Thursday, 31 March 2016

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి

Bangalore - Nandi Hills - Lepakshi - One Day Road Trip!

రోజువారి జీవితంతో విసిగి పోయారా? 
ఒక్క రోజు రిలాక్స్ అయి ఆనందించాలని అనుకుంటున్నారా? 
మీ విలువైన సమయమును స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తూ గడపాలని అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, ఈ రోడ్ ట్రిప్ మీకు మీరు కోరినవన్నీ అందిస్తుంది.

ప్రయాణం అనేటప్పటికి అందులో వినోదం తప్పక చూస్తారు. బెంగుళూరు నుండి లేపాక్షికి వయా నంది హిల్స్ రోడ్డు ప్రయాణం వినోదం కంటే కూడా సౌకర్యం కూడుకొన్నది. ఈ ప్రయాణంలో మీరు ప్రకృతిని దాని సహజ అందాలలో చూడవచ్చు. 

సుమారు 137KM. కల దూర ప్రయాణం చేయాలంటే, మీరు ఉదయం వేళ కొంచెం పెందలకడే జర్నీ మొదలు పెట్టాలి. సూర్యోదయానికి ముందు బెంగుళూరు రోడ్లు ఖాళీగా వుంటాయి. ప్రశాంతం మరియు ఎల్లపుడూ ఆహ్లాదంగా వుండే బెంగుళూరు వాతావరణం మీ ఈ రోడ్ జర్నీకు మరింత సహకరిస్తుంది. మరి బెంగుళూరు నుండి లేపాక్షి కి నంది హిల్స్ మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి అనేది చూడండి

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి - ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ప్రయాణం మొదలు పెట్టండి
రోడ్డుకు ఇరు పక్కలా సుందరమైన దృశ్యాలు కనపడతాయి. పచ్చటి భూమి, సగం నిద్ర కళ్ళతో వీదులలో తిరిగే పిల్లలు, సగం సగం నిద్ర లేచిన పశువులు రోడ్డు పై నడవటం వంటివి మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో వున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ప్రకృతి ఒక్క పెట్టున చల్ల గాలితో మిమ్ములను స్పర్శించి, తాజా గాలి అందిస్తుంది. మీరు మీ కారు లేదా ఇతర వాహనం నుండి దిగి వచ్చి ఆనందించాలని ప్రయత్నిస్తారు. కాని మీరు వెళ్ళవలసిన దూరం గుర్తుకు వచ్చి జర్నీ కొనసాగిస్తారు.

మేఘాల్లోకి ప్రయాణం ....
సూర్యోదయానికి పూర్వం నంది హిల్స్ వాతావరణం సన్నని ఉదయపు వేళ మంచు పొరలు, మేఘాలు చల్లటి గాలులు, అన్నీ కలిపి మీరు ఒక స్వర్గంలో వున్నామా అనిపించేలా చేస్తుంది.
మబ్బుల మధ్య నడక...
నంది హిల్స్ శిఖరం చేరాలంటే, కొండ చేరి నప్పటి నుండి కొంత దూరం నడవాలి. రాజకుమారుడి కథలలో వలే, అందమైన వాతావరణంలో చిన్న నడక సాగించండి.
ఒక్కటే ధ్యానం
అక్కడ ఏర్పడే సూర్యోదయం చూస్తూ మీరు నడుస్తూంటే, అసలు మీరు ఎక్కడ వున్నామనేది మరచి ప్రకృతిని ఆనందిస్తారు. అసలైన ధ్యానం అనే మాటకు అర్ధం మీకు అక్కడ లభిస్తుంది. ఇక్కడ మీకు లభించే అనుభూతి మాటలలో చెప్పనలవి కాదు.
భూమి పై స్వర్గం
అక్కడ మీకు లభించే సూర్యోదయం దృశ్యం చూడకపోతే, మీరు నంది హిల్స్ కు వెళ్ళినా వృధా అని చెప్పవచ్చు. అంత అందమైన సూర్యోదయం మీకు అక్కడ లభిస్తుంది. ఇక ఆ ప్రదేశం ఆ సమయంలో భూమిపై గల స్వర్గం అన్నామంటే, మరి ప్రకృతి చేసే మాజిక్ మీరు గ్రహించండి.

శిఖర దృశ్యం
మీరు శిఖరం పై చేరిన వెంటనే, అక్కడ నుండి చూసే నగర దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఏనాటికైనా ప్రకృతి, మానవుడి కంటే కూడా బలమైనడనే మెసేజ్ ఇస్తుంది.

భోగ నందీశ్వర టెంపుల్
కొండకు కింది భాగంలో, లేపాక్షి కి వెళ్ళే మార్గంలో భోగ నందీశ్వర టెంపుల్ కలదు. ఈ టెంపుల్ పూర్తిగా అందమైన ద్రావిడ శిల్ప శైలి లో నిర్మించబడినది. ప్రయాణంలో ముందుకు సాగే ముందు ఈ టెంపుల్ తప్పక దర్శించండి.

లేపాక్షి
చివరకు మీరు హైదరాబాద్ హై వే పైకి చేరుతారు. లేపాక్షి , హిందూపూర్ కు సమీపంగా వుంటుంది. లేపాక్షి లో మీరు వీరభద్ర స్వామి టెంపుల్ చూడవచ్చు. ఈ ప్రదేశం మత పరంగానే కాక, పర్యాటక ప్రాధాన్యత కూడా కలిగి వుంది. బెంగుళూరు కు ఇది 123 కి. మీ. ల దూరం. నంది హిల్స్ నుండి 79 కి. మీ. ల దూరం.
ప్రపంచం మరచి పొండి
ఈ దేవాలయంలోని వీరభద్రుడు మరియు అక్కడే కల అతి పెద్ద ఏక శిలలో చెక్కిన నంది విగ్రహం, మరొక అతి పెద్ద నాగలింగం మొదలైనవి, ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశంలో, చరిత్ర, ప్రకృతి, కళలు, శిల్ప సంపద అన్నీ కలవు. ఈ ప్రదేశం అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారనేది కూడా మరపింప చేస్తుంది.
ఎన్నో చెక్కడాలు
లేపాక్షి లోని వీరభద్ర స్వామీ టెంపుల్, కూర్మ శైల అని పిలువబడే తాబేలు ఆకారం కల కొండపై కలదు. టెంపుల్ గోడలపై, అనేక కుడ్య చిత్రాలు చెక్కబడి కలవు. వాటిని చూడటంలో మీరు సమయం కూడా మరచి పోయే అవకాశం వుంది.
చారిత్రక ప్రాధాన్యత
ఇక్కడ కల అద్భుత శిల్ప సంపద విజయనగర సామ్రాజ్యం నాటిది. దీని గురించి మనం చరిత్రలో కూడా చదువుకొని ఉంటాము. ఈ టెంపుల్ నిర్మాణంలో ప్రసిద్ధ శిల్పి విశ్వకర్మ ప్రధాన పాత్ర వహించాడని చెపుతారు.
ప్రయాణం పూర్తి
టెంపుల్ చుట్టూ కల అవశేషాల మధ్య నడచి, నేటికి ఆనాటి శిల్ప కళల వైభవం గమనించవచ్చు. వింత అయిన స్తంభాలు, మరచి పోయిన నవ్వులు, గత కాల వైభవం, రాజ దర్పాలూ, అన్నీ కలిపి మీరు చేసిన ప్రయానికి సార్ధకత కలిగిస్తాయి. మధుర స్మృతులను మూట కట్టి మిమ్మల్ని వెనక్కు పంపుతాయి.

బెంగళూరు నుండి తిరుపతి కి రోడ్ ట్రిప్ జర్నీ !!

బెంగళూరులో చాలా వరకు ఎక్కువ సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఏదైన వారాంతంలో చాలా మంది తరచూ తిరుపతి వెళ్ళి అలా వస్తుంటారు అవునా ..! 
బెంగళూరు ప్రజలైతే మరీను ..! 
దగ్గరలో ఉంది కాబట్టి ఒక్క రోజులో వెళ్ళి వస్తుంటారు. 
బెంగళూరు నుండి తిరుపతికి మీరు ఎప్పుడైనా బైక్ లేదా సొంత వాహనాల వెళ్ళరా ..?? 
ఒకవేళ అలా వెళితే ఏ ఏ ప్రదేశాలు మీకు కనిపించాయి ...?? 
అక్కడ ఏమేమి చూడాలి..?? 
ఎప్పుడైనా ఆలోచించారా ..!! 
అయితే ఈ దిగువ పేర్కొనబడిన సారాంశం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బెంగళూరు తిరుపతి మార్గం
బెంగళూరు నుండి తిరుపతి 260 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రయాణ సమయం సుమారుగా 5 గంటలు పడుతుంది. బెంగళూరు నుండి తిరుపతికి గల జాతీయరహదారి నెంబర్ 4. మీరు ఈ రహదారి గుండానే తిరుపతికి వెళ్ళాలి.

కోలార్
కోలార్ తిరుపతికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం బంగారు గనులకి ప్రసిద్ధి. అలాగే అద్భుతమైన దేవాలయాలను, చారిత్రక కోటలను కలిగి ఉంది.

కోలారమ్మ గుడి
కోలార్ లో తప్పక చూడవలసినది కోలారమ్మ గుడి. ఇక్కడి ప్రధాన దైవం పార్వతి దేవి. 'ఎల్' ఆకారం లో కనిపించే ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినారు. ఇక్కడ గ్రానైట్ రాళ్లతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు అబ్బురపరుస్తాయి.

