Friday, 10 June 2016

సినిమా షూటింగ్ కేరాఫ్ పొల్లాచి

ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురి అండ్ నేషనల్ పార్క్... 
అద్భుతమైన అన్నామలై కొండల నెలకొనివుంది. 1961 లో అప్పటి ప్రధానమంత్రి సందర్శన తర్వాత దీని పేరు మార్చారు. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున ఉన్నది. సుమారు 958 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వున్న ఈ పార్క్‌లో వివిధ రకాల మొక్కలు, ఎన్నో రకాల వన్య జీవులు ఉన్నాయి. చిరుతలు, లేళ్ళు, పులులు, ఏనుగులతో పాటు ఇక్కడ అనేక రకాల, అరుదైన పక్షులు కూడా మనం చూడవచ్చు. పార్క్ పరిసరాలలో ఉన్న అమరావతి రిజర్వాయర్‌లో మొసళ్ళు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి ఏటా వందలాది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూవుంటారు.

అలగునాచి అమ్మన్ టెంపుల్...
అలగునాచి అమ్మన్ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుత ఆలయం. పొల్లాచికి 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయాన్ని వల్లియరాచల్ ప్రాంతానికి చెందినవారు కట్టించారు. ఈ ఆలయంలో అలగునచి అమ్మవారు వుంటుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మవారి విగ్రహంతో అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకొంటుండగా ఆ విగ్రహం అదృశ్యం అయ్యింది. దానితో వారు అక్కడ దేవాలయం నిర్మించారు. అక్కడే వారు స్థిరపడి దేవాలయాన్ని నిర్వహిస్తుండడం విశేషం.

అజియార్ డ్యాం...
అజియర్ డ్యాం పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అజియార్ నది పై 1959-69 మధ్య కాలంలో సాగు నీటి కొరకు ఈ డ్యాం నిర్మించారు. ఈ డ్యాం 81 మీటర్ల ఎత్తు కలిగి... అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కలిగివుంది. ఇటీవలికాలంలో ఇది ప్రధాన పిక్నిక్ స్పాట్‌గా మారింది.

అరివు తిరుకొయిల్...
అరివు తిరుకొయిల్ ఆడాలి అమ్మన్ కొయిల్ సమీపంలో కలదు. పొల్లాచికి 25 కి.మీ.ల దూరంలో వున్న ఈ ఆలయాన్ని 'మనస్సాక్షి టెంపుల్' అంటారు. దీనిని యోగిరాజ్ వేదాద్రి మహాతిరి మహర్షి ఒక ధ్యానం కేంద్రంగా నిర్మించారు. ఇక్కడ ధ్యానం, ఆధ్యాత్మిక పుస్తకాలు, విరివిగా లభిస్తాయి.

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి...
ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురి పొల్లాచికి 65 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక్కడ వివిధ రకాల జంతువులు... ప్రత్యేకించి మెరుపులు కల అతి పెద్ద ఉడుత ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. తూవనం వాటర్ ఫాల్స్, వాచ్ టవర్‌లు ఈ ప్రాంత అందాలను మరింత ద్విగుణీకృతం చేస్తాయి.

మరియమ్మన్ టెంపుల్...
టౌన్ మధ్య భాగంలో ఈ మరియమ్మన్ టెంపుల్ కలదు. ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల కిందటిదిగా చెబుతారు. ఈ దేవాలయంలో మాసి రథోత్సవం ప్రధాన వేడుక. ప్రతి రోజూ పూజలు ఉ. 6 గం నుండి రాత్రి 8 గం. వరకు నిర్వహిస్తారు.

మాసాని అమ్మన్ తిరుకొయిల్...
ఈ గుడిలో మాసాని అమ్మన్ ప్రధాన దేవత. ఈ దేవత సర్ప శరీరం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు దేవుడు సరిగ్గా మూడు వారాలలో తమ కోరికలు విని తీరుస్తాడనే నమ్మకం ప్రబలంగా వుంది. మంగళ, శుక్ర వారాలు ప్రధానం. ఆలయం మధ్య భాగంలో మాసాని అమ్మన్ పెయింటింగ్ వుంటుంది. ఈ టెంపుల్, రాజు మాసాన్ కు చెందిన ఒక మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండు తిన్న ఒక బాలిక పేరు పై నిర్మించబడింది. స్థానికులు తర్వాత ఆ బాలికను మాసాని అమ్మన్ గా పూజించారు. ఇతిహాసం మేరకు శ్రీరాముడు సీత కొరకు అన్వేషించేటపుడు ఈ టెంపుల్ సందర్శించాడని అక్కడ ధ్యానం చేసాడని చెపుతారు.

ఉడుమాల్ పేట్...
ఈ ప్రదేశం పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో కల దు. ఉడుమాల్ పేట్ పొల్లాచికి జంట నగరం.
ప్రకృతి అందాలు, అనేక టెంపుల్స్... అనగా ప్రసన్న వినాయక టెంపుల్, మరి యమ్మ టెంపుల్, కామాక్షి అమ్మ టెంపుల్ మొదలైన వాటితో పాటు తిరుమూర్తి డ్యాం, అమరావాతి డ్యాం, కాడంబారి డ్యాం వంటి డ్యాంలతో ఈ ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది.

No comments:

Post a Comment