Monday, 23 January 2017

2017 చూడాలని ఉంది

ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు.

 • 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్‌నాథ్‌ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్‌ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్‌నాథ్‌ చార్‌ధామ్‌ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి.
  కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే..
  విమానమార్గంలో డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్‌∙315, కేదార్‌నాథ్‌ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్‌ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్‌నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్‌ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్‌ నుంచి కేదార్‌నాథ్‌ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్‌ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్‌ అయి తెలుసుకోవచ్చు.

 • మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్‌. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్‌ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్‌ రిజర్వ్‌లో హోటల్‌ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్‌ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్‌ స్పాట్‌ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్‌ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్‌ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్‌ పార్క్‌గా ప్రకటించింది.
  http://rtdc.tourism.rajasthan.gov.in


 • 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్‌లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు.  చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది.
  ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్‌ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్‌ సీయింగ్‌ టూర్స్‌కి హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in

 • 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్‌ (రాజస్థాన్‌)కు దేశంలో అత్యంత రొమాంటిక్‌ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్‌ ఆఫ్‌ మేవార్‌’, ‘వెనీస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్‌ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్‌ లేక్, ఉదయ్‌సాగర్‌ లేక్, జైస్మండ్‌ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్‌ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్‌ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
  http://rtdc.tourism.rajasthan.gov.in/

 • 5 ప్రకృతి ప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్‌పోర్ట్‌ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్‌ బకులా రిన్‌పోచే’ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు.

  నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్‌ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్‌లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు.

  32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్‌ రూట్‌లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్‌ గ్రామం ఓవర్‌వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది.

 • గుజరాత్‌లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్‌ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్‌ గార్డెన్‌లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్‌ టెంపుల్‌ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్‌ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్‌’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్‌ టెంపుల్‌ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్‌ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం.

  ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్‌ మెహసనాలో ఉంది.  Mail: info@gujarattourism.com

 • ఇది దేశంలోనే అతి పెద్ద జైన్‌ టెంపుల్‌. భావనగర్‌కు (గుజరాత్‌) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు.
  రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్‌ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్‌ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోకు 9493350099 ఫోన్‌ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com

 • 8 స్నేహ బృందంతో కలిసి ట్రెక్కింగ్‌ వెళ్లాలంటే మధేఘాట్‌ సరైన ప్లేస్‌. పశ్చిమపూణె (మహారాష్ట్ర) రాయగడ్‌ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్‌. భటఘర్‌ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్‌ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్‌ ఉంటుంది. రాయగడ్‌ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్‌ ఘాట్‌ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్‌ స్టేషన్‌ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్‌ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్‌ టేక్‌’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్‌ స్పాట్‌. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్‌ ఘల్‌ కి మహాబలేశ్వర్‌ రోడ్‌ మీదుగా వెళితే ముంబయ్‌–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు.

 • పశ్చిమ బెంగాల్‌లో టెర్రకోట టెంపుల్స్‌ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్‌ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్‌ టెంపుల్‌ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక  విద్యాలయాలకు పెట్టింది పేరు.

  బిష్ణుపూర్‌ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్‌సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్‌ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్‌పోర్ట్‌ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్‌ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు:  రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్‌ దర్వాజ, గడ్‌ దర్వాజ, దాల్‌మండల్‌ కమాన్, స్టోన్‌ చారియట్, నూతన్‌ మహల్, చిన్నమస్త టెంపుల్‌.

 • 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్‌పోర్ట్‌ ఖజురహో. రైల్వేస్టేషన్‌ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్‌ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్‌ మందిర్, షాహిద్‌స్మారక్‌ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్‌ ఉంది.
  www.mptourism.com-----

 • 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్‌ లేక్‌. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం.  కోయంబత్తూర్‌కి హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్‌ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్‌ నుంచి ఎమరాల్డ్‌ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు.  ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్‌ గార్డెన్, ఊటీ, రోజ్‌ గార్డెన్, లేక్‌ పార్ట్, ఊటీ లేక్, డీర్‌ పార్క్‌.

 • 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్‌. సిక్కిమ్‌ వాసులు ఇక్కడ ‘పాంగ్‌ లహ్‌బ్సోల్‌’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్‌ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్‌పోర్ట్‌ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ హెలీకాప్టర్‌ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్‌పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్‌ నుంచి మే వరకు సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు బడ్జెట్‌ హోటల్స్‌ సదుపాయాలను పొందవచ్చు.
  మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్‌ అవ్వచ్చు.

 • 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్‌ నేషనల్‌ పార్క్‌ లక్కమ్‌ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి.

  కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్‌. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్‌ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు:  పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్‌ హార్ట్‌ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి.

No comments:

Post a Comment