సోమేశ్వర ఆలయం
కోలార్ జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయం ఈ సోమేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఊరికి మధ్యలో ఉండే ఈ ఆలయాన్ని 14 వ శతాబ్దంలో విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించినారు. లోపల ఉండే కళ్యాణ మండపంలోని స్థంబాలపై గల చెక్కుడు లు చైనీస్, థాయి, యూరోపియన్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.

ఆది నారాయణ స్వామి 
కోలార్ లో ఎల్లొడు కొండల మీద ఉన్న ఆదినారాయణ స్వామి ఆలయం ప్రముఖంగా చూడవలసినది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 618 మెట్లు ఉన్నాయి. చివరికి మెట్లు ఎక్కుకుంటూ గుడి దగ్గరివరకి వెళితే అక్కడ మరో రెండు మెట్లు ఎత్తులో ఉంటాయి. ఈ రెండు మెట్లను కేవలం తాడు సహాయంతో మాత్రమే ఎక్కడానికి వీలుంటుంది.

కోలార్ పర్వతాలు
కోలార్ పర్వతాలను కోలార్ బెట్ట అనికూడా పిలుస్తారు. ఈ ప్రదేశం చేరుకోవాలంటే వందల మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా పైకి ఎక్కిన తరువాత మీకు ఒక విశాలమైన మైదానం కనపడుతుంది. అలాగే తూర్పు దిక్కున అంతర గంగ కూడా చూడవచ్చు.

అవని
అవని ఇతిహాస నేపధ్యం ఉన్న గ్రామం. ఇక్కడనే సీతాదేవికి లవకుశలు జన్మించినారు మరియు ఈ గ్రామంలోనే రాముడికి, వారి కుమారులైన లవకుశ లకు యుద్ధం జరిగింది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమంతో పాటుగా, సీతాదేవి అరుదైన ఆలయాన్ని, రామలింగేశ్వర దేవాలయ సముహాన్ని చూడవచ్చు.

విదురాశ్వత ఆలయం
కోలార్ మీదుగా తిరుపతి వెళ్లే పర్యాటకులు విదురాశ్వత ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ పవిత్రమైన ద్వాపరయుగం నాటి అశోక చెట్టు ఉన్నది. కృష్ణ భగవానుని అనుచరుడు విదురుడి ఈ గుడిలో పూజలు చేయటం వల్ల ఈ గుండికి ఆ పేరొచ్చింది. ఇక్కడ ఉండే ఈ ఆలయ విగ్రహాన్ని భక్తులు రథోత్సవ సమయంలో అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.

కోటిలింగేశ్వర
తిరుపతికి వెళ్లే మార్గంలో ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తున్న శివలింగాన్ని చూడకుండా వెళ్ళిపోతారా ?? అవును కొల్లర్ లోని కమ్మసాన్ద్ర గ్రామంలో ఈ మహా విగ్రహం ఉన్నది. ఉదయం, సాయంత్రం 6 గంటలకు 10 మంది పూజారులు వాయిద్యాల నడుమ మంత్రోచ్చారన చేస్తూ నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు.

మార్కండేయ కొండ
మార్కండేయ కొండ అన్వేషణలను ఇష్టపడే వారికి బాగుంటుంది. ఈ కొండ దట్టమైన అడవుల మధ్యలో నెలకొని ఉంది కాబట్టి పర్యాటకులకు అసలు సమయమే తెలీదు. పూర్వం ఇక్కడే మార్కండేయులు కొండమీద తపస్సు చేసాడని భక్తుల నమ్మకం. ఇక్కడ మార్కండేయులు పేరుతో గల ఆలయం మరియు జలాశయం చూడవలసినది.

అంతరగంగ
కోలార్ సమీపంలో గల అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు.

పలమనేరు చెరువు
పలమనేరు ప్రదేశంలో కాసింత ఆగి నీరు తాగవచ్చు. నీరంటే అదేదో మినరల్ వాటర్ బాటిల్ లో నీళ్ళు తెచ్చుకొని తాగేరు ..! వద్దు ఇక్కడ చెరువులో లభ్యమయ్యే నీరు తియ్యగా ఉంటుంది కనుక చెరువుల వద్దకి వెళ్ళి నీళ్ళు తాగండి వీలు దొరికితే ఇక్కడే భోజనం చేయండి.

బంగారుపాళ్యం
బంగారుపాళ్యం తిరుపతి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో పురాతన మొగిలీశ్వరాలయం ఉంది. ఇక్కడ మామిడి పండ్ల గుజ్జును తయారుచేసి ఎగుమతి చేసే చిన్నా చితక పరిశ్రమలు, దారాల పరిశ్రమలు ఉన్నాయి.

కాణిపాక గణపతి
చిత్తూర్ కి 10 కి. మీ. దూరంలో కాణిపాక గణపతి ఆలయం ఉన్నది. ఇక్కడికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కూడా ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఈ ఆలయంలో ఆసత్య ప్రమాణాలు చేయరు అసలు చేయటానికే భయపడతారు భక్తులు. ఆలయంలో స్వామి వారు దినదినం పెరుగుతూపోతుంటారు.

అర్ధగిరి వీరాంజనేయస్వామి
అర్ధగిరి వీరాంజనేయస్వామి అరగొండ గ్రామంలో చిత్తూర్ కి 20 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ గల పుష్కరిణి కి విశేష ప్రాచూర్యం ఉన్నది. తటాకములో నీరు ఎన్నటికీ చెడిపోదని అలాగే ఇప్పటివరకు చెడిపోలేదని భక్తుల విశ్వాసం. మండలం పాటు ఇక్కడి మట్టిని శరీరానికి రాసుకుంటే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం. అలాగే పున్నమి నాడు "ఓంకార" శబ్ధం వినపడుతుందని భక్తులు చెబుతుంటారు.

చంద్రగిరి
చంద్రగిరి లో ప్రధానంగా చూడవలసినది రాజమందిరం. పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ మహల్ ను విడిదిగా ఉపయోగించేవాడు. ఇక్కడ మహల్ రెండు భాగాలుగా ఉన్నది. ఒకటేమో రాణి మహల్, మరొకటేమో రాజా మహల్. రాణి మహల్ రెండు అంతస్తులుగా, రాజమాహల్ మూడు అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ మరియు సౌండ్ సిస్టం తో ప్రదర్శనలు సైతం చేస్తారు.

తిరుమల కొండ
తిరుపతిలో ప్రధానంగా చూడవలసినది తిరుమల కొండ. ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ ఏడు శిఖరాలు ఉన్నాయి. వాటిలో వేంకటాద్రి కొండ మీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.

వెంకటేశ్వర ఆలయం
శ్రీ వెంకటేశ్వర ఆలయం చాలా పురాతనమైన క్షేత్రం. ఇది తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని జాతి రాళ్లతో అలంకరించి ఉంటారు.

ఆలమేలు మంగమ్మ లేదా పద్మావతి దేవి ఆలయం
అలమేలు మంగమ్మ ఆలయం తిరుపతి సమీపంలో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం.

గోవిందరాజస్వామి దేవాలయం
తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది.

హనుమాన్ ఆలయం
హనుమాన్ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది. రాముడు, సీతా, లక్ష్మణుడితో పాటు హనుమంతుడు ఇక్కడ ఉన్నాడని నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో రామ కుండ౦ అని పిలువబడే చెరువు కూడా ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో వినాయకుని ఆకారంలో ఉన్న విగ్రహాన్ని చెట్టు మొదట్లో చూడవచ్చు.

ఇస్కాన్ ఆలయం
తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.

కపిల తీర్ధం
తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

కోదండ రామస్వామి ఆలయం
కోదండ రామస్వామి ఆలయం చోళ రాజులచే 10 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ రాముని విగ్రహం ఉంది, రామునితో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణునితో పాటు లంక నుండి వచ్చిన తరువాత ఇక్కడే ఉండేవారని పురాణాల కధనం.

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం
అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ సిద్దేశ్వర, ఇతర ఋషులను ఆశీర్వదించాడు.

పరశురామేశ్వర ఆలయం
గుడిమల్లం లోని పరశురామేశ్వర ఆలయం తిరుపతి నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ గర్భగృహ౦లో ఉన్న శివలింగం ప్రసిద్ది చెందింది. ఇప్పటికీ మొదటిసారిగా కనుగొనబడ్డ శివలింగంగా భావిస్తారు. ఇది 1 లేదా 2 వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతారు.

శ్రీ పద్మావతీ దేవి దేవాలయం
తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

గుడిమల్లం శివలింగం విశిష్టత

ప్రపంచంలో అరుదైన శివలింగం
ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం ఉన్నది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఉన్నది. దీనిని క్రీ.పూ. 1 -3 వ శతాబ్ధంలో కట్టించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చంద్రగిరి మ్యూజియం వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాశనాల ద్వారా తెలిసిపోతుంది కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్టించారో .. ఎప్పుడు ప్రతిష్టించారో తెలీదు. అయితే గుడికి సంభంధించిన ఆనవాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లోని మథుర మ్యూజియంలో, ఉజ్జయినీ రాజ్య కాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి.

గుడిమల్లం శివలింగం విశిష్టత 
గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరునిగా పూజలందుకొంటున్నాడు. ఆలయంలో గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగాని వలె దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాఫీవర్ణం లో ఉండి 5 అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది.
శివలింగం గురించి వర్ణన 
ప్రపంచంలో ఎక్కడా వినని, చూడని పురుష అంగాన్ని పోలి ఉండే సుమారు 5 -7 అడుగుల ఎత్తున్న ఈ శివలింగం పై కుడిచేతితో ఒక గొర్రెపోతును, ఎడమచేతిలో చిన్నగిన్నె పట్టుకొని, ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ... యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతి రూపాన్ని చెక్కారు.

స్వామి జటాభార తలకట్టుతో, చెవులకు అనేక రింగులు వివిధ ఆభరణాలు, నడుము నుండి మోకాళ్ళ వరకూ వస్త్రము ధరించి ఉంటాడు. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. రుద్రుని వస్త్ర ధారణ ఋగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్తవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించిన సమాచారం లభించటం లేదు.

పురావస్తు ఆధీనంలో ..! 
గుడిమల్లం ఏడేళ్ల కిందటి వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉండటంతో ఎటువంటి పూజాపునస్కారాలు జరగలేదు. ఇక్కడ ఒక పురావస్తు ఉద్యోగి గైడ్ గా ఉండి, అరుదుగా వచ్చిపోయే సందర్శకులకు ఆలయం పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంటాడు.

చంద్రగిరి కోట 
అంతదూరం వెళ్ళి ఈ ఆలయాన్ని చూడలేనివారు, ఆలయంలోని మూలవిరాట్టును అన్ని విధాల పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని మ్యూజియంలో చూడవచ్చు.

గుడిమల్లం ఎలా వెళ్ళాలి ? 
గుడిమల్లం చేరుకోవటానికి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రవేట్ వాహనాలు ఎక్కి గుడిమల్లం చేరుకోవచ్చు. రైలు మార్గం గుడిమల్లం సమీపాన రేణిగుంట (11 కి.మీ) మరియు తిరుపతి(22 కి.మీ) రైల్వే స్టేషన్ లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు వెళుతుంటాయి. రోడ్డు/ బస్సు మార్గం రేణిగుంట (11 కి.మీ), తిరుపతి(22 కి.మీ), చిత్తూర్ (85 కి.మీ), చంద్రగిరి (38 కి.మీ) ల నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యం తో పాటుగా జీపు, షేర్ ఆటో ల సౌకర్యం ఉన్నది.

Saturday, 26 March 2016

Accommodation in Varanasi

Mutts & Ashrams In Varanasi


వారణాసిలో యాత్రికుల కోసం రూమ్స్ చాలానే ఉన్నాయ్ . కాస్త అటు ఇటు లో దేవాలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. వారణాసి లో దేవాలయం చుట్టూ సుమారు 2-3 కిలో మీటర్లు దూరం వరకు వీధులాన్ని చాల ఇరుకుగా ఉంటాయి. కొత్తగా వెళ్ళేవాళ్ళకి అడ్రస్ కనుక్కోవడం ఇబ్బంది కరంగానే ఉంటుంది. ఎక్కువమంది వెళ్తే కనుక అందరు వస్తున్నారో లేదు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి . ఇక తెలుగు వాళ్ళకోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు / సత్రాలు ఉన్నాయి . మీరు కనుక రైల్వేస్టేషన్ నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చేసరంటే సగం కాశి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా జరిగినట్టే . ఆలయ విశేషాలు , చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు తరువాత చెబుతాను . పైన హెడ్డింగ్ రూమ్స్ కోసం అని పెట్టానుగా.

అక్కడ మన భాష కాని వారికంటే తెలుగు వచ్చిన వారితోనే మనం జాగ్రత్తగా ఉండాలి . ఎందుకంటున్నాను అంటే మీకు ఈ పాటికే తెలుసు ఉంటుంది . కాశి లో ఆంధ్ర ఆశ్రమం ఒకటుంది అని . అదే పేరుతో కొత్తగా తెలుగు తెలిసిన మేధావులు Ganga Yogi Lodge అనే దాన్ని శ్రీ రామ ఆంధ్ర ఆశ్రమం గా పేరు మర్చి ఆటో వాళ్లతో బేరాలు కుదుర్చుకుని ఆంధ్ర ఆశ్రమం అంటే ఇదే ఆంధ్ర ఆశ్రమం అని విరి దగ్గరకు తీస్కుని వచ్చేలా చేస్కోన్నారు. కొత్తగా వెళ్లినవారికి ఎలా తెలుస్తుంది . ఆంధ్ర ఆశ్రమం పేరు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం . వీరు తెలివిగా తారక తీసి వేసి బోర్డు పెట్టారు.రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో ముందుగా రూమ్ బుక్ చేస్కోవడానికి లేదు. మీరు వెళ్లి అడిగితే ఉంటే ఇస్తారు. 80% రూమ్ దొరుకుతుంది. రూమ్ రెంట్ 100, 300, 350 వసూలు చేస్తున్నారు. రూమ్స్ బాగున్నాయి . a/c రూమ్స్ కూడా ఉన్నాయి రెంట్ తెలియదు. మధ్యాహ్న భోజనం రాత్రి టిఫిన్ పెడతారు. వాటికి ఛార్జ్ ఏమి ఉండదు. కాకపోతే ముందుగా రాయించుకోవాలి.ఆంధ్ర ఆశ్రమం పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంది. తెలుగు వాళ్ళదే ఆశ్రమం. 400/- ఛార్జ్ చేస్తున్నారు నలుగురు ఉండవచ్చు. ఇక్కడ కూడా భోజనం, టిఫిన్ పెడతారు.Sri Rama Taraka Andhra Ashram
B 14/92, Varanasi H O,
Varanasi - 221002,
Manasorovar
+(91)-542-2450418
----
Sri Sringeri Shnkar Math,
B-14/111 Kedargrghat,
Varanasi, Uttar Pradesh
PIN Code - 221 001
Telephone No 0542- 2452768

Branch in charge : Ramakrishna Prasad
--
Sri Kanchi Kamakoti Peetam Sri Sankara Mutt
Varanasi Branch
B 4/7, Hanuman Ghat,
Varanasi - 221001
--
Kumara Swamy Mutt
Near Kedar Ghat
Tel No. 0542 2454064


Click Here For :
Accommodation in Varanasi
Varanasi Yatra Video 
Varanasi Local Temples
Varanasi Surrounding Temples
Tuesday, 22 March 2016

మనసు పరిమళించే సుందర ప్రదేశం "కురుక్షేత్ర"

కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా... అనేక యుగాలకు ముందు పరిపాలించిన "కురు" అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.

కురుక్షేత్రలో అద్భుతమైన ఆలయాలుగానీ, కట్టడాలు ఉండవుగానీ... "బ్రహ్మ సరోవరం" అనే ఓ కొలను ఉంటుంది. పూర్వం చాలా పెద్దదిగా ఉండే ఈ బ్రహ్మ సరోవరాన్ని.. ఇటీవలి కాలంలో పునర్నిర్మించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు, వెడల్పు 546 మీటర్లు. గ్రహణం సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడం చాలా పుణ్యమని చెబుతుంటారు. అందువల్ల ఉత్తర దేశంలోని చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజుల్లో కొన్ని లక్షలమంది కురుక్షేత్రను దర్శిస్తుంటారు.

బ్రహ్మ సరోవరం ఒడ్డునే రోడ్డుకు రెండో వైపున లక్ష్మీనారాయణుని పురాతన ఆలయం ఉంది. ఈ రోడ్డుకు ఆనుకునే ఈ మధ్య నిర్మించిన చిన్న, పెద్ద ఆలయాలు చాలానే ఉంటాయి. ఊరినుండి దూరంగా ఓ వైపున ఇటీవలనే నిర్మించిన చిన్న ఆలయం, దానికి ఆనుకుని ఓ పెద్ద దిగుడుబావి లాంటి చిన్నకొలను ఉంటాయి.

ఈ ఆలయంలోనే భీష్ముడు అంపశయ్యమీద పడుకున్న దృశ్యం ఉంటుంది. ఆ పక్కనే ఉండే కొలనులో నుండే అర్జునుడు వేసి బాణం ద్వారా పాతాళగంగ పైకి వచ్చినట్లు పూర్వీకుల కథనం. అలాగే ఊరికి మరోవైపున "జ్యోతి సర్" అనే కొలను ఉంది. దీని ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు స్థలపురాణం.

ఇక బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపున బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలు ఉన్నాయి. అయితే కురుక్షేత్ర అనే ఊరు మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగానే కురుక్షేత్ర, తానేశ్వర్ అని రెండు భాగాలుగా ఉంటుంది. "స్థానీశ్వరుడు" అనే పేరుగల దేవుడి ఆలయం ఇక్కడ ఉన్న కారణంగా ఆ ఊరికి స్థానీశ్వర్ అనే పేరు ఏర్పడి.. కాల క్రమంలో తానేశ్వర్ అయింది. తానేశ్వర్‌లో స్థానీశ్వరాలయం, భద్రకాళి ఆలయం అనే పురాతమైన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే... న్యూఢిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూల వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది. ఢిల్లీ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే... సుమారుగా నాలుగన్నర గంటల రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే... ఢిల్లీ నుంచి ప్రతి అరగంటకూ బస్సులు ఉన్నాయి.

Wednesday, 16 March 2016

ప్రకృతి సోయగాల నడుమ భీమశంకర శైవ క్షేత్రం

పూణే నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో వున్న భీమశంకర క్షేత్రంలో 6వ జ్యోతిర్లింగం నెలకొని ఉంది. మేము ఉదయం 7 గంటలకు కారులో పూణే నుండి బయల్దేరాము. ప్రయాణం మొత్తం ఘాట్ రోడ్లో సాగింది. దారిలో సన్నని తుంపర్లు పడుతున్నాయి. ఎటు చూసినా రంగు రంగుల పూలు, పచ్చని జొన్న మొక్కజొన్నల పంట పొలాలు కనిపించాయి. 
మూడున్నర గంటల తరువాత మేము అడవి మార్గంగా భీమాశంకర్ చేరాము. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాల పైన వుంటాయి. కాని లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి. మెట్లు దిగుతూ పర్వత లోయలోకి సుమారు 30 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో ఎన్నో కోతులు కనిపిస్తాయి. అలాగే అనేక ఔషధ మొక్కలు దర్శనమిస్తాయి. 
పూలు పళ్ళు CDలు, మారేడు ఆకులు అమ్మే అనేక దుకాణాలు దాటిన తరువాత క్యూలైన్ కనిపిస్తుంది అక్కడి నుండి సుమారు 100 మీటర్ల దూరంలో ఆ సదా శివుడు దర్శనమిస్తాడు. లింగాకారం సుమారు 10 cm పొడవు వుంటుంది. గుడి ముందు రాతి ద్వీప స్థంభం వుంది పక్కనే ఒక కోనేరు వుంది. ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కుడా వుంది. 

