-ఆన్‌’ అనే రాక్షసుని వలన వచ్చిందని చెబుతారు. ఈ రాక్షసుడు శ్రీఆనందవల్లి అమ్మ, శ్రీనీలమేఘ పెరుమాళ్‌ ల చేత చంపబడ్డాడని, ఆ రాక్షసుని కోరిక మేరకు ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందనేది ఒక పురాణగాథ. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు, ఆ తరువాత విజయ నగర రాజులు పరిపాలించారు. అటుపిమ్మట 1674వ సంవత్సరంలో ఈ నగరాన్ని ‘వెంకాజీ’ ఆక్రమించుకున్నాడు. ఈ వెంకాజీ శివాజీ మహారాజు కు తమ్ముడు. 1740లో బ్రిటీష్‌వారు మొదట ఆక్రమణకు ఇక్కడికి వచ్చినా విఫలం చెందారు. తరువాత 1799లో విజయం సాధించారు. ఇదీ స్థూలంగా ఈ నగర చరిత్ర.

అచ్చెరువొందే శిల్పకళానైపుణ్యం...
ఆనాడు చోళుల సామ్రాజ్యం తమిళ, కేర ళ దేశాలకే కాక దక్షిణ మైసూరు, కోస్తాంధ్ర, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు మొదలైన ద్వీపాలకు విస్తరించి ఉంది. అప్పటికే రాష్ట్ర కూటులు తమ ప్రాభవాన్ని కోల్పోగా పశ్చిమ చాళుక్యులు విజృంభించారు. చాళుక్యులు వచ్చే నాటికే అక్కడక్కడా రాతితో ఆలయ నిర్మాణాలు, వాటిపై అందమైన శిల్పాలు శాస్తబ్రద్ధంగా పరిణతి చెందాయి. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం ‘కేరళాంతకన్‌’, రెండో ద్వారం ‘రాజరాజన్‌ తిరువసల్‌’, మూడో ద్వారం ‘తిరువానుక్కన్‌ తిరువసల్‌’.

ఈ ఆలయం సర్వ కళా శోభితమై సంస్కృత తమిళ శాసనాలున్న చారిత్రాత్మక సుప్రసిద్ధ దేవాల యంగా అలరారుతున్నది. క్రీశ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు బృహదీశ్వరాల యాన్ని నిర్మించాడు. ఈ పవిత్ర ఆలయంలోకి అడుగిడగానే 13 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది.ఐదుపడగల నాగేంద్రుని నీడన స్వామి దర్శ నమిస్తాడు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో ఇదొక అద్భుతమైన నిర్మా ణం. దక్షిణ విమాన నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల కళా నైపుణ్యానికి పరాకాష్టగా దీనిని పేర్కొనవచ్చు. ఈ బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున ‘రాజరాజేశ్వరాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.

భారీ నంది, ఎతైన శివలింగం...
ఈ ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన నంది శిల్పం ఉంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో డిజైన్లు చిత్రించారు. ఆ చిత్రాలు ఇప్పటికీ తమ ప్రాభవాన్ని కోల్పోకుండా అందంగా అలరిస్తున్నాయి. ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. బృహదీశ్వర ఆలయం విమానపు అధిష్టానం రెండు తలాలతో, మందమైన రెండు గోడల సాంధర ఆలయంగా ఉంటుంది. ఆలయం తూర్పునకు అభి ముఖంగా ఉండగా, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో ద్వారాలున్నాయి. గర్భగు డిలో చాలా పెద్ద పీఠం, దానిమీద పెద్ద లింగం ఉంది. ఇంత పెద్ద లింగం బహు శ దక్షిణ భారతదేశంలోనే లేదేమో! రెండు గోడల మధ్య రెండతస్తులతో ప్రదక్షి ణ మార్గం కూడా ఉంది.ఇలా నాలుగు వైపులా ద్వారాలున్న ఈ ఆలయం సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు.

అబ్బురపరిచే వర్ణచిత్రాలు...
అలాగే ఆలయద్వారానికి అటూ ఇటూ ఉన్న నిలువు గూళ్లను దేవకోష్టాలుగా తీర్చి వాటిలో దేవతామూర్తుల విగ్రహాలనుం చారు. ఇక కింది తలుపు లోపలి గోడలో దక్షిణాన శివుడు, పడమట వైపు నటరాజు, ఉత్తరాన దేవీ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన కథ చిత్రాలు ఉన్నాయి. ఇంకా శివ భక్తుడై న సుందరమూర్తి కథ, చిదంబరం నటరాజు మూర్తిని రాజు పూజిస్తున్న దృశ్యం, గాయకులు, నాట్యకత్తెలు, వివిధ పక్షులు వంటి చిత్రాలను అందంగా చిత్రించారు.

ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి ఉన్నాడు. ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా కాలక్రమంలో వివిధరాజులు కట్టించినవి.

బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నాయక రాజులు కట్టించిన సుబ్రహ్మణ్య ఆలయం ఒక మణిపూస వంటింది. బృహదీశ్వర ఆలయ ప్రాకారం లోపల ఈ ఆలయాన్ని విమాన అర్ధ, ముఖ మండపాలతో కట్టారు. నునుపైన గట్టి రాతితో కట్టిన ఈ ఆలయపు అధిష్ఠానం మీద, కుడ్య స్తం భాల మీద చాలా సూక్ష్మమైన, అందమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు అందమైన అలం కరణ లతో కనులు పండువుగా ఉన్నాయి. గర్భగృహంలో సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తున్నట్లు ఆల య గ్రీవ శిఖరాలు షణ్ముఖంగా ఉంటాయి. బహుతలములైన ఈ ఆలయపు విమాన తలం మూ లలు కూడా షట్భుజంగా ఉన్నాయి. ఈ పద్ధతి తరువాతి దక్షిణాత్య స్థపతులకు మార్గదర్శకాల య్యాయి.

సమ్మోహనభరితం... కోట ప్యాలెస్‌
తంజావూరులో చూడదగ్గ మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్‌ను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఎతె్తైన టవ ర్లు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, పరరాజుల దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.

విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహ ల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.

త్యాగరాజస్వామికి ఘన నివాళి...
తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న ‘తిరువయూరు’ అనే గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలోనే ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉం ది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగ రాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు’ ఘనంగా జరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూ లల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించి న గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.

బృహదీశ్వరాలయానికి చేరుకోవాలంటే...
ఈ ప్రసిద్ధ ఆలయానికి చేరాలంటే... చెనై్న వరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొ ని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.

తొలి వెయ్యి నోటుపై బృహదీశ్వరాలయం...
1954లో మొట్టమొదటిసారిగా రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది. ఈనాడు మళ్లీ ఈ ఆలయం సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఆ నోటు గుర్తుకు వచ్చింది.
1954లో తొలిసారిగా బృహదీశ్వరాలయం ఫొటోతో విడుదలైన వెయ్యి రూపాయల నోటు

తపాలా ‘ముద్ర’...
రాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

Friday, 13 November 2015

అహోబిల క్షేత్రo

అహోబిల క్షేత్రం
అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రంలో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు.

జ్వాలా నరసింహ క్షేత్రము వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని “జ్వాలా నరసింహుడు” గా వ్యవహరిస్తారు.

అహోబిల నరసింహ స్వామి ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా “స్వయంభు” తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

మాలోల నరసింహ స్వామి వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా “మా” అనగ లక్ష్మిలోల యనగ “ప్రియుడు” అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

వరాహ నరసింహస్వామి (క్రోడా) వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

కారంజ నరసింహస్వామి కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు “నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా” నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య “పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ” అని పాడారు.

భార్గవ నరసింహస్వామి పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని “భార్గోటి” అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

యోగానంద నరసింహస్వామి యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

చత్రవట నారసింహస్వామి పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. “హా హా” “హుహ్వా” అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

పావన నరసింహ స్వామి పరమపావన ప్రదేశంలో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు “భరద్వాజ” ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి “శనివారం” నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.Thursday, 12 November 2015

హింగ్లాజ్ దేవీ ఆలయం

బెలూచిస్థాన్ లోని హింగ్లాజ్ దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలోని ఒక శక్తి పీఠం.
సతీవియోగ దుఃఖం తీరని పరమశివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.  ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు. రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు.
హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.

ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా

బృహదీశ్వరాలయము


Brihadeeswarar Temple ( Big Temple )
బృహదీశ్వరాలయము భారతీయుల ప్రతిభకు నిలువేత్తు నిదర్శనం. 1000 సంవత్సరములు పూర్తిచేస్కుని చెక్కు చెదరకుండా సింహంలా కనిపిస్తుంది. మన వాళ్ళ ప్రతిభకు ముందు చూపుకు బృహదీశ్వరాలయము నిదర్శనం. ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని 1000 సంవత్సరాల క్రితం కేవలం 5 సంవత్సరాల వ్యవదిలోనే అంత పెద్ద ఆలయం ఎలా నిర్మించారో!?
సునామి వచ్చినప్పుడు కూడా ఎటువంటి కధలిక లేక స్థిరంగా నిలబడేలా మనవాళ్ళు చేసిన నిర్మాణం అద్బుతం. ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. ఎవరికీ అంతుపట్టని ఊహకు అందనివి . 
The Peruvudaiyar Kovil, also known as Periya Kovil, Brihadeeswara Temple, RajaRajeswara Temple and Rajarajeswaram, at Thanjavur in the Indian state of Tamil Nadu, is a Hindu temple dedicated to Shiva.

 1. ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు.
 2. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది.
 3. బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటి. ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎత్తు, అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం .
  అంత పెద్ద శివ లింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
  ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారు మాత్రమే దర్శించుకునే వారు సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు. తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటుంది.
 4. కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సంవత్సరాల కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.
 5. ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు. ఔరా ఎంత పెద్దగా ఉండి ఉంటుంది గుడి. ఇంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ శిల్పుల ప్రతిభ.
 6. ప్రధాన దేవాలయ గోపుర కలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది. అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది...
  ఈ రాయిని గోపురం పైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.
 7. తమిళనాట కావేరీ నదీ తీరాన కళలకు కాణాచిగా వెలుగొందిన తంజావూరు నగరంలోని బృహదీశ్వరాలయం శిల్పసౌందర్యానికి పెట్టిందిపేరు. ఈ ఆలయంను రాజ రాజ చోళ-I, మధ్యయుగ చోళ రాజు 11వ శతాబ్దం ADలో నిర్మించారు. 216 అడుగుల ఎత్తయిన గోపురం, దానిపై 80 టన్నుల కలశం, గర్భగుడిలో 13 అడుగుల ఎత్తయిన ఏకశిలా లింగం, బయట ఏకశిలా నంది ఇలా ఎన్నెన్నో శిల్పకళా మహాద్భుతాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. పునాదులే లేకుండా 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా 1987 వ సంవత్సరంలో ప్రకటించింది.
 8. ఈ ఆలయ గోపురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. (ఎందుకంటే దాదాపు పదమూడు అంతస్థుల భవనమంత ఉంటుంది మరి)
 9. ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే చేయబడినది.
 10. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. జీవితకాలంలో ఒక్కసారైనా తప్పని సరిగా చూడవలసిన ఆలయం.
  తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం 216 అడుగుల ఎత్తు. ఈ ఆలయం పై వర్షం పడినప్పుడు శిఖరం నుంచి క్రింద వరకు నీటిని ఒక చోటకు వచ్చేలా చేసి అక్కడ నుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు / భూమి లోపలకి పంపేల ఏర్పాటు చేసారు. 1000 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గోప్పగా ఆలోచించారో చూడండి.
  తంజావూరు బృహదీశ్వరాలయం గుడిలోపల "ప్రతిధ్వని" ఉండదు. మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినబడవు. 1000 క్రింతం మన వాళ్ళు సాధించారు.  పైగా గుడి అంతా రాయిచే నిర్మించబడింది. సౌండ్ తిరిగి రాకుండా ఎలా చేయగలిగారో .

తంజావూరు:: బృహదీశ్వరాలయం:: తంజావూరు బృహదీశ్వరాలయం... రాజ రాజ చోళుడు నిర్మించిన ఆలయం ... చాలా సుప్రసిద్ధమైనది..
ఇక్కడ ఈ ఆలయాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన రాళ్ళు పరిసర జిల్లాలలో కనపడవు.. అంటే వేరే ప్రదేశం నుండి తరలించినది. ఇది కూడా విచిత్రమే. ఈ ఆలయ పరిసరాలలోనే వివిధ భాషలలో తాళపత్ర గ్రంథాలను చూసాము. ఇక్కడ అతి పెద్ద పురాతన గ్రంథాలయం, మ్యూజియం, మహళ్ళు చాలా బావుంటాయి. ఒకరోజు పూర్తిగా సరిపోయేంత దర్శనీయ స్థలాలున్నాయి.

బృహదీశ్వరాలయం [తంజావూరు]
ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..


తంజావూరు లోని బృహదీశ్వరాలయ గోపురం
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.


బృహదీశ్వరాలయం
బృహదీశ్వర ఆలయం (తమిళం: பெருவுடையார் கோவில்; పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

బృహదీశ్వర ఆలయం (తమిళం: பெருவுடையார் கோவில்; పెరువుదైయార్ కోయిల్[2]బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
More: http://te.advisor.travel/poi/bRhdiishvraalyN-14567
ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.
More: http://te.advisor.travel/poi/bRhdiishvraalyN-14567

కోణార్క సూర్యదేవాలయం


కోణార్క సూర్యదేవాలయం

కోణార్క సూర్యదేవాలయం.
అద్భుతాలకు నిలయం.
భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం.

కోణార్క సూర్యదేవాలయం చంద్రభాగా నది తీరాన ఉంది. ఈ దేవాలయాన్ని సూదంటురాయి (మేగ్నటైట్) లాంటి రాళ్ళతో నిర్మించారు. అవన్నీ ఒక క్రమ పద్దతిలో ఒక దాని మీదుగా అమర్చటం వలన సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖద్వారం కూడా ఎంతో విలువైనది. ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఎంత శక్తివంతమైనవంటే ఆ ఆలయం దగ్గరలో తిరిగే హెలికాప్టర్‌ను సైతం ఆకర్షించగలిగేంత అంత. దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల నిమిత్తం ఇంగ్లాండుకు తీసుకుని పోయారని ఒక కథనం.

ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు ఇరవై నాలుగు చక్రాలతో, ఏడు అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ఇరవైనాలుగు చక్రలు ఒక రోజులోని గంటలకు సూచన. ఏడు గుర్రాలు ఏడు రోజులకు సూచన. ఈ అశ్వాలు చాలా రౌద్రంగా భయానకంగా కనపడి చూపరులను భయపడే విధంగా ఉంటాయట. (ప్రస్తుతం శిధిలమైనాయి). ఏనుగులు నిజంగా ఉన్నాయేమొనని అనిపించేంత ఉంటాయట. ఈ ఆలయ కుడ్యాల మీద రసరమ్య శిల్పాలు, నాట్యభంగిమలు ఉంటాయి. ఇవి మాటలకందని అద్భుతాలని చెప్పవచ్చు.

ఈ ఆలయం కట్టడానికి పదహారు సంవత్సరాలు పట్టిందట. దీనికై దాదాపు పన్నెండు వందల మంది శిల్పకారులు పనిచేసారట. ఎంతకీ ఈ ఆలయ గోపురాన్ని వాటి మధ్య సూర్యభగవానుడు తేలే విధంగా చేయడం వారికి సాధ్యమవలేదట. రేపటి రోజులోపులో ఈ గుడి నిర్మాణం పూర్తి కావాలి లేదా అందరికీ శిరచ్చేదమే అని రాజు ఉత్తర్వులు జారీ చేసి వెళ్ళి పోతారట. సాయంత్రం దాకా ఏమీ తేలలేదు తెల్లారితే శిరచ్చేదమే అని బాధతో నిష్క్రమిస్తారట. అయితే అందులో ఒక శిల్పి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పనిలో చేరతాడు. ఆ శిల్పకారుడి కుమారుడి పదహారవ ఏడున తన తండ్రిని చూడాలని వచ్చి ఆ రాత్రి వారి సమస్యను చూసి వెంటనే ఆ రాత్రే పరిష్కరించి ఆలయ శిఖరాన్ని పూర్తిచేసి వారందరిని ఆశ్చర్య చకితులను చేస్తారట. అయితే అంతటి మహత్కార్యాన్ని పూర్తి చేసిన అతన్ని చూసి మిగిలిన వారిని రాజు చంపేస్తాడనే భయంతో ఆ కుర్రవాడు చంద్రభాగా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథనం. ఆ కుర్రవాడు భారత నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. కానీ ఈ ఘటన ఈ ఆలయానికి ఒక శాపమైందనే కథనం కూడా ఉంది. ఈ ఆలయం చాలా సార్లు ముష్కరుల దండ యాత్రకు, ఆంగ్లేయుల దాష్టికానికి గురై తన వైభవాన్ని దాదాపు కోల్పోయి ప్రస్తుతం కొంచెం కొంచెంగా వెలుగొందుతోంది. జీవిత కాలంలో ఒక్కసారిఅయినా చూడతగిన క్షేత్రం కోణార్క సూర్య దేవాలయం.
కోణార్క్‌ - సూర్యదేవుని సౌధం
సప్తాశ్వ రథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరం దేవం
తమ్‌ సూర్యం ప్రణమామ్యహం!

