Saturday, 11 June 2016

తలకోన జలపాతం - కొండల మధ్యలో ఓ అద్భుత జలపాతం !!

చుట్టూ ఎత్తైన కొండలు... 
దట్టమైన అరణ్యప్రాంతం... 
మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. 
అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? 
మరెక్కడో కాదు చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం.

ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణ గాథ. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలిచి అలసిపోయి నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకోవడంలో తల భాగం ఇక్కడ ఉన్న కొండ (కోన) శిఖరం మీద ఆనించాడని అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. మన రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కూడా ఇదే మరి!!. దీన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. తలకోనలో దాగిఉన్న అందాలను ఒకసారి చూసినట్లయితే...

కొండా..కోనల్లో దాగి ఉన్న జలపాతం తలకోన జలపాతం
నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ జాలువారే జలపాతాన్ని చూడొచ్చు. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది.

జలపాతం కింద తడుస్తూ..
దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి? అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

తలకోన వద్ద ఉన్న ఆలయం
తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు.ఈ ఆలయాన్ని 1811 సంవత్సరంలో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించాడని స్థానికులు చెబుతారు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి. పర్యాటకులు తీసుకెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ్నుండి జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే పాదయాత్ర చేయాల్సిందే.

నెలకోన
అలయానికి అతిసమీపంలో వాగు ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. శివరాత్రి పర్వ దినాన ఉత్సవాలు జరుగుతాయి. తలకోన అటవీ ప్రాంతంలో తలకోన, నెలకోన అనే పేర్లున్న రెండు జలపాతాలు ఉన్నాయి. వీటిని జంట జలపాతాలని పిలుస్తారు. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఎంత ఎత్తునుంచి నీళ్లు జాలువారుతాయో కనిపించవు. రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడవచ్చు.

వృక్ష సంపద... వన్య ప్రాణుల నెలవు!!
తలకోన దట్టమైన అటవీ ప్రాంతం. వృక్ష సంపదకు, వన వుూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లో వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో చెట్లు సూర్యరశ్మిని అందుకోవడానికి పైకి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్రచందనం, జాలారు, వుద్ది లాంటి చెట్లు ఉంటాయి. అడవిలో ప్రధానంగా అడవికోళ్లు, నెమెళ్లు, దేవాంగుపిల్లి, బెట్లుడుత, ఎలుగుబంట్లు, వుుచ్చకోతి, దుప్పులు, కణితులు, ఏనుగులు ఉన్నాయి.

విడిది చేసే వారి కోసం
తలకోన జలపాతానికి దగ్గర్లోని ఆలయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఓ అతిథి గృహం ఉంది. అలాగే వచ్చి విడిది చేసే వారి కోసం ఫారెస్టు శాఖ గెస్ట్‌హౌస్‌లు, తిరువుల తిరుపతి దేవస్థానం గదులు ఉన్నాయి.ఆలయానికి తలకోనకు వెళ్లే పర్యాటకులు తినే పదార్థాలను వెంట తీసుకెళ్లాలి. ఏమీ తీసుకెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్లో ముందుగా చెపితే భోజనం ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు చెట్లపై నడవడానికి అటవీ శాఖ వినూత్న ప్రయోగం చేసింది. అదే కెనఫీవాక్. పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీ శాఖ నెమళ్లను కూడా పెంచుతోంది. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడిదగ్గరికి చేరుకుంటారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సినిమా షూటింగులు నిరంతరం జరుగుతూనే వుంటాయి.

ఎలా చేరుకోవాలి?
విమానాశ్రయం
తలకోన జలపాతానికి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుపతి విమానాశ్రయం. ఈ తిరుపతి విమానాశ్రయానికి దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, ముంబై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు మొదలగు ప్రాంతాలనుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైల్వే స్టేషన్
తలకోనకి చేరువలో ఉన్న రైల్వే స్టేషన్ తిరుపతి. ఈ స్టేషన్ కి దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లు వస్తుంటాయి. తలకోనకి ఈకాక్‌ది నుంచి రావాలంటే బస్సు ద్వారా కానీ, ట్యాక్సీ ల ద్వారా కానీ లేకుంటే స్టేషన్ బయటికి వస్తే ఆటో లు దర్శనమిస్తాయి. అవి ఎక్కి కూడా రావచ్చు.

రోడ్డు మార్గం
ఒకవేళ మీరు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలనుకుంటే, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం వుండలంలో వైఎస్‌ఆర్ జిల్లా సరిహద్దుకు దగ్గరగా ఉంది తలకోన. ఇక్కడికి చేరుకోవాలంటే తిరుపతి గుండా ప్రయాణించాలి. తిరుపతి, పీలేరుల నుంచి తలకోనకు ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. తిరుపతి - మదనపల్లె జాతీయు రహదారి మార్గంలోని భాకరాపేట చేరుకుంటే అక్కడ నుంచి ఆటోలు, జీపులు ఉంటాయి.

వేంకటేశ్వర స్వామి ఆలయాలు !


తిరుమలతో ముడిపడి ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయాలు ! 

వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతిలో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అప్పనపల్లిలో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లాలో ఉండటం.

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు పై రెండు ఆలయాలను దర్శిస్తే సకలశుభాలు, శుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

వెంకటేశ్వర స్వామి తీర్థయాత్రలు !
ట్రిప్ వేయండి ఇలా ..!
ముందుగా తిరుపతి దర్శనం
తిరుపతికి దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు / రైలు / విమాన సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు వ్యవస్థ కూడా చక్కగా ఉన్నది. తిరుపతి చేరుకున్నాక అక్కడ గల ఆలయాలను తప్పక సందర్శించండి.

గోవిందా .. గోవిందా !
తిరుపతి, తిరుమల పేర్లు వేరేమో కానీ ... రెండింటి ఆత్మ ఒక్కటే..! వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. ఈ ఆలయం పురాతనమైనది మరియు దీని నిర్మాణ శైలి ద్రవిడ సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.

సుమారు రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నది. ఈ విగ్రహం జాతి రాళ్ళతో అలంకరించబడి ఉంటుంది.

తిరుమలకు కాలినడకన వెళ్ళే వారు ఉదయాన్నే వెళితే చుట్టూ ప్రకృతి దృశ్యాలను, ఘాట్ రోడ్, కొండ చరియలు చూసి ఆనందించవచ్చు. దారి పొడవునా విష్ణువు అవతారాలను, ఆంజనేయస్వామి ప్రతిమలను గమనించవచ్చు.

కాలినడకన వెళ్ళేటప్పుడు మీకు దర్శనం కౌంటర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి దర్శనం టికెట్ ను కొనుగోలు చేయవచ్చు. గాలిగోపురం, శ్రీవారి పాదాలు, నారాయణ స్వామి ఆలయాలు కాస్త ముందుకు వెళితే కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సెల్ ఫోన్, కెమెరాలు లోనికి తీసుకొని వెళ్ళరాదు. అవి పూర్తిగా నిషేధం.

శ్రీవారి దర్శనం
శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు కంపార్ట్ మెంట్ లలో, క్యూ లైన్ లలో నిల్చుంటారు. కాలినడకన వచ్చే వారికి ఒక కంపార్ట్ మెంట్, లఘు దర్శనం, సర్వ దర్శనం .. ఇలా ఎన్నో దర్శనాలకి ఇంకొన్ని కంపార్ట్ మెంట్ లు ఉంటాయి. ఎలా పోయినా దేవుణ్ణి మాత్రం దర్శించుకుంటారు. తేడా ఒక్కటే చూడటంలో దగ్గర .. దూరం అంతే ..!

వీలుంటే చూడండి
శ్రీవారి దర్శనం ముగించుకున్నాక సమయం ఉంటే కపిల తీర్థం, తలకోన చూడటం మరవద్దు. జలపాత సోయగాలు అద్భుతంగా ఉంటాయి. కపిల తీర్థంలో శివుని ఆలయం ఒక్కటే ఉంది. ఇక్కడికి ప్రవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే తలకోనకి కూడా!

ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)
దర్శనం అయిపోయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 'చిన్న తిరుపతి' గా పిలువబడే ద్వారకా తిరుమలకి వెళ్ళండి. ద్వారకా తిరుమలకి విజయవాడ (100KM), రాజమండ్రి (75KM) నగరాలు దగ్గరలో ఉన్నాయి. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులు సులభంగా లభ్యమవుతాయి. ద్వారకా తిరుమల ఆలయం దేశంలోని ఆలయాలన్నింటిలోకి భిన్నంగా ఉంటుంది. తిరుమల తిరుపతి (పెద్ద తిరుపతి)లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం. తిరుపతితో పోలిస్తే ద్వారకా తిరుమలలో దర్శనం కాస్త త్వరగానే జరుగుతుంది. గుడిలో ప్రవేశించేటప్పుడు ముందు తిరుపతి వలే శ్రీవారి పాదాలను నమస్కరించి మెట్లు ఎక్కాలి. ప్రధాన ఆలయానికి వెళ్ళేటప్పుడు మెట్ల పొడవునా ఆళ్వారుల ప్రతిమలు, అన్నమాచార్య విగ్రహం, సత్రాలు, కళ్యాణ మండపాలు గమనించవచ్చు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు, గరుడ విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూగా వెలసిన వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వర స్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయరు. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి!

ద్వారకా తిరుమల దర్శనం
ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆ రోజే స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలు జరుగుతాయి. ఆలయానికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు మూసి 3 గంటలకు తెరుస్తారు.

బాల తిరుపతి
పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

అప్పనపల్లి కాకినాడ కు 70KMల దూరంలో, రాజమండ్రి కి 85KMల దూరంలో మరియు అమలాపురం కు 35KMల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రేవులపాలెం మీదుగా (110 KM) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.

అమలాపురం మీదుగా వచ్చే వారు వయా అంబాజీపేట మీదుగా 35 KMల దూరం ప్రయాణించి అప్పనపల్లి చేరుకోవచ్చు. అన్నట్లు ఫెర్రీ సౌకర్యం కూడా ఉన్నది. అమలాపురం నుండి బోడసకుర్రు ఫెర్రి ఎక్కి 13KM దూరంలో ఉన్న అప్పనపల్లి చేరుకోవచ్చు.

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి ఉంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాల బాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లిని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం.అంతర్వేది .. గోదావరి సంగమ ప్రదేశం !

గోదావరి తల్లి గురించి ఎంతో మంది కవులు కవితల రూపంలో, రచయితలు పాటల రూపంలో వర్ణన లు చేశారు. నదీ తీరానికి ఇరువైపులా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పచ్చని పంట పొలాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే, మరో వైపు కనుచూపుమేర ఉన్న సముద్రం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. గోదావరి నది ఉరుకులు, పరుగులు తీస్తూ బంగాళాఖాతం సముద్రం లో కలిసే దృశ్యాలు తప్పక చూడాల్సిందే .. అక్కడి సముద్ర ప్రవాహాల శబ్దాలు విని తీరాల్సిందే ..! ఆ ప్రదేశం పేరే ' అంతర్వేది' !!

అంతర్వేది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అందమైన గ్రామం మరియు ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 100 కి. మీ ల దూరంలో, కాకినాడకు 111 కి. మీ ల దూరంలో .. సఖినేటి పల్లి మండలంలో కలదు. ఇక్కడ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కలదు. గోదావరి నది సముద్రంలో కలిసే 'సంగమ ప్రదేశం' గా అంతర్వేది కి పేరు. ఇక్కడున్న కొన్ని సందర్శనీయ స్థలాలను గమనిస్తే ..

ఇతర సందర్శన స్థలాలు !
అన్న చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును 'అన్న - చెళ్ళెళ్ళ గట్టు' అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు 4KM ల మేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.

ఇతర విశేషాలు
అంతర్వేది, సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

వసతి సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

రవాణా సౌకర్యాలు
బస్సు
అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి (100 KM), కాకినాడ (111 KM) ల నుండి రావులపాలెం(63 KM), రాజోలు(27 KM) మీదుగా సకినేటిపల్లి(19 KM) చేరవచ్చు. విజయవాడ(200 KM), ఏలూరు(140 KM) ల నుండి నరసాపురం(21 KM) మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి కలవు.

రైలు
అంతర్వేది కి సమీపాన నరసాపూర్ రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి. హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా డైరెక్ట్ గా నరసాపురం చేరవచ్చు. నరసాపూర్ నుండి సఖినేటిపల్లికి అలాగే అంతర్వేది కి ప్రభుత్వ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

విమానం
అంతర్వేది కి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి రైలు లేదా బస్సులో ప్రయాణించి సఖినేటి పల్లి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు.

భీమశంకర్

మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి.

భీమశంకర్ పూనే నగరానికి దగ్గరగా ఖేడ్ పట్టణానికి వాయువ్యంగా సుమారు 568 కి.మీ.ల దూరంలో షిరాధోన్ గ్రామంలో 3250 అడుగుల ఎత్తున కలదు. ఈ దేవాలయం సహ్యాద్రి కొండల శ్రేణి ప్రాంతంలో కలదు. భీమశంకర్ భీమానది పుట్టిన ప్రాంతం. ఈ నది ఆగ్నేయ దిశగా ప్రవహించి క్రిష్ణా నదిలో కలసిపోతుంది. 

మతపర ప్రదేశం -
ఇతిహాసం మేరకు శివ భగవానుడు సహ్యాద్రి కొండలలో భీముడి అవతారంగా దేవతల కోరిక మేరకు నివసిస్తున్నాడని చెపుతారు. త్రిపురాసురుడనే రాక్షసుడితో శివుడు పోరాడి ఆ రాక్షసుడిని వధించాడు. ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడి శరీరంనుండి ప్రవహించిన చెమట ధారలే భీమ నదిగా ప్రవహించాయని చెపుతారు.

ఈ ప్రాంతంలో మరి కొన్ని దేవాలయాలు కూడా కలవు. కమలాజ - పార్వతీ దేవి అవతారం. మోక్షకుండ తీర్ధ - ఇది భీమ శంకర్ దేవాలయ వెనుక భాగంలో కలదు. కుషారణ్య తీర్ధ మరియు సర్వతీర్ధ ఇతర మతపర ప్రదేశాలు. వీటిని తప్పక చూడాలి.

భీమశంకర్ ప్రదేశం తీర్ధ యాత్రికులకు మాత్రమే స్వర్గంగా ఉండదు. ఇది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వర్గం లానే ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో ట్రెక్కింగ్ అవకాశాలు కలవు. ఈ ప్రాంతం అంతా సహ్యాద్రి కొండల కిందకు వస్తుంది. ఎన్నో రకాల పక్షులు ఇక్కడి రిజర్వు అటవీ ప్రదేశంలో ఉంటాయి. వివిధ రకాల వన్య జీవులు కూడా ఈ ప్రదేశంలో సంరక్షించబడుతున్నాయి. గ్రేట్ ఇండియన్ స్వ్విర్రల్ లేదా ఉడుత తప్పక చూడదగిన జంతువులలో ఒకటి.  భీమశంకర్ ప్రదేశం మతపర అభిమానులకే కాదు సాహస క్రీడా కారులకు కూడా ఖ్యాతిగాంచిన ప్రదేశం. పచ్చటి ప్రదేశాలను ప్రదర్శిస్తూ పర్యాటకుల మనసులను దోచుకునే ప్రదేశంగా ఉంటుంది. 

