Monday, 13 March 2017

శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి





తెలంగాణ మహానంది
జల లింగం.. ‘బుగ్గ’ క్షేత్రం
శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి





శివలింగం అడుగున ఊట!
అంతు చిక్కని రహస్యం!!
ఎక్కడైనా శివుడి తలపై గంగమ్మ!
కానీ.. ఆ గుడిలో మాత్రం.. శివలింగం కింది భాగంలో ఉబికి వచ్చే ఊటలా భాగీరథి!!
తలవొగ్గి ఆ లింగానికి చెవి ఆనిస్తే.. నీటి ప్రవాహ శబ్దం!
అక్కడ నుంచి పుష్కరిణి వద్ద ఉన్న నంది నోటిలోకి ఆ జలధార ప్రయాణం!!
ఎంత ఎండాకాలమైనా.. మండే ఎండలు కాస్తున్నా.. శివలింగం కింద నీటి ఊట ఇంకదు. ఆ నంది నోటి నుంచి వచ్చే నీటి ధార ఆగదు!
ఆ ప్రవాహం అంతూదరీ ఏమిటో తెలుసుకోవడానికి చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. ఏమిటా క్షేత్ర ప్రత్యేకత? ఆ గుడెక్కడుంది?

తెలంగాణ మహానందిగా.. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వికారాబాద్‌ పట్ణణ శివారులోని అనంతగిరిపల్లిలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించినట్టుగా పేర్కొనే శివలింగం అడుగుభాగం నుంచి సర్వకాల సర్వావస్థల్లోనూ నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీరు నంది ముఖం గుండా పుష్కరిణిలోకి ప్రవేశిస్తుంటుంది. అందులో స్నానమాచరించి స్వామివారి అభిషేక తీర్థం స్వీకరిస్తే సకల పాపాలు, దీర్ఘవ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. 


లింగం అడుగు భాగం నుంచి వచ్చే నీటి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ఎంత మంది ప్రయత్నించినా ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు. దేవాలయ పునరుద్ధరణ పనులు చేపట్టిన సమయంలో కూడా.. గుడి చుట్టూ లోతుగా తవ్విచూశారు, గానీ ఉపయోగం లేకపోయింది. చెవులు దగ్గరగా చేర్చి జాగ్రత్తగా వింటే శివలింగం కిందిభాగంలో నుంచి నీరు ప్రవహిస్తున్నట్లుగా శబ్దం వినిపించడం విశేషం. సుందరమైన అనంతగిరి అటవీ ప్రాంతంలో ఒకవైపు శ్రీ అనంత పద్మనాభుడు కొలువైతే.. మరోవైపు శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి కొలువుదీరాడు. శని, ఆది, సోమవారాల్లో స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

అనంతగిరి కొండపైన అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న భక్తులు బుగ్గ రామలింగేశ్వరస్వామిని కూడా దర్శించుకుంటారు. గతంలో రామలింగేశ్వరుడి దేవాలయం చిన్నగా ఉండేది. అప్పట్లో వికారాబాద్‌ నుంచి అడివయ్య అనే వ్యక్తి రోజూ ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి రామలింగేశ్వరుడికి నిత్యపూజలు చేసేవారు. ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఎస్‌.వీరప్ప, శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు దివంగత ఆమని భద్రప్ప తదితరులు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.



No comments:

Post a Comment