అంటూ.. ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రెండు చేతులు ఆకాశంవైపుగా సాగి మందిరానికి కైమోడ్చుతాయి. లోకానికి ప్రాణనాథుడైన సూర్యదేవునికి కనులు ప్రణామాలు చెల్లిస్తాయి. ఉదయపు భానుడిలా ఎర్రదనంతో ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆ భానుని నివాసాన్ని మనసు తనువంతా కనులు చేసుకొని అచ్చెరువొందుతూ వీక్షించడంలో మునిగిపోతుంది.

ఒరిస్సా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో శంఖుక్షేత్రం పూరి, చక్ర క్షేత్రం భువనేశ్వరం, గదా క్షేత్రం జాజ్‌పూర్, ఈ కోణార్క్‌ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. కోణార్క్‌ ఆలయాన్ని ‘నల్ల పగోడా’ అంటారు. ప్రధాన పట్టణమైన భువనేశ్వర్‌ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో జగన్నాథుడు కొలువున్న పూరీ పట్టణానికి కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది కోణార్క్‌. ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘యునెస్కో’ జాబితాలో చేరిన ఈ ఆలయం మనదేశ అద్భుతాల్లో ఒకటి. ఇప్పుడిదొక మాన్యుమెంట్‌గా గత చరిత ఘనతకు ఆనవాలుగా గాధలను మనకు వివరిస్తుంది. రారమ్మని ఆహ్వానిస్తుంది.

నాటి గాధలు కళ్లకు కట్టే కట్టడం
భువనేశ్వర్‌ నుంచి బస్సులో కోణార్క్‌కు చేరుకోగానే హృదయం ఒక్కసారిగా ఉద్వేగభరితం అవుతుంది. పరుగులాంటి నడకతో ఆలయం ముంగిట్లో గువ్వపిట్టలా వాలిపోతాం. నాటి గుర్తులను హృదయంలో ఒక్కొక్కటి లిఖించుకుంటాం. ఈ ఆలయం 13వ శతాబ్దిలో రూపుదిద్దుకున్నట్టు పద్మపురాణంలో చెప్పబడింది. ఈ ప్రాంతం గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడు సూర్యభక్తుడు. ఇతని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనినే మైత్రేయ వనం అనేవారు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అప్పటి తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని పేరిట నెలకొన్న స్థలమనీ అంటారు. పూరీక్షేత్రానికి ఈశాన్య కోణంలోని అర్క (సూర్య) దేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు వచ్చింది.

సప్తాశ్వరథం
సూర్యుడు 24 చక్రాలతో, ఏడు అశ్వాలతో ఉన్న రథాన్ని అధిరోహించి సౌరమండలాన్ని పాలించడానికి బయల్దేరుతాడట. ఆ ఆకారం పోలికతోనే నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు, వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడు అశ్వాలు చెక్కబడి ఉంటాయి. (ప్రస్తుతం ఆశ్వాలు లేవు) ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతారని గైడ్స్‌ వివరిస్తారు. సూర్యపరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం. ఒక్కో రథ చక్రం 3 మీటర్ల వైశాల్యంతో అద్భుత శిల్పచాతుర్యంతో కనిపిస్తుంది. మందిరం మధ్యభాగంలో రత్నఖచితమైన సింహాసనముండేదట. దానిపైన సూర్యభగవానుడు ఆసీనుడై ఉండేవాడట. ఈ మూర్తి ముందు వజ్రం ఉండేదని, సూర్య కిరణాలు ఈ వజ్రం మీద పడి అవి కాంతులు విరజిమ్మేవని చెబుతారు. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవులకు కుండలాలు, కంఠంలో హారం, మెడలో జంధ్యం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో ఆభర ణం, దానికింద గ్రంథిమాల.. జీవకళ తొణికినట్టు కనిపించేదట. 1627లో రాజ కుద్ర సూర్య మూర్తిని కోణార్క్‌ నుంచి పూరీలో జగన్నాథ ఆలయానికి తరలించారని చెబుతారు. దేవాలయం పైన పద్మం, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడా శృంగార రసభరిత శిల్పాలు ఎన్నో ఉన్నాయి.