మహోన్నత ఆలయం ... కేదారేశ్వర్ గుహాలయం !

యుగాంతం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం యుగాంతం 2012. అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు, సునామీలు ఇలా ఎన్నో ప్రకృతి వైపరిత్యాల కారణంగా యుగాంతం అంతమవుతుందని పసిగట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళు తీసిన సినిమా ఇది. వాళ్ళకి సైన్స్ బాగా అంటబట్టింది కాబట్టి ఆ విధంగా తీశారు. మనవాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు బాగా అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి, యుగంతం ఎలా వస్తుందో అని స్వామీజీ వద్దకు వెళ్ళి అడిగితే - 'ఎప్పుడైతే పాపాత్ముల సంఖ్య భూమి మీద పెరిగిపోతుందో అప్పుడు దేవుడు భూమిని భస్మం చేస్తాడని' చెప్పేస్తారు.

శివుడు మూడో కన్ను తెరుస్తాడో? లేడో? మనకైతే తెలీదు కానీ నాలుగో స్తంభం విరిగితే మాత్రం యుగాంతం వస్తుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. అక్కడంటే ఎక్కడో అనుకొనెరు. స్వయాన మన భారతదేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రంలో ..! మహారాష్ట్ర లో ఎన్నో నదులకు, ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ మరియు అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. ఇంతకు ఈ ప్రదేశం చెప్పలేదు కదూ ..! హరిశ్చంద్రగడ్. హరిశ్చంద్రగడ్ ఒక హిల్ ఫోర్ట్ అంటే కొండ కోట. కొండ మీద ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఇంతవరకు చెప్పానే యుగాంతం అని ఆ అలజడి రేపే అంశాలు దాగి ఉన్నాయి. హరిశ్చంద్రగడ్ అహ్మద్ నగర్ జిల్లా కు చెందినదైనా దాని చరిత్ర మాత్రం దగ్గర్లోని మల్షేజ్ ఘాట్ తో ముడిపడి ఉన్నది. ఇక ఆలస్యం ఎందుకు? ఎలాగైనా అక్కడికి వెళ్తాం కదా .. ఆ వెళ్లెదీ కూడా మల్షేజ్ ఘాట్ మీదనే. దాన్ని కూడా చూస్తూ ... చివర ఆ యుగాంతం చేరుకుందాం స్వామీ అని !

మల్షేజ్ ఘాట్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
మల్షేజ్ ఘాట్ కు సమీపాన 150 కి. మీ. దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి మల్షేజ్ ఘాట్ చేరుకోవచ్చు.

రైలు మార్గం
కల్యాణ్ రైల్వే స్టేషన్ మల్షేజ్ ఘాట్ కు 80 కి. మీ. దూరంలో ఉన్న సమీప స్టేషన్. స్టేషన్ నుంచి గంటన్నార లో అక్కడికి చేరుకోవచ్చు.


మల్షేజ్ ఘాట్

మల్షేజ్ ఘాట్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది పూణే జిల్లాలో కలదు. సముద్ర మట్టానికి 700 మీ. ఎత్తున ఉండే ఈ ప్రదేశం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు సరదా రాయుళ్లకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇస్తుంది.


మల్షేజ్ ఘాట్ లో ఏమి చూడాలి?

శివాజీ పుట్టిన కోట, అందమైన జలపాతాలు, డ్యామ్, ఆ డ్యామ్ కు వచ్చే ప్లేమింగో పక్షులను చూడటం మరిచిపోకండి.


మల్షేజ్ జలపాతాలు

మల్షేజ్ జలపాతాలు సహజ అందాలకు ప్రసిద్ధి. పై నుండి కిందకు కు పదే ఆ నీటి ధార ప్రవాహం చూపరులను ఆకట్టు కుంటుంది. ఈ ప్రదేశం వర్షాకాలం స్వర్గధామం అనుకోండీ ..!


పిమ్పల్గావ్ జోగా డ్యామ్

పిమ్పల్గావ్ జోగా డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అందించే అద్భుతమైన దృశ్యాల నెలవుగా వుంది. జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి పక్షుల విహంగ వీక్షణలను చూసి పక్షి ప్రేమికులు ఆనందిస్తారు. ఫ్లెమింగో లాంటి వలస పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు.


హరిశ్చంద్రగడ్

ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ ప్రదేశం రానే వచ్చింది .... హరిశ్చంద్రగడ్. మల్షేజ్ ఘాట్ నుంచి ఈ ప్రదేశం దగ్గరదగ్గర 95 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో పర్వతారోహణ సూచించదగినది.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

హరిశ్చంద్ర గడ్ థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. థానే జిల్లా నుంచి : థానే నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బోర్డ్ తగిలించి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి ఖుబిఫట గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. ఖిరేశ్వర్ నుంచి 7 కి. మీ. వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

పూణే లోని శివాజీనగర్ ఎస్ టి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజూ ఖిరేశ్వర్ కు బస్సులు నడుస్తాయి.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

అహ్మద్ నగర్ జిల్లా నుంచి : నాసిక్, ముంబై లేదా అలైట్ కు వెళ్లే బస్సులు ఎక్కి ఘోటి గ్రామం చేరుకోవాలి. ఘోటి నుంచి సంగమ్‌నేర్ వయా మలేగావ్ మరియు అలైట్ బస్సులు ఎక్కి రాజూర్ గ్రామం చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి 3 దారుల్లో కోట కు చేరుకోవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

రాజూర్ గ్రామం నుంచి పచనై గ్రామం వరకు బస్సులో లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి నేరుగా ఉన్న మార్గంలో ఆ ఎత్తైన చోటుకి చేరుకోవాలి.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

కొత్తగా రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) వరకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. లోయ నుండి 2 - 3 గంటలు కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

కోటుల్ నుండి కొథలె వరకు లోయ ప్రాంతమైన తోలార్ ఖింద్ మార్గం గుండా ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం గంట గంట కు ఉన్నది.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొండ మీదకి చేరుకోవటానికి 4 -5 మార్గాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధి గాంచిన రూట్లు ఖిరేశ్వర్ నుంచి గుహలు, వాటర్ ట్యాంక్ ల ను దాటుకుంటూ జున్నార్ దర్వాజా వరకు చేరుకోవాలి. అక్కడి నుండి నేరుగా తోలార్ ఖింద్ కు చేరుకొని కొద్ది దూరం నడవాలి. రాళ్ళ గుట్టలను, తక్కువ అడవులున్న పీఠభూమి మైదానాలను, ఏడు కొండలను దాటుకుంటూ 2 - 3 గంటలు నడిస్తే హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.

గమనిక : నడిచి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గుర్తులు ఉపయోగ పడతాయి.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

ఈ ఏడు కొండలను స్కిప్ చేసి వెళ్లే మార్గం ఒకటి ఉన్నది. అది దట్టమైన అటవి ప్రాంతం కనుక వెళ్తే సమూహంగా(గ్రూప్ లుగా) వెళ్ళాలి. ఈ మార్గాన్ని బలెకిల్ల అంటారు. తోలార్ ఖింద్ నుండి రాక్ క్లైంబింగ్ చేసుంటూ వెళ్తున్న తప్పక ఆయాసం వస్తుంది. కాస్త ఆగుతూ వెళ్ళాలి. ఇలా వెళితే 1 -2 గంటల్లో హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

బెల్పడ

మల్షేజ్ ఘాట్ నుంచి కల్యాణ్ వెళ్లే మార్గంలో బెల్పడ గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వయా సధ్లెఘాట్ గుండా 1 కిలోమీటరు దూరం నుడుచుకుంటూ దారిమధ్యలో ఎత్తుపల్లాలను, ఏటా వాలు రాళ్ళను దాటుకుంటూ వెళితే హరిశ్చంద్ర గడ్ చేరుకోవచ్చు.


కొథలె నుండి

హరిశ్చంద్ర గడ్ కు చేరుకోవటానికి సూచించదగిన మరో మార్గం కొథలె గ్రామం. ఇక్కడి నుంచి కోట మూడు కిలోమీటర్లు. నడక మార్గాన వెళ్తున్న మీరు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. దారి మద్యలో నీటి తో నిండిన కుంట లను, చెరువులను గమనించవచ్చు.


హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కేదారేశ్వర్ గుహాలయంపక్క చిత్రంలో మీరు చూస్తున్నది అపురూపమైన, అద్భుతమైన కట్టడం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని హరిచంద్ర కోట లో ఉన్న కేదారేశ్వర్ స్వామి ఆలయం. ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి, కింద 4 స్తంభాల పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలీదు. ఎవరు నిర్మించారో కూడా తెలీదు. కానీ ఇక్కడున్న నాలుగు స్తంభాలు 4 యుగాలకి(సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం) సంకేతాలు గా నిలిచాయి. ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కనుక, ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే వున్నది. ఎప్పుడైతే ఈ స్తంభం కూడా విరిగిపోతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి మహాత్వమైన గోపురం ఇది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ... గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరూ లోనికి వెళ్ళరు. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు గుడి లో ఉండదు...!! వేసవి, శీతాకాలం లో 5 అడుగుల మేర ఎత్తులో నీరు వుంటుంది.


హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కొండ మీద చూడవలసినది కోట.

కోట పురాతమైనది చాలా వరకు శిధిలాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం గురించి మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో పేర్కొన్నారు. కోటను కాలచూరి వంశీయులు నిర్మించారు. కోట సముద్ర మట్టానికి 1424 మీ. ఎత్తున ఉంటుంది.


కోట ఆవరణలో అందమైన విష్ణు దేవాలయం దగ్గర్లో పురాతన బౌద్ధ గుహలు ఉన్నాయి. మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం మరియు కేదారేశ్వర్ గుహాలయం కూడా సమీపంలోనే ఉన్నాయి.


సప్త తీర్థ పుష్కరణి

ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరణి చెరువు ఉన్నది. ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటుంది. అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి. మొన్ననే ఆ విగ్రహాలను గుహలకు దగ్గర్లోని హరిశ్చంద్రేశ్వర్ ఆలయానికి తరలించారు. వచ్చి పోయే ట్రెక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులను పడేసేవారు దాంతో గత 7 సంవత్సరాల నుంచి ఈ చెరువు కనీసం స్విమ్ చేయటానికి కూడా ఉపయోగపడటం లేదు. వేసవిలో ఈచెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ... ఫ్రిజ్ ముందర నిలబడ్డట్టు ఉంటుంది.


కొంకణ్ క్లిఫ్

ఇక్కడ అద్భుతమైన సూర్యోదయాలను, సూర్యాస్తమాలను చూడవచ్చు. ప్రకృతి అందాలను, లోయ అందాలను, సహజ ప్రకృతి సన్నివేశాలను కూడా గమనించవచ్చు.


తారామతి పీక్ / తారామంచి

ఈ పిక్నిక్ ప్రదేశం సముద్ర మట్టానికి 1429 మీ. ఎత్తున ఉంటుంది. దీనికి అనుకోని ఉన్న అడవుల్లో చిరుత లను చూడవచ్చు. పశ్చిమ కనుమల లోని కసర రీజన్ లో ఘోడ్‌శెప్(865 మీ.), అజోబా (1375 మీ) కులాంగ్ ఫోర్ట్(1471 మీ) లను కూడా చూడవచ్చు కానీ మసక మసక గా కనిపిస్తాయి.


హరిశ్చంద్రగడ్ గుహలు

దాదాపు కోట అంతటా గుహలు విస్తరించాయి. వాటిలో కొన్ని తారామని పీక్ వద్ద మరియు బస చేసే వద్ద ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.


నాగేశ్వర్ ఆలయం, ఖిరేశ్వర్ దగ్గర

ఇదొక విష్ణు దేవాలయం. ఇది ఖిరేశ్వర్ సమీపంలో ఉన్నది. ఇందులో ప్రధాన దైవం విష్ణువు. శిల్పం 1.5 మీ. పొడవు ఉండి విష్ణువు పడుకొని ఉన్న భంగిమలో ఉంటాడు.


హరిశ్చంద్రేశ్వర్ ఆలయం

ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్ కు వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు. సమీపంలో అనేక వాటర్ ట్యాంక్ కు ఉన్నాయి. ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కుచెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటున్నది.


వసతి సౌకర్యాలు

కొండ మీద ఉన్న గుహాల్లో గణేశ్ ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో 50 వరకు వసతి కల్పించవచ్చు. క్యాంపైనింగ్ కూడా సూచించదగినది.


కొథలె గ్రామంలో వసతి

కొథలె గ్రామంలో బస చేయటానికి చారిటబుల్ ట్రస్ట్ వారు, సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు , దాతలు తక్కువ ధరకే వసతి సదుపాయం కలిపిస్తున్నారు.


ఖిరేశ్వర్ వసతి

ఖిరేశ్వర్ లో రాత్రి పూట బస చేయటానికి లోకల్ స్కూల్ ఉత్తమం. ఇక్కడ చూడటానికి నాగేశ్వర్ ఆలయం మరియు యాదవ గుహలు ఉన్నాయి. పచ్‌నై గ్రామం లో రాత్రి పూట బస చేయటానికి హనుమాన్ ఆలయం సూచించదగినది.


భోజన సౌకర్యాలు

సమ్మర్ లో, వింటర్ లో స్థానికులు తయారు చేసిన వంటలను గుహల వద్ద అమ్ముతుంటారు కాబట్టి తినొచ్చు. ఐతే, మాన్సూన్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు వంటలు చేయరు అప్పుడు మనమే స్వయంపాకం చేసుకోవాల్సిందే ..!


తాగునీటి సౌకర్యం

తాగునీటి అవసరాలకై నిర్మించిన వాటర్ ట్యాంక్ కు గుహల వద్ద ఉన్నాయి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. తోలార్ ఖింద్ మరియు హరిశ్చంద్రగడ్ వద్ద వేసవి మరియు వింటర్ సీజన్ లో నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ అమ్ముతారు.

[EDIT] Historic Structure and Monuments of Tamil Nadu

21 Historic Structure and Monuments of Tamil Nadu

Tamil Nadu has a very rich history and several monuments from ancient time along with largest collection of heritage buildings in India. Some of the most famous historic buildings and national monuments of state also includes Vivekananda House,Madras War Cemetery, Kamarajar Mani Mantapa Monument,Freemasons Hall Chennai,Sittanavasal Cave,Kamaraj Memorial House and Thanjavur Palace.

