Thursday, 11 February 2016

లింగరాజు ఆలయం


లింగరాజు ఆలయం

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్‌ని విశ్లేషించడం అంటే...గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం. తర్వాత పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలుగా చెప్పుకోదగినవి.

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.

లింగాలకు రాజు:
లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు ముందర నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కత లిపి సాక్ష్యంగా ఉన్నది.

నిర్మాణ శైలి:
లింగరాజ ఆలయం నిర్మాణ పటం - పై నుండి కిందికి విమాన (గర్భగుడి కలిగిన నిర్మా ణం), జగమే హన (అసెంబ్లీ హాల్), నటమందిర (వేడుకలు జరిపే గది) మరియు భోగమండప (సంతర్పణల గది) ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 18 86), అనే చరిత్ర పకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నది.

ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్:
గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం, పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలు. భువనేశ్వర్ యాత్ర ప్రయాణాన్ని ఒడిషలో ప్రారంభించడం ఖచ్చితమైన మార్గం. ఈ నగరం వందకంటే ఎక్కువ ఆలయాలను అందిస్తుంది వాటిలో అనేకమైనవి గొప్ప చారిత్రిక సంబంధం కలిగి ఉన్నాయి.

ఒడిష తరువాత పూరి మరో గమ్యస్థానం. పూరి భారత దేశంలోని పవిత్ర చార్‌దామ్‌లలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం. ఆశక్తికరంగా, ఈ పవిత్ర భూమిని సందర్శిస్తే కనీస ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒడిషలోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయంతో ఈ కోణార్క్ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది, ఇప్పటికీ ఇది శిల్పాలు, చేక్కుల్లలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఒడిష దాని విస్మయ-స్పూర్తితో రాష్ట్రం మొత్తంలో నిర్మాణ శైలిలో పెరుగంచడమే కాకుండా, గర్వించదగ్గ అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. జైన్ స్మరక చిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్య ప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియచేస్తుంది. ఒడిష పట్టణ, గ్రామీణ పరిపూర్ణ సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నివాసితులు నగరాలకంటే గ్రామాలలోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కౄతిని అనుసరిస్తున్నారు, అలాగే వారి సంప్రదాయాన్ని సంరక్షించుకుంటున్నారు. ఒరియా రాష్ట్ర అధికారిక భాష. అయితే హిందీ, ఇంగ్లీష్ వినియోగం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడలేదు.

ఒడిష సంస్కతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగా ఉంది. దీనిని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. ఈ పండుగలే కాకుండా ఒడిషలో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక, కళా వేడుకలు జరుపుకుంటారు.No comments:

Post a Comment