నిర్మాణానికి 16 ఏళ్లు..
ఈ మందిరాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల పాటు నిర్మించారని చరిత్ర విశదం చేస్తుంది. దేవాలయంతో పాటు దీంట్లోని ప్రధాన హాలు ఒక తామరపూవు మీద ఉన్నట్టు చెక్కి ఉంటుంది. ఈ విశాలమైన హాలుకు నాలుగువైపులా ద్వారాలు, వాటి మీద చెక్కిన లతలు, పువ్వులు.. నాటి అద్భుత కళాసృష్టికి నీరాజనాలు పలుకకుండా ఉండలేం. ఈ హాలు ముందు భాగంలో మరో నాట్యమందిరం నిర్మింపబడి ఉంది. దీనిని భోగమంటపమని, నాట్యమందిరం అని అంటారు. అన్ని వైపులా రాతిపైన చెక్కిన నర్తకుల బొమ్మలు బాజభజంత్రీలతో దేవతార్చన చేయటం కనపడుతుంది. హాలుకి ఉత్తరం వైపు రెండు ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. అవి నిజం ఏనుగులనే తలపించేలా ఉంటాయి. ఒక్కో ఏనుగు ఎత్తు 9 అడుగులు, వెడల్పు 5 అడుగులు ఉంటుంది. హాలుకు దక్షిణం వైపు విరాట్‌ స్వరూపంతో రెండు గుర్రాలుండేవట. ఇప్పుడవి కానరావు. వీరావేశంతో ఉండే ఆ విగ్రహాలను చూసి దర్శకులు భయపడేవారట. ఈ ఆలయం తూర్పు–పడమరల దిక్కులుగా ఉంటుంది. ప్రధాన హాలులో భక్తజనం ప్రార్థనలు జరిపేవారు. అయితే ప్రస్తుతం ఇది మూసి వేసి ఉంటుంది. ఈ ప్రాంత సమీపంలోనే భక్తకబీరుదాసు సమాధి ఉండేదని అబుల్‌ఫజల్‌ అయినీ అక్బరీ చెబుతోంది.

సూర్యుడే తపమాచరించిన చోటు
శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపించాడట. ఆ శాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడయ్యాడు. దీంతో ఇక్కడి మైత్రేయవనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగవిముక్తుడయ్యాడట. ఈ ప్రాంత పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను ప్రతిష్టించి పూజలు జరిపాడని చెబుతారు. ఆ తర్వాతి కాలంలో లాంగులా నరసింహదేవుడు నేటి ఆలయాన్ని నిర్మించారని కథలున్నాయి.

స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి, ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరందని చెబుతారు. అంటే ఈ ప్రాంతంపై సూర్యదేవుని మహిమలు అధికమన్నమాట. ఎంతటి దీర్ఘకాల వ్యాధులైనా ఈ ప్రాంత సందర్శనంతో నయమవుతాయని భక్తుల విశ్వాసం. అనూరుడు సూర్యుని రథసారధి. చేతులు జోడించి సూర్యుని ధ్యానిస్తున్నట్లు ఉంటుంది ఆకృతి. ఇక్కడ గల రామచండీ మందిరం కోణార్కు అధిష్ఠాత్రిదేవీ మందిరం (దీనినే బుద్ధుని తల్లి మాయాదేవి మందిరం) అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయానికి దగ్గరగా ఉన్న లియాఖియా అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నవగ్రహాలు తప్పక దర్శించవలసినవి. ఈ గ్రహాలు మనుష్యాకారంలో కాంతులు వెదజల్లుతున్నట్టు మెరుస్తుంటాయి. ఇవన్నీ.. తలలపై మకుటం, పద్మాసనం వేసినట్లు చెక్కబడ్డాయి. ఇంకా ఎన్నో ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ఆలయం పక్కనే ఉండే మర్రివృక్షం అతి ప్రాచీనమైనది, విశాలమైనది. ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసినట్టు కథలుగా చెబుతారు.

అలంకారాలెన్నో!
ఆ నిర్మాణ కౌశలం, ఆ శోభ ఆనవాలుగా కనిపిస్తున్న ఆ దర్బారు హాలు, ఆ అలంకారాలు, ఆ మందిరాలు.. ఎన్నో గాలి తుపానులకు, మరెన్నో భూకంపాలకు లోనైంది. ఇంకా తనవితీరక విదేశీయుల చేతిలో విధ్వసం చేయబడింది. కర్కోటకుడైన కళాపహాడు, 17వ శతాబ్ది జహంగీర్‌ ఈ దేవాలయం ధ్వంసం చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహమ్మదీయ నావికులు ఉత్కలకళామణిని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. కోణార్క దేశం పతనం చెందింది. ఇక్కడ దేవ దేవీల దివ్యమందిరం, జాతీయ కాంతి సౌధం పోర్చుగీసుల ఆశ్రయ స్థలం ముక్కలై జీర్ణ చిహ్నమై కనిపిస్తుంది. అయినా, నాటి కళావైభవం చెక్కుచెదరక కనులకు విందు చేస్తూనే ఉంది. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూనే ఉంది.