Brihadeeswarar Temple

Brihadeshwara-Temple-Thanjavur
The Brihadeshwara Temple is one of the most ancient temple, situated in the city of Thanjavur and one of the most famous temple in India. The temple has the tallest temple tower in the world and It is one of the largest temples in India.

Meenakshi Amman Temple

Meenakshi-Amman-Temple-Madurai
Meenakshi Amman Temple is a historic Hindu temple dedicated to Parvati and the most prominent landmark and most visited tourist attraction in the city of Madurai. Meenakshi temple was on the list of top 30 nominees for the New Seven Wonders of the World.

Victory War Memorial

Victory_War_Memorial-Chennai
Victory War Memorial is situated on the Beach Road,erected in the memory of Madras Presidency who lost their lives in the wars. The circular rock and marble structure is one of the seven magnificent memorial structure of Tamil Nadu.

Fort St George

Fort St. George also known as White Town is one of the 163 notified areas in the state of Tamil Nadu. The fort and museum is located on the banks of Bay of Bengal and the complex also host other monuments.

Rama Setu

Rama-Setu-or-adams_bridge
Rama Setu is a national monument and the symbol of national unity,is a stretch of limestone shoals between Rameswaram Island. As per Geological survey it a land bridge connection between India and Sri Lanka.

Valluvar Kottam

Valluvar_Kottam
Valluvar Kottam is a popular monument in Chennai city,situated on the corner of Kodambakkam High Road. This monument is one of the landmarks of modern Chennai,dedicated to the classical Tamil poet.

Senate House

Senate_House_Madras
Senate House is situated in Wallajah Road is basically administrative centre of the University of Madras in Chennai. Senate building is one of the best and oldest examples of Indo-Saracenic architecture in India.

Varaha Cave Temple

Varaha-cave
Varaha Cave Temple has the beautiful rock-cuts of Lord Vishnu and his incarnation,located at Mamallapuram. The temple is most prominent sculpture in the caves and one of the finest testimonial to the ancient Vishwakarma.

Thirumalai Nayakkar Mahal

Thirumalai_Nayakkar_Mahal
Thirumalai Nayakkar Mahal or Palace is a classic fusion of Dravidian and Rajput styles, located in the city of Madurai. Tirumalai Nayak Palace is considered to be one of the wonders of the South India and declared as a national monument.

Samanar Malai

Samanar_Malai
Samanar Malai is a hill rock complex, declared as a protected monument by the Archaeological Survey of India. Samanar Hills has caves, inscriptions, stone beds and many sculptures.

Vivekanandar Illam

Vivekanandar_Illam
Vivekanandar Illam or Vivekananda House is an important landmark in Chennai and an important place for the Ramakrishna Movement in South India. Vivekananda House is located on the main road facing the Marina Beach.

Manora Fort

manora-fort
The Manora fort is one of the most prominent tourist attractions in the district of Thanjavur in Tamil Nadu, located at 65 kilometers distance from Thanjavur. The fort is hexagonal structure and has eight storeys, raising to a height of 75 ft (23 m).

Ripon Building

Ripon_Building_Chennai
The Ripon Building is a fine structure in the Indo-Saracenic styled architecture, located near the Chennai Central railway station. It is one of the first heritage building in the country and most famous monuments of Tamil Nadu.

Vivekananda Rock Memorial

vivekananda-rock-memorial
Vivekananda Rock Memorial is a popular tourist monument in Kanyakumari,renowned for its stunning architecture. The Vivekananda Rock Memorial is one of the 7 magnificent memorial structure in Tamil Nadu.

Yanaimalai Elephant Hill

Yanaimalai-Elephant-Hill
Yanaimalai or Elephant Hill is a protected monument and tourist attraction in Tamil Nadu. The Ladan temple has been declared a protected monument by the Archaeological Survey of India.

Armamalai Cave

Armamalai Cave is known for its Indian cave paintings located at Malayampattu village and a protected monument by the Archaeological Survey of India. The natural cave of Armamalai has the the rock arts and paintings, ranked as one of the best Tamil Nadu tourist attraction.

Madras High Court

Chennai_High_Court
Madras High Court is the highest court in Tamil Nadu, built as an exquisite example of Indo-Saracenic style of architecture. Madras High Court is one of the most beautiful heritage structures in Chennai along with Southern Railway headquarters,General Post Office and Government Museum Buildings.

Tiruchirapalli Rock Fort

Tiruchirapalli-Rock-Fort
Tiruchirappalli Rockfort is one of the most prominent historical monuments in Tiruchirappalli,built on an ancient rock. This historic fortification and complex is also famous for Rockfort Ucchi Pillayar Temple,dedicated to Lord Ganesh.

Descent of the Ganges

Mamallapuram
Descent of the Ganges is one of the famous monument at Mahabalipuram and part of the Group of Monuments at Mahabalipuram. The descent of the Ganges are portrayed in stone at the Pallava heritage site in the Kancheepuram district.

Padmanabhapuram Palace

Padmanabhapuram-Palace
Padmanabhapuram Palace is located at the foot of the Veli Hills in at Padmanabhapuram Fort in Kanyakumari district. The Palace complex has several interesting features such as clock tower,variety of weapons,Kuthira Vilakku and unique rooms.

Chennai Central Railway Station

Chennai_Central_Station
Chennai Central railway station is one of the most important railway hubs in South India. Chennai Central building is one of the most prominent landmarks of city and railway station has been ranked as one of the top 10 most beautiful railway stations in India.

Tourist Destinations of Andhra Pradesh

Top 15 Must See Tourist Destinations of Andhra Pradesh 

The state of Andhra Pradesh is also known as Koh-i-Noor of India, It has many tourist attractions such beaches, hills, caves, wildlife, forests and temples. Tourist destinations also includes Visakhapatnam city, Rajahmundry city and Vijayawada city, Nature tourism of Andhra Pradesh are many beautiful beaches on Bay of Bengal, Hills,valleys,religious and pilgrimage sites.
 1. Araku Valley
  Araku Valley is the most famous Hill station in Andhra Pradesh, Located at a distance of 120 KM from Visakhapatnam. The valley is rich in biodiversity and also popular for its famous coffee plantations.
  Araku Valley-of-eastern-ghats

 2. Talakona Waterfall
  Talakona waterfall is the highest waterfall in the Andhra pradesh state, located in Nerabailu village. The waterfall of Talakona is surrounded by dense forests and home to rare and endangered species of animals.
 3. Rama Krishna Beach
  Rama Krishna Mission Beach is the most popular beach parks in Andhra Pradesh and must visit place in the list of Visakhapatnam tourist attractions. RK Beach is best known for the INS Kursura Submarine Museum.
 4. Borra Caves
  Borra Caves are located in the Ananthgiri Hill Ranges of Eastern Ghats in the State of Andhra Pradesh at an elevation of about 705 m. The caves are one of the largest in the country and also considered the deepest cave in India.
 5. Belum Caves
  Belum Caves are the longest caves in plains of Indian Subcontinent and one of the largest tourist cave in India. It is a natural underground cave with underground water and also known for its stalactite and stalagmite.
 6. Kondareddy Buruju
  Konda Reddy Buruju is a part of Kurnool fort and one of the well known monument in Kurnool city of Andhra Pradesh. The Fort and Konda Reddy Buruju are located in the heart of Kurnool and is one of the prominent landmarks of the town.
 7. Natural Arch
  Tirumala hills Natural Arch is one of the geological wonders of India and one of the few natural arches or bridges in Asia. Natural Arch is also known as Silathoranam in local language and it one of the best known rock formation site in India.
 8. Thotlakonda
  Thotlakonda is a Buddhist Complex near the coast north of Vizag, It is one of the best & famous Buddhist places in Visakhapatnam. Maha Stupa at Thotlakonda is ancient brick work architecture and is surrounded by several other excavated structures.
  Maha_Stupa_Thotlakonda

 9. Horsley Hills
  Horsley Hills is a picturesque series of hills, situated at an altitude of 4,100 ft in Madanapalle. This mesmerizing hill is one of the most visited Hill Stations in Andhra Pradesh.
  Horsley Hills
 10. Gandikota
  Gandikota is a village located on the bank of river Pennar in Kadapa district and best known for Madhavaraya temple,Gandikota fort and 300ft deep gorge formed between Gandikota hills and the river Pennar, known as The Grand Canyon of India.
  Gandikota-Gorge

 11. Kondaveedu Fort
  Kondaveedu Fort is part of the rich historical past of Guntur city and one of the best tourism place in Andra Pradesh. The fortresses surrounding forest has a very large number of Custard apple trees.
 12. Nallamala Hills
  Nallamala Hills is a section of the Eastern Ghats range in Kurnool, Guntur, Kadapa and Chittoor districts of Andhra Pradesh. The rocks and hill forest of Nallamala range have some of the most beautiful temples of Andhra Pradesh such as Mahanandi temple, Srisailam Shiva temple and Ahobilam temple.
 13. Kolleru Lake
  Kolleru Lake is one of the largest freshwater lakes in India, located between Krishna and Godavari delta. Atapaka Bird Sanctuary on the Kolleru Lake is home to pelicans,Siberian crane, ibis and painted storks.
 14. Indira Gandhi Zoological Park
  Indira Gandhi Zoological Park is amidst in the scenic Eastern Ghats of India and surrounded by Hiils,Ghats,vallyes on three sides and Bay of Bengal form one side. The Zoo Park is located in the Kambalakonda Wildlife Sanctuary and home to 80 species of mammals, birds and reptiles.
 15. Pulicat Lake Bird Sanctuary
  Pulicat Lake Bird Sanctuary is the second largest brackish-water eco-system in India, located at the border of Andhra Pradesh and Tamil Nadu. The Lake and water sanctuary is haven for bird lovers and one of the most famous Bird Sanctuaries in India.

థాయిల్యాండ్ ట్రిప్ ఇలా ప్లాన్ చేయండిభూలోక స్వర్గం.. థాయిల్యాండ్ ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకోండి!
పర్యాటకుల స్వర్గధామం థాయిల్యాండ్. ఎన్నోసుందర ప్రదేశాలు సందర్శకుల మదిని దోచేస్తాయి. అందుకే భారతీయ సినిమాల సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. మరి ఆ అందాలను చూడాలని అనుకుంటే పర్యటనకు ప్లాన్ చేసుకోండి...

విమానయాన చార్జీలు, ఆహారం, వసతి చార్జీలు
చెన్నై నుంచి బ్యాంకాక్ (థాయిలాండ్ రాజధాని)కు విమానంలో చెక్కేయాలంటే ప్రారంభ టికెట్ చార్జీలు సుమారు 6వేల రూపాయల నుంచి ఉన్నాయి. అదే బెంగళూరు నుంచి అయితే 8,500 రూపాయలు, హైదరాబాద్ నుంచి అయితే 10,500 రూపాయల నుంచి ఉన్నాయి. బ్యాంకాక్ లో ట్యాక్సీల్లో ప్రయాణించాలంటే… ప్రారంభ చార్జీ 35 థాయ్ బాట్ (టీహెచ్ బీ). ఒక టీహెచ్ బీ భారతీయ కరెన్సీలో సుమారు రెండు రూపాయలు. ఒక కిలోమీటర్ తర్వాత నుంచి పది కిలోమీటర్ల వరకు ప్రతీ కిలోమీటర్ కు 5.50 టీహెచ్ బీల చార్జీ వసూలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 20 కిలోమీటర్ల వరకు కిలోమీటర్ కు 6.50 టీహెచ్ బీల చార్జీ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉంటుంది. హోటల్ ముందు కాకుండా కొంచెం పక్కకు వచ్చి ట్యాక్సీలను మాట్లాడుకోవడం నయం. మీటర్ వేస్తేనే వాహనం ఎక్కండి. లేదంటే ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు.

బ్యాంకాక్ లో పైన తీగల మార్గంలో (రోప్ వే) ప్రయాణించాలనుకునేవారికి బీటీఎస్ వ్యవస్థ ఉండనే ఉంది. ఇందులో తక్కువ చార్జీకే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అయితే, వీటిలో రష్ ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో రద్దీ తగ్గుతుంది. వీటిలో ప్రయాణ చార్జీలు 20 నుంచి 40 టీహెచ్ బీల మధ్యలో ఉంటాయి. బస్సుల్లో ప్రయాణ చార్జీలు 6.50 టీహెచ్ బీల నుంచి 20 టీహెచ్ బీల వరకు ఉంటాయి. ద్విచక్ర వాహన ట్యాక్సీలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. బ్యాంకాక్ కు వెలుపల బస్సు సర్వీసులు, రైల్, ట్యాక్సీ సేవలు సౌకర్యంగా ఉంటాయి.

హోటల్లో విడిది చార్జీల విషయానికొస్తే… బడ్జెట్ హోటల్లో ఒక రోజుకు గాను చార్జీ 500 రూపాయల వరకు ఉంటుంది. స్టాండర్డ్ హోటల్స్ లో బస చేయాలంటే 700 రూపాయల నుంచి వ్యయమవుతుంది. వివరాలకు ఈ Website ను సందర్శించవచ్చు. భారతీయ ఆహారం కోరుకునే వారు వీధి పక్కన బండ్ల పై లాగించేద్దామనుకుంటే చైనాటౌన్ సమీపంలోని పహురత్ కు వెళ్లాలి. లేదా భారతీయ జనాభా ఎక్కువగా ఉండే ప్రతునమ్ ప్రాంతానికి వెళ్లినా కోరుకున్న ఆహారం లభిస్తుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి.

ఓ పది ప్రముఖ భారతీయ రెస్టారెంట్ల వివరాలను Website కు వెళ్లి తెలుసుకోవచ్చు. ఉత్తరాది, దక్షిణాది భారతీయ వంటకాలకు పేరుగాంచిన ఉడ్ ల్యాండ్స్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఒక చపాతి 15 టీహెచ్ బీ, తందూరి రోటి 20 టీహెచ్ బీ, అలూ పరాటా 50 టీహెచ్ బీ, చికెన్ పరాటా 130 టీహెచ్ బీల ధరల్లో ఉన్నాయి. ప్లెయిన్ రైస్ ధర 30 టీహెచ్ బీలు కాగా, వెజిటబుల్ కర్రీ తీసుకోవాలంటే 110 టీహెచ్ బీలు చెల్లించాలి. పప్పు ఒకటి చాలనుకుంటే 60 టీహెచ్ బీలు.