భీమా నది ఒడ్డున ఉన్నందున ఈ క్షేత్రానికి భీమశంకర్ అని పేరు వచ్చింది. ఇది సహ్యాద్రి పర్వతాలలో వుంది. పూర్వము బ్రహ్మ విష్ణు తమరిలో ఎవరు గొప్ప అని వాదమాడుకుంటారు. అప్పుడు శివుడు మూడు లోకాలు నిండే అంత పెద్దగా ఒక పెద్ద జ్యోతిర్లింగంగా మారి తన ఆది అంతాలను కనుగొనమంటాడు. బ్రహ్మ విష్ణు ఒకరు పైకి, ఒకరు కిందకు వెళతారు. బ్రహ్మ శివుని మొదలు కనిపెట్టానని అబద్దం ఆడతాడు. దానితో కోపగించిన శివుడు బ్రహ్మకి ఇక పూజలు ఉండవని శపిస్తాడు. కాని విష్ణువు తన పరాభవాన్ని ఒప్పుకుంటాడు. దానితో శివుడు విష్ణువుకు ఈ బ్రహ్మాండం ఉన్నంతవరకు పూజలు ఉంటాయని వరం ఇస్తాడు. ఇక శివుడు 12 ప్రదేశాలలో జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. 
దర్శనం అయిన తరువాత మేము మహారాష్ట్రలో ప్రత్యేకంగా దొరికే మిస్సల్ పావ్ తిన్నాము. అక్కడనుండి మేము అష్ట వినాయకుళ్ళలో ఒకటైన లేన్యాద్రి మరియు ఒజ్హౌర్ చూడడానికి వెళ్ళాము.  లేన్యాద్రి ఒక కొండపైన వుంది. ఒజ్జూర్ ఒక నది పక్కనే వుంది. అక్కడ దర్శనం అయ్యాక తిరిగి పూణే వెళ్ళాము.

గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం

గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం

పూణే నుండి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలను చూడడానికి కారులో ఉదయం 5 గంటలకు బయల్దేరాము. ఎల్లోరా గుహలు మొత్తం చూడడానికి ఒక రోజు సరిపోదు. కొన్ని వందల గుహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కైలాస మందిరం. ఇక్కడ ముగ్గురు మనుషులు కలిసి బంధించిన సరిపోని అంత పెద్ద శివ లింగం వుంది. అక్కడకు ఒక కిలోమీటరు దూరంలో గ్రుశ్నేశ్వర్ జ్యోత్రిలింగం వుంది.
ఇక్కడ ఒక విచిత్ర ఆచారం వుంది. మందిర ప్రహరీకి మూడు అడుగుల ఎత్తు వున్న ద్వారం వుంది. భక్తులు అదే ద్వారం నుండి వెళ్ళాలి. అక్కడ భక్తులను లోపలకు బయటకు అదే మార్గం కావడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిన నిదానంగా లోనికి ప్రవేసిన్చాము. ఇక్కడ ఆచారం ప్రకారం మగవారు గుడిలోనికి చొక్కా ధరించి వెళ్ళకూడదు.

ఒక పురాణ గాధ ప్రకారం గృష్ణ అనే ఒక భక్తురాలు శివుని నిత్యము ఒక కుండంలో పెట్టి పూజిస్తూ ఉంటుంది. ఆ మహా శివుని వరదానం వల్ల ఒక కుమారుడు కలుగుతాడు. దీనితో తన భర్తకు మొదటి భార్య పన్నాగం పన్ని గృష్ణ కుమారుని హతమారుస్తుంది. గృష్ణ తిరిగి శివుని పూజించగా తన కుమారుడు తిరిగి వస్తాడు. అంతే కాక శివుడు అక్కడ గ్రుశ్నేశ్వరునిగా అవతరిస్తాడు

అక్కడ నుండి బయల్దేరి ఔరంగాబాద్ చేరుకున్నాము. అక్కడ మినీ తాజ్ మహల్, దవళగిరి కోట చూసాము. అక్కడ నుండి బయల్దేరి పూణే చేరుకున్నాము.

గోదావరీ తీరాన కొలువైన శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం

మేము పూణే నుండి  కారులో బయల్దేరి త్రియంబకేశ్వరం చేరుకున్నాము. అక్కడ దర్శనానికి సుమారు 2 గంటలు పట్టింది. గుడిలోపల లింగాకారం ఉండదు దాని ప్రదేశంలో ఒక గుంత వుంటుంది. ఈ గుంటలో మూడు చిన్న లింగాకారాలు ఉంటాయట. అందులో ఒకటి బ్రహ్మకు ప్రతిరూపం, ఒకటి విష్ణువుకు ప్రతిరూపం, ఇక మూడొవది శివునికి ప్రతిరూపం. అందుకే ఈ ప్రదేశానికి త్రియంబకం అని పేరు వచ్చింది.


గుడి చాలా పురాతన పురాతనమైనది.  తరువాత ఒక కోనేటి దగ్గర నుండి గోదావరి ఉద్గమ స్థానాన్ని చూసాము. అక్కడ నుండి కొంత దూరంలో వున్నా గోదావరి ఉద్గమ స్థానానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి ఒక కొండ ఎక్కాల్సి వుంటుంది. కొండ కింద పెద్ద మందార చెట్టు వుంది. నేను సాధారణంగా మందార మొక్కలను చూసాను. కాని ఇక్కడ మందార మహా వృక్షం వుంది. దాని నీడలో రెండు కార్లు ఆపివుంచారంటే ఆ చెట్టు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

అక్కడ కొండపైకి వెళ్ళడానికి దోళీళు వున్నాయి. ఒక మనిషికి 250 రూపాయలు తీసుకుంటున్నారు. కొండపైన కోతులు ఎక్కువుగా ఉంటాయని ఒకతను చెప్పాడు. అక్కడే కర్ర పుల్లలు అద్దెకు ఇస్తున్నారు. ఒక కర్ర పుల్లకు 5 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. తిరిగి వచ్చేటప్పుడు మనకు 3 రూపాయలు తిర్గి ఇస్తారు. మేము అందరం తలా ఒక కర్ర పుల్ల అద్దెకు తీసుకున్నాము.

కొండపైన కంచె మేకలు వున్నాయి. అవి అవలీలగా కొండ అంచులకు ఎక్కి గడ్డి తింటున్నాయి. కొండ మధ్యలు ఒక చిన్న గుండం వుంది అక్కడ ఒక గుడి కూడా వుంది. అక్కడ ఒక ఆమె  నీళ్ళు తోడిపోసింది. ఆ నీళ్ళు అక్కడ తీర్థంలా భావిస్తారట. కొండపైన గోదావరి అమ్మవారికి చిన్న గుడి వుంది. ఆమె విగ్రహం కాళ్ళ దగ్గర నుండి నీళ్ళు వస్తున్నాయి.  అక్కడకు కొద్ది దూరంలో సహశ్ర లింగాల గుహ ఒకటి ఉంది.

అక్కడ మేకలు కోతులను బెదిరించి మరమరాలు తింటున్నాయి. అక్కడనుండి నాసిక్ చేరుకున్నాము. అక్కడ ఒక శివాలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి పూణే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము.

Tuesday, 15 March 2016

వెంకన్న తొలి కాపురం ఇక్కడే !

వెంకన్న తొలి కాపురం ఇక్కడే !కొండపై గుడి కట్టేదాకా ముక్కోటిలోనే కొలువు

సువర్ణముఖి నది ఆవిర్భవించిన ‘ముక్కోటి’ అగస్త్యే శ్వరుడు కొలువైన పవిత్ర శైవక్షేత్రం. తిరుమల వెంకన్న నారాయణవనంలో పద్మావతీదేవిని పరిణయ మాడి తిరుమల వెళుతూ ముక్కోటికి వచ్చి అగస్త్యుడి అనుజ్ఞతో ఆరు నెలల పాటు ఇక్కడే ఆవాసం చేశాడట. తొండమానుడితో కొండపై గుడి కట్టించుకుని ఆనక తిరుమల క్షేత్రం చేరుకున్నాడని ప్రతీతి.


స్థలపురాణం : అగస్త్యుడి ఆశ్రమమే ఆలయమైంది స్వర్ణముఖి నది ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం ముక్కోటి. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద వెలసిన ఈ క్షేత్రం ఒకనాడు శ్రీఅగస్త్యమహాముని ఆశ్రమం. దీనిని అగస్త్య పూజిత విష్ణుపాదంగా కూడా పిలుస్తారు. అగస్త్యుడు ఒకనాడు స్వర్ణముఖిలో స్నానం చేస్తుండగా నదిలో ఒక శివలింగం లభ్యమైందట. దానిని గట్టుమీద ప్రతిష్టించి శ్రీ అగస్త్యేశ్వరస్వామిగా ఆయన నామకరణం చేశారు. తిరుమల శ్రీనివాసుడు నారాయణవరంలో ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతీదేవిని వివాహమాడి తిరుమలకు వెళుతూ ఈ ఆశ్రమంలో శ్రీఅగస్త్యమహామునిని దర్శించుకున్నారట. నూతన వధూవరులు పసుపుబట్టలతో కొండకు వెళ్ళరాదని అగస్త్యుడు సలహా ఇవ్వడంతో పద్మావతిదేవి, శ్రీనివాసులు ఈ ఆశ్రమంలోనే ఆరుమాసాల పాటు ఉన్నారని ఐతిహ్యం. ఆకాశరాజు మరణానంతరం రాజ్యం కోసం తమ్ముడైన తొండమానుడు, కుమారుడైన వసుధాముడు పోట్లాటకు దిగారు. వారికి భాగపరిష్కారం చేసి పోట్లాటను ఆపమని అగస్త్యుడు శ్రీనివాసుడికి సలహా ఇవ్వగా దానిని శ్రీనివాసుడు పాటించాడు. ప్రతిగా తొండమానుడు తిరుమలలో వెంకన్నకు ఆలయం నిర్మించి ఇచ్చాడట. ఆరుమాసాల తరువాత వేంకటేశ్వరుడు అగస్త్యమహాముని అనుజ్ఞ తీసుకొని తిరుమలకు వెళ్లాడు. అందువల్ల ఈ క్షేత్రానికి అగస్త్యపూజిత విష్ణుపాదం అన్న పేరొచ్చింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్లు ఈఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి ఆలయ పాలనను నిర్వహించి అనంతరం ప్రాంతీయులైన మోగిలిరెడ్లకు అప్పగించారు.

విశేషం : రాతిబండపై విష్ణుపాదం ఈ క్షేత్రంలో ఆరునెలలు నివసించినందుకు గుర్తుగా వేంకటేశ్వరుడు నదిలోని బండపై తన పాదముద్రలను వదిలాడట. నేటికీ ఈ గుర్తును భక్తులు చూడవచ్చు. అగస్త్యేశ్వరస్వామి ఆలయాన్ని ముప్పై సంవత్సరాల క్రితం జీర్ణోద్ధరణ చేసి భద్రాచలం రాములవారి ఆలయం తరహాలో విగ్రహాలతో అందంగా నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గణేశ, కార్తికేయ, వీరభద్ర (కాలభైరవ), సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీమహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ, సుబ్రహ్మణ్యస్వాములకు చిన్నచిన్న గుడులు వెలిశాయి. స్వర్ణముఖినదిలో రాతిబండపైన విష్ణుపాదముద్రతో పాటు శివకేశవ, అయ్యప్పస్వామి విగ్రహాలు నెలకొన్నాయి.

ఆలయ విశిష్టత... ముక్కోటి ఆలయం ఎంతో విశిష్టత కలిగిఉంది. శ్రీహరి, పద్మావతిదేవి ఆరుమాసాలు ఇక్కడ ఉన్నారు కనుక ఈస్థలం ఎంతో పవిత్రమైనది భావిస్తుంటారు.అంతేకాకుండా శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతకంలో 105వ నామంలో సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్ట దాయినే.. అని ఉంది. అంటే సువర్ణముఖిలో స్నానం చేసే వారందరి అభీష్టాలు శ్రీ వేంకటేశ్వరుడు నెరవేరుస్తాడని అర్థం.

ఉత్సవాలకు కొదవేలేదు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమినాడు రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు అన్నాభిషేకం, రెండవరోజు సువర్ణముఖీ తీర్థ ముక్కోటి లింగోద్భవ అభిషేకం, మూడవరోజు కల్యాణం నిర్వహిస్తారు. కార్తీక సోమవారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యత వైభవోపేతంగా జరుగుతాయి. జనవరిలో అయ్యప్పస్వామి పూజాదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి గురువారం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.Monday, 14 March 2016

రామేశ్వరం

అపూర్వ ప్రదేశాల రామేశ్వరం..

ప్రతి ఒక్క భారతీయుడు... తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రదేశాలలో రామేశ్వరం... మదురై... కన్యాకుమారి ఉంటాయి. కేవలం భక్తికే కాదు అద్భుత శిల్పకళకూ, తరతరాల భారతీయ సంస్కృతికీ చక్కని చిరునామాలు..ఈ ఆలయాలు. గర్భగుడులలోకి హైందవేతరులకు ప్రవేశం లేదన్న సంగతి తెలిసినా ఈ ఆలయాల సందర్శనకు  ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. ప్రాకారాల్నీ, మండపాల్నీ చూసి మైమ‌ర‌చిపోతుంటారు.

హైందవ మతంలో కాశీయాత్రకు ఉన్నంత ప్రాధాన్యం రామేశ్వరానికి ఉంది. బంగాళాఖాతంలో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం. అక్కడి నుంచి శ్రీలంక చాలా దగ్గరలో వుంది. సముద్రంలో కట్టిన ఇందిరా గాంధీ రైల్వే బ్రిడ్జి రామేశ్వరం దీవిని మండపం రైల్వేస్టేషన్‌తో కలుపుతుంది. వయా డక్ట్‌గా రూపొందించిన ఈ రైల్వే బ్రిడ్జి భారతీయ ఇంజినీరింగ్‌ అద్భుతాల్లో ఒకటి. స్టీమర్లు, నౌకలు లాంటివి వచ్చినప్పుడు బ్రిడ్జి రెండుగా విడి పైకి లేస్తుంది. మధ్యలోనుంచి నౌకలు వెళ్లగానే మళ్లీ యథాస్థానంలోకి వస్తుంది.

రామేశ్వరం చాలా చిన్నవూరు. ఇక్కడ సముద్రం లోతూ, అలలూ తక్కువే. ఆలయ గోపురం 126 అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో అద్భుత శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడి గుడిలో 22 తీర్థాలు ఉన్నాయి. రామేశ్వరానికి వచ్చిన వాళ్లు ముందుగా ఇక్కడి తీర్థాల్లో స్నానం చేసి దైవదర్శనానికి వెళతారు. ఒక్కొక్క తీర్థం చిన్న బావిలా ఉంటుంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన లింగంగా రామనాథస్వామి వారిని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ద్రవిడ శిల్పకళారీతికి ఆలవాలమైన ఈ ఆలయం నిర్మాణంలో పన్నెండో శతాబ్ది నుంచి ఎంతో మంది రాజులు పాలు పంచుకున్నారు. ఆలయ మూడు ప్రాకారాల్లోనూ మూడ మండపాలు ఉన్నాయి. మూడో ప్రాకారంలోని మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటూ ఇటూ 1200 రాతిస్తంభాలతో సుమారు కిలోమీటరున్నర విస్తీర్ణంలో ఉన్న ఈ మండపం అతి పొడవైనదిగా పేరు తెచ్చుకుంది.

రామేశ్వరానికి 12కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోడిలో కోదండరామస్వామి ఆలయం ఉంది. 1964లో సంభవించిన భయంకరమైన తుపాన్‌కు ఊరు అంతా కొట్టుకుపోయినా ఈ గుడి మాత్రం చెక్కు చెదరలేదట. రాముడిని విభీషణుడు శరణు కోరిన ప్రదేశమనీ, శ్రీరాముడు లంకాపురికి ఇక్కడి నుంచే వారధి నిర్మించాడనీ చెబుతారు. గంధమాదవ పర్వతం మీద ఉన్న రాతి మీద ఉన్న చిన్న పాదముద్రలను శ్రీరాముడివని చెబుతారు.

అక్కడికి సమీపంలోనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌క‌లాం నివాసం ఉంది.


కన్యాకుమారి

కన్యాకుమారి

భారతదేశపు దక్షిణపు కొన కన్యాకుమారి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే పవిత్ర ప్రదేశం ఇది. అక్కడికి సమీపంలోనే ఎత్తైన ప్రాకారాల మధ్య ఉన్న కన్యాకుమారి అమ్మవారి ముక్కెర విశేష కాంతుల్ని విరజిమ్ముతూ ఆకట్టుకుంటుంది. ఇక్కడి త్రివేణీ సంగమంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి.

బీచ్‌ దగ్గరే ఉంది గాంధీ మెమోరియల్‌.. ఇక్కడ సముద్రంలో కలిపే ముందు గాంధీ అస్థికలు కొన్నింటిని ఉంచారు. అస్థికలు పెట్టిన ప్రదేశం మీద ప్రతి అక్టోబరు 2న సూర్యకిరణాలు పడేలా నిర్మించడం ఈ కట్టడంలోని విశేషం. ఇక్కడ మహాత్ముడి జీవిత విశేషాలను తెలిపే ఫొటో ప్రదర్శనను చూడవచ్చు. ఈ భవనంలో మెట్లెక్కి పై అంతస్థులోకి వెళితే అద్భుతమైన సాగర సంగమం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. కన్యాకుమారిలో తప్పకుండా చూడాల్సింది సూర్యోదయం, సూర్యాస్తమయం. అస్తమిస్తున్న సూర్యుణ్ని, ఉదయిస్తున్న చంద్రుణ్ని ఏకకాలంలో చూడాలంటే మాత్రం పౌర్ణమిరోజున ఇక్కడికి రావాల్సిందేనట. 1892లో యాత్రికుడిగా ఇక్కడికి వచ్చిన వివేకానందుడు ఇక్కడున్న రాతి కొండ మీద ఓ రాత్రంతా ధ్యానంలో గడిపాడట. ఆ తరవాతే భరతజాతికి తన జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించుకున్నాడట. ఆయన జ్ఞాపకార్థం 1970లో ఆ కొండ మీద పెద్ద భవనం నిర్మించి అందులో ఆయన నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి పక్కనున్న కొండ మీద తమిళ కవీశ్వరుడు తిరువళ్లువార్‌ ఎత్తైన విగ్రహాన్ని మెట్లెక్కి విగ్రహం మండపం వరకూ వెళ్లి చూడొచ్చు. అక్కడి నుంచి కనిపించే ప్రకృతి సోయగం మాటల్లో వర్ణించలేనిది.

కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోని చర్చి, ఉదయగిరి ప్యాలెస్‌, వట్టకొట్టై(వృత్తాకార కోట)లను చూడటానికి స్థానికంగా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

మ‌దురై మీనాక్షి ఆలయం

ఆలయాల నగరం.. మ‌దురై

తమిళనాడులోని వస్త్రపరిశ్రమకు కేంద్రంగా ఉన్న మ‌దురై పెద్దనగరం. మీనాక్షి ఆలయం చుట్టూ నగరం అభివృద్ధి చెందిందని అంటారు. 150 అడుగులకు మించిన ఎత్తుతో ఉన్న నాలుగు ప్రధాన గోపురాల మధ్య ఆలయం ఉంది. ప్రతీ గోపురం మీదా లెక్కలేనన్ని శిల్పాలు ఇట్టే ఆకర్షిస్తాయి. అనంతమైన శిల్పసంపదకు అద్దంపట్టే ఈ గుడి ప్రపంచ వింతల్లో ఒకటి. తూర్పు దేశాల ఏథెన్స్‌ (ఏథెన్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌)గా పేరు తెచ్చుకుంది. నిజానికి సువిశాలమైన ఈ ఆలయాన్నే ఒక నగరంగా పేర్కొంటారు. ఆలయాన్నంతా చూడాలంటే కనీసం అయిదు గంటలైనా పడుతుందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న వేయిస్తంభాల మండపంలో ఎటు నుంచి చూసినా అన్ని స్తంభాలూ వరుసగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి మ్యూజియం సుమారు 1200 సంవత్సరాల గుడి చరిత్రనంతా కళ్ల ముందుకు తెస్తుంది.

అక్కడి నుంచి సుందరేశ్వరుని ఆలయానికి చేరుకుంటే సమీపంలోని మీనాక్షి ఆలయానికి వెళ్లినట్టే. అక్కడ మూడున్నర అడుగుల ఎత్తులో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివితీరదు.Sunday, 13 March 2016

త్రయంబకం

అలల సవ్వడిలో సప్త స్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గర ఉన్న త్రయంబకం తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది.

గోహత్య మహాపాపాన్ని ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే పరమేశ్వరుడు త్రయంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ స్థల పురాణంగా ప్రచారంలో వుంది. అంతేకాక అష్టా దశ పురాణాలలో ఒకటైన శ్రీ శివమహాపురాణంలో త్రయంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది.

కొందరు రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం దానితో పాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి. వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే ’’ గురువు ఎప్పుడు సింహరాశిలో వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది. ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు. సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను, చెవులను ఇక్కడే ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్‌ అని పేరు వచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు.

ఉజ్జయినీ కాళిఉజ్జయినీ కాళి
అనంత కల్పవల్లి


అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళిగా అమ్మవారి రూపాన్ని వర్ణించడం జరిగింది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళీశ్వరుని రూపం ఇక్కడ కనిపిస్తుంది. ఉజ్జయినిలో ఆ మహాకాళీదేవి హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందింది.

స్థల పురాణం ప్రకారం అంధకాసురుని వధించడానికి హరుడు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ రాక్షసునికి ఉన్న వరాల బలంతో మరణించకపోవడంతో మహంకాళిని పిలిచాడు శివుడు. ఆ తల్లి ప్రత్యక్షం అయి అంధకాసురుని సంహారానికి కారణం అయ్యింది. అలా రాక్షస సంహారం జరగాలన్న హరుని కోరిక సిద్ధింపజేయటం వలన ఆనాటి నుండి ఉజ్జయినీలోని మహాకాళిని ‘‘హరసిద్ధి’’ మాతగా కొలవటం ప్రారంభం అయ్యింది.

ఆ పరిసర ప్రాంతంలో ‘‘గడ్‌ కాళి’’ ఆలయం కూడా కనపడుతుంది. కొంతమంది ఈమెను మహాకాళిగా భావించటం కూడా కనిపిస్తున్నది. ఉజ్జయినీలో ఆ తల్లి రాత్రివేళ సంచరిస్తూ ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది.

ఉజ్జయినిలోనే కాళిదాస మహాకవికి నాలుక మీద వాశ్చీజాన్ని వ్రాసింది మహాకాళి.

విక్రమార్కుని ఇంటి ఇలవేల్పు ఉజ్జయినీ కాళి. విక్రమార్కుని అనుగ్రహించి వెయ్యేళ్ళు రాజ్యాధికారాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ప్రసాదించింది.

భర్తృహరి కవి కూడా ఉజ్జయిని కాళి కోసం తపస్సు చేసి ఆమె అనుగ్రహాన్ని పొందినవారని తెలుస్తున్నది. ఇప్పటికీ ఉజ్జయినిలో భర్తృహరి తపస్సు చేసిన గుహలు ఉన్నాయి.

నాథ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాథుడు కూడా ఉజ్జయిని కాళిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని; కాళీమంత్ర సిద్ధిని పొందటం జరిగింది. ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధుని సమాధిని కూడా స్థానికులు పూజించటం కనిపిస్తుంది.

ఇవాల్టికీ ప్రతిరోజు వేలమంది యాత్రికులు అక్కడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని ఆమె అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుంటున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు.
- మాతాజీ రమ్యానందభారతీ స్వామిని


Saturday, 5 March 2016

ROAD TRIP - హైదరాబాద్ - వయా గోవా - మున్నార్.

హైదరాబాద్ - వయా గోవా - మున్నార్
ROAD TRIP


ఆగష్ట నెల మూడో తేది సోమవారం ఉదయం 5:30కు జడ్చర్ల లో మా రోడ్ ట్రిప్ మొదలయింది. కర్నూలు నుండి వచ్చిన మధు అనే నా కాలేజి క్లాస్‌మేట్‌ని పికప్ చేసుకొని అక్కడ నుండి బాదామికి మద్యాహ్నానికి చేరాము.మరసటి రోజు ఉదయం పదుకొండు గంటల వరకు అక్కడ చూడాలసిన ప్రదేశాలు చూసి అక్కడ నుండి గోవాకు ప్రయాణం..

ఒక పక్కన వర్షం, మంచు.. కొండల మీదుగా...మేఘాల మద్యన పచ్చని ప్రకృతిలొ ఒక పక్కన పాత పాటలు వింటూ ప్రయాణం. మాటల్లో వర్ణించలేని అనుభూతి..!

రాత్రికి గోవా చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్‌లో బస.. మరసటి రోజు సమయాలనుకూలతను బట్టి కొన్ని ప్రదేశాలు చూసేసి ఆ మరసటి రోజు ఉదయం మద్యాహ్నంగా ప్రయాణం.... బీచ్ వెంబడీ రోడ్ ప్రయాణం...మరో వైపు పచ్చదనం.

కార్వార్ మీదుగా గోకర్ణ చేరి.. అక్కడ నైట్ హాల్ట్. మరసటి ఉదయం అక్కడ నుండి మురుడేశ్వర్.అక్కడ నుండి జోగ్ ఫాల్స్ అవి చూసుకొని సాగర్ మీదుగా షిమొగా చేరి అక్కడ నైట్ హాల్ట్.మరసటి రోజు ఉదయం అక్కడ నుండి ఇక్కేరి అనే కేలడి రాజుల చారిత్రక ప్రాంతం సంధర్శన..

"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం 

నా రోడ్ ట్రిప్‌లో భాగంగా ఆరవ రోజు.. హోటల్ రూమ్‌లో పొద్దున్నే ల్యాప్ టాప్ ముందర కూర్చోని చుట్టు పక్కల ఏమేమ్ వున్నాయో చూడదగ్గ ప్రదేశాలంటూ వెదుకుతూ కుర్చున్నాను. మా టూర్ ఫ్రోగ్రామర్ మాత్రం ఇక్కడ దగ్గరలో ఏవి లేవు అన్ని వంద కిలోమీటర్ల్ దాటి వెళ్లాలి దానికన్నా "ఆగుంబే" వెళ్లిపోవడం మంచిదంటూ కూర్చున్నాడు. నాకేమో చుట్టూ వున్న చూడదగ్గ ప్రదేశాలను చూడకుండా వెళ్లడం ఇష్టం లేదు. గూగుల్ సెర్చ్‌లో మంచి ఆర్కిటెక్చర్ వున్న దేవాలయం ఫోటొ కనపడ్డది. ఆ ఫోటో పట్టుకొని అదెక్కడ... అని వెదికితే.. మేముంటున్న షిమొగా వూరుకు 90 కిలోమీటర్ల దూరంలో వున్నదని చూపిస్తున్నది. మా టూర్ ఫోగ్రామర్ మాత్రం మళ్లీ వెనక్కు 90 కిలోమీటర్ల్ వెళ్లడం ఎందుకు "ఆగుంబే" దారిలొ ఏవైనా వుంటే చూసుకొంటూ వెళ్లిపోదాం అని చెబుతున్నాడు. నేను ససేమిరా అంటు పట్టు బట్టి బయలు దేరాం.

వాస్తవంగా జోగ్ ఫాల్స్ నుండి షిమొగాకు వచ్చే దారిలొ "సాగర్" అనే వూరు వున్నది. మేము ఆ వూరు మీద నుండే వచ్చి షిమోగాలో నైట్ హాల్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఆ దేవాలయం సాగర్ వద్ద నుండి ఓ మూడు కిలోమీటర్ల్ లోనకు ప్రయాణించాలి. తిరిగి వెనక్కు వెళ్లి చూడటం అంత అవసరమా అని మిత్రుల ఆలోచన.. ! ఫోటోలో ఆ ఆర్కిటెక్చర్ చూడగానే ఆకట్టుకొంది...!