మార్గం సులభం
హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కి విమానమార్గం, రైలుమార్గం, రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి భువనేశ్వర్‌ చేరుకోవచ్చు. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి 64 కిలోమీటర్లు. పూరీ నుంచి 34 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సు సదుపాయాలు ఉన్నాయి. పూరీలో రైల్వేస్టేషన్‌ ఉంది. కోణార్క్‌ చుట్టుపక్కల చూడదగిన సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పూరీ జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లోని సోమేశ్వర ఆలయం, భువనేశ్వరి మాత ఆలయం, చంద్రభాగా బీచ్, రామచండీ టెంపుల్, బీచ్, బౌద్ధ ఆరామాలు... ప్రధానమైనవి.

విశేష యాత్ర
ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు విశేష యాత్ర జరుగుతుంది. ఘనత వహించిన యాత్రలెన్నో పూర్వం ఇక్కడ వైభవంగా జరిగేవట. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగయాత్ర.700 ఏళ్ల ఘనచరిత్ర గల ఈ నిర్మాణ ప్రాంగణంలో కోణార్క్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ను ప్రతియేటా ఒరిస్సా ప్రభుత్వం జరుపుతుంది. ఈ ఉత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19న జరగనున్నాయి.పూరి నుంచి కోణార్క్‌తో పాటు మరో 10 చూడదగిన ప్రదేశాలను సందర్శించడానికి టూరిస్ట్‌ బస్సులు ప్యాకేజీలను అందిస్తుంటాయి. ఒకరికి 200 రూపాయల నుంచి టికెట్‌ ఉంటుంది.భువనేశ్వర్, పూరీ క్షేత్రంలో బస సదుపాయాలకు లోటు లేదు.ఈ ప్రాంత స్థానిక వంటల రుచి తప్పక ఆస్వాదించాల్సిందే!సముద్రతీర ప్రాంతం గనుక ఇక్కడ దొరికే గవ్వలతో తయారుచేసే హస్తకళా వస్తువులు, పూసలు కారుచవకగా దొరుకుతాయి.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి


ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం - కంబోడియా


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం మన భారతదేశంలో లేదని అది 'కాంభోజ దేశం' లో వుందని? ఆ దేశం ఎక్కడ వుందో! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి.. చూడండి ..!ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం కంపూచియా)లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం. ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.

క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని “కంపూచియా”లో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా?


అసలు విషయానికొస్తే, ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని “కంబోడియా”గా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో “కంపూచియా”గా మారిపోయింది. పూర్వకాలంలో, కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది “హిందూ రాజులు” కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. “చైనా” రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా “భరత ఖండానికి” చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. (కాంభోజ రాజు కధలు..?)


“చోళ” రాజ్యానికి చెందిన ఒక రాజు, “టోనెల్‌ సాప్‌” నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. “ఖ్మేర్‌” సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. “సంస్కృతం” అధికారభాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.

జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది.

ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి.

భారతదేశంలో కూడా ఇప్పటివరకు, ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ఆ దేవాలయాన్ని చూసి హిందూ ధర్మ/మతం గొప్పదని తెలుసుకొని .. గర్వపడుదాం..!! శుభం భూయాత్ .!Saturday, 7 November 2015

Green Route: Trekking along the Railway Track

Overview:
Trekking along the "Green Route" was always on my mind and I got a chance to do that with a friend. We decided to keep it a low budget trip as we were fresh from a 3-day trip the previous week. So we decided to go by ordinary KSRTC bus.

We reached Kempegowda Bus terminus and enquired about the last bus to Sakleshpur. Finally boarded a Karnataka Sarige bus at 12am. We reached Sakleshpur at 5am in the morning. We started off for Donigal in sometime which was the starting point of our trek. We hired an auto and it took around 15 mins to reach Donigal railway station. We freshened up at the station. Normal passenger trains don't halt at Donigal apart from technical halts. There was one station master at the station and nobody else when we went there. We started our trek from Donigal knowing that it would not be an easy one with over 15+ kms to cover. The beginning of the trek was not too exciting but we had read in other blogs that it gets interesting as the trek advances.