టూర్ ప్యాకేజీలు
రూ.27,668 రూపాయల యాత్రా సంస్థ ప్యాకేజీతో థాయిల్యాండ్ లోని బ్యాంకాక్, పట్టాయా నగరాలను చూసి రావచ్చు. ఐదు రోజుల పర్యటనలో రెండు రాత్రులు పట్టాయాలో, రెండు రాత్రులు బ్యాంకాక్ లో విడిది. రానుపోను విమానయానం, బ్రేక్ ఫాస్ట్ ఉచితం. జీఎస్టీ 3.6 శాతం అదనం. ఇక ఫుకెట్, బ్యాంకాక్ పర్యటనల ప్యాకేజీ ధర రూ.51,990. ఇదే ప్యాకేజీని థామస్ కుక్ 46,500 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. ఫుకెట్, క్రాబి, బ్యాంకాక్ ల ప్యాకేజీని 54,500 రూపాయలకు అందిస్తోంది. పట్టాయా, బ్యాంకాక్ ల పర్యటన వరకే అయితే, 27,925 రూపాయలకు అందిస్తోంది. Make My Trip ఇదే తరహా టూర్ ప్యాకేజీకి 33,990 చార్జ్ చేస్తోంది. ఈ ప్యాకేజీల్లో భాగంగా టూరిజం సంస్థలు అన్ని ప్రదేశాలను చూపించవు. రోజులో కేవలం ఒక పూట మాత్రమే పరిమిత సందర్శనకు తీసుకెళతాయి. కాబట్టి ముందుగానే టూర్ లో భాగంగా ఏమి చూడాలన్న విషయమై ప్లాన్ తో ఉంటే మంచిది.

సందర్శనీయ స్థలాలు
 • క్రాబి ప్రావిన్స్ లో ఉన్న ఫిఫి ద్వీప సమూహం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతం. ఇక్కడ తరచూ సినిమా షూటింగు లు జరుగుతుంటాయి.
 • పాంగ్ ఎన్జీయే బే… ఇది ఫుకెట్ ఐలాండ్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిల్యాండ్ లోని అత్యద్భుతమైన సుందర ప్రదేశం. సముద్రం మధ్యలో చిన్న చిన్న కొండలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూసి ఉంటారు. ఇక ప్రత్యక్షంగా చూస్తే... ఆ ఆనందమే వేరు!
 • గ్రాండ్ ప్యాలస్.. బ్యాంకాక్ లో ఉన్న ఈ రాజ ప్రాసాదం చావో నది ఒడ్డున సుందరమైన నిర్మాణ శైలితో అపురూపంగా ఉంటుంది.
 • ముకోచాంగ్ నేషనల్ పార్క్ మొత్తం 50 ద్వీపాల్లో విస్తరించి ఉంది. కొండలు, అటవీ ప్రాంతంతో మరోవైపు సాగరుడి అందాలతో చూడచక్కగా అనిపిస్తుంది.
 • థాయిల్యాండ్-బర్మా డెత్ రైల్వే... కాంచనబురి నుంచి క్వాయ్ నది వంతెన మీదుగా నామ్ టోక్ వరకు రెండు గంటల ప్రయాణం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది.
 • కో ఫాంగాన్ ద్వీపంలోని హాడ్ రిన్ ప్రాంతంలో ప్రతి నెలా పున్నమి నాడు ఫుల్ మూన్ పార్టీ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ఈ పార్టీకి సుమారు 30 వేల మంది వరకు హాజరవుతుంటారు.
 • సూర్య దేవాలయం వాట్ అరుణ్ చూడకుండా థాయిల్యాండ్ పర్యటన సంపూర్ణం కాదు. చూడచక్కని నిర్మాణ నైపుణ్యం ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. చావో ఫ్రాయ నది ఒడ్డున బ్యాంకాక్ లో ఉందీ ఆలయం. దీని ఎత్తు 280 అడుగులు.
 • ఖావో సాక్ నేషనల్ పార్క్ సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. ప్రపంచంలో 5 శాతం జంతు జాతులకు ఇది ఆవాసంగా వర్ధిల్లుతోంది.
 • బ్యాంకాంక్ లో చాతుచాక్ వీకెండ్ మార్కెట్ ను ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు సంతగా చెబుతుంటారు. సుమారు 8వేల స్టాళ్లు కొలువు దీరతాయి. ప్రతీవారం సుమారు 2 లక్షల మంది షాపింగ్ చేస్తుంటారు. చియాంగ్ మాయ్ పట్టణంలోని అతిపెద్ద నైట్ బజార్ కూడా పర్యాటకులను ఆకర్షించే వాటిలో ఒకటి.
 • థాయిల్యాండ్ లో బౌల్ ఆఫ్ గోల్డ్ అనే పార్క్ ను కూడా తప్పక సందర్శించాలి. 42 చిన్న చిన్న దీవులు పక్క పక్కనే విసిరేసిన రాళ్లలా విస్తరించి ఉంటాయి. వీటిలో పర్యాటకుల విడిదికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.
 • 11, 12వ శతాబ్ద కాలంలో కెమెర్ రాజ్యంలో నిర్మించిన ఆలయాలు నాటి చరిత్రకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇక్కడ హిందూ దేవతల శిల్పాలు దర్శనమిస్తాయి.
 • బ్యాంకాక్ సిటీకి వెలుపల ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ల సందర్శన కూడా మరపురానిదే. నీళ్లలో పడవల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం అదో ప్రత్యేక అనుభవం, అనుభూతి!
 • ఎరవణ్ నేషనల్ పార్క్ లోని ఎరవణ్ జలపాతాలు మంత్రముగ్ధులను చేసేస్తాయి. హిందూ పురాణాల్లోని మూడు తలల తెల్ల ఏనుగు పేరు ఈ జలపాతాలకు స్థిరపడింది. ఐరావతాన్ని థాయ్ భాషలో ఎరవణ్ గా పిలుస్తారు.

Friday, 10 June 2016

అండమాన్‌ -ఓ మహా ఆకర్షణ

రొస్ ఐలాండ్
అండమాన్‌ ఒక గాయం. సునామీ మిగిల్చి వెళ్ళిన గాయం గురించి నేను మాట్లాడటం లేదు. సెల్యూలర్‌ జైలు చూశాక, ఆ జైలులో ఖైదీలు అను భవించిన వర్ణనాతీత వేదనలు విన్నాక అండమాన్‌ ఎర్రటి పుండు మానిన గాయం లాగానే అన్పించింది నాకు. వందల సంఖ్యలో ఉరితీయబడిన ఖైదీలు, భయానక బాధల నడుమ కూడా చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు వీరసావర్కార్‌ లాంటి ధిక్కార స్వరాలు క్రౄర, కసాయి బ్రిటిష్‌ జైలర్లు. అండమాన్‌లో అడుగిడిన సాయంత్రమే సెల్యులర్‌ జైలును చూడడం, లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రోగ్రామ్‌లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు సజీవంగా ముందుకు రావడంతో మనసు వికలమై పోయింది. ఆ రాత్రి కలల నిండా ఖైదీలే. వారి హృదయ విదారక ఆర్తనాదాలే. పోలీసుల కరకు బూట్లచప్పుడు గుండెల మీద ఆనుతున్నట్టుగా అన్పించి చాలాసేపు నిద్రపట్టలేదు. ఆ తర్వాత తిరగిన సుందర ప్రదేశాలు మొదటి రోజు చేదు అనుభవాన్ని కొంతవరకు తగ్గించేయి. సెల్యూలర్‌ జైలు చూడ్డానికి వెళ్ళకముందు సన్‌సెట్‌ పాయింట్‌కి వెళ్ళాం. మేమున్న గెష్టహౌస్‌కి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుంది. మెలికలు తిరిగిన రోడ్లు. దట్టమైన అడవిగుండా మా ప్రయణం సాగింది. కొబ్బరి చెట్లు, ఆకాశన్నంటే పోక చెట్లు దారిపొడుగునా ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన మొగలి పొదలు చాలా కన్పడ్డాయి. అయితే ఈ పొదలు కొబ్బరి చెట్లంత పొడవున్నాయి. పెద్ద పెద్ద ఆకుల్తో పొడవుగా ఎదిగిన ఈ చెట్ల నుండి మొగలి పొత్తుల్ని ఎలా కొస్తారా అని తెగ ఆశ్చర్యపోయాన్నేను. కొబ్బరి, పోక, మొగలి ముప్పేటలా అల్లుకున్న ఆ తోటల్లోంచి మా కారు చాలా వేగంగా దూసుకెళ్ళసాగింది. అపుడపుడూ సముద్రం కూడా దర్శనమిస్తోంది. అకాశం రంగులో నీళ్ళు. స్వచ్ఛంగా వున్నాయి.
మంగ్రూన్ చెట్లు

ఓ నలభై నిముషాలు ప్రయాణం చేసాక సూర్యాస్తమయ ప్రదేశం వచ్చింది. ఎదురుగా నీలిరంగు సముద్రం. సముద్రానికి అటువేపు చిన్న దీవి. ఆ చిన్న దీవిలో ఎత్త్తైన కొండవెనక్కి సూర్యుడు జారిపోతున్న అద్భుతదృశ్యం కంటపడింది. టైమ్‌ చూస్తే నాలుగున్నరే అయ్యింది. మరి కాసేపట్లో చీకట్లు అలుముకున్నాయి. ఐదింటికల్లా చీకటిపోయింది. అప్పటి వరకు నీలాకాశం రంగులో కనబడిన సముద్రం నల్లటి దుప్పటి కప్పుకుని పడకేసీనట్లనిపించింది. సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గర అటవీశాఖవారి అందమైన అతిధి గృహం వుంది. బయట లాన్‌లో కూర్చుంటే నల్లటి దుప్పట్లో దూరిన సముద్రం గురకలు పెట్టినట్టుగా చిరు కెరటాలు తీరాన్ని తాకుతూ విరుగుతున్న సవ్వడి విన్పిస్తుంది. వేడిగా ఓ టీ తాగేసి మేము తిరుగు ప్రయాణమయ్యా౦. చీకటి దట్టమైపోయింది. కొబ్బరి చెట్లు, పోక, మొగలి పొదలు ఏకమైపోయాయి. చల్లటి సముద్రగాలిని ఆస్వాదిస్తూ ఓ గంట తర్వాత మా గెస్ట్‌ హవుస్‌కి వచ్చేం.

మేము బస చేసిన గెస్ట్‌ఔస్‌ సముద్రానికి ఆనుకుని వుంది. మేమున్న రూమ్‌ పేరు నికోబార్‌. పెద్ద పెద్ద చెట్లతో గెస్ట్‌హౌస్‌ చాలా బావుంది. మేము రూమ్‌లో కెళ్ళగా ఓ కుర్రాడొచ్చి తలుపు తట్టాడు. 

”నమస్కారం సార్‌” అంటూ పలకరించాడు. 
తెలుగోడివా అంటే ”మాది విజయనగరం. ఇక్కడ క్యాంటీన్‌లో వంట చేస్తా. ఏమేం స్పెషల్స్‌ కావాలో చెప్పండి.” అన్నాడు. 
మాకు బోలెడంత సంతోషం వేసింది. అతని పేరు మల్లిఖార్జున్‌. మేమున్నన్ని రోజులు మంచి భోజనం పెట్టాడు. చేపలు, పీతలు, నాటుకోడి అన్నీ ఆంద్రా స్టయిల్‌లో వండి వడ్డించే వాడు కాంటీన్‌లో.

మర్నాడు హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళ్ళాలనేది మా ప్రోగ్రామ్‌. పోర్ట్‌ బ్లయర్‌ నుంచి హేవ్‌లాక్‌కి షిష్‌మీద రెండు గంటల ప్రయాణం. ఉదయం ఎనిమిందింటికి షిిప్‌ బయలురుతుందని రెడీగా వుండమని చెప్పి వెళ్ళాడు ప్రొటోకాల్‌ చూస్తున్న భండారి.

మర్నాడు ఉదయం తొందరగా బ్రేక్‌ఫాష్ట్‌ చేసేసి షిప్‌ బయలుదేరే ప్రదేశానికి వెళ్ళాం. అక్కడంతా చాలా రష్‌గా, గోలగా వుంది. వివిధ ప్రదేశాలకు బయలుదేరే షిప్‌లు అక్కడ ఆగివున్నాయ్‌. మా షిప్‌ పేరు వంగర్‌ అని, అది హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళుతుందని భండారి చెప్పి మమ్మల్ని అందులో ఎక్కించాడు. మేము లోపలి కెళుతుండగా ఓ కబురు కూడా చెప్పాడు. విఐపి లాంజ్‌లో ఖాళీలేవని, ఒక రూమ్‌ వున్నా అది శుభ్రంగా లేదని, పబ్లిక్‌తో పాటు కూర్చోవాల్సి వుంటుందని చెప్పాడు. ఏం ఫర్వాలేదు. ఇంతటి జలరాశిని వదిలి పెట్టి రూమ్‌ల్లో ఏం కూర్చుంటాంలే అని అతనితో చెప్పి మేము మాకిచ్చిన రూమ్‌లో కెళ్ళి మా బ్యాగు పెడుతుండగానే షిప్‌ బయలుదేరింది. ఇంతలో ఇంజన్‌ రూమ్‌లో వుండే అటెండెంట్‌ వచ్చి పైకి వెళదాం రండి అని మమ్మల్ని కెప్టెన్‌ కేబిన్‌ల్లోకి తీసుకెళ్ళాడు. కనుచూపు మేరంతా నీలం రంగులో పరుచుకున్న బంగాళాఖాతం. 

నేను కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటే ”ఏం సార్‌ తెలుగువారా?” అనే పిలుపు వినబడింది.
”అవును. ఎలా గుర్తు పట్టారు.”అన్నాం.
”తెలిసిపోతుంది సార్‌. మాది వైజాగు. నా పేరు స్వామినాథం నేను ఈ షిప్‌ కెప్టెన్‌ని” అంటూ పరిచయం చేసుకున్నాడు.
‘ఆహా! బావుందండి. చూస్తుంటే అండమాన్‌లో ఆంధ్రవాళ్ళు బాగానే వున్నట్టున్నారు.
”అవును. చాలామంది వున్నారు. వైజాగు నించి షిప్‌లో వస్తుంటారు.” అంటూ ఆయన కబుర్లలోకి దిగారు.
మా కోసం కుర్చీలు తెప్పించి వేయించారు. 
నేను కన్నార్పకుండా ఆ మహాసాగరాన్ని చూస్తున్నాను. మా షిప్‌ చాలా వేగంగా వెళుతోంది. మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఎదురౌతున్నాయి. దట్టమైన అడవులు కన్పిస్తున్నాయి. నీలపు నీళ్ళు అంచుల వెంబడి విస్తరించిన ముదురాకుపచ్చ అడవుల సౌందర్యం చూసి తీరాల్సి౦దే. నేను చాలా బీచ్‌లు చూసాను గాని కెరటాలను తాకుతూ వుండే అడవుల్ని ఎక్కడా చూడలేదు. ఒడ్డుకు చాలా దూరంగా కొబ్బరి తోటలు చూసాను కానీ ఇలాంటి అడవుల్ని చూళ్ళేదు. నీళ్ళల్లో మునిగి వుండే మంగ్రవ్స్‌ మొక్కల్ని కూడా నేను అక్కడే చూసాను.