సాగర్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఎడమ వైపుకు వెళ్లాక ఈ "ఇక్కేరి" దేవాలయం కనపడ్డది. అప్పటి వరకు అయిష్టంగా వచ్చిన ఇద్దరు మిత్రులు..ఆ దేవాలయం ముఖ ద్వారం చూడగానే మొహాలు విప్పారాయి.ఆ ఆర్కిటెక్చర్....ఆ పచ్చని ప్రదేశం మద్యలో ఆ కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతున్న దేవాలయం చూడగానే వీరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన మైమరుపు... హమ్మయ్య అనుకొన్నాను నాలోపల...! అది గాని అతి సాదారణంగా వుండుంటేనా...?? అంతే " చెబితే విన్నావా.. చూడు ఏవైనా బాగున్నదా.. ఇలాంటివి మనూళ్లో లేవా ఏంటి.. వీటి కోసం అన్నేసి గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలా" అంటు నామీద దాడి చేసేవాళ్లు.


లోపలి వెళ్లగానే ఆ శిల్పాలను.. వాటిని మలిచిన తీరును చూస్తూ అబ్బరపడిపోతున్నాం. ఫోటోస్ తీసుకోవడానికే సత్తాను చేతుల్లోకి తెచ్చుకొంటూ ఉత్సాహ పడిపోతున్నాం అందరం. అదో రకమైన శైలి అవి. దేవాలయం పైన మాత్రం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనపడుతున్నది. మండపాలు మరో శైలి.. ఇలా చాలా రకాలు కనపడుతున్నాయి. గుర్తించడం నాబోటి అఙ్ఞానికి చాలా కష్టం.


మరో వైపున శిల్పం మొత్తం ఆనవాలే లేకుండా కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

లోపల గర్భ గుడికు ముందు శిల్పాలతో చెక్కిన పదుల సంఖ్యలో స్థంభాలతో కూడిన పెద్ద హాల్ వున్నది. అక్కడ ఫోటోస్ తీయడానికి తగినంత వెలుగు లేకపోవడంటొ ఫోటోస్ సరిగ్గా తీయలేకపోయాను. లోపలికి కెమెరా ట్రైపాడ్ అనుమతి లేదట.


దాదాపుగా ఓ గంటన్నర సమయం ఫోటోస్ తీయడానికే గడిచిపోయింది. అక్కడ నుండి తిరిగు ప్రయాణానికి కారులొ సిద్దమవుతూ.. అక్కడే వున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చిరుద్యోగిని కలిసి చుట్టూ వున్న మరిన్ని చూడతగ్గ ప్రదేశాల వివరాలు తెలుసుకొందామని కారులో నుండి అతని వద్దకు వెళ్లాను. అలా వెళ్లడం వలన నాకు మరింత చరిత్ర తెలుసుకొవడానికి దోహద పడింది. ఒక రకంగా నా బుర్రకు మేత దొరికింది. నిజంగా ఆ క్షణం అలా సమాచారం సేకరించాలనే తలంపు రావడమన్నది లక్కీనే అనుకోవాలి.


ఆ చిరుద్యోగిని కాస్త కదపగానే మెల్లి మెల్లగా చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. బయలు దేరాలనుకొన్న ఇద్దరు మిత్రులు కూడ వచ్చి చేరి మళ్లీ తిరిగి ఆయనతో పాటు ఆ చరిత్ర వింటూ ఆశ్చర్యపోతూ మళ్లీ మరికొన్ని మేము చూడ కుండా మిస్ అయినా శిల్పాల ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టాం.


ఆ టెంపుల్ గురించి ముద్రిత సమాచారం అక్కడ హింధీలో వుండటం వలన కేవలం ఆ ఆర్కియాలజీ డిపార్ట్‌మెట్ం చిరుద్యోగి చెప్పిన చరిత్ర విశేషాలనే నేనిక్కడ ఇస్తున్నాను. ఇవి ఎంత వరకు అథింటికేట్ అన్నది నేను కూడ చెప్పలేను గానీ.. .. ఆయన మాటల్లోనే....

కేలడీ నాయకులు అని పిలువ బడుతున్న చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ),శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు ( విక్కీలో మాత్రం మొత్తం 17 మంది రాజుల పేర్లు చెబుతున్నది ). కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. వీరి బంగారను అక్కడుకు, విజయనగరం సామ్రాజ్యపు వజ్రాలు వైఢూర్యాలు వీరికి ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన వీళ్లు విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించే వారట. అలా 24 క్యారెట్స్ బంగారం అనే కొలతను వీరి నుండే ప్రారంభమైందట. వీరి పాలన దాదాపుగా 250 సవంత్సారల పైనా సాగింది. (1540 - 1760 )

వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రుడు, పూర్తి చంద్రుడు ఆకారంతో చలా మనిలో వుండేవట. వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. మరొక విషయం భారతదేశంలొ దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది.


అంతే కాకుండా దేవాలయానికి ముఖ ద్వారం వద్దనే "నంధీశ్వరుడి" మండపం వుంటుంది ఇదొక కొత్త శైలి. అందునా గర్భ గుడిలోని ప్రధాన విగ్రహానికి చాలా దూరంలో (58 అడుగులు) వున్నది. మళ్లీ గర్భ గుడిలొ మరొక అమృత శిలగా పిలవబడుతున్న ట్రాన్స్‌పరెంట్ నంధీ విగ్రహం వున్నది. చీకటిలో టార్చి లైట్ వెలిగించినా ఆ వెలుగు ఆ విగ్రహం గుండా మరో వైపుకు ప్రవహిస్తుందట.ఇక ఈ అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుదట...! ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారట. ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువ బడుతున్నారు.ఇక అన్ని గుళ్లల్లోను వుండే "రతి భంగిమల" విగ్రహాలు ఇక్కడా చెక్కబడి వున్నాయి. నేనిప్పటి వరకు చూసిన ప్రతి హిందూ దేవాలయాలలో ఈ వాత్సాయనుడి రతిభంగమలు చూస్తూనే వున్నాను. బహుశ ప్రపంచానికి ఈ దేశం నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమైందేమో అని అనిపిస్తూ వుంటుంది నాకు. మద్యలో ఏర్పడిన నాగరికత పౌర సమాజం నుండి వచ్చిన మత పెద్దలు వీటిని సమాజ హితం కోసమంటూ కొన్ని అంక్షలు పెట్టడం వలన అయితేనేమి..? సెక్స్ అన్నది కేవలం "మగవాడి" సామర్థ్యానికి, గొప్పదనానికి ప్రతీక అనే ఒక భావజాలంలో వుండడం వలన అది నలుగురిలో ఒక సబ్జెక్ట్ లాగ మాట్లాడుకొనే దశను కోల్పోయి అదొక అశ్లీలత, బూతు వ్యవహారంగా భౌతిక ప్రపంచంలో చలామని కావడం మొదలయ్యింది.

మేము అక్కడున్నప్పుడే కొందరు కాలేజీ యువతీయువకులు అక్కడికొచ్చారు. అందులొ ఉత్తర, దక్షణ భారతదేశీయులు వున్నారు. అందరిలాగ ఒకరిద్దరు యువకులు ఈ భంగిమలు చూడగానే మొహం విప్పారి తోటి వారికి చెప్పాలనే ఉత్సాహంతో వెర్రికేక పెట్టి చూపుతుండగా మరి కొందరు తమతో వున్న అమ్మాయిలకు కూడ చూపి వాళ్లెలా ఫీల్ అవుతారో అని గమనించసాగారు. దానికా ఒకరిద్దరు అమ్మాయిలు "హ్మ్..దానిదేమున్నది అవన్ని సహజం అప్పట్లో.. దేవాలయాల్లో అదొక అంశం" అంటూ అదొక సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లా మరొక సబ్జెక్ట్ అనే భావంతో ఎటువంటి వికారాలు, అసభ్యమైన కోణాలు లేకుండా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఇక్కడ ప్రభుత్వాలు వెబ్‌సైట్స్ మీద బ్యాన్ విదిస్తే విదించొచ్చు కాని ఇలాంటి దేవాలయాలలొ బహిరంగంగా వున్న ఈ భంగిమలను చూడకుండా ఎవరు ఆప లేరు కదా..?ఇక దేవాలయం విషయానికొస్తే..

ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే చాలా చాలా సాంకేతికమైన విషయాలు బాగా తెలుస్తాయి. అంత టెక్నికల్‌గా నిర్మించారు ఈ దేవాలయాన్ని.

ఇక్కడికి చేరాలనుకొనే దారి. కర్నాటకలోని జోగ్ ఫాల్స్ నుండి షిమోగా వెళ్లే దారి మద్యలో "సాగర్" అనే తాలుకా ఎదురవుతుంది. ఆ వూరి నుండి లోపలికి ఓ మూడు కిలోమీటర్ల్ ప్రయాణిస్తే ఈ "ఇక్కేరి" టెంపుల్‌కు వెళ్లొచ్చు. షిమోగా నుండి 90 కిలోమీటర్ల్ సాగర్ వైపు ప్రయాణించినా ఇక్కడికి చేరుకోవచ్చు.

