Tuesday, 7 June 2016

పాపికొండల్లో పరవశించిపోండి....


చుట్టూ గోదారమ్మ పరవళ్లు... 
పచ్చని ప్రకృతి సోయగాలు... 
కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... 
గిలిగింతలు పెట్టే చలిగాలులు... 
కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, 
అంతే అందమైన సూర్యాస్తమయం... 
రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... 
మధ్యలో క్యాంప్‌ఫైర్... 
గోదారమ్మ ఒడిలో స్నానం..! 
ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! 

యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్ట్రలోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.

యాతస్రాగేదిలా...
ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.

ఝటాయువు గురుతులు
వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.
మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. టూరిజం శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.

భాగ్యనగరం నుండి నేరుగా...
'హైదరాబాద్ - భద్రాచలం - పాపికొండలు' ఈ పదాల కలయికే ఆసక్తికరం. భద్రాచలం మీదు గా... హైదరాబాద్ నుంచి పాపికొండలకు పర్యాటకాభివృద్ధి సంస్థ గత మూడేళ్ళుగా ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరితే... భద్రాచలంలో భద్రాద్రి రాముడు, పర్ణశాల సందర్శనం... అనంతరం గోదారమ్మ ఒడిలో 'హరిత' ప్రయాణం... వెదురు గుడిసెల్లో బస... పాపికొండల ప్రయాణానికి చిరునామాగా మారిన పేరంటాల పల్లి సందర్శన... ఇదీ ఈ ప్యాకేజీ.

రాముని పాదాల చెంత
హైదరాబాద్ నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ప్రతి శుక్రవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:30 - 6:00 గంటల మధ్య భద్రాచలం చేరుకుంటుంది. అక్కడే హరిత హోటల్‌లో బస. శబరీ నదీ స్నానం, కొండపై కొలువైన భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి 70 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణం. పర్ణశాల, ఇతర స్థానిక పర్యాటక కేంద్రాల సందర్శనాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది.

ఆద్యంతం ఆహ్లాదకరం
దీనికి కొనసాగింపుగా... పోచవరం వరకు బస్సు ప్రయాణం ఉంటుంది. దట్టమైన అడవుల్లో గిరిపుత్రులు నివాసం ఉండే పోచవరం గోదావరి నదీ తీరంలో ఉంది. అడవుల్లో అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉండే గిరిజనుల ఆవాసాలు చూపు మరల్చుకోనీయవు. అక్కడి నుంచి పాపికొండల ప్రయాణం మొదలవుతుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన బోటు హరిత'లో జలప్రవేశం. 180 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ బోటులో సుమారు రెండున్నర గంటల మేర ప్రయాణం నిజంగా 'హరిత'మయమేనని అనిపిస్తుంది. ఎందుకంటే... పచ్చగా అలరారే దట్టమైన అడవుల మధ్య పాయగా చీలిన గోదావరి అలలపై ఈ పడవ పర్యాటకులను తీసుకెళ్తుంది. సూర్యాస్తమయం వేళ, బంగారు రంగులో మెరిసిపోయే గోదావరి నదీ జలాలు, పర్వతాల బారుల వెనుక అస్తమించే సూర్యుడిని తిలకించడం ఓ అద్భుతమే..!

ఈశ్వరాలయ సందర్శనం
కొల్లూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాపికొండల మధ్య వెలసిన పేరంటాల పల్లి శైవక్షేత్రం సందర్శన ఉంటుంది. ఏటా కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాల సమయంలో ఈ శైవక్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పేరంటాల పల్లి నుంచి హరితలోనే తిరుగు ప్రయాణం ఉంటుంది. లాంచీలో పోచవరం, అక్కడి నుంచి మళ్లీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులో భద్రాచలం చేరుకుంటారు. పాపికొండల ప్రయాణం మిగిల్చే మధురానుభూతులతో హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులో తిరుగు ప్రయాణం అవుతారు. ఇది జీవితంలో
మరిచిపోలేని విహారంగా మగిలిపోతుంది.

ఇసుక తిన్నెల్లో భోజనం
సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం పర్యాటకులు కొల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఇసుక తిన్నెల్లో వెదురు బొంగులతో వేసిన గుడిసెలు స్వాగతం పలుకుతాయి. పర్యాటకుల రాత్రి బస అక్కడే. సంధ్యవేళ పర్వాతాల మీది నుంచి సుడులు తిరుగుతూ వీచే చల్లని గాలులు ఇబ్బంది పెట్టకుండా పర్యాటక శాఖ సిబ్బంది బ్లాంకెట్లను ఏర్పాటు చేస్తారు. గిరిజనుల సంప్రదాయ వంటకాలతో భోజనం ఉంటుంది. చుట్టూ నీళ్లు, హరితమయమైన పర్వతాల పంక్తి, సోలార్ దీప కాంతుల మధ్య డిన్నర్.

ఇక పాపికొండల్లో...
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్ట్రలోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు. ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి. వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది. మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. టూరిజం శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.

వారాంతంలో మొదలు
ప్రతి వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి, శని, ఆదివారాల్లో పాపికొండల్లో విహరించి... సోమవారం తెల్లవారు జామునే హైదరాబాద్‌కు చేరుకునేలా ఈ ప్యాకేజీని రూపొందిం చారు. నగరానికి చెందిన పర్యాటకుల నుంచి ఈ ప్యాకేజీకి చక్కని స్పందన లభిస్తోంది.

టారిఫ్‌ వివరాలు
ఏసీ బస్సులో...
పెద్దలకు
- రూ.2800
పిల్లలకు
- రూ.2250
నాన్ ఏసీ బస్సులో...
పెద్దలకు
- రూ.2300
పిల్లలకు
- 1850

పర్యాటక శాఖ కార్యాలయాల వివరాలు
సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్:
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, శంకర్ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా, హైదరాబాద్. ఫోన్ నెం: (040) 66746370, 66745986.
ఇన్‌ఫర్మేషన్ అండ్
రిజర్వేషన్ ఆఫీసులు:
* ట్యాంక్‌బండ్ వద్ద గల పర్యాటక శాఖ కార్యాలయం.
* గ్రీన్ ల్యాండ్‌లోని టూరిజం ప్లాజా.
* సికింద్రా బాద్‌లోని యాత్రీ నివాస్‌లలో ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment