Monday, 27 February 2017

కాణిపాకం

కాణిపాకం
అబద్ధం ఈ ఆలయంలో నిషిద్ధం

దేశంలో ఎక్కడా లేని విధంగా సత్య ప్రమాణాలకు వేదికగా కాణిపాకం పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. తప్పుచేసిన వారు ఈ ఆలయంలో ప్రమాణం చేయడానికి సాహసించరు. ఇక్కడ కొలువైన వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే వరసిద్ధుడిగా పేరు గాంచాడు. ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం కేవలం ఒక మండపంలోని ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ తిరుమల, శ్రీకాళహస్తి తరువాత జిల్లాలో అంతటి ఆదరణ గల ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆలయానికి ప్రతి రోజు ఇరవై వేల మందికి తక్కువ కాకుండా ముఖ్యమైన పర్వదినాలలో లక్ష మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.

వరసిద్ధుడి ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాణిపాకాన్ని అప్పట్లో విహారపురిగా పిలిచేవారు. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారట. వీరిలో ఒకరు అంధుడు, మరొకరు చెవిటివాడు, ఇంకొకడు మూగవాడు. వీరు తమ పొలానికి నీరు పెట్టడానికి బావి నుంచి యా తం వేసి నీరు తోడుతుండగా బావిలోని ఓ శిలకు యాతపు బాణ తగిలి రక్తం స్రవించిందట. ఆ నీరు తగిలి అంధుడికి కళ్లు కనిపించాయి,చెవిటివాడికి వినబడింది, మూగవాడు మాట్లాడగలిగాడు. యాతపు బాణ తగిలింది స్వామి విగ్రహ శిరస్సుకు. అందుకే స్వామి విగ్రహం తలపై ఇప్పటికీ కొప్పులా ఉంటుంది. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు విగ్రహం మహిమను గుర్తించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పూజించారు. భక్తులు కొట్టిన కొబ్బరి నీళ్లు కాణి(ఎకరా)పారకం అయింది. ఈ క్షేత్రం ఆ విధంగా కాణిపారకమని కాలక్రమేణా కాణిపాకమని పేరుపడింది.

స్వామి విగ్రహం పెరుగుతోంది స్వయంభుగా వెలసిన స్వామి విగ్రహం అచ్చుం శిల్పి చెక్కినట్లు ఉంటుంది. ఈ విగ్రహం ప్రతి ఏడాది కొంత పరిమాణంలో పెరుగుతూ ఉందని భక్తులు చెబుతారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ఉంచిన స్వామి వెండి కవచాలే దీనికి నిదర్శనం. దోషులతో నిజం చెప్పించడానికి, మద్యపానం వంటి దురలవాట్లు మాన్పించడానికి ఈ క్షేత్రంలో సత్యప్రమాణాలు చేయిస్తారు. స్వామి సన్నిధిలో అబద్ధం ఆడడానికి ఎవరూ సాహసించరని నమ్మకం.

స్వర్ణ ధ్వజ స్తంభాలు, కలశాల ఏర్పాటు కాణిపాకం క్షేత్రంలోని ప్రదాన ఆలయం, అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన కాశెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వర్ణ ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే వరసిద్ధుని ఆలయ విమాన గోపురం,తూర్పు రాజగోపురం, పశ్చిమరాజగోపురం,ఆంజనేయస్వామి ఆలయ విమాన గోపురంపై నెల్లూరుకు చెందిన వీటీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత వేమిరెడ్డిప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి 14 స్వర్ణ కలశాలను ప్రతిష్ఠింపజేశారు.

వేలాది మంది భక్తులకు అన్నదానం కాణిపాకం క్షేత్రంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బుగ్గమఠానికి చెందిన దేవిమంగమ్మ చారిటీ ట్రస్టు వారు తొలత విరాళం ఇచ్చి అన్నదానాన్ని వరసిద్ధుని ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం ఆలయంలో స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.

Friday, 24 February 2017

అంతా శివమయం

అంతా శివమయం

నిరాకార రూపుడైన శివుడు.. భారతావనిలో పన్నెండు ప్రదేశాల్లో జ్యోతిర్లింగ స్వరూపునిగా వెలిశాడు. మన దేశానికి నాలుగు దిక్కులా ఈ జ్యోతిర్లింగ ఆలయాలున్నాయి. వాటిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందులో ఒక్క లింగాన్నైనా దర్శించుకోగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. శివరాత్రి పర్వదిన వేళ.. వాటి గురించి మరిన్ని విశేషాలు..

తైత్తీరియో ఉపనిషత్తును అనుసరించి మనిషిలోని పన్నెండు తత్వాలే ఈ జ్యోతిర్లింగాలు. అవేంటంటే..
1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనసు 5. బుద్ధి 6. చిత్తం 7. అహంకారం 8. పృథ్వి 9. జలం 10. తేజస్సు 11 వాయువు 12. ఆకాశం

జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ..
  • సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతం తీరాన రామేశ్వరం, ఆరేబియా ఒడ్డున సోమనాథాలయం)
  • పర్వతసానువుల్లో నాలుగు (శ్రీశైల శిఖరాన మల్లికార్జున, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాల్లో భీమశంకరుడు, మేరు నగపై వైద్యనాథుడు )
  • మైదానాల్లో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగబాద్‌ - ఘృష్ణేశ్వర, ఉజ్జయిన నగరాన - మహాకాలేశ్వరుడు)
  • నదులు తీరాన మూడు (గోదావరి ఒడ్డున త్రయంబకేశ్వరుడు, నర్మదా నదీతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు)
జ్యోతిర్లింగ రూపాల్లో ఉన్న ఆ లింగాలు పరమశివుని తేజస్సు అని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశాదిత్యులకు ప్రతీకలుగా భావిస్తారు. లయకారుడైన పరమశివుడు స్వయంభువుగా వెలిసిన దివ్యక్షేత్రాలుగా ఇవి పేరొందాయి.

సోమనాథ జ్యోతిర్లింగం :
గుజరాతలోని వీరావల్‌ దగ్గరున్న ప్రభాస పట్టణంలో సోమనాఽథ ఆలయం ఉంది. చంద్రుని కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించుటకు శివుడు సోమనాథునిగా ఇక్కడ వెలిశాడని స్థల పురాణం.

మల్లిఖార్జున జ్యోతిర్లింగం :
ఇది ఆంద్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. పర్వతుడనే రుషి తపఃఫలంగా ముక్కంటి ఇక్కడలింగ రూపంలో ఆవిర్భవించాడని స్థానిక కథనం. ఆది శంకరుడు ‘శివానందలహరి’ని ఇక్కడే రాశాడని చెబుతారు.

మహాకాళే శ్వర జ్యోతిర్లింగం :
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉందీ క్షేత్రం. స్మశానం, ఎడారి, పాలపీఠం, అరణ్యం ఉన్న ప్రదేశం ఉజ్జయిని. అందుకే అన్ని క్షేత్రాల్లో కంటే మహాకాళేశ్వరం అత్యుత్తమైందిగా భక్తులు భావిస్తారు.

కేదారనాథ్ ఆలయం :
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మందాకిని నదీ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం పర్వత రాజైన హిమవంతుని కేదార నామ శిఖరంపై ఉండటంతో ఇది కేదార జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది.శీతాకాలంలో అక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మాత్రమే దీన్ని సందర్శించవచ్చు.

నాగేశ్వర దేవాలయం :
మరో జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకవనంలో వెలిసిన ‘నాగేశ్వర లింగం’. ఒంటినిండా సర్పాలనే వస్ర్తాలుగా చుట్టబెట్టుకుని శివుడు ఈ తీర్థాన కొలువైనందున ‘నాగేశ్వరుడి’గా పూజలందుకుంటున్నాడు. పతి వెంటే సతీ అన్నట్లుగా... పార్వతీదేవి ఇక్కడ నాగేశ్వరిగా కొలువు తీరింది. గుజరాత పోరుబందర్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థముంది.

రామేశ్వరం :
తమిళనాడులోని ‘రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం’ పరమపవిత్రమైందిగా ప్రసిద్ధి గాంచింది. రామేశ్వర దర్శనం చేసుకుంటే.. కాశీ యాత్ర చేసినంత ఫలితం వస్తుందని పెద్దల మాట. ఈ ఆలయంలో 36 తీర్థాలు ఉండటం విశేషం. బంగాళాఖాతంలో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ స్వామిని కొలిచిన వారికి సంతాన నష్టం ఉండదు. అకాల మరణ దోశం కూడా తొలగిపోతుందట. జ్యోతిర్లింగాల్లో ఇది పన్నెండో జ్యోతిర్లింగం.

త్రయంబకేశ్వర దేవాలయం :
పరమ పవిత్ర నది గోదావరి పుట్టిన చోట ఈ క్షేత్రం ఉంది. త్రయంబకేశ్వరుని పూజిస్తే.. ప్రమాదాలతో పాటు, అకాల మృత్యుదోషాలు తొలగుతాయని స్థలపురాణం చెబుతోంది. ఈ లింగం చెంతనే మూడు చిన్న లింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలే ఆ లింగాలు. అందుకే ఈ క్షేత్రం త్రయంబకేశ్వర పేరుతో విరాజిల్లుతోంది.

వైద్యనాథ దేవాలయం :
జార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌లో వైద్యనాథ ఆలయం ఉంది. ఈ స్వామిని పూజించిన వారికి సకల రోగాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాన్ని రాణి అహల్యదేవి అభివృద్ధి చేసినట్టుగా అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని శివలింగ శిరస్సుపై ఉన్న నొక్కును రావణాసురుని బొటన వేలు నొక్కుగా చెబుతారు.

భీమశంకర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. పూణె నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఇది ఇంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న భీమనది ఇక్కడే పుట్టింది. ఈ నది పేరుమీదనే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది.

కాశీ విశ్వనాథ దేవాలయం :
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పరమేశ్వరుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించాడు. పవిత్ర గంగానదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది. వరుణ, అసి నదులు గంగానదిలో సంగమించిన ప్రదేశం ఇది కనుక వారణాసిగా చరిత్రకెక్కింది. ‘కాశి వంటి పుణ్య క్షేత్రం, తల్లి వంటి దైవం, గాయత్రి వంటి మంత్రం’ లేదు అని ఓ నానుడి.

ఓంకారేశ్వర ఆలయం :
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌, ఖాండ్వాలో నర్మదా నదీ తీరాన మంధాత పర్వత ప్రాంతంపై కొలువై ఉంది. ఇక్కడి లింగం చుట్టూ ఎప్పుడు నీళ్లు ఆవరించి ఉండటం విశేషం. ఈ దేవాలయం కృత యుగం నాటిది.

రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ ఆలయం కనిపిస్తుందట!

గుజరాత్ రాష్ట్రం భావనగర్‌ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉంది కొలియాక్‌ గ్రామం. తీరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక విశాలమైన రాతి చప్టా కనిపిస్తుంది. ఓ పక్క త్రిశూలం, మరోపక్క శివలింగాలు కనిపిస్తాయి. పైన సిందూర వర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఇక్కడ శివలింగాలతో పాటు ఒక నీటి గుంట ఉంది. దీనిని ‘పాండవ కొలను’ అని పిలుస్తారు. భక్తులు ఈ కొలనులో కాళ్లు కడుక్కుని శివుణ్ణి దర్శించుకుంటారు. సముద్రంలో ఆలయమేంటి? దాన్నెవరు నిర్మించారు? ఎలా వెళ్లడం?... అని ఎవరికైనా ఉత్సుకత కలుగుతుంది. మన ఉత్సాహానికి సమాధానాలు దొరికేలోపే ఆ గుడి మాయమైపోతుంది. ఇరవై అడుగుల పొడవున్న ఆలయ ధ్వజస్తంభం పూర్తిగా నీట మునిగి దానిపైనున్న జండా ఒక్కటే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఏమిటీ వింత? అనే మరో కొత్త ప్రశ్న ఎదురవుతుంది.

కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత ఐదుగురు పాండవులూ భాతృ, బంధువర్గ హత్యాపాతకాల నుంచి విముక్తి కోసం ఇక్కడ అయిదు శివలింగాలను ప్రతిష్టించి కొలిచారట. వారి ప్రార్థనను మన్నించడంతో ఆనాటి నుంచి సర్వేశ్వరుడు ఇక్కడ ‘నిష్కలంక మహదేవ్‌’గా పూజలు అందుకుంటున్నాడు. కాలక్రమంలో ముందుకు రావడమో, వెనక్కిపోవడమో సముద్రం లక్షణం. కొన్నిచోట్ల వెనక్కి తగ్గి కొత్త భూభాగాన్ని సృష్టిస్తే... మరికొన్ని చోట్ల ముందుకు వచ్చి ఉన్న భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుంది సముద్రం. అలా ఈ శివాలయం సముద్రంలో మునిగిపోయింది.

అయితే రోజులో కొన్నిగంటల పాటు ఆటు సమయంలో సముద్రమట్టం తగ్గి ఆలయం బయటపడుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజులలో సముద్ర పోటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆటు సమయం కూడా ఎక్కువే కనుక ఆ రెండు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ భాదర్వి అనే వేడుక జరుగుతుంది. భావనగర్‌ రాజవంశీయులు ఆ వేడుకలో పాల్గొని ధ్వజ స్తంభంపై కొత్త జెండాలను ఆవిష్కరిస్తారు. రోజూ ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి ఇస్తారు.

మహాదేవుణ్ణి అర్చించాలనుకునేవారు ఆ సమయం కోసం నిరీక్షించాల్సిందే! ఆ సమయంలోనే నడుములోతు నీళ్లల్లో తాళ్ల సహాయంతో నడుస్తూ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇలా సముద్రం ఆలయాన్ని ముంచి, మళ్లీ వెనక్కి వెళ్లినట్టే... తమను నిండా ముంచిన పాపాలు... ఆ మహేశ్వరుడి అనుగ్రహంతో వెనక్కి మళ్లిపోతాయని భక్తుల విశ్వాసం.

శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు

శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే... తప్పక దర్శించుకోవాలనుకుంటారు


‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ...

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు.

శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి... మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

Thursday, 23 February 2017

హరోం హరా..

హరోం హరా..

ఊరు.. వాడ.. కొండ.. కోన.. పులకించే పండుగ శివరాత్రి. ఊరూరా ప్రభలు కట్టడం ఈ పండుగ ప్రత్యేకత. పంట ఇంటికి పంటలర వస్తున్న తరుణంలో సంక్రాంతి. ఆ ఆదిదేవుడు దయతో అన్ని పంటలు పూర్తిగా ఇంటికి చేరాక శివరాత్రి. తమను, తమ పంటలను కంటికి రెప్పలా కాపాడిన ఆ భోళాశంకరునికి రైతులు మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయ వాహనాలు, ఎద్దులు, ఇతర పశువులను శివాలయం చుట్టూ తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భ క్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా శివయ్య దర్శనానికి తరలివెళతారు. కొందరు భక్తులు రోజంతా ఉపవాసంతో జాగరం చేయడం ఆనవాయితీ. శివరాత్రి నాడు భక్తులు హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పారవశ్యంతో చేసే శివనామ స్మరణతో చలి శివ..శివా.. అంటూ పారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రముఖ శివాలయాలు  సోమవారం నిర్వహించనున్న శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.

యనమలకుదురులో శివరాత్రి ఏర్పాట్లు
యనమలకుదురు(పెనమలూరు) : నేటి నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు కొండ పైకి వెళ్లటానికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు. ఇతరుల వాహనాలు కొండపైకి అనుమతించరు. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీపాలు పెట్టారు. దాదాపు 60 అడుగులు ఎత్తు హనుమంతుడి విగ్రహానికి రంగులు వేశారు. నటరాజస్వామిని తీర్చి దిద్దారు. ఆరు మాసాలుగా చేపట్టిన కొండపై విస్తరణ పూర్తి చేశారు.

శివగిరిపై ఉత్సవాలకు సిద్ధం
మొగల్రాజపురం : కొండపై (శ్రీ వాగ్దేవీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం) శివగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది.40 అడుగుల ఎత్తు త్రిభుజాకారపు డమరుకం కలిగిన శివలింగాన్ని కొండపై ఏర్పాటు చేశారు. సున్నపుబట్టీల సెంటర్‌లోని అమ్మ కల్యాణ మండపం నుంచి శివగిరికి దారి ఉంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని శివగిరిక్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ తెలిపారు.

బలివేలో ఏర్పాట్లు సిద్ధం..
నూజివీడు : ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో రామలింగేశ్వరస్వామి (భలే రామస్వామి) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయంలో రామలింగేశ్వరస్వామి పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఉత్తరవాహినీ ముక్త్యాల..
జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఉత్తరవాహినిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. అధికారులు స్నానఘాట్‌లను శుభ్రం చేయించారు. గ్రామ సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటి లింగాలు) మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు.

రామేశ్వరుని ఆలయం ముస్తాబు
తోట్లవల్లూరు : శివరాత్రి సందర్భంగా మండలంలోని ఐలూరులో గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో నీరు లేకపోవటంతో బోర్లు వేయించి జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అనంతరం రామేశ్వరస్వామి, రఘునాయకస్వామిని దర్శించుకుంటారు. భక్తుల రాకకు పంచాయతీ, దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.

సకల పాప హరణం.. సంగమేశ్వరుడి దర్శనం..
కూడలి(నందిగామ రూరల్): శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు గుర్తొచ్చేది కూడలి తిరునాళ్ల. ఏటా శివరాత్రికి నందిగామ మండలంలోని దాములూరు కూడలిలో సంగమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో స్వామి వెలిశారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది వైరా, కట్టెలేరు ఎండిపోయాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కుంటలు ఏర్పాటుచేశారు. కూడలి తిరునాళ్ల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు తిరునాళ్ల కొనసాగుతుంది.
రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇదే..!
ఏలూరు/పెదవేగిత్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారానంతరం శ్రీలంక నుంచి అయోధ్య చేరడానికి ముందు మార్గమధ్యమంలో బ్రహ్మ హత్యా దోషనివారణార్థం మహాస్థలాలను ఎన్నుకుని ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేస్తూ వెళతాడు. అందులో భాగంగా తమ్మిలేరు ఒడ్డున శ్రీరాముడు బలివేలో ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అనంతరం బలివే రామలింగేశ్వరస్వామితో పాటు చుట్టుపక్కల నూటొక్క లింగాలు ప్రతిష్ఠింపజేస్తామని శ్రీరాముడు చెప్పినట్టు పురాణగాధ. ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించినట్లుగా చరిత్ర. అందుకే ఈ ప్రాంతానికి బలివేగా, ఇక్కడ వేంచేసిన స్వామిని బలివే రామస్వామిగా పిలుస్తారు. 101 శివలింగాల్లో ప్రస్తుతం 4, 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ప్రముఖమైనది మృత్యుమల్లేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తాతగుడి అంటారు. రామలింగేశ్వరస్వామి కళ్యాణానంతరం రధోత్సవంనాడు తాతగుడికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకునే సంప్రదాయం ఉంది. బలివే రామలింగేశ్వరస్వామి పశ్చిమకు అభిముఖంగా ఉండడం విశేషం. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ స్వామి సమీపంలో తమ్మిలేరులో ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి పూర్వీకులకు పిండప్రధానం చేసి, పితృతర్పణాలు వదలడం ఆనవాయితీ.రాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు బలివే (ముసునూరు): భక్తుల కోర్కెలు తీర్చే బలివే శ్రీరామలింగేశ్వరుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి ఏటా మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుని పూర్వీకులు, పితృదేవతలకు పిండప్రదానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. శ్రీరాముడు రావణ సంహరాణానంతరం దోష నివారణార్థం మహాస్థలాలను ఎన్నుకొని ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేసుకుంటూ అయోధ్య చేరడానికి ముందు మహా అరణ్యమైన ఈ స్థలంలో పరమేశ్వరుడుని ఆవాహనం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణ గాధ. బలిచక్రవర్తి పరిపాలించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం బలివేగా, ఈ ఆలయాన్ని బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ పరిసరాల్లో పూర్వం 101 లింగాలు ఉండేవని పురాణాలు చెబుతుండగా, ఇప్పటికీ కొన్ని తవ్వకాలు బయటపడుతున్నాయి. ఈ గుడికి సమీపంలో బలివే రామస్వామికి తాతగా పిలిచే మృత్యు మల్లేశ్వరస్వామి లింగం (తాత గుడి) ఉంది. స్వామి వారు కల్యాణం అనంతరం రథోత్సవంలో తాత దర్శనం తీసుకుంటుండటం అనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్వామి వారు పశ్చిమాభిముఖముగా సద్యోజాతమూర్తిగా వెలుగొందుతుండటం వల్ల పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఆలయం చేరడానికి ఆర్టీసీ అధికారులు నూజివీడు నుంచి ప్రత్యేక బస్సు వసతి కల్పిస్తుండగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాలకు తమ్మిలేరు జలాలతో పాటు, జల్లు స్నానాలు దేవదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

కోటప్పకొండ - త్రికూటేశ్వరస్వామిశివరాత్రి ఉపవాసాల పండగ. జాగరణల పండగ. శివయ్యకు అభిషేకాల పండగ. ఇదే శివరాత్రి జాతరల పండగ కూడా. జాతర అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని కోటప్పకొండ. త్రికోటేశ్వరుడు వెలసిన కోటప్పకొండ శివరాత్రి సమయంలో భక్తజనజాతరతో కిటకిటలాడతాయి. ఈ క్షేత్ర పర్యటన ఆధ్యాత్మిక ఆనందం పంచడంతో పాటు ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.  

జగత్తుకు పితృదేవుడైన పరమేశ్వరుడు బాలుడిగా అవతరించిన క్షేత్రం...
బ్రహ్మవిష్ణువులకు దక్షిణామూర్తిగా ఉపదేశం ఒసిగిన ప్రదేశం...
ఇలా ఎన్నో పౌరాణిక విశేషాలను కలిగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కోటప్పకొండ.

గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివరాత్రి సందర్భంగా తిరునాళ్ల సందడితో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కోటప్పకొండపై పచ్చదనం నిండుగా ఉంటుంది. మూడు శిఖరములతో కనిపిస్తుంది. వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపములుగా భావిస్తారు. ఈ శిఖరాలను త్రికూటమలు అని, ఇక్కడ వెలసిన పరమేశ్వరుడ్ని త్రికూటేశ్వరస్వామి, త్రికోటేశ్వరస్వామి అని పిలుస్తారు. కోటప్పకొండకు ఆ పేరు రావడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముక్కోటి దేవతలు పరమేశ్వరుడి కోసం ఇదే కొండపై తపస్సు చేశారట. అందుకే ఈ కొండను కోటప్పకొండగా పిలుస్తారని స్థానికులు చెబుతుంటారు.

శివరాత్రి సందర్భంగా కోటప్పకొండపై జరిగే జాతరకు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ సందర్భంగా భక్తులు తీసుకువచ్చే ప్రభల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారీ కర్రలతో ప్రభలు రూపొందించి వాటిని అందంగా ముస్తాబు చేస్తారు. విద్యుత దీపాలు అలంకరించి తిరునాళ్లకు తీసుకువస్తారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది భారీ ప్రభలు కొండ దిగువభాగంలోని పొలాల్లో ఉంచుతారు. చిన్న ప్రభల సంఖ్య వేలల్లో ఉంటుంది. శివరాత్రి మొదలు నాలుగైదు రోజులపాటు ఈ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది. రికార్డింగ్‌ డాన్సులు, డప్పుమోతలు, ఆటపాటలు ఇలా కోరుకున్నవారికి కోరుకున్నంత వినోదం దొరుకుతుంది. కొండపై నుంచి తిలకిస్తే.. జనసంద్రాన్ని చూడొచ్చు. ప్రభల వెలుగులు.. సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తాయి.

ఎలా వెళ్లాలి.
నరసరావుపేట నుంచి కోటప్పకొండ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి అరగంటకో బస్సు సౌకర్యం ఉంది. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. గుంటూరు నుంచి కోటప్పకొండకు 62 కిలోమీటర్లు. ఇక్కడ్నుంచి చిలకలూరిపేట లేదా నరసరావుపేట మీదుగా కోటప్పకొండ చేరుకోవచ్చు. కోటప్ప కొండ మీద దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి రమణీయతతో పాటు అందమైన విగ్రహాలు పర్యాటకులకు ఆనందాన్నిస్తాయి. పచ్చని వనంలో కదలాడే నెమళ్లు, పావురాలు, చిలకలు ప్రత్యేక ఆకర్షణ. త్రికూట పర్వతంలో మొదటి కొండపై ఓ ఆలయం ఉంది. రెండో కొండపై త్రికోటేశ్వర ఆలయం కనిపిస్తుంది. మూడో కొండపై కల్యాణకట్ట, సిద్ధి వినాయక మందిరం ఉన్నాయి.

ఏడుపాయల వనదుర్గమ్మవారు

శివరాత్రి ఉపవాసాల పండగ. జాగరణల పండగ. శివయ్యకు అభిషేకాల పండగ. ఇదే శివరాత్రి జాతరల పండగ కూడా. జాతర అనగానే గుర్తొచ్చేది తెలంగాణలోని ఏడుపాయల. వనదుర్గ అమ్మవారు కొలువుదీరిన ఏడుపాయల శివరాత్రి సమయంలో భక్తజనజాతరతో కిటకిటలాడతాయి. ఈ క్షేత్ర పర్యటన ఆధ్యాత్మిక ఆనందం పంచడంతో పాటు ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మంజీర నాదాలు
ఎత్తయిన బండరాళ్లు. చిన్నరాయిపై పెద్దరాయి. పెద్దరాయిపై ఇంకా పెద్ద బండరాయి. ఆ బండరాళ్లను తాకుతూ సాగిపోయే మంజీరా నది. ఏడుపాయలుగా విడిపోయి సప్తస్వరాలు పలికే మంజీర నాద.. ఇదీ ఏడుపాయల సోయగం. జలతరంగాల నడుమ నిలిచిన కొండల్లో వెలిసింది వనదుర్గా అమ్మవారు. అపర కాళీ అవతారంగా అమ్మను భావిస్తారు. దుర్గా రూపాల్లో వనదుర్గ అంత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. శతాబ్దాలుగా పూజలందుకుంటున్న అమ్మవారి విగ్రహం చూసినంత ప్రసన్నత చేకూరుతుంది. పూర్వం జనమేజయుడు ఈ క్షేత్రంలోనే సర్పయాగం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. వనదుర్గాదేవి సన్నిధిలో శివరాత్రి మొదలు వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
 
శివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో ఘనంగా జాతర నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు దీనికి హాజరవుతారు. జాతరలో భాగంగా శివరాత్రి మర్నాడు నిర్వహించే ఎడ్ల బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగుతుంది. ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఘనపురం ఆనకట్ట ఏడుపాయలలో ప్రధాన ఆకర్షణ. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన డ్యామ్‌ మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఓవైపు పచ్చదనం.. మరోవైపు మంజీరా నదీ జలాలు.. కట్టమీదుగా సాగే కాలినడక ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


ఎలా వెళ్లాలి.. 
హైదరాబాద్‌ నుంచి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏడుపాయల. ముందుగా మెదక్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయి. 

ఘనపురం కట్ట అందాలు వీక్షించాలనుకుంటే.. హైదరాబాద్‌ నుంచి మెదక్‌ (వయా నర్సాపూర్‌) బస్సు ఎక్కాలి. పోతంశెట్టిపల్లి చౌరస్తా దగ్గర బస్సు దిగి.. అక్కడి నుంచి ఘనపురం ఆనకట్ట వరకు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లాలి. డ్యామ్‌పై నుంచి కాలినడక ద్వారా ఏడుపాయల చేరుకోవచ్చు. 

గోదావరి ఉపనది అయిన మంజీరా మహారాష్ట్రలోని బాలాఘాట్‌ పర్వతశ్రేణుల్లో పుట్టింది. కర్ణాటక మీదుగా తెలంగాణలోకి మెదక్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాశీలో గంగానది ప్రవాహం ఉత్తరంగా మారినట్లు.. ఏడుపాయల క్షేత్రం సమీపంలో మంజీరా ప్రవాహం ఉత్తర దిశకు మళ్లింది. అందుకే మంజీరా నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తారు. గురు గ్రహం మేష సంక్రమణ సందర్భంగా గంగానదికి పుష్కరాలు నిర్వహించినప్పుడు.. మంజీరానదికి కూడా పుష్కరోత్సవం చేస్తుంటారు. 

  
Wednesday, 22 February 2017

జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమఃశివాయ...
అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం.

నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్‌ అని పేరు వచ్చింది.

గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో!
ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది. ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్‌’ ఆలయం చేరుకుంటాం.

దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్‌ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం.

అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్‌ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్‌ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్‌ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు.

వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు
దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట.

శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని,

నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.

అలంకారంగా శయనహారతి
ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

ఆధునికత అంటని వాతావరణం
ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్‌ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు.

స్వామి దర్శనం
ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి.

ఓంకారేశ్వర్‌కు దారి
ఇండోర్‌ నుంచి ఓంకారేశ్వర్‌ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్‌ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. హైదరాబాద్‌ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్‌ చేరుకోవాలి.

– నిర్మలారెడ్డి చిల్కమర్రితిరుమలకు ఉన్న ఏడు నడకదారులు

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం తిరుమల.

ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే భక్తులు బస్సులను,ప్రైవేటు కార్లను, కాలి నడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే ఎక్కువ మందికి తెలిసిన నడక దారి ఒకే ఒక్కటి అదే అలిపిరి. కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు ఉన్నాయని? మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం.

తిరుమల ఆలయానికి ఏడుకొండలు నలువైపులనుండి ఏడు నడకదారులు ఉన్నాయి.

ఆదిపడి లేదా అలిపిరి :
తాళ్ళపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు.

క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు.

basettybhaskar
అలిపిరి నడకదారి , Way to footpath from Alipiri to Tiumala.

మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి.

అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.

అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు.

అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది.

అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ.శ1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజుస్వామి, అలిమేలుమంగమ్మ దేవాలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.

గాలి గోపురం లోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు. అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.

basettybhaskar
అలిపిరి నుంచి తిరుమల కాలినదకదారి. Way to Tirumala from Alipiri Footpath

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.

శ్రీవారి మెట్టు :
తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు.

చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.

చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు.అలిపిరికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు అయితే ఈ దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే.

basettybhaskar
Srivari Mettu

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు.

మామండూరు అడవి :
ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది.


ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారు ఈ దారి మీదుగానే తిరుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు.

మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది.

ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంతదూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది.

1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు.

అలిపిరి నుండి తూర్పు వేపుకు వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు.

తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక దారిలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళినా మామండూరు చేరుకోవచ్చు.

కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా:
కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడి నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు.

పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు.

తిరుమలకు ఉన్న నడకదారులు
పాపవినాశనం తుంబుర తీర్థ నడక దారి

తిరుమలకు ఉన్న 7 నడక దారులు
తుంబుర తీర్థం - తిరుమల
తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది.

పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.

రేణిగుంట నుంచి అవ్వచారి కోన దారి :
దీన్నే “అవ్వాచారి కోనదారి” అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.

basettybhaskar
Kadapa to Tirumala Foot Way Point
మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.

ఏనుగుల దారి :

basettybhaskar
Tirumala Foot Way
ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు.ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.

తలకోన నుంచి :
తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది.

తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు , ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు.

basettybhaskar
Talakona to Tirumala Foot Way

basettybhaskar
Talakona Water Fall

traditional hinduism
Talakona to Tirumala

మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి,కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది.

ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని.

ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది.

నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి.

Basetty Bhaskar

Friday, 17 February 2017

జలధీశ్వర ఆలయం


జలధీశ్వరా పాహిమాం 


Sakshi | Updated: February 14, 2017
శివరాత్రి స్పెషల్‌ – 1

జలధీశ్వర ఆలయం.
రెండవ శతాబ్దికి చెందిన అతి పురాతన దేవాలయం.
శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు విభిన్నంగా ఏకపీఠం మీద శివపార్వతులు దర్శనమిచ్చే అరుదైన దేవాలయం.
శివరాత్రి సందర్భంగా ఘంటసాల గ్రామంలో కొలువుతీరిన జలధీశ్వరాలయంపై ప్రత్యేక వ్యాసం.


విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో కొడాలికి ఎడమవైపున అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలోని శ్రీబాలపరమేశ్వరీ సమేత జలధీశ్వరాలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. విజయవాడకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా సముద్ర తీరంలోని ఈ గ్రామంలో బాలపార్వతీ సమేతంగా జలధీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ శక్తిపీఠాలను దర్శిస్తే వచ్చే పుణ్యమే ఈ దేవాలయ సందర్శన వల్ల కూడా కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. జలధీశ్వర అభిషేక జలం సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం.

శివుని కోరిక మేరకు...
ఏకపీఠే విరాజన్తం సర్వమంగళాయా సహా ఘంటశాల పురాధీశం జలధీశ్వర ముపాస్మహే భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్ట ప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే‘‘ పూర్వం శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సృష్టిలోని సకల జీవకోటి భక్తితో ఉత్తరాపథానికి తరలి వెళ్లింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగిపోసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి సృష్టి సమతుల్యం కావడం కోసం తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి, పవిత్రప్రదేశంలో శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కల్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. దాంతో అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి ఘంటసాల గ్రామంలో ఏకపీఠంపైన శివపార్వతులను ప్రతిష్ఠించాడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది.

అనేక ప్రత్యేకతలు
ఆలయానికి ఎదురుగా గోపురం, మూడువైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయ మహామండపానికి ఇరువైపులా పల్నాటి సున్నపురాయితో చెక్కిన భైరవుడు, నరసింహస్వామి విగ్రహాలున్నాయి. నరసింహస్వామి క్షేత్ర పాలకునిగాను, భైరవుడు ద్వారపాలకుని గాను ఉండటం ఆ ఆలయంలో మరో ప్రత్యేకత. సరస్వతీమాత, మరికొందరు దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఇక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం మొహంజొదారో కాలానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతారు. ఘంటసాలలో ఇంకా వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాంబ ఆలయం, భావనారుషి ఆలయం, రామాలయం, పెన్నేరమ్మ, ముత్యాలమ్మలకు కూడా దేవాలయాలు ఉన్నాయి.

జలధి ఒడ్డున ఉన్న శివుడు
ఘంటసాల గ్రామానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమీ ఈ గ్రామాన్ని ‘కంటకస్సిల’ అని పేర్కొన్నాడు. సిద్ధార్థుని గుర్రమైన కంటకం పేరు మీద ఈ గ్రామానికి కంటకశైలమనీ, తరువాత కంటకశిల అనీ రానురాను ఘంటసాలగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకారంభంలో ఇదొక రేవు పట్టణంగా ఉండేదనీ, ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించిన మహా నావికులున్నారనీ, క్రీ.శ. 3వ శతాబ్దంలో ఉపాసిక బోధిసిరి ఇక్కడొక శిలామండపాన్ని కట్టించిందని శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ గ్రామంలో శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలు, రోమన్‌ నాణాలు, శాలంకాయనుల నాణాలు లభించాయి. ఇక ఈ గ్రామంలోనే ఉన్న జలధీశ్వర ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇది అతి పురాతన ఆలయాలలో నాలుగవదని పురావస్తు శాస్త్రకారులు చెబుతున్నారు. గుడిమల్లం, అమరావతి, దాక్షారామం... ఆలయాలలోని శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక్కడి శివలింగం. అప్పట్లో వ్యాపార నిమిత్తం సముద్రంలో (జలధిలో) పడవలలో ప్రయాణించిన వర్తకులు, మత్స్యకారులు, నావికులు ఇక్కడి శివుడిని అర్చించడం వల్ల ఈయనకు జలధీశ్వరుడని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివుడు శివలింగం ఆకారంలో పార్వతీ సమేతుడై ఏక పానవట్టం మీద దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఏక పీఠం మీద శివపార్వతులు ఉన్న ఏకైక దేవాలయం ఇదే అని చెప్పవచ్చు. సాధారణంగా గర్భగుడికి ఎదురుగా నంది దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇద్దరినీ సమదృష్టితో చూస్తూ కనువిందు చేస్తాడు నందీశ్వరుడు.

ఆలయంలో పూజలు
ప్రతిరోజూ ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. ఏటా జరిగే ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా నమకం, చమకం, శ్రీసూక్తంతో రుద్రాభిషేకాలు మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారి కళ్యాణం దేవీ నవరాత్రులు, కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష పూజలు ఏటా డిసెంబర్‌లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు

నాటి కంటక శాలే.. నేటి ఘంటశాల

శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధస్థావరంగా ఉన్నట్లు తవ్వకాల్లో తెలిసింది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఒక గుర్రం మీద వెళ్లాడట. ఆ గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు, కొండను పోలిన స్థూపం పేరు కలిపి కంటకశాల అయిందని, రానురాను ఘంటసాల అయ్యిందని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం అప్పట్లో వర్తక స్థావరంగా కూడా వెలిసింది. నహపాలుడు శకవంశానికి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే శకనాణాలు దొరికాయి. 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతానికి చోళపాండ్యపురం అని పేరు. జలధిని ఈశ్వరునిగా భావించి, జలధీశ్వరస్వామిని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించారు. మొదటి వేయిసంవత్సరాలు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. తరువాత నుంచి జలధీశ్వరస్వామితో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. జలధీశ్వరస్వామి శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది. పలనాటి సున్నపు రాతితో ఈలింగాన్ని రూపొందించారని స్థానికులు చెబుతారు. ప్రాకృత, తెలుగు, కన్నడ శాసనాలు ఉన్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో చాలామంది ఇక్కడ నుంచి పాల్గొన్నారు.
– ఈమని శివనాగిరెడ్డి, CEO, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ


ఇలా చేరుకోవాలి...
రోడ్డు మార్గం: తెలుగు రాష్ట్రాలలోని అన్నిప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది.
రైలు మార్గం: మచిలీపట్నం అతి సమీప రైలుస్టేషన్‌. ఇక్కడ నుంచి ఘంటసాల 27కి.మీ. దూరంలో ఉంది.
విమాన మార్గం: విజయవాడ అతి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుంచి 50 కి.మీ. దూరం. ఇక్కడ నుంచి RTC బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, టాక్సీలు దేవాలయం వరకు దొరుకుతాయి. ఆలయ సందర్శన వేళలు: ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు

– డా. పురాణపండ వైజయంతి
సాక్షి, విజయవాడ  అవనిగడ్డ, కృష్ణాజిల్లా

Monday, 13 February 2017

పంచారామ క్షేత్రాలు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో
వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల  కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.

యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల  ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు. 

1. దాక్షారామము :
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం లో ఉంది.  ఇక్కడ వెలసిన స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తుంటారు.  స్వామి లింగాకారం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది.  పై అంతుస్తు నుండి పూజలు నిర్వహిస్తుంటారు.  ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేక ఏంటంటే లింగాకారం సగ భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు , రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాశారు. 

2. అమరారామము :

పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో  స్వామి విగ్రహం ఈ శివలింగం పాలరాతిది.. తెల్లగా శోభాయమానంగా కనిపిస్తుంది... గతంలో ఈ శివలింగం నెమ్మదిగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండేదట.. ఇప్పుడు పెరుగుదల నిలిచిపోయింది.. గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.

3. క్షీరారామము :

ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ  ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్ధంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.

4.సోమారామము :

పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని  భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

5. కుమారభీమారామము : 

పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి  జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

‘‘అడుగడుగునా ఆలయాలకు నెలవైన కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు సంబంధించిన ఆలయాలూ, 108 దివ్యదేశాలల్లోని కొన్ని వైష్ణవ క్షేత్రాలూ కూడా కొలువై ఉన్నాయి. నెల రోజులు పర్యటించినా వీటన్నింటీనీ సందర్శించడం సాధ్యం కాదు. కానీ ఓ ప్రణాళిక ప్రకారం కేవలం 3 రోజుల్లో 40 ఆలయాలు చూడగలిగాం.’’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొచ్చారు M.సరోజని గారు .

తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఈసారి కుంభకోణం చూడాలనుకుని బయలుదేరాం. అందుకే మూడురోజుల్లో వీలయినన్ని ఎక్కువ దేవాలయాలు సందర్శించాలనుకున్నాం. తమిళనాడు దేవాలయాలకు సంబంధించిన ఓ బ్లాగులోని మిత్రుడి సలహాసూచనల సాయంతో తిరుచ్చి నుంచి రైల్లో కుంభకోణం చేరుకున్నాం.

ఆజ్ఞా గణపతి!
ప్రతిరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు టాక్సీలో బయలుదేరి, తిరిగి ఆలయాలు మూసివేసే వరకూ పర్యటిస్తూ మూడురోజుల్లో దాదాపు 40 ఆలయాలు దర్శించాం. మొదటిరోజు కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడిలోని గురుగ్రహక్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఇక్కడి ఆలయంలో ఆపత్సహాయేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అనంతరం తిరుభువనంలో కంబహరేశ్వర, శరభేశ్వర స్వాములను దర్శించుకుని సమీపంలోని గోవిందపురం చేరుకున్నాం. విఠల్‌దాస్‌జీ మహారాజ్‌ మహారాష్ట్ర శైలిలో నిర్మింపజేసిన ఇక్కడి మందిరంలో పాండురంగడిని దర్శనం చేసుకున్నాం. కృష్ణాష్టమి వేడుకలకు అలంకారాలతో ఉన్న ఆ దివ్యమూర్తులను తిలకించి మైమరిచిపోయాం. అక్కడికి దగ్గరలోనే ఉన్న తిరువిడైమరుదూర్‌ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో 20 అడుగుల నందీశ్వరుడి విగ్రహాన్ని చూశాం. ఈ ఆలయంలో కొలువైన మహాలింగేశ్వర స్వామిని మధ్యార్జునేశ్వరుడుగా కూడా పేర్కొంటారు. ఇదే ప్రాంగణంలోని విఘ్నేశ్వరుని ఆజ్ఞాగణపతిగా అర్చిస్తారు.

ఉప్పులేని ప్రసాదం!
అక్కడి నుంచి అయ్యావాడి వెళ్లి ప్రత్యంగిరాదేవిని పూజించాం. సమీపంలోనే ఉప్పిలిఅప్పన్‌ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుతీరిన నారాయణుడికి ఉప్పులేని ప్రసాదాన్ని నివేదించడం విశేషం. తరవాత రాహు గ్రహ క్షేత్రమైన తిరు నాగేశ్వరం చేరుకుని, నాగేశనాథుడిని దర్శించుకున్నాం. దారి పొడవునా పచ్చటి అరటితోటలు కనువిందు చేస్తుండగా తింగలూరు చేరుకున్నాం. అక్కడ ఉన్న చంద్రగ్రహ క్షేత్రంలో పెరియనాయకి అమ్మవారిని అర్చించి, కావేరీతీరానగల తిరువయ్యారుకి చేరుకున్నాం. వాగ్గేయకారుడు సద్గురు త్యాగరాజస్వామి సమాధిని దర్శించి, ఆయన అర్చించిన శ్రీరామ పంచాయతనాన్ని చూశాం. ఆ సాయంకాలం అక్కడి ప్రశాంత వాతావరణంలో మైకులో ఏసుదాసు ఆలపించిన త్యాగరాజ కీర్తన వింటుంటే మనసంతా ఆధ్యాత్మిక చింతనతో నిండిపోయింది.తరవాత అక్కడ నుంచి ఆ వూరిలోనే ఉన్న సుప్రసిద్ధ పంచనదీశ్వర ఆలయానికి వెళ్లాం. ఇక్కడి కుడ్యచిత్రాలు చూసి తీరాల్సిందే. స్వామి ప్రదోష హారతిని కనులారా దర్శించుకొని, కపిస్థలం చేరుకున్నాం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి మాత్రమే కాదు. పంచ కృష్ణ క్షేత్రాల్లో ఒకటని అక్కడి అర్చకుడు తెలిపాడు. ఇక్కడ గజేంద్ర వరదరాజ స్వామిని ఆదిమూలం అని కూడా వ్యవహరిస్తారట. ఇక్కడికి సమీపంలోనే పాపనాశ క్షేత్రం ఉంది. రావణ సంహార పాపప్రక్షాళనార్థం ఇక్కడి రామలింగేశ్వరుడిని శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ప్రదోష హారతిని చూసే భాగ్యం కలిగింది. ఇక్కడినుంచి తిరుకరవూరులోని గర్భరక్షాంబికాదేవి ఆలయానికి వెళ్లాం. గర్భిణులు ఈ అమ్మవారిని సేవిస్తే సుఖప్రసవమై చక్కటి బిడ్డకు జన్మనిస్తారని భక్తుల విశ్వాసం. ప్రసవానంతరం బిడ్డలతో వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్న జంటలు చాలానే కనిపిస్తాయక్కడ. సంతానంలేని వాళ్లు కూడా ఇక్కడి అమ్మవారికి మొక్కుకుంటుంటారట.

తరవాత వేదనారాయణస్వామి కొలువైన వూత్తుకాడు వైష్ణవ క్షేత్రానికి వెళ్లాం. అక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు చేస్తారని అర్చకులు తెలిపారు. వాగ్గేయకారుడైన వూత్తుకాడు వేంకటకవి గానానికి పరవశించిన బాలకృష్ణుడు ఈ ఆలయ ప్రాంగణంలో నర్తించేవాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకుని పట్టీశ్వరంలోని దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నాం. అమ్మవారు శాంతమూర్తిగా చేతిపై చిలుకతో దర్శనమిస్తుంది. రాహు, నవగ్రహ పరిహార పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి.

ఉప్పు ప్రసాదం!
రెండోరోజున కుంభకోణం సమీపంలోనే ఉన్న సూర్య భగవానుడి ఆలయాన్నీ, కంజనూరులోని శుక్రుడి ఆలయాన్నీ దర్శించి వైదీశ్వరన్‌ చేరుకున్నాం. ఇక్కడి స్వామి వైద్యనాథుడు. కుజగ్రహ క్షేత్రమైన ఈ ఆలయంలో కుజ దోష పరిహార పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి భక్తులు ఉప్పు, బెల్లం, మిరియాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాడీ జ్యోతిషానికి కూడా ఈ వూరు ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి బుధ గ్రహ క్షేత్రం తిరువేంగడుకు చేరుకున్నాం. ఆ ఆలయ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ శ్వేతారణ్యేశ్వర స్వామి, బ్రహ్మ విద్యాంబిక, నటరాజస్వామి, అఘోరమూర్తి, శ్వేతకాళి కొలువై ఉన్నారు. వీటిలో ఓ ఆలయ నిర్మాణం కేరళను గుర్తుతెస్తుంది. ఇక్కడి రెండు తటాకాలకు సూర్యచంద్రుల పేర్లు ఉండటం విశేషం.

షష్టిపూర్తి ఉత్సవ వేదిక!
అనంతరం కేతు గ్రహ క్షేత్రమైన కీలపెరుంబళంలో నాగనాథ స్వామినీ సౌందర్యనాయకి అమ్మవారినీ అర్చించి, తిరుక్కడయూర్‌ చేరుకున్నాం. భక్త మార్కండేయునికి పరమశివుడు వరం అనుగ్రహించిన క్షేత్రంగా తిరుక్కడయూర్‌ పేరొందింది. ఇక్కడ స్వామి సుందరేశ్వరుడు. అభిరామి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తాడు. వీరి సన్నిధిలో షష్టిపూర్తి ఉత్సవాలు చేసుకోవడం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తారు. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు వృద్ధ దంపతులకు వారి బంధువులు ఇక్కడ షష్టి పూర్తి వేడుక నిర్వహించడం చూశాం.

పట్టుదారాల దారాసురం!
ఇక శనీశ్వర క్షేత్రమైన తిరునల్లారు శనిదోష నివారణ పూజలకు పేరు. ఇక్కడ దర్భారణ్యేశ్వర స్వామిని సేవించుకొని దారాసురం చేరుకున్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. శిల్పకళాశోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజచోళుడు నిర్మించాడు. ఇక్కడి ఐరావతేశ్వరుని దర్శించి, ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ కుడ్య చిత్రాలనూ ఆసాంతం తిలకించాం. అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోయాం. అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూశాం.

దారాసురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేకపోయాం. అక్కడి నుంచి నాచ్చియార్‌ కోయిల్‌ వెళ్లి శ్రీనివాసుడు, తాయారులతోపాటు గర్భాలయంలో కొలువైన అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు, బలరాముడు, బ్రహ్మమూర్తులను దర్శించాం.

శ్వేత గణపతి!
మూడోరోజు కుంభకోణంలోని ప్రసిద్ధ ఆలయాలతోపాటు చుట్టుపక్కల మరికొన్ని పురాతన దేవాలయాలను దర్శించాం. ముందుగా కుంభకోణం క్షేత్రానికి ఆ పేరు తెచ్చిన ఆది కుంభేశ్వర స్వామినీ మంగళాంబికనూ దర్శించుకున్నాం. తెలుగులో కుంభకోణం అనే పదానికి మరో అర్థముంది. కానీ స్థల పురాణం ప్రకారం కుంభకోణం అనేది ఎంతో ప్రాశస్త్యమైనది. ప్రళయానంతరం సృష్టి పునరుజ్జీవనానికై సర్వేశ్వరుడు జీవాన్ని ఓ కుంభంలో దాచిన క్షేత్రం ఇదేననీ, సృష్టి తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభమైందనీ చెబుతారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన సుప్రసిద్ధ సారంగపాణి ఆలయానికి వెళ్లాం. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 170 అడుగులు. మహాలక్ష్మిని వివాహమాడేందుకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, అశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి సారంగపాణిగా ఇక్కడ అవతరించాడట. గర్భాలయం కూడా రథాకృతిలోనే ఉండటం విశేషం. స్వామి ఇక్కడ శయన భంగిమలో దర్శనమిచ్చాడు. ఇక్కడి అమ్మవారి పేరు కోమలవల్లి. ఈ ఆలయానికి ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం ఉన్నాయి. అర్ధ సంవత్సరం పాటు ఒక్కో ద్వారం తెరచి ఉంచుతారు. ఆలయం గోడలపై భరతనాట్య భంగిమలను కూడా చెక్కారు. అక్కడి నుంచి చక్రపాణి ఆలయానికి వెళ్లి త్రినేత్రుడైన స్వామిని చూశాం. వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించాక, తిరువళంచుళి వెళ్లి శ్వేత గణపతిని సేవించుకున్నాం. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై ఇక్కడికి దగ్గరలోనే ఉంది. దీనికి 60 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లెక్కి కుమారస్వామిని పూజించుకున్నాం. ఈ ప్రాంతంలో అనేక శిల్పశాలలు ఉన్నాయి. వీటిల్లో వందలాది శిల్పులు రాతితోనూ వివిధ లోహాలతోనూ అనేక దేవతామూర్తుల ప్రతిమలను అద్భుతంగా రూపొందిస్తున్నారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఏడోదైన తిరుపుళ్లంపుదంగుడి వెళ్లి, వల్‌విల్‌ రాముని ఆలయంలో శయన భంగిమలో ఉన్న శ్రీ రామచంద్రుని అర్చించుకున్నాం. ఈ గర్భాలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతోబాటు బ్రహ్మ, జటాయువులతో కూడా కొలువుదీరడం విశేషం.

మహామహం పుష్కరిణి!
అక్కడి నుంచి వైష్ణవ దివ్యదేశాల్లో మరొకటైన ఆదనూరు చేరుకుని రంగనాథుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడి గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి, బ్రహ్మ, భృగు మహర్షి, అగ్నిదేవుడు, కామధేనువు కొలువై కనిపిస్తారు. కుంభకోణం తిరిగివచ్చి, ఆది వరాహస్వామి, నాగేశ్వరస్వామి ఆలయాలను మహామహం పుష్కరిణిని చూశాం. కుంభకోణం అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఈ పుష్కరిణే. ఆరు ఎకరాలకు పైగా విస్తీర్ణంతో అలరారే ఈ తటాకం చుట్టూ 16 మండపాలు, తటాకం లోపల 21 బావులు ఉన్నాయి. ఇక్కడ ఏటా మాఘమాసంలో జరిగే ఉత్సవం కాకుండా 12 సంవత్సరాలకొకసారి జరిగే ఉత్సవాలకు లక్షలాది భక్తులు వస్తారు. అనంతరం పట్టాభిరామస్వామి ఆలయంలో సీతాలక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత శ్రీరామచంద్రమూర్తిని సేవించాం. ఇక్కడ ఆంజనేయస్వామి వీణాపాణియై దర్శనమివ్వడం విశేషం. ఇక్కడి వైష్ణవాలయాల్లో మూలవిరాట్‌ విగ్రహాలు పది అడుగులకు పైగా ఎత్తులో నేత్రపర్వంగా ఉన్నాయి.ఓ బ్లాగు ద్వారా పరిచయమై, ఈ ఆలయాలనూ చూసేందుకు మాకు మార్గనిర్దేశం చేసిన మిత్రుడు విజయకుమార్‌గారికి ఫోనులోనే కృతజ్ఞతలు తెలియజేసి, తిరుగుప్రయాణమయ్యాం.

Thursday, 9 February 2017

ఆనందానుభూతుల ద్వారం...నైమిశారణ్య మార్గంముక్తినాథ్‌
ఆనందానుభూతుల ద్వారం...నైమిశారణ్య మార్గంవిష్ణుభక్తులందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడే పుణ్య క్షేత్రం ముక్తినాథ్‌. ఇది హిమాలయాల్లో 3710 మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ముక్తినాథ్‌ 106వ క్షేత్రం. ముక్తినాథ్‌ క్షేత్రాన్ని ముక్తిక్షేత్రమనీ, త్రిశూలగ్రామం అనీ పిలుస్తారు. ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే, అటు హిందువులు, ఇటు బౌద్ధులు కూడా దీనిని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ముక్తినాథుణ్ణి ఒక్కసారి దర్శిస్తే మోక్షం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా లక్నోకి చేరుకోవాలి. ముక్తినాథుని దర్శనానికి వెళ్లే ముందు లక్నో చుట్టు పక్కల ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

నైమిశారణ్యం:
లక్నోకి సుమారు 40 మైళ్ల దూరంలో నైమిశారణ్యం ఉంది. విష్ణుమూర్తి స్వయంగా వెలసిన ఎనిమిది వైకుంఠ క్షేత్రాల్లో ఇది ఒకటి. మనం భారత భాగవతాది పురాణాలలో నైమిశారణ్యం గురించి వింటూనే ఉంటాం. అంతే కాదు, 108 దివ్యదేశాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో స్వామి అరణ్యరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి ఆలయంలోని మూలవిరాట్టును దేవరాజ్‌ పెరుమాళ్‌గా పిలుస్తారు. ఇక్కడే చక్రతీర్థం ఉంటుంది. వలయాకారం కొలను మధ్యలో మరో వలయం లాంటి దిమ్మ ఉంటుంది. ఆ కొలనుకి దక్షిణంగా దుర్గ, రాధాకృష్ణ, వినాయకమందిరాలు ఉంటాయి. దగ్గర్లోనే మహర్షులైన వ్యాస, వైశంపాయనుల గుడులు ఉన్నాయి. వాటి ఎదుట ఉన్న పెద్ద హోమగుండంలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతుంటుంది. అక్కడ పూర్వం 108 మంది రుషులు యజ్ఞం చేశారని ప్రతీతి.

గండకీనది:
నైమిశారణ్యం దగ్గర్లోనే కాళీ గండకీనది ఉంది. ఇది చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి దేవరాజ్‌ స్వామిని దర్శించుకోవాలి. పక్కనే అహోబిల మఠం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహాస్వామి గుడి ఉంది. మఠం నుంచి అయిదు గంటలు ప్రయాణిస్తే అయోధ్యకు చేరుకోవచ్చు.

రాముడి జన్మస్థానం :

అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. అక్కడకి దగ్గరలో రాముడు జన్మించిన ప్రదేశం ఉంది. రామమందిరానికి వెళ్లే వీధులన్నీ ఇరుకుగా ఉంటాయి. ఆలయంలో రాముడికీ సీతకీ మాత్రమే మందిరాలు ఉన్నాయి. రామజన్మభూమి ప్రాంతం భద్రతాపరమైన తనిఖీల మధ్య దర్శించుకోవాల్సి ఉంటుంది. .

ముక్తినాథుని యాత్ర:
ముక్తినాథ్‌ ఆలయం నేపాల్‌లోని ముస్తాంగ్‌ జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా సరిహద్దు గ్రామమైన సొనాలి చేరుకోవాలి. ఇది సగం నేపాల్‌లోనూ సగం భారత్‌లోనూ ఉంది. ఇక్కడ భద్రతాపర తనిఖీలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి పోఖ్రా విమానాశ్రయం చేరుకొని జమ్‌సమ్‌ చేరుకోవాలి. పోక్రా నుంచి విమానంలో ప్రయాణించేటప్పుడు మంచుకొండలు, జలపాతాలు, అగాథంలా కనిపించే లోతైన లోయలు అద్భుతంగా ఉంటాయి. జమ్‌సమ్‌ మంచుశిఖరాలు కనులవిందుగా అనిపిస్తాయి. జమ్‌సమ్‌ నుంచి ఇరుకైన దారిలో గంటన్నర ప్రయాణిస్తే రాణీపువా గ్రామం చేరుకోవచ్చు. అక్కడ మోటారు సైకిళ్ల మీద నేపాలీయులు చాలామంది ఉంటారు. బైక్‌లమీదే ముక్తినాథ్‌కు వెళ్లాలి. ఎందుకంటే అది చాలా ఇరుకైన దారి. సుమారు 20 నిమిషాలు ప్రయాణిస్తే ముక్తినాథ్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ హోటళ్లు తక్కువగా, చాలా చిన్నవి ఉంటాయి.

దేవాలయాన్ని చేరుకుని, స్వామిని సందర్శించుకోవాలంటే కనీసం 200 మెట్లు ఎక్కాలి మరి. తీరా ఆలయానికి చేరుకున్నాక, ఇంత చిన్న ఆలయమా! అని అనిపిస్తుంది కానీ, గుడి ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, గర్భాలయంలో వింజామరలు వీచే శ్రీదేవి, భూదేవిలతో సహా సాక్షాత్కరించే శ్రీమన్నారాయణుని దివ్యసుందర విగ్రహాన్ని దర్శించుకునేసరికి, ఆ భావన కాస్తా ఎటో ఎగిరిపోతుంది. ఆలయ అంతరాళంలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుదేవుడి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగానే, మనసు వైకుంఠానికి వెళ్లిపోతుంది. తన భక్తులూ తనతో సమానం అన్నట్లుగా ఆ స్వామి మూర్తి పక్కనే ఆయనకు పరమ భక్తాగ్రేసరుడైన రామానుజుల విగ్రహం దర్శనమిస్తుంది. గుడి పక్కనే 108 గోముఖాల గుండా నీటిధారలు పడుతుంటాయి. వీటి నుంచి వచ్చే నీళ్లు చల్లగా రక్తం గడ్డ కట్టేటట్లు ఉంటాయి. గుడికి దగ్గరలో దివ్యమైన జ్వాలతో మన అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేసేందుకా అన్నట్లు ఒక దివ్య జ్యోతి మినుకు మినుకుమని వెలుగుతుంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పే మూడు జ్యోతులు ఉంటాయని భక్తుల విశ్వాసం.

శ్వేత గండకీ నది, డేవిడ్‌ పాల్స్‌:
పోఖ్రా నుంచి శ్వేతగండకీ నదికి వెళ్లవచ్చు. ఇక్కడ నీళ్లు పాలల్లా తెల్లగా, స్వచ్ఛంగా, తాగడానికి కొబ్బరినీళ్లలా ఉంటాయి. అక్కడికి దగ్గరలోనే డేవిడ్‌ ఫాల్స్‌ ఉన్నాయి. నీటిధారల్నీ భూమినీ ఎవరో కళాకారుడు చెక్కినంత అందంగా అక్కడ జలపాతం దూకుతూ ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదు.

పశుపతి నాథ్‌
ఖాట్మండు నుంచి 12 గంటలు ప్రయాణిస్తే పశుపతి నాథుణ్ని దర్శించుకోవచ్చు. దారి మధ్యలో ఒక వైపు వాగులు మరో వైపు క్యాబేజీ కాలీఫ్లవర్‌ పంటపొలాలూ చూసుకుంటూ వెళ్లవచ్చు. పశుపతినాథుని ఆలయం చాలా విశాలంగా, సుందరంగా ఉంటుంది. ఆలయంలో ఈశ్వరుడు చతుర్ముఖుడు. గుడిలోపల వినాయకుడు, నర్‌నారాయణ్, శ్రీరామమందిరాలు కూడా ఉన్నాయి. పక్కనే భాగమతీనది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఘాట్‌లో దహనం చేసి నదిలో కలిపితే కాశీలో మరణించిన పుణ్యం వస్తుందని స్థలపురాణం చెబుతోంది.

నీలకంఠ బుద్ధుడు:
నీల్‌కంఠ ఆలయం చాలా పెద్దది. గుడి మధ్యలో పెద్ద కొలను ఉంది. దాని మధ్యలో శ్రీమన్నారాయణుడి విగ్రహం ఉంది. అందువల్ల కొలను నీళ్లతో ప్రక్షాళన చేసుకోవడమే మహాప్రసాదంగా భావిస్తారు భక్తులు. అక్కడికి దగ్గరలో రాధాకృష్ణుడి ఆలయం ఉంది. ఇది ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా రక్షించబడుతోంది. పగోడాల్లాంటి గోపురాలు, పెద్ద సింహాలు, ఏనుగుల శిల్పాలతో పాటు నర్తన గణపతి, కాళికాంబ విగ్రహాలు చెక్కి ఉన్నాయి. రాధాకృష్ణమందిరంలో పైకప్పుపైన చెక్కిన మహాభారత ఘట్టాలు నయన మనోహరంగా ఉంటాయి. ముక్తినాథ్‌ యాత్రలో భాగంగా చాలా ప్రదేశాలను చూడవచ్చు. ఈ యాత్ర మనకు ఎన్నో మధుర స్మృతులను మిగులుస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి?
ముక్తినాథుణ్ణి సందర్శించుకోవడానికి మార్చి నుంచి జూన్‌ వరకు అనుకూలంగా ఉంటుంది. అంతకన్నా ముందు లేదా ఆ తర్వాత వెళ్లలేం. వొళ్లు గడ్డకట్టించే చలి పులి, అతిశీతలవాయువులు మనల్ని తరిమి తరిమి కొడతాయి. మనం ఆనందానుభూతులను పొందలేము కూడా. కాబట్టి మనకు ఎండలనుంచి ఉపశమనం కలగాలన్నా, మంచుకొండల మధ్యన మనం ఆనందాన్ని అనుభవించాలన్నా ఎండాకాలమే మంచిది.

– డి.వి.ఆర్‌.భాస్కర్‌Wednesday, 8 February 2017

శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి

శుభాలనిచ్చే శోభనాచలుడు
శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి


దక్షిణ హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఆగిరిపల్లి శోభనాచలం. కృష్ణాజిల్లా విజయవాడ–నూజివీడు మధ్యలో ఉన్న ఈ ప్రాచీన దివ్యక్షేత్రాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక పరవశానికి లోనవుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆశ్రయించిన భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడు. ఇది శివకేశవ క్షేత్రం కూడా. ఇక్కడి స్వయంభువుగా వెలసిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నృసింహుణ్ణీ, చేరువనే వెలసిన పరమశివుణ్ణీ దర్శించి జన్మధన్యంగా భావించే భక్తులు ఎందరో. మాఘమాసంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి, శోభనాచలుని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. ఇటీవల రథసప్తమి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని స్వామిని సేవించుకున్నారు.

స్థల ప్రాశస్థ్యం
బ్రహ్మాండ పురాణంలో ఆగిరిపల్లి దేవాలయ స్థల ప్రాశస్థ్యం ఉంది. దానిప్రకారం కృతయుగాన శుభవ్రతుడనే రాజు శ్రీమహావిష్ణువు గురించి చాలాకాలం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ‘నేను పర్వతాకారం పొందుతాను. మీరు లక్ష్మీసమేతులై నా యందు వేంచేసి ఉండాలి’ అని శుభవ్రతుడు కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ‘పరమేశ్వరుని కూడా ప్రార్థించు. ఉభయులం వస్తాం’ అని చెప్పాడు. దాంతో ఆ రాజు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహమూ పొందాడు. తత్ఫలితంగా శివ పరమేశ్వరులిరువురూ ఈ క్షేత్రంలో వెలసి పూజలందుకుంటున్నారు. శుభవ్రతుడు తన తపస్సుతో పర్వతాకారం పొందాడు కాబట్టి ఈ కొండ శోభనగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఈ పర్వతానికి పశ్చిమాన ఉన్న కొలనుకు ‘వరాహ పుష్కరిణి’ అని పేరు. వరాహావతార ఘట్టంలో శ్రీ స్వామివారిచే ఇది నిర్మించబడిందని ప్రతీతి. ‘కిరి’(వరాహం)చే నిర్మించబడిన కొలను గల పల్లె కాబట్టి శోభనగిరికి దక్షిణంగా ఉన్న గ్రామం ‘ఆకిరిపల్లి’ కాలక్రమేణ ‘ఆగిరిపల్లి’ అయిందని అంటారు.

మరో కథనం
పూర్వం శివకేశవులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు విష్ణుమూర్తి ‘నేను ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేస్తాను. నివసించడానికి అనువుగా ఉండే పర్వతం చూడమని శివుణ్ణి పంపాడు. శివుడు అన్ని పర్వతాలు చూసి వాటన్నింటిలో శోభనగిరి పర్వత సౌందర్య పర్వతానికి ముగ్ధుడై విష్ణుమూర్తికి ఈ కబురు చెప్పకనే అక్కడే ఉండిపోయాడు. ఈలోపు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి కొలను నిర్మించాడు. కాని శివుడు ఎంతకూ రాకపోవడంతో వెదుకుతూ వచ్చి శివుడు స్థావరం ఏర్పరుచుకోవడం చూసి అక్కడ నుంచి ఒక్క గంతు వేయగా రాతిమీద పాదముద్రలు పడ్డాయి. అక్కడ విష్ణువు వ్యాఘ్రస్వరూపుడై వెలిశాడు.

పూజలు ప్రారంభమైంది ఇలా
క్రీ.శ.17వ శతాబ్ది ప్రారంభంలో అచ్యుత భాగవతి, అనంత భాగవతి అనే పరమ భక్తులు ఉండేవారు. ఒకరోజు పరమేశ్వరుడు వీరిరువురికీ కలలో కనబడి శివకేశవులం ఇక్కడ వెలసి ఉన్నామని, తమకు పూజాదికాలు ఒనర్చాలని కోరాడు. మరునాడు వీరిరువురూ తమ స్వప్న వృత్తాంతం గ్రామస్తులకు చెప్పగా అందరూ దేవాలయ నిర్మాణానికి కావలసిన స్థలం చూసేందుకు బయలుదేరారు. అంతా అరణ్య ప్రాంతం కావడం, భక్తులు తనను గుర్తించలేకపోవడం చూసిన పరమేశ్వరుడు తంగేడు, ఇతర పూలను బారులు తీర్చి తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించేటట్టు చేశాడు. దాంతో అందరూ శోభనగిరి శిఖరం మీద వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వరూపంలో విష్ణుమూర్తిని, చేరువలో నీలగళుని ఆకారంలో పరమశివుణ్ణి చూశారు. వెంటనే స్వామికి అభిషేకం చేద్దామని నీటి కోసం వెతకగా కొలను కనిపించింది. ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేసి సంతృప్తులయ్యారు. తర్వాత అచ్యుత, అనంత భాగవతులు శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. శ్రీ శోభనాచలస్వామికి జరిపే ఉత్సవాలు చూసి కొండపల్లి ఫిర్కా ముజుందారు ఇందుపూడి లక్ష్మీనారాయణరావు సంతోషించి ఈ అగ్రహారాన్ని భగవత్‌ కైంకర్యంగా ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తోంది.

నూజివీడు జమీందార్ల సేవ
క్రీ.శ.1800 నుంచి క్రీ.శ.1804వరకు నూజివీడు ప్రభువులుగా ఉన్న శ్రీ రాజా రామచంద్ర అప్పారావు బహద్దూర్‌ ఈ క్షేత్రానికి ధర్మకర్తలుగా వ్యవహరించారు. అప్పటి నుంచి నూజివీడు జమీందార్లే శ్రీ స్వామివారి కైంకర్యాలను వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు. క్రీ.శ. 1890 ప్రాంతంలో దేవులపల్లి వెంకటనర్సయ్య కొందిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కూడా కట్టించారు. శనివారపుపేట ఎస్టేటు జమిందారిణి శ్రీ రాజా పాపయ్యమ్మారావు బహద్దూర్‌ వరాహ పుష్కరిణికి మెట్లు కట్టించి మంటపాన్ని నిర్మించారు.

నయనానందకరంగా నాలుగు మంటపాలు
తేలప్రోలు ఎస్టేటు జమీందారు రాజా శోభనాద్రి అప్పారావు 1856లో శ్రీ స్వామివారికి కల్యాణ మంటపాన్ని (కొఠాయి) గ్రామం మధ్యలో నిర్మించారు. అతి విశాలమైన ఈ మంటపంలో కల్యాణోత్సవాలు కడువైభవంగా జరుగుతాయి. అలాగే గ్రామంలో మరో మూడు వీధులలో నిర్మించిన ప్రాచీన మంటపాలు మూడు ఉన్నాయి. వీటిలో ఆయా పర్వదినాలలో స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆగిరిపల్లి దివ్య క్షేత్రానికి వెళ్లే మార్గం
విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రోడ్డు మార్గం–30 కి.మీ
నూజివీడు నుంచి రోడ్డుమార్గం–12 కి.మీ
గన్నవరం నుంచి రోడ్డు మార్గం–17 కి.మీ
హనుమాన్‌ జంక్షన్‌ నుంచి రోడ్డుమార్గం–20 కి.మీ
– నల్లాన్‌ చక్రవర్తుల సతీశ్‌ కుమార్‌

భీష్ముడు - కురుపితామహుడి దేవాలయం

మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణాన్ని పొందిన కురు పితామహుడు భీష్ముడు . విష్ణుసహస్ర నామాలను చెప్పిన మహానుభావుడు. పాండవులకు నీతిబోధ చేసిన రాజనీతిజ్ఞుడు. తండ్రి వివాహం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా తనువు చాలించిన పుణ్యపురుషుడు. అలాంటి భీష్ముడికి ఒకే ఒక ఆలయం దేశంలో ఉంది.

అరుదైన దేవాలయం...

అలహాబాద్‌ నగర నడిబొడ్డున అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది. యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుని, భ్రాతృత్వాన్ని అలవరచుకుంటున్నారు. పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి దారగంజ్‌లోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని J.R.భట్‌ అనే న్యాయవాది నిర్మింపచేశాడు. 1961 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్‌ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.


కురుక్షేత్రలో భీష్మకుండ్‌
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట ఒక పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. దానిని బన్‌గంగ లేదా భీష్మకుండ్‌ అంటారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేసి మంచినీరు కావాలని కోరడంతో, అర్జునుడు బాణంతో పాతాళగంగను బయటకు తీసుకువచ్చాడని, ఈ భీష్మకుండ్‌ అదేనని స్థానికులు చెబుతారు.

భారత కథలో...
శంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అప్పుడు గంగాదేవి ‘నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేను నిన్ను విడిచివెళ్లిపోతాను’ అంది. అంగీకరించాడు శంతనుడు. పెళ్లయ్యింది. గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు. ఆమె ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో విడిచింది. ఈ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలో విడిచింది. ఎనిమిదవ పుత్రుడిని విడిచి పెడుతుండగా శంతనుడు అడ్డు తగిలాడు. తను విధించిన షరతు ప్రకారం గంగాదేవి శంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును తనతో తీసుకువెళ్లి పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పింది. ఆ బిడ్డకు ‘దేవవ్రతుడు’ అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి శంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది. ఒకనాడు శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగబోయే కుమారుడే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు ఆమె తండ్రి దాసరాజు. ఈ విషయం తెలుసుకున్న గంగానందనుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు.  కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై శయనించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు. యుద్ధం ముగిసిన తరవాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేశాడు. భీష్ముడు శర శయ్య మీద ఉన్నప్పుడే విష్ణుసహస్ర నామాలను రచించాడని ప్రతీతి. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ 1008 నామాలు పఠించాడు భీష్ముడు. ఆయన జీవితం భారతీయులకు ఒక గ్రంథం లాంటిది.
– డా.పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ

Saturday, 4 February 2017

చెర్వుగట్టు జడల రామలింగేశ్వరుడు

ఆ నూట ఎనిమిదో లింగం ఇదే!

ఎందరో రాజులను చంపిన పరశురాముడు తన పాపప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా 108 శివలింగాలను ప్రతిష్ఠించాడన్నది తెలిసిన విషయమే. అందులో 108వ లింగమే నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరుడు. కొండ గుహలో కొలువైన ఈ శివయ్య దర్శనమే ఓ దివ్యానుభూతి.

భక్తవత్సలుడంటే శివయ్యనే చెప్పుకోవాలి. కాబట్టే రాక్షసులకూ వరాలిచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. భక్తులను కాసేపు ఉడికించి వూరడించిన కథలూ చాలానే ఉన్నాయి. ఈసారి ఒక పరమభక్తుడి చేతిలో ఓ దెబ్బ కూడా తిన్నాడు శివయ్య. చెర్వుగట్టు సాంబయ్యకు జడల రామలింగేశ్వరుడన్న పేరు రావడానికీ ఆ ప్రేమే కారణం.

ఇదీ కథ...
కామధేనువు విషయంలో తన తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతోపాటు, చివరికి ఆయన చావుకు కారణమైన కార్తవీర్యార్జునుడినేకాక కనబడిన రాజులందరినీ హతమార్చాడు పరశురాముడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. అందులో చివరిదే నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెర్వుగట్టు రామలింగేశ్వర లింగంగా చెబుతారు. ఈ ప్రదేశంలో ఓ గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశాడట. తాను ప్రతిష్ఠించిన దానికన్నా శివలింగం రోజురోజుకూ పెద్దది కాసాగింది కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడంలేదట. దీంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం మీద ఒకదెబ్బ వేశాడట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెనువెంటనే ప్రత్యక్షమయ్యాడట. శాంతించమని చెబుతూ, ఆయన కోరినట్టే కలియుగాంతం వరకూ తాను అక్కడే ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. తర్వాత పరశురాముడూ ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండి పోయి చివరకు శివైక్యం అయ్యాడని పురాణగాథ. ఇలా కొట్టడం వల్ల శివలింగం బీటలు వారి వెనుకవైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్టు కనిపిస్తుందట. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ప్రస్తుతం కొండమీద నిర్మించిన గుడిలో గుహాలయంలో స్వామి దర్శనమిస్తాడు. పార్వతీ దేవి ఆలయం విడిగా ఉంటుంది.

పెద్ద జాతర...
తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెర్వుగట్టు ప్రత్యేకమైనది. ఇక్కడి శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ వదులుతుందని కొందరూ, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కొందరూ నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగానూ పిలుస్తారు. 3, 5, 7, 9, 11 లేదా 21 అమవాస్యలు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల అపారమైన విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్యల సమయంలో రద్దీ ఎక్కువ. ఇక, ఏటా మాఘశుద్ధ పంచమి నాటి నుంచి ఐదురోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి (ఈ ఏడాది ఫిబ్రవరి 3) నాటి అర్ధరాత్రి నిర్వహించే శివకళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు. జాతర సమయంలో రైతులు తమ పొలంలో పండించిన కందులు, ఆముదాలు, పత్తి, వరి తదితరాలను దేవుడికి సమర్పిస్తారు. జాతరకు రైతులంతా ఎడ్లబండ్లపైనే సందడిగా వస్తుంటారు.

మూడు గుండ్లు...
ఆలయానికి సమీపంలో ఉండే మూడుగుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త పక్కన ఓ చోట మూడు పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. కానీ ఎంత శరీరం ఉన్నవాళ్లైనా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులోంచి అవతలికి చేరగలగటం ఇక్కడి దేవుడి మహిమకు తార్కాణంగా చెబుతారు. దేవాలయంలోని కోనేరులో స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టును చేరతారు. ఇక్కడి చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకల జతలు చాలా ఉంటాయి. వాటిని శరీరం మీద ఉంచుకుని స్వామికి మొక్కుతారు. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే మంచిదని నమ్ముతారు. ఇక్కడి హనుమ, వీరభద్ర, శివరేణుక తల్లి దేవాలయాలకూ మంచి ప్రాశస్త్యం ఉంది.

ఇలా వెళ్లొచ్చు
చెర్వుగట్టు హైదరాబాద్‌ - నల్గొండ ప్రధాన రహదారిలో హైదరాబాద్‌ నుంచి సుమారు 90 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి నల్గొండ వెళ్లే ప్రతి బస్సు చెర్వుగట్టు నుంచే వెళుతుంది. గట్టుపైకి వెళ్లాలంటే నార్కెట్‌పల్లి - అద్దంకి జాతీయ రహదారిపైన దిగి అక్కడి నుంచి 2 కి.మీ. ప్రయాణించాలి. క్షేత్రానికి రోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ, సూర్యాపేట నుంచి వచ్చేవారు నార్కెట్‌పల్లిలో దిగితే అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

- జీడిపల్లి దత్తురెడ్డి, ఈనాడు, నల్గొండపార్వతీ రామలింగేశ్వరాలయం

పార్వతీ రామలింగేశ్వరాలయం
పరశురామ శివుడు!పరమశివుడి మహాభక్తుడూ, ప్రియశిష్యుడూ అయిన పరశురాముడు స్వయంగా పునఃప్రతిష్ఠించిన లింగమిది. కాబట్టే, విజయవాడలోని యనమలకుదురులో కొలువైన పార్వతీరామలింగేశ్వరుల్ని పూజిస్తే... కష్టాలూ నష్టాలూ గొడ్డలితో కూల్చినట్టు సమూలంగా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

పార్వతీ రామలింగేశ్వరాలయం విజయవాడలోని యనమలకుదురు కొండ మీద విరాజిల్లుతోంది. పవిత్ర కృష్ణాతీరంలో... వాయులింగంగా శివుడిక్కడ పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా వెలుగొందింది. ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని విశ్వసించేవారు. ఎక్కడెక్కడి సాధకులో వచ్చి ఘోరతపస్సు చేసేవారు. వేయిమంది మునులు తపస్సును ఆచరించిన చోటు కాబట్టి, ‘వేయి మునుల కుదురు’ అన్న పేరొచ్చింది. అదే కాలక్రమంలో, యనమలకుదురుగా స్థిరపడింది. మునిగిరి అనీ పిలుస్తారు. ఇప్పటికీ ఈ గాలిలో ఓంకార నాదం వినిపిస్తుందని ఓ ప్రచారం.

స్థల పురాణమిదే...
దశావతారాల్లో ఆరవది పరశురామ అవతారం. త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు... ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన గొడ్డలిని కానుకగా పొంది... పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు. ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. అదీ పరశురాముడి శక్తి! ఒకానొక సందర్భంలో...అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రిమాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు. కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు... ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆతర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు. మళ్లీ సీతాస్వయంవర సమయంలో వచ్చి... తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యానికి కూడా వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలసిన పార్వతీరామలింగేశ్వరస్వామిని దర్శించుకుని... వేదోక్తంగా పునఃప్రతిష్ఠంచినట్టు స్థానికుల విశ్వాసం. అదే సమయంలో కొండపై నుంచి నదీప్రవాహం వరకూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించాడని అంటారు. కాలక్రమంలో అవి భూగర్భంలో కలసిపోయాయి. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది. వనవాస సమయంలో...సీతారాములు రామలింగేశ్వరస్వామిని పూజించారని కూడా ఓ కథనం. ఎంతోమంది పాలకులు ఆదిదంపతుల్ని అర్చించి తరించారు. చాళుక్యులూ కాకతీయులూ రెడ్డిరాజులూ విజయనగర ప్రభువులూ మునిగిరి మహాదేవుడిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యాల్నీ అనావృష్టినీ చోరభయాల్నీ పరశురాముడు పరశువు (గొడ్డలి)తో రూపుమాపుతాడని భక్తుల నమ్మకం. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయకుడు, దాసాంజనేయస్వామి కొలువుతీరారు.

వైభవంగా ప్రభోత్సవం
మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటూ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు నిర్వహించే ప్రభోత్సవాల ప్రాధాన్యంపై ఓ కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఓసారి ఆధిపత్య పోరు మొదలైంది. ఎవరికివారు ‘నేనే గొప్ప’ అంటూ వాదించసాగారు. దీంతో పరమేశ్వరుడు జోక్యం చేసుకొని మహాలింగంగా ఉద్భవించాడు. బ్రహ్మ, విష్ణువుల్లో ఒకరిని తన పాదాన్నీ, మరొకరిని తన శిరస్సునూ...ఎవరు ముందుచూసి వస్తే వారే గొప్పవారని పరీక్షపెట్టాడు. ఆ ఇద్దరూ ఎంత ప్రయత్నించినా, లింగరూపంలో ఉన్న శివుడి ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. ఆ మహారూపానికి ప్రతీకలుగానే శివరాత్రి సమయంలో ప్రభలను కడతారని ఓ నమ్మకం. వాటిని శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ఉత్సవం రోజు రాత్రి రంగురంగుల విద్యుద్దీపాల మధ్య...మేలుజాతి వృషభాలతో, మేళతాళాలతో ప్రభలను గిరి ప్రదక్షిణ చేయిస్తారు. శివరాత్రి తెల్లవారి స్వామివారి కల్యాణం, గ్రామోత్సవం ఘనంగా జరుగుతాయి. మూడో రోజున పార్వతీరామలింగేశ్వరస్వామి వసంతోత్సవం కనులవిందుగా నిర్వహిస్తారు. కష్టాలను తొలగించాలని కోరుతూ గండదీపాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రామలింగేశ్వరస్వామిని ఒకసారి దర్శిస్తే, వేయిమంది మునుల అనుగ్రహాన్ని అందుకున్నంత ఫలమని భక్తుల నమ్మకం. ఈ ఆలయం విజయవాడ బస్‌, రైల్వేస్టేషన్లకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. కనకదుర్గమ్మ దేవాలయం నుంచి అయితే ఏడు కిలోమీటర్లు.
- దండంరాజు మనోజ్‌కుమార్‌