వీటి చుట్టు పక్కల ఇంకా చూడాలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మాకున్న సమయభావం వలన అవన్నీ చూల్లేకపోయాం. కేలడి వూరు అందులోని టెంపుల్, అక్కడే వున్న కేలడీ రాజుల కోటలు నాలుగు వున్నాయి. ఇవే కాక చాలా చాలా పచ్చని లాండ్ స్కేప్స్ చాలా వున్నాయి. ఇక్కడ నుండి ఆగుంబే వెళ్లే దారిలొ "తీర్థ హల్లి" అనే మరొక వూరు వొస్తుంది. అబ్బో ఆ వూరు చుట్టు కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణిస్తే చాలు ఎన్నో జలపాతాలు, పచ్చని ల్యాండ్ స్కేప్స్, సరస్సులు బోలెడు చూడొచ్చు. మొత్తం పచ్చదనమే..ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చదనమే కనపడుతుంది. ప్రకృతి ఆరాధకులకు పండగే పండగ.........!!

ఈ ఇక్కేరి రాజధాని గురించి మరింత క్షుణ్నంగా సమాచారం కోసం గూగుల్‌, విక్కీలో చాలా దొరుకుతుంది. అక్కడ మరింత సమాచారం తెలుసుకోవచ్చు.


అప్పట్లో ఎన్నేసి రకాల స్త్రీలకు జడ కుచ్చులు వేసారో ఈ శిల్పంలో చూడొచ్చు.....అప్పటి అంతపుర స్త్రీలు ధరించిన "వ్యానిటీ బ్యాగ్" ఈ చిత్రంలో..!!ఇస్లామిక్ పరిపాలనలో సింహాలకు ముస్లీమ్ రాజుల్లా వుండే వారి గడ్డాలనే ఇక్కడున్న సింహాలకు ముస్లీమ్ సింహాల్లాగా శిల్పాలను అక్కడక్కడ చెక్కించారు.

తర్వాత తీర్థ హల్లి మీదుగా ఆగుంబే. మద్యలో కుంభవృష్టితో వర్షం. ఆ వర్షంలోనే మేఘాల మద్యన ఘాట్ రోడ్ లో ఎత్తైన కొండ మీద కుండాద్రి బెట్టను చేరుకొన్నాం అదొక అడ్వేంచర్ మాకు. కింద ఏమున్నదో కూడ కనపడనంతగా మేఘాలలో వుండిపోయాము. అక్కడ నుండి సాయింత్రం ఆగుంబే చేరాము. కాని చుట్టు పక్కల చూట్టానికి వాతావరణం అనుకూలించలేదు. చాలా జలపాతాలు, ల్యాండ్ స్కేప్స్ మరియూ కుద్రేముఖ్ లాంటి సీనరీ కలిగిన ప్రదేశాన్ని చూడలేకపోయాము.. కుంభవృష్టితో ఒక్కటే వాన. అక్కడ నుండి బయలు దేరి రాత్రి తొమ్మిదికి ఉడిపికి చేరుకొని అక్కడే నైట్ హాల్ట్.. దర్శనాలు..అన్నీను.

పొద్దున్నే సేయింట్ మేరీ ఐల్యాండ్ చూడాలనుకొని వెళ్లాం.. ఊహు. సముద్రంలో తుఫాన్ కదిలకలతో ఐల్యాండ్ కూడ క్యాన్సిల్.. అక్కడ నుండి మడికెరకు ప్రయాణం.... మద్యలో...!!

కార్కాల అనే వూరికి చేరాం. ఇదే వూరికి నేను ఓ 15 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఒక ముఖ్యమంత్రి సొంత వారు కావడం చేత ఇక్కడకు వెళ్లాను. తిరిగి ఇప్పుడు గుర్తు పెట్టుకొని వెళ్లాను. ఇక్కడొక విశేషమున్నది..! అక్కడ నుండి మూడబిదిరి లోని జైన్ దేవాలయాన్ని చూసుకొని సాయింత్రం మడికెరి (కూర్గ్) చేరుకొన్నాం. కాని కూర్గ్‌కు వెళ్లే మార్గ మద్యలో వున్న ఘాట్ రోడ్ మాత్రం భలే వున్నది, ఎన్నెన్ని వొంపులు..ఎన్నెన్ని మెలికలో.. స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చోవాల్సిందే.. అదీను ఆకు పచ్చని కొండల నడుమ.. ప్చ్ ఆ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ చేయడమన్నది ఒక అడ్వేంచరే..! ఫుల్ ఆఫ్ జాయ్ అంటే ఏమిటో అర్థమవుతుంది.

మరసటి రోజు ఉదయం వర్షంలోనే "అబ్బి ఫాల్స్" చూసుకొన్నాం.. అక్కడకు దగ్గరలోనే "మండద పట్టి" అనే కొన్ని ల్యాండ్ స్కేప్స్ వున్న ప్రాంతాలు వున్నాయి. కాని నా ఫ్రెండ్స్ అనాసక్తితో చూడకుండానే వెనుతిరగాల్సి వొచ్చింది. అక్కడ నుండి కోస్‌కోడె అనే కేరళ ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. ఇక ఆ ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు గానీ.. చాలా రద్దీగల రహదారి అది. మద్యలో "తలసరి" అనే వూరులో భోజనం. అక్కడే వున్న ఒక చిన్న పాటి కోటను సందర్శించి తిరిగి అక్కడ నుండి "కోజ్‌కోడె" కు సాయింత్రానికి చేరుకొన్నాం. వర్షాకాలం వలన అక్కడ బ్యాక్ వాటర్ బోట్ హోమ్‌లో బస చేయడానికి అవకాశం లేకపోవడం వలన అక్కడ నుండి గురువాయర్‌కు వెల్దామని ఫ్రెండ్స్ ప్రప్ఫొజల్‌తో.. ఇంత వరకు చూడలేదాయన్ని.. సరే నేను చూసినట్లుంటుంది.. అలాగే ఒక పలకరింపు పలకరిస్తే ఓ పనైపోతుంది కదా రాత్రికి గురువాయర్ చేరుకొన్నాం.

తెల్లారు జామున్నే గురువాయిర్‌ని పలకరించేసాను, పాపం అక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఏదో కోరిక కోరడం.. అందుకోసమే ఆయన్ని దర్శించుకోవడం చేస్తున్నారు, ఒక్కరు కూడ ఆయన క్షేమ సమాచారాలు విచారించ లేదు..!! బహుశ నేనొక్కడీనే అనుకొంటాను.. "ఎలా వున్నావయ్యా, అంతా క్షేమమే కదా.. కుశలమేనా!" అని కుశలోపరి ప్రశ్నలతో పలకరించి... అక్కడ నుండి మున్నార్‌కు బయలు దేరాం. మున్నారు పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతుంది.
ఓ రెండు మూడు రోజులు గడిపేసి మూడో రోజున తెల్లారు జామునే హైదరాబాద్‌కు బయలు దేరాం. మద్యలో మధురై మీదుగా ప్రయాణం చేసి మరసటి తెల్లారు జామున రెండు గంటలకు ఒక ఫ్రెండ్‌ని కర్నూల్‌లో అతని ఇంటి వద్ద దింపేసాము. బాగా డ్రైవ్ చేసే మూడ్‌లో వుండటం మూలాన అక్కడే నిద్రకు ఉపక్రమించకుండా.. అలానే హైదారాబాద్‌కు బయలు దేరి తెల్లారు జామున ఆరుగంటలకు నా గమ్య స్థానం చేరుకొన్నాం. దాదాపు 24 గంటలు నిర్విరామంగా డ్రైవ్ చేయడం.. అందునా వర్షంలో.... అదొక అడ్వేంచర్.. అనుభూతినిచ్చింది. నా స్టామినా మీద నేనే ఒక ప్రయోగం చేసుకొన్నాను.

మొత్తం పదిహేను రోజుల పాటు 3,600 కిలోమీటర్ల పచ్చని ప్రకృతిలో ప్రయాణం చేసి.. చేసి పచ్చగా మారిపోయాను.... నేనొక్కడినే డ్రైవ్ చేయడం.... ఒక ఆనందం. ఫ్యూచర్‌లో దేనికి పనికిరాకుండా పోయినా "డ్రైవర్" ఉద్యోగం చేసుకోనైనా బతకొచ్చనే ధైర్యం వచ్చిందబ్బా..!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మొత్తం ఈ ట్రిప్ అంతా నాకు కొత్తే.. ఏ దారులు తెలీవు, కాని "గూగుల్" మ్యాప్ ద్వారా మొత్తం తిరిగాను. గోవాలొ గల్లీ గల్లీ తిరిగాను. అస్సల్ ఎటుపోతే ఏది వొస్తుందో..! ఎక్కడికి చేరుతామో కూడ తెలియని నేను. పుర్తిగా గూగుల్ మ్యాప్ మీద ఆదార పడ్డాను.

ఎక్కడ.. ఎన్ని కిలోమీటర్ల్ వద్ద.. ఎన్ని మీటర్ల వద్ద ఎటువైపు మలుపు తిరగాలో కూడ ప్రతీది చెబుతూ వచ్చింది ఆ గూగులమ్మాయ్.. గొంతు మాత్రం యమ స్వీట్. ఒకో సారి దగ్గరి దారిలో తీసుకెళ్లి గమ్యం చేరుస్తుండేది..! ఒక వేళ దారి తప్పోయినా ..? తప్పోయిన దారి నుండి మళ్లీ డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది పాపం ఆ గూగుల్ అమ్మాయి... ఎంత మంచిదో. ? జై గూగులమ్మాయ్..!!


యాగంటి బసవయ్య రంకె లేసేను - మహానంది


కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది, భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.


ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది. రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.
మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90 సంవత్సరాల క్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు.. మన పూర్వీకులంటే అర్థం కాలేదా..? అదేనండి మన వా’నరులు’ పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది. ముందే కోతులు.. ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.

ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రము నుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసర ప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.


రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు. తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ కాలక్రమేనా యాగంటిగా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు. మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు. ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.
మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.
- మహానంది -


ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమ ప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12 కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.


మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.


ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’ ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.! జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!


ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.