Tuesday, 7 June 2016

సాహసికులకు స్వాగతం

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్ - నేపాల్ సరిహద్దులన్నీ హిమాలయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఆశ్చర్యమేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింగ్ స్పాట్‌లలో కొన్ని మీకోసం...ఎవరెస్ట్ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం, ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉం టుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మం చి ట్రెక్కింగ్ ప్రదే శంగా చేశాయి. ఇక్కడ మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్ హిమాల్ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి.

కాళి గండకి:
అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతై నది. హిందువుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షం పడే ప్రాంతాలు, నేపాల్ లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ నేర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్ మెచ్యూరిటీ (యూయస్ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచం లోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతంగా గుర్తించబడినది. పోఖరా ది సిటీ అఫ్ లేక్స్ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుంది. సహజ సౌందర్యంతో, చిత్రవిచి త్రంగా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

లంగ్ టంగ్:
ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకో వచ్చు. లంగ్‌టంగ్ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్ సరిహద్దుపై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రకాల మొక్కలకు, హిమాలయాల రెడ్ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతు వులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిదిగా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్‌కు చాలా చాలా అనువుగా ఉంటుంది. గోసాయి కుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

పర్వతారోహణము:
800 ల కిలోమీటర్ల నేపాల్‌లోని హిమాలయముల పంక్తి మౌంట్ ఎవరెస్ట్‌తో సహా 8,000 మీటర్లకు పైగా ఉన్న ఎనిమిది పర్వత శిఖరములు, ప్రపంచ ములోనే గొప్పవి. 1994లో దేశము ఈ పర్వత శిఖరములు ఎక్కడానికి అనుమతించినప్పటినుంచి, నేపాల్ హిమాలయములు పర్వతారోహణకు ఆల వాలము అయింది మరియు అందులో విజయము, అపజ యము వేలమంది స్త్రీలు, పురుషులకు అక్కడకు చేరడము అనే సవాలులో నెగ్గాలన్న తపనను పెంచింది. ఈ నేపాల్ హిమాలయములు సాధువులు, తత్వవేత్తలు, పరిశోధ కులు లేదా సాహస ములు చేసేవారు వంటి ఎంతో మందికి ఆకర్షణియముగా ఉన్నాయి.

చూపుతిప్పుకోనివ్వని సోయగాలు:
బర్డ్ వాచింగ్ నేపాల్ పక్షి ప్రేమికులకు మొత్తము 646 జాతులతో(దాదాపు ప్రపంచములో 8% శాతము) స్వర్గధామము, మరియు వాటిలో దాదాపు 500ల జాతులు ఒక్క ఖాట్మండు లోయలోనే చూడవచ్చు. జాతీయ అభయా రణ్యములైన ఫుల్ చోకి, గోదావరి, నాగార్జున్, బాగమతి చెరువు, టౌడహాలు పక్షులను చూసే ప్రదేశములలో బాగా పేరు పొందినవి. మీ బైనాక్యులర్స్ కూడా తెచ్చుకుని ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన అనుభవము కొరకు ఎదురు చూడండి.

మౌంటైన్ ఫ్లైట్ భూమి పైన ఎత్తౖన పర్వత శిఖరములు చేరడము అనే అనుభవమునకు దగ్గరగా రాగలిగింది కేవలము భయానకమైన నిశ్శబ్దము మాత్రమే. పర్వత శిఖరములు మౌంట్ ఎవరెస్ట్,కాంచెనగంగ మరియు టిబె టన్ ప్లేటుల దగ్గరి విహంగ వీక్షణము ఇస్తాయి. పర్వతశిఖరములు అన్ని రక ముల ప్రయాణికులకు నచ్చుతాయి మరియు నేపాల్ పర్యాటకములో పేరు పొందిన ఆకర్షణ అయ్యాయి. సమయాభావంతో లేదా వేరే ఇతర ఏ కారణ ముల వలన అయినా కానీ ఇలా వెళ్ళలేని వారికి, ఈ శిఖరములు హిమాలయ ములకు నాలుగు దిక్కులా ఉన్న అధ్బుతమైన సౌందర్యమును ఒక్క గంటలోనే చూపిస్తాయి.రాక్ క్లైమ్బింగ్ అక్కడ ఉన్న క్లిఫ్ హంగర్స్ కు, ఖాట్మండ్‌లోని రాళ్ళ గోడల పంక్తి ఒక మంచి జీవిత అనుభవము అవుతుంది. ఆలస్యముగా అయినా, ఖాడ్మండ్‌లో రాక్ క్లైమ్బింగ్‌కు అనువుగా ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశముల వలన ఇది పేరు పొందిన ఆట అయింది. మీరు ఈ ఆట కోసము చూడదగిన ప్రదేశములలో నాగార్జున్, బలాజు, శివ్ పురి మరియు బుధానిల్ కంత వంటివి ముఖ్యమైనవి.

No comments:

Post a Comment