మా ‘వంగర్‌’ సాగర జలాలను చీల్చుకుంటూ హేవలాక్‌ ద్వీపం వైపు వెళుతోంది. వేడి వేడి కాఫీ వచ్చింది. సముద్రపు గాలి చల్లగా వొంటిని తాకుతుంటే, వెచ్చటి కాఫీ తాగడం ఎంత బాగుందో. ఆంధ్ర కెప్టెన్‌ మాకు బోలెడన్ని మర్యాదలు చేసాడు. షిప్‌ అంతా తిప్పిచూపించాడు. ఇంజన్‌ రూమ్‌లోకి తీసుకెళ్లగానే ఆ వేడికి నా శరీరం కాలిపోతుందేవె అన్పించింది. ఆ శబ్దానికి చెవులు చిల్లులడిపోతాయని భయమేసింది. అంత వేడిగా, అంత భయంకరమైన చప్పుడుగా వుందక్కడ. చెవులకి రక్షణగా కప్స్‌ తగిలించుకున్నాగాని ఆ హోరు వినబడుతూనే వుంది. అలాంటి స్థితిలో కూడా పని చెయ్యక తప్పని మనుష్యులున్నారక్కడ. మేము కొంచెం సేపు అటు ఇటు తిరిగి పైకి వచ్చేసాం.
రాధనగర్ బీచ్
ఇంకో పది నిముషాల్లో హేవలాక్‌ ఐలాండ్‌లో వంగర్‌ ఆగింది.
‘సాయంత్రం మా షిప్‌లోనే రండి’ అంటూ మా కెప్టెన్‌ ఆహ్వానించాడు.
మేము వసతి దొరికితే రాత్రిని హేవలాక్‌లోనే గడుపుదామనుకున్నాం.
‘మేము సాయంత్రం బయలుదేరితే వంగర్‌లోనే వస్తామని’ చెప్పి షిప్‌దిగి బయటకొచ్చాం.
అక్కడంతా హడావుడిగా, రద్దీగా వుంది. షిప్‌లోంచి దిగిన యాత్రికులు, కారు హారన్‌ వెతలు గందరగోళంగా వుంది. కొంచెం దూరంలో మా పేర్లు రాసిన ప్లేకార్డు పట్టుకుని ఓ కుర్రాడు నిలబడ్డాడు. మేము అతని దగ్గరకెళ్ళాం.
‘ఆయియె మే౦ సాబ్‌’ అంటూ మమ్మల్ని ఆహ్వానించి కారు దగ్గరకు తీసుకెళ్ళాడు. అతని పేరు జెయిమ్‌. కారు అతనిదే. చక్కటి హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. మేము కారులో కూర్చోగానే ప్రోగ్రామ్‌ ఏంటని అడిగాడు. గెస్ట్‌హౌస్‌కి వెళదామంటే, రూమ్‌లు దొరకడం కష్టమని, ప్రెసిడెంటు పర్యటన సందర్భంగా ఎవరికీ రూమ్‌లివ్వడం లేదని అన్ని గెష్ట్‌ హౌస్‌లు రిపేర్‌ చేస్తున్నారని చెప్పాడు జెయిమ్‌ . ప్రయత్నం చేద్దాం పద అంటే సరే అని బయలుదేరాడు. హేవలాక్‌ ద్వీపం చుట్టూ సముద్రం. ద్వీపం లోపల దట్టమైన అడవిలాగా పెరిగిన కొబ్బరి, పోకచెట్లు.
ఎంత పచ్చగా వుందంటే - ఆ పచ్చదనానికి గుండెలయ తప్పుతుంది. ఆ ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయం కల్గుతుంది. నేను ఆ చెట్లల్లో, పుట్టల్లో పడి పారవశ్యంలో మునిగిన వేళ మా కారు అంతకన్నా అద్భుతమైన ప్రదేశంలో ఆగింది. నీలి సముద్రం ఒడిలో కెరటాల లాలిపాటలో ఒదిగివున్న డాల్ఫిన్స్‌ గెష్టహౌస్‌కి మమ్మల్ని తెచ్చాడు. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా ఎండలో మిల మిల మెరిసిపోతున్న సాగరం. అబ్బ! ఈ గెస్ట్‌హౌస్‌లో ఒక్కరోజున్నా చాలు కదా! ఇంత సౌందర్యం, ఇంత నిశ్శబ్దం, కెరటాల చప్పుడు తప్ప మరేమీ వినబడని ఈ నిరామయ ప్రదేశం. నేను వెంటనే ఆ ప్రాంతంతో ప్రేమలో పడిపోయాను. నేనలా తన్మయంలో మునిగివుండగానే జెయమ్‌ రూమ్‌లివ్వరట. గెష్టహౌస్‌ మూసేసారట అని చెప్పాడు. నాకు చాలా కోపమొచ్చింది. ఎప్పుడో వారం తర్వాత వచ్చే ప్రెసిడెంట్‌ కోసం ఇప్పట్నించే పర్యాటకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏం భావ్యం? ఇంత అందమైన ప్రాంతం వారం రోజులు బోసిపోవాల్సిందేనా? జనాలను చుట్టూ పక్కలక్కుడా రానీయడం లేదట. రూమ్‌కోసం చాలా ప్రయత్నాలు చేసి చేసేదేంలేక కనీసం ఇక్కడి సముద్రాన్నయినా తాకుదాం. ఇంత స్వచ్ఛంగా మెరిసిపోతున్న జలాలను తాకకుండా ఎలా అనుకుంటూ నీళ్ళలోకి దిగి కెరటాలతో కాసేపు ఆడి, అక్కడి నుండి అయిష్టంగా బయలుదేరాం. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెల్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న నీలి రంగు నీళ్ళు. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, కళ్ళనీళ్ళొచ్చాయి అలా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఆ బీచ్‌లోనే నాకో పెద్ద శంఖం దొరికింది. దాన్ని తాకినపుడల్లా నాకు డాల్ఫిన్స్‌ బీచ్‌ కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
మధ్యాహ్నం అవుతోంది. లంచ్‌కోసం మంచి హోటల్‌కి తీసుకెళ్ళమని జెయిమ్‌కు చెప్పాం. దట్టంగా అల్లుకున్న పొదలు, చెట్లు, పక్షుల కిలకిలా రావాల సంగీతం వినబడుతున్న చక్కటి పొదరిల్లులాంటి హోటల్‌కి తీసుకెళ్ళాడు.
అక్కడికి సమీపంలోనే సముద్రం. పక్షుల పాటల్తో పోటీ పడుతూ కెరటాల హోరు వినబడుతోంది. అంత హాయైన ప్రదేశంలో ఆకలేం వేస్తుంది? అయినా వాళ్ళు పెట్టిందేదో తిని మళ్ళీ మా వాహనంలో కొచ్చి పడ్డాం.

”జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?”
’కోరల్స్‌ చూడ్డానికి ఎలిఫెంటా బీచ్‌ కెళుతున్నాం’అన్నాడు. ”జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?”
”కోరల్స్‌ ఎక్కడున్నాయ్‌? సముద్రం లోపలికెళ్ళాలి. ”హేవ్‌లాక్‌నుంచి ఓ గంట ప్రయాణ౦. పడవలో ఎలిఫెంటా బీచ్‌కెళ్ళాలి.” ఈ మహా సముద్రంలో పడవ మీదా?” ‘అవును . పడవలోనే వెళ్ళాలి. సముద్రంలోపలి కెళితే గాని కోరల్స్‌ కనబడవు.”అంటుండగానే ఉదయం మేము షిప్‌ దిగిన ప్రాంతానికి వచ్చాం. ఇక్కడినుంచే పడవ మాట్లాడుకోవాలి’అన్నాడు జెయిమ్‌. మేము కారుదిగి నిలబడగానే ఓ కుర్రాడు మా దగ్గరకు వచ్చాడు.’ఇతను సురేష్‌. పడవ ఇతనిదే. మిమ్మల్ని ఎలిఫెంటా బీచ్‌కి తీసుకెళ్ళి, కోరల్స్‌ చూపిస్తాడు. ”చెప్పాడు జెయిమ్‌. రానూ పోనూ మాట్లాడుకొని మేము అతను తెచ్చిన గటిపడవ ఎక్కాం. పడవ ఎంతో అందంగా వుంది. పసుపు. ఎరుపు రంగు గడుతో ఆకర్షణీయంగా వున్న మర పడవ. జెయిమ్‌ కూడా మాతో పాటే పడవెక్కాడు. మోటార్‌ ఆన్‌ చేయగానే పడవ సముద్ర గర్భంవేపు దూసుకెళ్ళసాగింది.

మేము కూర్చున్న ఎడమ చేతివేపు సముద్రతీరం వెంబడి దట్టమైన అడవి. నీళ్ళల్లోకి చొచ్చుకొచ్చిన మంగ్రస్‌ చెట్లు. ఎగిసిపడుతున్న కెరటాల మీద ఎగిరెగిరి పడుతున్న పడవ. ఇటీవల ప్రళయకావేరిలో పడవ ప్రయాణం గుర్తొచ్చింది. ఈ సముద్ర కెరటాలు మరింత ఎత్తుగా రావడంతో పడవలోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి. సముద్ర మధ్యంలోకి ఇంత చిన్న పడవలో ప్రయాణం చేయడం సాహసమే. పడవ ఎగిరినపుడల్లా గుండె ఝుల్లుమంటోంది. చుట్టూ అల్లుకున్న ఈ అనంత జలరాశి, నీలపు రంగుతో అందమైన డిజైన్లు, నడినెత్తిమీదున్న సూర్యుడి కిరణాలకి మిల మిల మెరిసిపోతున్న నీళ్లు. ఎగిరెగిరి పడుతున్న మా గటి పడవ. ప్రకృతి సౌందర్యాన్ని, బీభత్సాన్ని, గగుర్పాటుని, సాహసాన్ని ఒకేసారి అనుభవించడం అంటే ఏమిటో అవగతమైన క్షణాలవి. మా పడవ వూగుత, వయ్యరాలు పోత ఎలిఫెంటా బీచ్‌కి చేరింది. బీచ్‌ని ఆనుకుని అడవి. ఈ అడవిలోంచి ఏనుగులతో కట్టెల్ని మోయిస్తారట. లోపల్నించి ఏనుగులు మోసుకొచ్చిన పెద్ద పెద్ద మానుల్ని పడవలమీద ఎగుమతి చేస్తారట. ఒకప్పుడు చాలా ఏనుగులుండేవట. మాకయితే ఒక్కటీ కనబడలేదు. బహుశ అడవి లోపల ఉండొచ్చు.

పడవని కట్టేసి సురేష్‌ వచ్చాడు. అతని చేతిలో ఆక్సిజన్‌ మాస్క్‌ వుంది. ”ఇదెందుకు సురేష్‌ అంటే సముద్రం లోకి వెళ్ళాలి కదా! అన్నాడు. కోరల్స్‌ ఎక్కడున్నాయి? అంటే అక్కడ అంటూ కడలి వేపు చూపించాడు. అమ్మో! అంత లోపలికా అంటే ‘ఫర్వాలేదు నేనున్నాను కదా! భయపడకుండా నా చెయ్యి పట్టుకుని వచ్చేయండి అన్నాడు. ‘మళ్ళీ తనే మీరు చీరతో లోపలికి రాలేరు. అదిగో అక్కడ డ్రస్‌లు అద్దెకిస్తారు. వెళ్ళి మార్చుకురండి అన్నాడు. నా సహచరుడు హాయిగా నిక్కరేసేసుకుని కెరటాల మీద ఈత కొడుతున్నాడు. నేను బట్టలు అద్దెకిచ్చే చిన్న పాక దగ్గరికెళ్ళి ఓ నిక్కరు, టీ షర్ట్‌ తీసుకుని వేసుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలా మందే వున్నారక్కడ. ఎవ్వరికీ వొంటిమీద ఏం వేసుకున్నామన్న స్పృహే లేదు. నీళ్ళతో ఆడుతూ, ఇసుకలో దొర్లుతూ, సముద్ర గర్భంలోకి వెళుతూ అందరూ మహానందనంలో మునిగివున్నారు. కెరటాలతో సయ్యాటకి చీరెంత అడ్డో నేను వేరే డ్రస్సులోకి మారాక అర్ధమైంది. ఇంక లోపలికి వెళదామా అంటూ సురేష్‌ వచ్చాడు. నువ్వు ముందువెళ్ళు అన్నాడు రావ్‌. నా తలకి ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించాడు. నీళ్ళల్లో మునిగి ప్రాక్టీస్‌ చెయ్యమన్నాడు. మొదటిసారి మునగ్గానే నోట్లోకి ఉప్పునీళ్ళు వెళ్ళిపోయి ఉక్కిరిబిక్కిరైపోయాను. అలా నాలుగైదు సార్లు ప్రాక్టీస్‌ చేసాక కాస్త అలవాటయింది.
‘సరే వెళదాం పద’అన్నాను. సురేష్‌ చేయి అందించాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంతకు ముందెప్పుడూ చూడని, కలలో సైతం ఊహించని ఓ అద్భుత ప్రపంచం లోకి చేపపిల్లలా ఈదుకుంటూ వెళ్ళిపోయాను. ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోను నోరు తెరవకుండా మొదటిసారి నీళ్ళల్లోకి మునిగి కళ్ళముందు కనబడిన అపూర్వదృశ్యానికి అబ్బురపడి ‘వావ్‌’ అంటూ నోరు తెరవడంతో నోట్లోకి నీళ్ళు పోయి ఉక్కిరి బిక్కిరై పైకి వచ్చేసాను. సురేష్‌ హెచ్చరికని పాటించి మళ్ళీ నీళ్ళ అడుగుకి వెళ్ళాను. అబ్బ! బతికివున్న రంగు రంగుల కోరల్స్‌. రకరకాల చేపలు. సదుల్లా కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. గుత్తులు గుత్తులుగా, రంగు రంగుల పూల గుత్తుల్లా జీవంతో తొణికిసలాడుతున్న కోరల్స్‌. సురేష్‌ చేతిని గట్టిగా పట్టుకుని అతని వెంబడి అలా అలా నీళ్ళమీద నడుస్తూ, సాగర సంపదని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోయాను. ఇలాంటి దృశ్యాలను డిస్కరరీ ఛానల్‌లో చూస్తూ పరవశించడమే ఇంతకాలం తెలుసు. ఇపుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నానే, తాకగలుగు తున్నానే అనే ఆనందం అణువణువు లోను నిండి పోయింది. అతను నన్ను సాగర గర్భంలోకి, కోరల్స్‌ కమనీయదృశ్యాల్లోకి ఎంతసేపలా లాక్కెళ్ళి పోయాడో గాని గాలి పీల్చుకోవడం కోసం నీళ్ళపైకి రాగానే తీరం చాలా దూరంగా కనబడింది. రావ్‌ చాలా దూరంలో కనబడతున్నాడు. ఇంత లోపలికికొచ్చేసామా అంటూ ఆశ్చర్యపడుతూ, మళ్ళొకసారి నీళ్ళల్లో మునిగి సూర్యకాంతితో సమానంగా మెరుస్తున్న కోరల్స్‌ని తనవితీరా చూసి ఓ చిన్న ముక్కని పీకడానికి ప్రయత్నించాను కానీ రాలేదు. సురేష్‌ అవలీలగా ఓ చిన్న కోరల్‌ని పీకాడు. దాన్ని వెసుకుంటూ నీళ్ళ మీది కొచ్చేం. మెల్లగా ఈదుకుంటూ తీరం చేరాం. ఎలా వుంది అని రావ్‌ అడిగాడు.
అద్భుతం, అపూర్వం అన్నాను. తర్వాత రావ్‌ని తీసుకుని, సురేష్‌ వెళ్ళాడు. నేను ఆ అద్భుతానందాన్ని గుండెల్లోకి ఒంపుకుంటూ కెరటాలతో ఆటాడుతూ నిలబడ్డాను. అక్కడ తీరం వెంబడి రకరకాల ఆకారాలతో చనిపోయిన కోరల్స్‌ వెదజల్లి నట్టున్నాయి. బోలెడన్ని కోరల్స్‌ ఏరాను. వాటన్నింటినీ బాగులో వేసుకున్నాను. రావ్‌ కూడా తిరిగొచ్చాక, మా పడవలో హేవలాక్‌ బయలుదేరాం. ఆ రోజు పౌర్ణమి. సముద్రం మంచి పోటు మీదుంది. కెరటాలు మరింత ఎత్తుకి లేస్తూ పడవని ఢీ కొడుతున్నాయి. నీళ్ళు ఎగిరొచ్చి మమ్మల్ని తడుపుతున్నాయి. హఠాత్తుగా పడవ బోల్తా పడితే? ఏముంది పోయి ఆ కోరల్స్‌ మీదేగా పడతాం. 
‘ఇక్కడ పడవలెప్పుడైనా బోల్తాకొట్టాయా? సురేష్‌ని అడిగాం. 
ఊహూ..డరనా నహీ ..కుచ్‌ నైహోగా అన్నాడు”. 
హమ్‌ నహీడరరే. ఊరికే అడుగుతున్నాం” అన్నాను నేను.

జెయిమ్‌ అందుకుని ”కోరల్స్‌ బావున్నాయా? మీకు నచ్చిందా?” అన్నాడు. 
నేను సమాధానం చెప్పేలోగానే సురేష్‌ ‘మేడమ్‌! మీకు బతికిన కోరల్‌ ఇచ్చాను కదా! అది ఎవ్వరికీ చూపించొద్దు.” అన్నాడు. 
”ఏమౌతుంది చూపిస్తే..” 
”బతికిన కోరల్స్‌్‌ సముద్రంలోంచి తియ్యడం నేరం. పోలీసులు పట్టు కుంటారు”.
”అరే! వాటిని తియ్యకూడదా?మాకు తెలియదు కదా! ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు!” 
”ఫర్వాలేదు. ఏమీకాదు. మీరు ఉప్పునీళ్ళల్లో దాన్ని వేయండి. అది బతుకుతుంది.”అన్నాడు. 

మేమిలా మాటల్లో వుండగానే మా పడవ హేవలాక్‌ తీరం చేరింది. జెయిమ్‌ వెళ్ళి కారు తెచ్చాడు. మేము పడవ దిగి కారులో ఎక్కగానే ”మనమిప్పుడు రాధానగర్‌ బీచ్‌ కెళుతున్నాం” అన్నాడు.

బాగా ఆకలిగా వుంది. ఏమైనా తిందామంటే అక్కడ బీచ్‌లో హొటల్స్‌ వుంటాయని అక్కడ తినొచ్చని చెప్పాడు. ‘అయితే నేను కొబ్బరి బొండాం తాగుతాను! అంటే బొండాలమ్మే బండి దగ్గర ఆపాడు. మన ప్రాంతపు బొండాం కన్నా రెండింతలు పెద్దగా వుంది. లీటర్‌ నీళ్ళుపైనే వున్నాయి. తియ్యగా, చల్లగా చాలా బావున్నాయి కొబ్బరినీళ్ళు. ఓ పెద్ద అడవి, కొండ దాటి రాధానగర్‌ చేరాం. 

మేము అక్కడ హొటల్‌లో తింటున్నపుడు ‘హాయ్‌! అంటూ ఓ విదేశీయుడు పలకరించాడు. అతను ఎలిఫెంటా బీచ్‌ దగ్గర కన్పించాడు. చేతిలో కర్రతో ఇంకొకతనితో కలిసి అడవిలోంచి, కొండదిగి మాకంటే ముందే వచ్చేసాడు. ‘u came before us.how can it be possible?అంటే yah.everything is possible with this’ అంటూ తన కర్ర చూపించాడు. అతను ఫ్రాన్స్‌నించి వచ్చాడట. పెయింటింగు పని చేస్తాడట. సంవత్సరమంతా పనిచేసి డబ్బు కూడబెట్టి నెలరోజులు ఇలా దేశాలు తిరుగుతాడట.’ఆహా! అన్పించింది నాకు.
టిఫిన్‌ తినడం అయ్యాక బీచ్‌లోకి వెళ్ళాం చాలా అందమైన బీచ్‌. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెలు. స్వచ్ఛంగా , తేటగా వున్న నీళ్ళు, నీళ్ళనానుకుని అడవి. ఎక్కడా ఒక్క ప్లాస్టిక్‌ కవర్‌గాని, చెత్తా చెదారంగాని కనబడలేదు. శుభ్రంగా చీపురుతో ఊడ్చినంత నీట్‌గా వుంది బీచ్‌. కళ్లముందు కనబడుతున్న వివిధ రంగులు, బంగారం రంగు ఇసుక, ఆ ఇసుకను తాకుతూ తెల్లటి మల్లెపువ్వు ల్లాంటి కెరటాలు, ఆ కెరటాలను తరుముతున్న నీలం రంగు నీళ్ళు, కొంచెం కన్నుసారిస్తే ఆకుపచ్చటి అడవి. నేనలా మంత్రముగ్ధనై, ప్రకృతి సోయగానికి పరవశమై కళ్ళల్లో నీళ్లు బుకుతుంటే రెప్పవేయకుండా చస్తుండి పోయను. విస్తారమైన ఆ బీచ్‌ కెరటాల సంగీతం తప్ప మహా నిశ్శబ్ధంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాల్సిందే.
ఈ నిశ్శబ్దాన్ని ప్రేమించటానికి, మనలో పేరుకు పోయిన శబ్ద కాలుష్యాన్ని కడుక్కోడానికైనా రాధానగర్‌ బీచ్‌ కెళ్ళాలి. మేమలా చిత్తరువుల్లా కూర్చుని వున్నపుడు జెయిమ్‌ వచ్చాడు. మేము మెల్లగా లేచి మా కారువేపు నడవసాగాం. నేను బోలెడన్ని డెడ్‌ కోరల్స్‌ ఏరుకున్నాను. రకరకాల డిజైన్లవి. మాకు గెష్టహౌస్‌ దొరకలేదు కాబట్టి పోర్ట్‌ బ్లేయర్‌కి తిరిగి వెళ్ళాలి.
మా కారు షిప్‌ ఎక్కాల్సిన యార్డ్‌ వేపు వెళుతోంది. జెయిమ్‌ ఆ ద్వీపం గురించి ముచ్చట్లు చెబుతున్నాడు. అక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారని, పని లేకపోవడమంటూ వుండదని చెబుతూ, కొబ్బరికాయలు తీయడం, ఏరడం, పోకకాయలు తెంపడం,
వాటిని సేకరించడంలాంటి పనులు సంవత్సరమంతా వుంటాయట. టూరిష్ట్‌లకు సంబంధించి కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మా హేవలాక్‌లో ఎవ్వరూ పేదవాళ్ళు లేరు అంటూ చాలా గర్వంగా చెప్పాడు. పోకచెట్టు మీద ఎగబాకుతున్న మనిషి, ఓ చెట్టునుండి ఇంకో చెట్టుకు దూకుతూ కంటబడ్డాడు. సన్నగా, రివటలాగా వుండే పోక చెట్టు చాలా సులువుగా ఒంగుతుంది. ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకు చాకచక్యంగా దూకుతుంటారు. మేము కారు దిగి కొన్ని పోకకాయలు ఏరి తెచ్చుకున్నాం. మేము షిప్‌ ఎక్కే ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఐదుగంటలైంది. వండూర్‌ రెడీగా వుంది. స్వామినాధం మా కోసమే ఎదురు చూస్తున్నాడు. జెయిమ్‌కి డబ్బు చెల్లించేసి అతనికి గుడ్‌బై చెప్పాం. షిిప్‌ ఎక్కడానికి నిలబడినవారిని, ఆ ద్వీపానికి చెందినవారిని గమనిస్తుంటే అందరి నోళ్ళు ఒకే లయలో కదలడం చూసి జెయిమ్‌ని అడిగాం ఏం తింటున్నారు అందరూ అని. ‘గుట్కా’, పాన్‌పరాగు అన్నాడు నవ్వుతూ. హేవలాక్‌లో ప్రతి వొక్కర గుట్కా తింటారని. గుట్కా వ్యాపారం చేసి లక్షలు సంపాదిస్తారని కూడా చెప్పాడు.
మేం షిప్‌లోకి ఎక్కగానే అది బయలుదేరింది. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కు సింధరం రంగులోకి మారింది. అప్పటివరకు నీలి ఆకాశంతో పోటీ పడిన సాగర జలాలు క్రమంగా నలుపు రంగుకి మారుతున్నాయి. షిప్‌ వేగంగా వెళుతోంది. చల్లటిగాలి హాయిగా తాకుతోంది. అపుడే ఓ అద్భుతాన్ని చూసాన్నేను. పడమటి ఆకాశంలో అస్తమించే సూర్యుడు అచ్చం చంద్రుడిలాగానే వున్నాడు. తూర్పు దిక్కుకు చూద్దునుకదా వెండివెన్నెలలు వెదజల్లుతూ పౌర్ణమి చంద్రుడు.రెండు బింబాలు ఒకేలా వున్న అపూర్వ దృశ్యమది. క్రమంగా సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. చుట్టూ దీపాలులేని అఖండజలరాశి.సముద్ర మధ్యంలో మా షిప్‌. నీళ్ళల్లోకి మిల మిల మెరుస్తూ కురుస్తున్న వెన్నెల. నేను నిశ్శబ్దంగా ఒక మూలకి కూర్చుండిపోయి, ప్రకృతిలో లీనమైపోయను. రావ్‌ హైదరాబాద్‌నుంచి వచ్చిన ఒక పోలీసాఫీసర్‌తో కబుర్లలో పడ్డాడు. నేను మాత్రం మాట పలుకు లేకుండా బంగాళాఖాతం మీద మనోహరంగా కురుస్తున్న వెన్నెల్లో తడుస్తూ, తన్మయమౌత తరించిపోయాను. నా ఆనందాన్ని నా ఆత్మీయ నేస్తాలతో పంచుకున్నాను. సముద్రం మధ్యలో సెల్‌ఫోన్‌లు పనిచేయడం ఆశ్చర్యమే. నా కళ్ళతో నేను అనుభవించిన ఆనందాన్ని నా మిత్రుల చెవుల్లో విన్పించడానికి సెల్‌ఫోన్‌ భలే ఉపయోగపడింది. సంతోషం ఇతరులతో పంచుకోవడానికే అని గాఢంగా నమ్ముతాను. వెన్నెల్లో గోదారిని చూసాను గాని వెన్నెల్లో సముద్రం అందాన్ని ఇప్పుడే చూస్తున్నాను.క్రమంగా దీపాలు కనబడసాగాయి. దూరంగా పోర్ట్‌బ్లేయర్‌ ఐలాండ్‌ కనబడుతోంది. దీపాలు దగ్గరయ్యే కొద్దీ వెన్నెల వెలుగులు మసక బారసాగాయి. మా వెంట తెచ్చుకున్న అరిశెలు, మురుకులు స్వామినాధానికిచ్చేసాం. అతను చాలా సంతోషపడిపోయాడు. మాకిచ్చిన ఆతిధ్యానికి ధన్యవాదాలు చెప్పి మేము ‘వండూర్‌” దిగేసాం.

మర్నాడు మా ప్రోగ్రామ్‌ జైలు లోపలి కెళ్ళి చూడ్డం. రోస్‌ ఐలాండ్‌, పీక్‌ పాయింట్‌ (ఎతైన ప్రదేశం) చూడ్డం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌్‌ చేసి సెల్యూ లర్‌ జైలుకి వెళ్ళాం. మొదటి రోజు రాత్రిపూట సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో చూసిన జైలు. ఏడు పొడవాటి గోడల్లాగా ఒక వైపు మాత్రమే సెల్‌ తలుపు లుండేలా చాలా ప్లాన్డ్‌గా కట్టిన కరకు నమూనా. ఖైదీలు ఒకరి ముఖాలొకరికి కనబడవు. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేసింది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. ఒకేసారి ముగ్గురిని ఉరితీసే గది, వాసానికి వేలాడుతున్న ఉరితాళ్ళు. వీరసావర్కార్‌ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు వుండేదని, ఈ జైలులో జరిగిన అకృత్యాలను మౌనసాక్షి అదేనని గైడ్‌ చెప్పాడు. సునామీకి ఆ చెట్టు కూలిపోయి, దాని స్థానంలో ఓ పిల్లచెట్టు మొలిచింది. చాలా సేపు ఆ చెట్టు ముందు నిలబడ్డాను. నాతో ఏదో చెప్పాలన్నట్లు ఆకులు గలగల లాడాయి. గుస గుసగా ఏదో చెప్ప ప్రయత్నించాయి.

మనసంతా భారమైపోయింది. అదే మూడ్‌తో సునామీకి బాగా దెబ్బతిన్న రాస్‌ఐలాండ్‌ చూడ్డానికి వెళ్ళాం. పోర్ట్‌ బ్లెయిర్‌కి కన్పిస్తూ వుంటుంది ఈ చిన్న ద్వీపం. అక్కడ బ్రిటిష్‌ వాళ్ళ ప్రాభవ చిహ్నాలు చాలా వున్నాయి. క్లబ్‌లు, చర్చి, వాళ్ళ క్వార్టర్స్‌, టెన్నిస్‌ కోర్టుల్లాంటివన్నీ ప్రస్తుతం కూలిపోయి, ఆ శిధిలాల్లోంచి చెట్టు మొలుచుకొచ్చాయి. ఆ చెట్లు భవనాల ఆకారంలో గమ్మత్తుగా వున్నాయి. సునామీ తీవ్రంగా తాకిన ద్వీపమిది.

అక్కడ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ వుంది. అందులో సునామీ కెరటాల్లో తన కళ్ళ ముందే తన భార్య ఎలా కొట్టుకుపోయిందో ఓ భర్త రాసిన ఉత్తరం వుంది. అన్నింటి కన్నా నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అక్కడి నుండి స్ఫష్టంగా కనబడే సెల్యూలర్‌ జైలు, సెంట్రల్‌ టవర్‌. జైలరు, అధికారులు ఇక్కడి నుండి కూడా జైలును కంట్రోలు చేసేవారని అర్ధమైంది. ప్రస్తుతం ఇక్కడ జనమెవ్వరూ నివసించడంలేదు. టూరిష్ట్‌లు మాత్రమే తిరుగుతున్నారు.
అక్కడి నుండి పోర్ట్‌బ్లెయిర్‌ మొత్తం కనబడే ‘పీక్‌ పాయింట్‌’ కి వెళ్ళాం. చిక్కటి అడవిలోంచి కొండెక్కడం, ఆ కొండమీంచి సముద్రం, చిన్నా చితకా ఐలాండ్స్‌ కనబడ్డాయి. పోర్ట్‌బ్లెయిర్‌ చుట్టూ వుండే సముద్రం కన్పడింది. అడవిలోంచి ఏవో జంతువుల అరుపులు, పక్షుల కిలకిలలు కింద సముద్ర కెరటాలు. చాలా అందమైన ప్రదేశం. మేం తిరుగు ప్రయాణంలో కొండ దిగుతుంటే”తెలుగు ప్రాధమికోన్నత పాఠశాల” పేరుతో తెలుగులో రాసి వున్న బోర్డ్‌ కన్పడింది. భండారిని అడిగితే ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారని చెప్పాడు.

మర్నాడు మ్యూజియమ్‌ చూసాం. అండమాన్‌ చరిత్రకి అద్దం పడుతూ ఎంతో సమాచారముందక్కడ. ఇక్కడ ఈ దీవుల చరిత్ర కొంత రాయాల్సి వుంటుంది. అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ గురించి 1777 వరకు బయట ప్రపంచానికేమీ తెలియదు. 1777లో బ్రిటిష్‌ వాళ్ళు జరిపిన సర్వేలోనే ఇవి బయట పడ్డాయి. అంత వరకు ఈ ద్వీపాల్లో బయట నుంచి అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఆదిమ మానవులుగా పిలవబడే ”నెగ్రిటాస్‌” ”మంగోలాయిడ్స్‌” జాతి ఆదివాసులు శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతుండేవారు. ఇక్కడ మొదట అడుగు పెట్టింది ఇంగ్లీషు వాళ్ళే. వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం సెంటిల్‌మెంటుగా దీన్ని మార్చేసారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వేలాది దేశ భక్తుల్ని ఈ సెటిల్‌ మెంట్లలో నిర్భధించేవారు. ఆ తర్వాత సెల్యూలర్‌ జైలు కట్టారు. ఆ తర్వాత జపాన్‌ వాళ్ళు దాడి చేసి ఈ దీవుల్ని ఆక్రమించు కున్నారు.1947లో భారతదేశానికి సిద్ధించిన స్వతంత్రంతోపాటు అండమాన్‌, నికోబార్‌లు కూడా స్వతంత్రయ్యాయి.

అండమాన్స్‌కి వలస వచ్చిన వాళ్ళలో బెంగాలీయులే అధికులు. ప్రభుత్వ పాలసీ ప్రకారం, పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ‘సెట్లర్స్‌’గా వీళ్లు వచ్చారు. ఈ పునరావాస కార్యక్రమం 1949 నుండి 70 వరకు కొనసాగింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుండే ఎక్కువ మంది ఇక్కడికొచ్చారు. అలాగే ఎంతోమంది ‘ఎక్స్‌సర్వీస్‌మెన్‌’ నికోబార్‌ దీవుల్లో పునరా వాసం పొందారు. వీరిలో పంజాబీలు, మరాఠీలు, మళయాళీలు, తమిళులు, తెలుగు వాళ్ళు వున్నారు. ఇలా బ్రిటీష్‌వాళ్ళు అడుగుపెట్టి, ఈ దీవుల ఉనికిని కనుక్కుని, తన రాజకీయ అవసరాలకు వాడుకున్న తరువాత , ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులు ఇక్కడ చొరబడ్డారు. ఈ నాగరీకుల ప్రవేశంతో అప్పటివరకు స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసులు లోపల్లోపలికి కుంచించుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అండమాన్స్‌లో వున్న 572 దీవుల్లో ఆదివాసులు కొన్ని దీవుల్లో మాత్రమే వున్నారు. నికోబార్‌ ఐలాండ్స్‌లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. జరువాలు, షోమ్‌పెన్‌, గ్రేట్‌ అండమానిస్‌, ఓగ్గ్సు, సెంటీనలీస్‌ అనే ఐదు తెగలకు చెందిన ఆదిమమానవులు, నాగరీక సెట్లర్స్‌ చర్యల వల్ల ప్రమాదంలో వున్నారని ఇటీవల భారత ప్రభుత్వ ఆదివాసీ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తెగలవారిని ”కుతూహలంగా” చూసేవారే తప్ప వారి సమస్యలు వీరికి అర్ధం కావని కూడా పేర్కోనడం గమనించాలి.


నికోబార్‌ ఐలాండ్‌కి మేము వెళ్ళలేక పోయా౦ కానీ అక్కడి ఆదివాసులకు సంబంధించి అనేక చిత్రాలు మ్యూజియంలో ప్రదర్శించారు. వారి ఇళ్ళు, ఆహారపుటల వాట్లు వస్త్రధారణ ఎంతో భిన్నంగా వుంటాయి. సునామీలో వేలాదిగా నికోబార్‌లో వుండే ఆదివాసులు చనిపోయరని, కొన్ని ద్వీపాలు శాశ్వతంగా సముద్రంలో కలిసి పోయాయని రాసివుంది. నికోబార్‌ ఐలాండ్‌ వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి, రక్షణ ఏర్పాట్లు అవసరమని, ఆదివాసులు ఎవరినీ నమ్మరని, ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదమని భండారి మాకు చెప్పడంతో మేము ఆ ప్రస్తావన వదిలేసుకున్నాం.

అద్భుతానుభవాల్ని గుండెల్లో పదిల పరుచుకుని అండమాన్‌ ద్వీపానికి, గెష్ట్‌హౌస్‌ సిబ్బందికి వీడ్కొలు పలికి మేము చెన్నైె విమానం ఎక్కాం. విమానం అనంతజలరాశి మీద ఎగురుతుంటే దాని నీడ చేపలాగా నీళ్ళల్లో కనబడింది. ఎన్నో ద్వీపాలు. నీలిరంగు నీళ్ళు చుట్టుకున్న ఆకుపచ్చటి ఐలాండ్స్‌. అండమాన్‌లో గాల్లో ఎగిరి చెన్నైలో దిగేవరకు రవ్వంత భమి కనబడదు. నీళ్ళే నీళ్ళు. చెన్నైలో దిగేటప్పుడు ఓ గమ్మత్తు జరిగింది. ల్యాండ్‌ అవడానికి విమానం చాలా కిందకి దిగింది. అయితే ఎందుకనో దిగకుండా కిందే ఎగురుతూ తిన్నగా వెళ్ళసాగింది. నెల్లరు దాటి పులికాట్‌ మీదుగా వెళ్ళి వెనక్కి తిరిగింది. నాయుడుపేట, తిరుపతి రోడ్డు స్ఫష్టంగా కన్పడుతుంటే నాకు ప్రతిమ గుర్తొచ్చింది. ప్రతిమా! మీ ఊరి మీద ఎగురుతున్నానని అరిచి చెప్పాలన్పించింది. సెల్‌ఫోన్‌ వాడనిస్తే ఫోన్‌లో చెప్పేదాన్నేమో! చెన్నై చుట్టూ చక్కర్లు కొట్టి లాండ్‌ అయ్యిుంది విమానం. మేము హైదరాబాద్‌ ప్లయిట్‌ కోసం ఎదురుచస్తూ లాంజ్‌లో కూర్చున్నాం.

ఓ మహా నిశ్శబ్ధ్దంలోంచి, పచ్చటి ప్రకతిలోంచి, నీలాల సంద్రపు కౌగిలిలోంచి విడివడి మళ్ళీ జనారణ్యంలోకి అడుగు పెట్టడంతో మా అండమాన్‌ ద్వీపాలయత్ర ముగింపుకొచ్చింది. జనాభాతో కిటకిట లాడుతున్న ఈ ప్రాంతాలెక్కడ 572 ద్వీపాలకు కలిపి నివసిస్తున్న నాలుగు లక్షల మంది ఎక్కడ. అందులో బెంగాలీలు, మళయాలీలు, తెలుగు వాళ్ళు, ముస్లిమ్‌లు, క్రిష్టియన్‌లు కలిసి మెలిసి సామరస్యంగా జీవించే అండమాన్‌ ఓ అద్బుత యత్రా స్థలం.

ప్రకృతికి అతి సమీపంగా, శబ్దరాహిత్యంలో తరించాలనుకునే వాళ్ళకి చక్కటి గమ్యం. ప్రకృతి ప్రేమికులను పారవశ్యంలో ముంచేయగల మహాసంద్రం బంగాళాఖాతం అడుగడుగునా పాదాలను తాకుత మనల్ని పునీతుల్ని చేస్తుంది. పునరాగమనకాంక్షని రగిలిస్తుంది. మళ్ళెపుడు…అంటూ మనల్ని బలంగా తనవేపు లాక్కెళ్ళిపోగల మహా ఆకర్షణ అండమాన్‌.

May 20, 2008
కొండవీటి సత్యవతి

పల్లవుల శిల్పకళావైభవం... భైరవకోన

భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవుల కాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...

సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశం జిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.

వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

శివలింగాలన్నీ ఒక్కచోటే...
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఒకేచోట త్రిమూర్తులు...
ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ.మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు...
ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాల మీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళు క్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొన సాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఇలా వెళ్ళాలి...
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరుకుంటే అక్కడి నుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.
కర్టసీ : సూర్య Daily

విశిష్ట నగరం... కొల్హాపూర్‌

భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన చారిత్రక నగరం ఉత్తర మహా రాష్ట్రలోని కొల్హాపూర్‌. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణం కొల్హాపూర్‌ చెప్పులకు కూడా ప్రసిద్ధి.

చూడవలసిన ప్రదేశాలు...
కొల్హాపూర్‌లో ముఖ్యంగా చూడవలసినవి మహాలక్ష్మి దేవాలయం, మహారాజ భవనం. మహాలక్ష్మి దేవాలయం "హేమాడ్‌ పంతి" నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది.

కొల్హాపూర్‌ మహాలక్ష్మి...
గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని "అంబాబాయి" అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. 
ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. 
ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. 
గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్థులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.

కొల్హాపూర్‌ సంస్థానం...
కొల్హాపూర్‌ బ్రిటిష్‌ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక ప్రముఖ సంస్థానం. ఆ కాలంలో నాలుగు ముఖ్యమైన సంస్థానాలలో ఒకటి; మిగిలిన మూడు బరోడా, గ్వాలియర్‌ మరియు ఇండోర్‌. దీని పాలకులైన బోంస్లే రాజ్యం 19 గన్‌ సెల్యూట్‌కు అర్హులు. కొల్హాపూర్‌ను పరిపాలించిన రాజులు, తంజావూరు, సతారాలను పాలించిన భోంసాలే వంశాల వలె మరాఠా భోంసాలే రాజవంశం నుండి ఉద్భవించారని చెప్పుకుంటారు. మరాఠా సామ్రాజ్య వారసత్వ విషయమై తలెత్తిన వివాదాల వలన సతారా మరియు కొల్హాపూర్‌ రాజ్యాలు 1707లో ఏర్పడ్డాయి. మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహూ శంభాజీని మొగలులు తొమ్మిదేళ్ళ వయసులో పట్టి బంధించి ఖైదులో ఉంచారు. షాహూ శంభాజీ తండ్రి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ. శంభాజీ మరణం తర్వాత శివాజీ చిన్నకొడుకు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1700లో అనారోగ్యం వలన రాజారాం మరణించగా ఆయన భార్య మహారాణి తారాబాయి తన కొడుకు రెండవ శంభాజీని మహారాజుగా ప్రకటించి, తాను ప్రతినిధిగా పాలించింది. 1707లో మెగలులు కొన్ని షరతులతో షాహూను విడుదల చేశారు. విడుదలైన షాహూ తన వంశానుగతమైన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. ఖేడ్‌ వద్ద జరిగిన యుద్ధంలో షాహూ, తారాబాయి ఓడించి సతారాపై తన అధికారాన్ని స్థాపించాడు. ఓడిపోయిన రాణి తన కొడుకుతో కలిసి కొల్హాపూరులో స్థిరపడింది. 1710 కల్లా రెండు వేర్వేరు రాజ్యాలుగా పరిణమించాయి. దీన్ని 1731లో కుదుర్చుకున్న వార్నా సంధి ధృవీకరించింది.

నవదంపతుల విహారేకంద్రం... కొడగు

నూతన దంపతుల తొలి అడుగులకు మడుగులొత్తే సుందరమైన కొండల ప్రాంతమే కొడగు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమతీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. దీనినే బ్రిటీష్‌ వారు కూర్గ్‌ అనే పేరుతో పిలిచేవారు. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం.

మిడకెరె ప్రాంతం నంచి ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్యలో నివాసం ఏర్పరుచు కున్న ప్రజలు అగుపిస్తారు. ఇక ఏ రుతువులో నయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కొడగు ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం ఇట్టే హాయిగా గడచిపోతుంది. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయ లు , ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకు లను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొడగు ప్రాంతం లోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకు న్నాయి. కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు...

మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది. పిల్లలు, పెద్దలు, ముసలివారు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు... ఇలా ఎవరైనా సరే కొడగు సౌందర్యానికి దాసోహం అనక తప్పదు. ఇక చివరిగా... కాఫీ ప్రియులకు కూర్గ్‌ కాఫీ అమృతం కంటే రుచిగా, మధు రంగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇక్కడి కాఫీ రుచికి ఎన్ని కప్పులయినా అలా తాగుతూనే ఉండాలనిపిస్తుంటుంది. అక్కడి కాఫీ తాగి నాణ్యమైన యాలకులు నోట్లో వేసుకుంటే, గాలిలో తేలిపోతున్నట్లనిపిస్తుంది. అలాంటి సువాసనను ఆస్వాదిస్తూ, కొత్త దంపతులు తొలిరాత్రుల ఆనందాన్ని హాయిగా అనుభవించవచ్చు.

కమనీయం... కూర్గ్‌ జలపాతం

భారత స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్‌ కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ జల పాతం మడికేరి ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో అద్భుతంగా కుదిరిన కూర్గ్‌, బెంగుళూరు నగరానికి సరిగ్గా 252 కిమీల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపెై దట్టమైన అరణ్యంలో, జలజలపారే జలపాత మధుర ధ్వనులతో ప్రకృతి రమణీయతకు మరో పేరుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది కూర్గ్‌ జలపాతం.

మంచు దుప్పటిని కప్పుకున్న పర్వతం, దట్టమైన అడవి, ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ, కాఫీ, నారింజ తోటలు... కనురెప్పవాల్చనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని అనుభూతులు మిగిల్చే అద్భుత విహార కేంద్రంగా విరాజిల్లుతోంది విడిదిగా మడికేరి. అంతేకాదు ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయని చెప్పక తప్పదు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థనా మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు సాయంకాల విడిదిగా పేరుగాంచింది. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

మడికేరిలో ప్రత్యేకించి సందర్శించాల్సిన వాటిలో నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం ప్రధానమైంది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర జంతువుల్ని ఇక్కడ వీక్షించవచ్చు. అంతే కాదు పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి పూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఉండడం విశేషం. సీతా దేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టేందుకు శిక్షణనిచ్చే కేంద్ర మైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నది నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్‌, కావేరి, కనిక, సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యా టక స్థలాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి.ఇలా ప్రకృతి రమణీయతనంతా ఒకే చోట పోతపోసినట్లు ఉన్న ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారెైనా దర్శించాల్సిందే...

చేరుకునేదిలా...
రెైలు, విమాన మార్గం లేని ఈ ప్రాంతానికి కేవలం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోవాలి. అయితే దూరప్రాంత ప్రయాణీకులు బెంగుళూరు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మడికేరి చేరుకోవచ్చు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు, తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం ఉన్నది.

మంచి కాఫీలాంటి మడికేరి

భారతదేశపు స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ లేదా మడికేరి, కొడగు జిల్లా కేంద్రంగా బాసిల్లుతూ ఉన్నది. సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో ప్రభవించిన కూర్గ్, బెంగుళూరు నగరానికి 252 కి.మీ.ల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపై చిక్కటి అరణ్యాన్ని పాదుకున్న కూర్గ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవి, వేల ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు... ఊపిరి సడలనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని విరామ విడిదిగా మడికేరి అలరారుతున్నది. అంతేకాదు... ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

సూర్యాస్థమయ వీక్షణం: 
శతాబ్ద కాలానికిపైగా చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థన మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు తమ సాయంత్రాలను ఇక్కడే గడిపేవారని వినికిడి. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. మడికేరిలో ప్రత్యేకించి సందర్శించవలసినదిగా నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం పేరొందినది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర సమస్త జంతు జాలాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఏర్పాటు చేశారు. మడికేరి సమీపంలో పర్యాటకులను, సినీజనాన్ని అమితంగా ఆకర్షించే అబ్బీ జలపాతం, భాగమండల మరియు కావేరీ నదీ జన్మస్థానమైన తలకావేరీలు పర్వతాలతో ఆవృతమై నేత్రానందం కలిగిస్తున్నాయి.

రామలక్ష్మణులు సంచరించిన ప్రాంతం:
సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టుట మరియు శిక్షణా కేంద్రమైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నదీ నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక మరియు సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యాటక స్థలాలు ప్రకృతి రమణీయతకు పట్టం కడుతున్నాయి.

వసతి సౌకర్యాలు :
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడకు చేరుకోగలము. ఇక్కడకు రైలు మరియు విమాన సౌకర్యం లేదు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు మరియు తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం కలదు. సుందర పర్వత ప్రాంతమైన మడికేరిలో బస చేసేందుకు హోటళ్ళు ఉన్నాయి. కూర్గ్‌లో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుపోయి కనిపిస్తుంది. గలగల పారే సెలయేర్లు, నదులు , కొండలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక జలపాతాలంటారా మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. యూత్ ఇష్టపడే ట్రెక్కింగ్, రిఫ్టింగ్, వన్యప్రాణులు, రక రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు, కోటలు కూర్గ్‌లో కనిపిస్తాయి. ఇన్ని అందాలకు నెలవైన కూర్గ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

అందమైన హిల్ స్టేషన్ కూర్గ్: 
దక్షిణ భారతదేశంలో కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. బెంగుళూరుకు 252 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల పైగా ఎత్తులో ఉండి దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులనెందరినో ఆకట్టుకుంటోంది. కూర్గునే కొడగు అని కూడా అంటారు. నిజానికి దీనిని పూర్వం కొడైమాలనాడు అని పిలిచేవారు. ఎత్తౖన కొండమీదున్న దట్టమైన అడవులు అని దీని అర్థం. ఇది దాదాపు 3000 నుంచి 4000 అడుగుల ఎత్తు ఉంటుంది. కొడగు లేదా కూర్గ్‌కు మడికెరి హెడ్‌క్వార్టర్స్. పచ్చటి ప్రకృతి, జలపాతాలు, వన్యమృగాలు, పక్షులకు కూర్గ్ నిలయం. అంతేకాదు ఇక్కడ కాఫీ, టీ ప్లాంటేషన్లు కూడా బాగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. కొడగులో మూడు తాలుకాలున్నాయి. అవి మడికెరి, విరాజ్‌పేట్, సోమ్‌వారప్పేట్. ఈ ప్రాంతాలన్నీ పచ్చటి లోయలతో, ఎత్తౖనకొండలతో, సెలయేర్లతో కనులవిందు చేస్తాయి.

హనీమూన్ జంటలకు కనువిందు:
పొగమంచునిండిన పచ్చటి అడవుల అందాలు చెప్పనక్కర్లేదు. కూర్గ్ చరిత్ర కూడా ఎంతో విశిష్టమైంది. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజవంశీయులు పరిపాలించారు. ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పలు రాజవంశస్థులు అంటే కదంబాలు, గంగాలు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసలలు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు. కూర్గ్ హానీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది. అలాగే వేసవిలో గడపడానికి వచ్చేవారికి కూడా ఇది మంచి ప్రదేశం. ఇక సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చే కుర్రకారైతే ఈ ప్రదేశంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి జలపాతాలను జులై సెప్టెంబరు నెలల మధ్యలో చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడి మాన్‌సూన్ సీజన్ సాహసప్రియులకు ఎంతో అనుకూలమైనది. ఆ టైములో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. కూర్గ్‌కి సమీపంలో బైలకుప్పె అనే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్. ఇది మడికెరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూర్గ్‌కు 94 కిలోమీటర ్ల దూరంలో నగర్‌హోలె నేషనల్ పార్క్ ఉంది. ఇది కూడా చూడాల్సిన ప్రాంతం. ఇది అతి పెద్ద వన్యప్రాణుల పార్కు. ఇక్కడ పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్ వాచింగ్ చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.

చూడాల్సిన ప్రదేశాలెన్నో :
కూర్గ్ అందాలు వర్ణించలేనంత బాగుంటాయి. అక్కడ అడుగుపెట్టగానే భూలోకస్వర్గంలా అనిపిస్తుంది. దీన్ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. బెంగుళూరు లేదా మంగళూరు నుంచి టాక్సీలో కూర్గ్‌కి వెడితే దారిపొడుగునా ఎన్నో ప్రకృతి అందాలను చూడొచ్చు. కూర్గ్‌లో ఎక్కడ చూసినా పచ్చదనమే. పొగమంచుతో కప్పబడిన కొండలు చూస్తుంటే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు అక్కడ చిక్కటి అడవులు దర్శనమిస్తాయి. అడవిలోని రకరకాల మూలికా వృక్షాల వాసనలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఎటు చూసినా కాఫీ ప్లాంటేషన్లు కనుల విందుగా కనిపిస్తుంటాయి. అక్కడి ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో కూర్గ్‌లోని ప్రజలు కూడా అంత స్వచ్ఛమనస్కులు. అక్కడి కొడవాలు ఎంతో స్నేహంగా ఉంటారు. విందు వినోదాలంటే వారికెంతో ఇష్టం. .

కావేరీ జన్మస్థలం:
కూర్గ్‌లో చూడాల్సిన మరో ప్రాంతం తలకావేరీ. కావేరి నదికి మూలం ఇదే. 4,500 అడుగుల ఎత్తు నుంచి ఇది ప్రవహిస్తుంది. ఇది మడికెరి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం కన్నులు చెదిరేంత అందంగా ఉంటుంది. అబ్బీ ఫాల్స్ ఇంకొకటి. దీన్నే జెస్సీ ఫాల్స్ అని కూడా అంటారు.

అబ్బి అంటే స్థానిక కొడగు భాషలో జలపాతం అని అర్థం. మడికెరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కూర్గ్ హిల్‌స్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు దీన్ని చూడకుండా వెళ్లరు. ఈ జలపాతంలో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీని శబ్దం రోడ్డు మీదకు వినిపిస్తుంది. ఇంకో ప్రసిద్ధి చెందిన జలపాతం ఇరుప్పు ఫాల్స్. నాగర్‌హోల్ వెళ్లే దారిలోని విరాజ్‌పేట నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దానికి దగ్గరలోనే లక్ష్మీతీర్థ నది ప్రవహిస్తుంటుంది. ఇరుప్పు ఫాల్స్‌లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని స్థానిక ప్రజల విశ్వాసం. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి స్నానాలాచరిస్తారు.

ఓంకారేశ్వర దేవాలయం:
కూర్గ్‌లో చూడాల్సిన గుడి ఓంకారేశ్వర దేవాలయం. ఇందులో శివునికి పూజలు చేస్తారు. ఈ దేవాలయం ఇస్లామిక్, గోథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. గుడి గోపురం మీద వాతావరణాన్ని తెలిపే బంతి ఆకారంలో ఉన్న క్లాక్ నిర్మాణం ఉంటుంది.

ఇక రాజాస్ సీట్ వచ్చి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆవిష్కరిస్తుంది. ఎంతో అందమైన వ్యూ పాయింట్ ఇది. దీని నుంచి చుట్టూరా పరచుకున్న అడవులు, అందమైన సూర్యాస్తమయం చూడాలంటే రెండు కళ్లు చాలవు. కొడగు రాజులు ఇక్కడకు వచ్చి సాయంత్రాలు విశ్రాంతిగా గడిపేవారట. భాగమందాలా ఇక్కడ చూడాల్సిన మరో ప్రాంతం. దీన్ని టెంపుల్ టౌన్‌గా కూడా పేర్కొంటారు. కావేరి, కనిక, సుజ్యోతులనే మూడు నదుల కలిసిన చోట భాగమందాలా ఉంది. ఇక్కడ మడికెరి ఫోర్టును కూడా చూడొచ్చు. ఈ కోటను 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఒక మ్యూజియం, జైలు, దేవాలయం, చర్చి ఉన్నాయి. కూర్గ్‌లో వెలనూర్ అనే అందమైన హామ్లెట్ ఉంది. ఇది దుబారే అడవికి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది.

అక్కడ ఒక వైపు అడవులుంటే మరోవైపు కావేరీనది ప్రవహిస్తుంటుంది. ప్రకృతిప్రేమికులకు, ఫిషింగ్ ఇష్టపడేవారికి ఇది ఎంతో నచ్చే ప్రదేశం. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో అవందూర్ ఫాల్స్ ఉన్నాయి. ఎన్నో చిన్న ఏరులు కలిసిన జలపాతం ఇది. ఈ జలపాతం అవందూర్ అడవిలో ఉంది కాబట్టి దీనికి అవందూర్ ఫాల్స్ అని పేరొచ్చింది. కోటెబెట్టా కొడగు జిల్లాలోని మరో అతిపెద్ద శిఖరం. సముద్రమట్టానికి 5,400 అడుగుల ఎత్తులో ఇది ఉంది. కోటెబెట్టా మడపూర్‌లో ఉంది. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో మడపూర్ ఉంది. కూర్గ్‌లో ఇది ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైన ప్రదేశం. అక్టోబరు మార్చి నెలల మధ్యలో ఇక్కడ ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బైలకుప్పెతోపాటు చూడాల్సిన మరో ప్రదేశం సిద్దాపురా. బైలకుప్పెలో ఎన్నో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి.

గోల్ఫ్ కోర్సులు:
ఇక అక్కడి ల్యాండ్‌స్కేప్ అందాలైతే చూడాల్సిందే గాని చెప్పలేం. సిద్దాపురా ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు కొడవ, కన్నడ, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. ఇంకో విశేషమేమిటంటే కూర్గ్‌లో ఇండియా మొత్తంలో అధిక సంఖ్యలో గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వీటన్నింటినీ మీకు చూడాలని ఉందా... మరెందుకు ఆలస్యం సెలవుల్లో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి మరి....కూర్గ్‌కు ఏ సీజన్‌లోనైనా వెళ్లొచ్చు. కానీ బెస్ట్ టైమ్ అంటే మాత్రం సెప్టెంబరు, మార్చినెలల మధ్య సమయమే. అకామడేషన్‌కు కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల కస్టమర్లకు తగిన వసతి సదుపాయాలు అక్కడ లభ్యమవుతాయి. లగ్జరీ హోటల్స్‌తోపాటు హిల్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. మధ్యతరగతివారికి వీలుగా మీడియం ధరలకే ఎకానమీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా క్యాంప్స్, హోంస్టేస్ కూడా ఉన్నాయి.

చూడాల్సిన ప్రదేశాలు: 
రాజాస్ సీట్, ఓంకారేశ్వర టెంపుల్, మడికెరి కోట, అబ్బీ ఫాల్స్, గడ్డిగె, బైలెకుప్పె, తలకావేరి, బారాపోలె రివర్, సోమ్‌వారప్పేట్

కూర్గ్‌కు మార్గాలు
కూర్గ్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసులు లేవు. దీనికి 135 కిలోమీటర్ల దూరంలో మంగళూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. బెంగుళూరు లేదా మంగళూరు వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్‌కు సులభంగా చేరుకోవచ్చు. కూర్గ్‌కు దగ్గరలో మైసూర్ రైల్వే స్టేషన్ ఉంది. బస్సు, వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటాయి. కూర్గ్ హైదరాబాద్‌కు 797 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ రైలు సౌకర్యం ఉంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి కూర్గ్ 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి మంగళూరు వరకూ వెళ్లాలి. మంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంది. బెంగుళూరు నుంచి కూడా కూర్గ్‌కు వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు బస్ సౌకర్యం ఉంది. ప్రయాణం 14 గంటలు పడుతుంది.

ఇండివిడ్యువల్ ట్రావలెర్స్‌కు ఇది సౌకర్యంగా ఉంటుంది. అదే వైజాగ్ నుంచి కూర్గ్‌కు దూరం 1282 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా ప్రయాణం చేయడానికి 21 గంటలు పడుతుంది. వైజాగ్ నుంచి కూర్గ్‌కు ఫ్లైట్ డిస్టెన్స్ 994 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లాలనుకునేవాళ్లకు టికెట్ ఖర్చు 2,291 రూపాయలతో మొదలవుతుంది. అలాగే వైజాగ్ నుంచి మంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 2,938 రూపాయల నుంచి ఉంటుంది. అదే వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 3,607 రూపాయల నుంచి ఉంటుంది.