The beauty of the place suddenly increased as we saw the first bridge. The only noise we could hear was of the birds chirping and trees swaying with the winds. As we moved on we realised why this place is called the Green Route. 

Further ahead we came across many people working on the railway tracks. They are assigned some daily tasks everyday and the inspection officer from PWD takes daily rounds to make sure everything is in place. We talked with them for sometime. They even warned us that the PWD officer might ask us to go back as he is very strict so advised us to think and proceed. We decided to take the plunge and proceeded further. A few meters from there we saw the first tunnel which was 239m long. It was like entering a huge cave, with droplets of water falling from the ceiling and eerie sound made by bats. It was a curve so light abandoned us from both sides and it was pitch dark. And our normal torches could light up only a small distance. We walked slowly and finally could see light at the end of the tunnel. It started drizzling and suddenly began to pour down heavily. Luckily we came across a small lonely tent where we quickly went inside for shelter. I carried a portable stove so we decided to prepare some tea for ourselves. It has a small stove with a camphor-like thing for flame. We lighted it and put the water to boil. We prepared the tea and it had stopped raining as well. So we decided to march ahead. The scenery kept getting better as we were walking and the cloudy weather and pleasant breeze added to it. We came across lot of waterfalls and words cannot describe the feeling. Then after covering about 12 kms we saw a small railway station called Hangarahalli. We crossed it and then decided to break for lunch with a huge tunnel ahead of us. We saw the Mangalore-Yesvantpur express coming out of the tunnel and was nice to watch. We noticed that all the trains heading towards Donigal from Subramanya road have to be pulled by one engine in the front and pushed by 2 engines from the back. This is because of the elevation which we were told that there is an elevation of 1 feet after every 100 meters. After lunch we took a 10 minute quick nap and continued towards Yedekumari. We crossed 2 small tunnels and 2 big ones before we saw someone guarding the tracks with a red flag. On asking him he said that some maintenance work is in progress on the other side of the tunnel so he was supposed to stop any train from entering it. We entered the tunnel which was around half a kilometre long. As he had told some work was going on the tracks at the exit of the tunnel. And unfortunately for us the PWD officer was monitoring the work. He stopped us from proceeding further and didn't allow us even after pleading. Finally disappointed, we came back to the guard and asked him for a solution. On his advice, we decided to head back towards the Hangarahalli railway station which we had left a couple of kilometres back. We started backtracking and finally reached the station in 30 mins. It was around 4pm and we got a waiting room to rest and spend the rest of our day and night. We immediately crashed to sleep and woke up at 7pm. In the evening after dinner we met a couple of villagers who worked for the railways who were telling about the nature of their work. They were supposed to work in shifts and it involved going 6kms and back on the track to make sure everything is fine. This person Hemanth was having his shift from 1am to 5am in the morning. He suggested that we take the 4am train to Subramanya Road and get a bus to Bangalore from there. We did exactly that. The train came at around 4:20am and reached Subramanya Road at 6:10am. We took a jeep to the bus stand. At the bus stand we decided to go to Gundya checkpost as the number of buses to Bangalore would be more. We reached Gundya at 8:10am and immediately got a bus to Bangalore. The journey back was also very pleasant with lot of waterfalls on the way near Shiradi Ghat though the roads were pathetic. We finally reached Bangalore at around 3pm in the afternoon.

How to reach:
Plenty of KSRTC buses available from Bangalore to Sakleshpur. At Sakleshpur, hire an autorickshaw to Donigal Railway Station. Start trekking from Donigal, to Yedekumari or Hadagarahlli. Halt at either of these places. Take early morning train 16517 Yesvantpur-Kannur express and get down at Subramanya road. From Kukke Subramanya plenty of buses available to Bangalore. 

Alternately, travel from Bangalore to Yedekumari by train by 16517 Yesvantpur-Kannur express. The reservation has to be done till Subramanya Road (SBHR) as there is no official stop at Yedekumari. Watch out for Yedekumari station between 4:15 to 5:00am. The train halts there only for 2 mins. Get down and relax till day break. Start trekking by 6am and reach Donigal station at around 4pm. Hire a jeep or auto from the main road outside the station to Sakleshpur bus stand. From Sakleshpur, plenty of buses available to Bangalore. 

Things to remember: Carry sleeping bags as it is not convenient to sleep at these places. Carry plenty of eatables and water, Raincoats in case of rainy season, a powerful torch.

Map: