Sunday, 13 May 2018

బైద్యనాథ్ దేవాలయం


బైద్యనాథ్ దేవాలయం
భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది.
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు.
ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు.
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె.
“మార్టిన్. ఐ మిస్ యూ మార్టిన్. ఐ మిస్ యూ సో మచ్ డియర్”
కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది.
సాయంత్రం.
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు.
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది.
వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది.
ఉన్నట్టుండి.
గణ గణ గణ గణ …..
గణ గణ గణ గణ……
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది.
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె.

దూరంగా ఒక శిధిల దేవాలయం.
అందులో నుంచి హారతి దీపాల వెలుగు.
ధూపాల పొగ. ఘంటారావం.
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది.
గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది.
లోపల వైద్యనాథ మహాదేవ శివుడు.
లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.
ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి.

ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.
కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది.
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు.
“మేమ్ సాబ్ తీర్థం తీసుకొండి.”
“ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు.”

ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది.
“మేమ్ సాబ్ కంగారు పడకండి. బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు. ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది.” అన్నాడు.

ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది. “ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.” మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు. ఇంకో ధ్యానం లేదు. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.

ఒకటి … రెండు …. మూడు ….. నాలుగు …. అయిదు …..
రోజులు గడిచిపోతున్నాయి.
“ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.”

పదకొండో రోజు. రోజు రోజంతా పంచాక్షరిని జపించింది
సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు “మేమ్ సాబ్ … మేమ్ సాబ్… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై…” అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది.
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది. కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది.

“డియర్. గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే. ఆహారమూ తక్కువే. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు. అంతలో అద్భుతం జరిగిపోయింది. ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు… ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు….ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది. ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు. వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్.”.

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండ మీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు.
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది.


Indian Temple Built by a British Man

Interesting Story..
In 1879, when the British were ruling India, Lt. Col. Martin of Agar Malva was leading the army in the war against Afghanistan.

Col. Martin used to regularly send messages of his well-being to his wife. The war continued for long & Lady Martin stopped getting messages. She was very upset.

Once riding on her horse, she passed by the temple of Baijnath Mahadev. She was attracted by the sound of Conch & Mantra. She went inside and came to know that the Brahmanas were worshipping Lord Shiva. They saw her sad face and asked her problem. She explained everything to them. They told her that Lord Shiva listens to the prayers of devotees and takes them out of difficult situations in no time. With the advice of the Brahmanas she started the ‘Laghurudri Anushtthan’ of the Mantra:

‘Om Namah Shivaya’ for 11 days. She prayed to Lord Shiva that if her husband reaches home safely, then she would get the temple renovated.

On the last of the ‘Laghurudri’ a messenger came and gave a letter to her. Her husband had written: ‘I was regularly sending messages to you from the battle grounds but suddenly the Pathans surrounded us from all sides. We were entrapped in a situation where there was no scope of escaping death. Suddenly I saw a Yogi of India with long hair, carrying a weapon with three pointers (Trishul). His personality was amazing and he was maneuvering his weapon with a magnificent style. Seeing this great man, the Pathans started running back. With his grace our bad times turned into moments of victory. This was possible only because of that man of India wearing a lion skin & carrying a three-pointer weapon (Trishul). That great Yogi told me that I should not worry and that he had come to rescue me because he was very pleased with my wife’s prayers.’

Tears of joy were falling down Lady Martin’s eyes while reading the letter. Her heart was overwhelmed. She fell into the feet of Lord Shiva’s statue and burst in tears.

After a few weeks Col. Martin returned. Lady Martin narrated the whole incident to him. Now both husband & wife became devotees of Lord Shiva. In 1883 they donated Rs. 15,000 for renovating the temple. The information engraved slab for the same is still there in the Baijnath Mahadev Temple of Agar Malva. This is the only Hindu temple built by a Britisher.

Analysis: The message talks about the Baijnath Mahadev (Shiva) Temple in Agar Malwa of Madhya Pradesh state in India, that it is the only temple made by a Britisher in India, and that it happened after the Colonel Martin was miraculously saved by an avatar of Lord Shiva – post prayers from his wife, Lady Martin. Many people could not believe these supernatural claims, but there are documented records suggesting such an incident could have possibly happened. There is some misinformation in the story though.

History of Baijnath Temple 

This famous Baijnath Mahadev Temple is located in southern banks of Banganga river in Agar Malwa of Madhya Pradesh, India. The Shiv Ling (the sacred stone form of Lord Shiva) in the Baijnath temple is believed to belong to 13th century, while some legends say it is probably more than thousand years old. As written in the foundation stone of the temple (shown in a Hindi documentary video of the temple in reference section below, at timeline 5:32), at the end of 16th century, the local inhabitants built a small mutt like mandhir and mandap (a type of small temple structure). Then after 300 years, in 1883, with the inspiration from British army Hindu officials, and financial help of British Commander Lt. Colonel C. Martin and other local people, 11000 rupees was donated for the renovation of the temple, making it large, and also building few other temples around it.

There is also another piece of writing on one of the pillars in middle of the temple suggesting that it was built (renovated) with the orders of C. Martin in 1883. The official website of Shajapur district in Madhya Pradesh (shajapur.nic.in), where this temple is located, also mentions about this story. It is said that when the British Commander Martin was in a war, his wife went to Baijnath mahadev temple and made a request for his returning. Then Martin successfully came back from the war, and thereafter a beautiful temple was constructed.

Our verification says that Agar is an ancient archaeological site, located 66 KMs from Ujjain, and was a Camp (Chhavani) in English period. And Lt. Colonel C. Martin was indeed the Commander of Central India Horse British regiment during the second Anglo-Afghan war between 1878-1880:

Commanded by Lt. Colonel C. Martin. The men of the Central India Horse (a wing each of the 1st and 2nd Regiments) crossed the frontier at Jamrud in February 1880 where they were then employed on the Khyber line of communications. In May a portion of the force was involved with the expedition against Mullah Khalil in the Besud Valley, before they were called to Kabul to join General Roberts’ force that was to march on Kandahar. They fought at the battle of Kandahar, including the pursuit of the retreating Afghans, and then returned to India in October.

The Baijnath Mahadev Temple is known to be powerful – for the Lord Shiva residing there shall fulfill the sincere wishes of all the people who pray and worship him. Not just thousands of Indians, many people from other countries also visit the temple quite often.

Conclusion 

Considering the aforementioned documented records and the beliefs about the power of the temple, we can conclude that such an incident could have possibly happened. So the Baijnath Mahadev Temple is the only Indian temple made by a Britisher during their rule in India.

There is this popular belief among Indians, especially Hindus, that God sometimes comes in human form (avatar or incarnation) to rescue his sincere devotees who are in trouble. One such example is the story of Bhadrachala Ramadasu (Kancherla Gopanna) who has been very keen and devoted towards Lord Rama that when he was jailed for using tax money to renovate the holy Rama temple at Bhadrachalam, both Rama and Lakshmana, in the guise of two youngsters paid up his dues to release him. Apart from the numerous songs of praise written by Ramadasu, the golden coins paid by Rama, known as Ram Tanka coins can be seen even today. You can read the detailed story from reference section below.


Monday, 7 May 2018

ఢిల్లీ


అక్బర్‌ చదరంగం ఆడింది అక్కడేనట

అక్బర్‌ కొలువుదీరింది ఇక్కడే. చదరంగం ఆడింది అక్కడే. జోధాబాయి కృష్ణుణ్ణి పూజించిన చోటు ఇదే. షాజహాన్‌ను ఔరంగజేబు నిర్బంధించింది  ఈ భవంతిలోనే. తాన్‌సేన్‌ తన సంగీత విభావరిని వినిపించిన ప్రదేశం ఇదే... అంటూ నాటి చరిత్రలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్‌ వాసి నున్నా వేణుగోపాలరావు.

హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి ఆగ్రాకు కారులో బయలుదేరాం. ఉదయాన్నే ఆగ్రాకు 37 కిలోమీటర్ల దూరంలోని ఫతేపూర్‌ సిక్రీ కోటను చూడ్డానికి వెళ్లాం. అప్పట్లో ఇక్కడ ఉండే సిక్రీ గ్రామంలో షేక్‌ సలీం చిస్తీ ఉండేవాడు. గుజరాత్‌ దండయాత్ర చేసి విజయానందంతో తిరిగి వస్తున్న అక్బర్‌ ఆ గ్రామంలో మజిలీ చేసి, బాబా ఆశీస్సులు పొందుతాడు. ఆ కారణంగానే జోధాబాయికి పుట్టిన కుమారుడికి సలీం అని పేరు పెట్టాడు. అతనే జహంగీర్‌. ఆ ప్రాంతం అదృష్టం తెచ్చిపెట్టిందనే భావంతో అక్బర్‌ అక్కడ ఫతేబాద్‌(విజయాల నగరం)ని నిర్మించాడు. అదే ఫతేపూర్‌ సిక్రీ. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవూ కిలోమీటరు వెడల్పులతో మూడువైపులా 50 అడుగుల ప్రహరీ, ఒకవైపు కృత్రిమ సరస్సుతో నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. నగరం లోపలికి రావడానికి ఏడు అతిపెద్ద దర్వాజాలు ఉన్నాయి. ఆగ్రా గేటు ద్వారా లోపలికి ప్రవేశించగానే నౌబత్‌ ఖానా భవనం నుంచి చక్రవర్తి రాకపోకలకు అనుగుణంగా సంగీతం వినిపించేవారట. దీనికి తూర్పుదిశగా టంకశాల ఉంది. ఇది శిథిలావస్థలో ఉంది.

ఫతేపూర్‌ సిక్రీలో...
ఫతేపూర్‌ సిక్రీ రాజభవనాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నదే బులంద్‌ దర్వాజ. దీన్ని దక్షిణ భారతం విజయాలను పురస్కరించుకుని నిర్మించాడట. 176 అడుగుల ఎత్తున్న ఈ ద్వారం ప్రపంచంలోని అతిపెద్ద దర్వాజాల్లో ఒకటిగా పేరొందింది. దీన్నుంచి లోపలకు వెళ్లగానే సూఫీ మతబోధకుడైన సలీం చిస్తీ సమాధి ఉన్న పాలరాతి కట్టడం కనిపిస్తుంది. తరవాత అక్బరు ప్రజాదర్బారు నిర్వహించిన భవనానికి వెళ్లాం. అక్కడ చక్రవర్తి కూర్చోవడానికి ఎత్తైన వేదిక ఉంది. అక్బర్‌కి జ్యోతిషంమీద నమ్మకం ఎక్కువ. హిందూ, ముస్లిం జ్యోతిషులిద్దరినీ సంప్రదించేవాడట. అందుకే వారికోసం చిన్న గోపురం వంటి కట్టడాన్ని నిర్మించాడు. ఆ గోపురం నుంచి కాస్త ముందుకు వస్తే అక్కడి విశాలమైన ప్రదేశంలో అక్బర్‌ చదరంగం ఆడిన చోటు ఉంది. గళ్లలో పావులకు బదులు మనుషులను నిలబెట్టి ఆడేవారట. దివాన్‌-ఎ-ఆమ్‌ వెనక వైపున ఉన్న భవనాలను ఖాస్‌ మహల్‌గా పిలుస్తారు. ఇవన్నీ రాజూ, రాణిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి. దీనికి మధ్యలో అక్బర్‌కోసం నిర్మించిన పడకగదిలో మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో మంచె నిర్మించి ఉంది. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. నలువైపులా పొడవాటి నీటితొట్టెల ఏర్పాటు ఉంది. అందులో సుగంధద్రవ్యాలను కలిపేవారట. ఇక్కడే రాణుల కోసం విడివిడిగా భవనాలూ వంటగదీ స్నానపుగదులూ ఉన్నాయి. జోధాబాయి భవనం అలంకరణ హిందూ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది.

వేసవిలో ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు భవన సముదాయం మధ్యలో నీటి సరస్సులను ఏర్పాటుచేయడం మొఘల్స్‌ ప్రత్యేకత. అందులో భాగంగానే ఖాస్‌మహల్‌ ప్రాంతంలో చార్‌ చమన్‌ పేరిట ఓ నీటి సరస్సును ఏర్పాటుచేశారు. సరస్సు మధ్యలోకి రావడానికి నలువైపుల నుంచీ బాటలు ఉన్నాయి. మధ్యలో ఓ వేదిక ఉంది. తాన్‌సేన్‌ ఈ వేదికమీద కూర్చునే రాజకుటుంబీకులను సంగీత రసాంబుధిలో ఓలలాడించేవాడట. తరవాత హీరామినార్‌ దగ్గరకు వెళ్లాం. తనకు విశ్వాసంతో సేవలందించిన ఏనుగు హీరా మరణానంతరం దాన్ని సమాధి చేసిన ప్రదేశంలో హీరామినార్‌ పేరిట ఓ స్మారక గోపురాన్ని నిర్మించాడు అక్బర్‌. దీని పైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. మినార్‌ మధ్యభాగంలోనూ బయటా ఏనుగు దంతాలను అమర్చారు. బులంద్‌ దర్వాజ సమీపంలో అక్బరుకి అతి సన్నిహితుడైన అబుల్‌ ఫజల్‌ మందిరం ఉంది. ప్రస్తుతం ఫతేపూర్‌ సిక్రీ కోట యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాల జాబితాలో ఉంది. అది చూశాక ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ చూసి, ఆగ్రా కోటకు బయలుదేరాం.

ఆగ్రా కోటలో...
దీన్ని కూడా అక్బరే నిర్మించాడు. ఆగ్రా కోట ఉన్నచోట రాజపుత్‌లకు చెందిన బదాయగఢ్‌ కోట ఉండేది. దాని శిథిలాలమీద 94 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారట. కోట చుట్టూ రెండు ప్రహరీలు ఉన్నాయి. అప్పట్లో రెండు కందకాలు ఉండేవి. వాటిల్లో మొసళ్లూ తాబేళ్లను పెంచేవారట. ప్రస్తుతం లోపలి కందకం మాత్రమే ఉంది. బయటి కందకాన్ని పూడ్చి, దాని స్థానంలో రోడ్డు నిర్మించారు. ఈ కోటను అక్బరు నిర్మించినా తరవాతి వాళ్లంతా తమ అభిరుచుల మేరకు మార్చుకున్నారట. చరిత్రకారుడు అబుల్‌ఫజల్‌ ప్రకారం ఆగ్రాకోటలో 500 భవనాలు ఉండేవట. ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయి.

ముందుగా ఈ కోటలో అమర్‌సింగ్‌ గేట్‌ చూసి, జహంగీర్‌ ప్రాసాదం దగ్గరకు వెళ్లాం. ఇది ఎర్రరాతితో నిర్మించిన రెండంతస్తుల భవనం. అక్బరు తన కుమారుడి కోసం కట్టించిన ఈ భవంతి లోపలి గోడలూ, పైకప్పుమీద రాజపుత్‌ శైలి అలంకరణ కనిపిస్తుంది. దీని ఎదురుగానే గ్రానైట్‌తో తయారైన బాత్‌ టబ్‌ ఉంది. దీనికి లోపలా బయటా కూడా మెట్లు ఉన్నాయి. ఇది ఒకచోట స్థిరంగా అమర్చినది కాదు. జహంగీరు ఎక్కడికి వెళ్లినా దీన్ని తీసుకెళ్లేవాడట. అక్బరు రాణివాసపు స్త్రీలకోసం ఖాస్‌మహల్‌ ఎదురుగా ఓ ద్రాక్షతోటను ఏర్పాటుచేశాడు. ఈ తోటకు మట్టిని కశ్మీర్‌ నుంచి తెప్పించాడట. షాజహాన్‌ యమున ఒడ్డువైపున నిర్మించిన దివాన్‌-ఇ-ఖాస్‌ భవనం పైకప్పు ఎంతో అందంగా ఉంది. ఇక్కడే తన నెమలి సింహాసనం మీద కూర్చుని మంత్రులతో ఆంతరంగిక సమాలోచనలు చేసేవాడట. ప్రస్తుతం ఆ సింహాసనం ఇరాన్‌లో ఉంది. అక్కడి నుంచి శీష్‌మహల్‌కు వెళ్లాం. దీన్ని జనానా మహిళలు డ్రెస్సింగ్‌ రూమ్‌గా వాడుకునేవారు. గోడలకు చిన్నచిన్న అద్దాలు తాపడం చేసి ఉండేవట. టర్కిష్‌ స్నానశాల రూపంలో కుటుంబసభ్యులకోసం ఖాస్‌మహల్‌కు ఉత్తరంగా దీన్ని షాజహాన్‌ కట్టించాడు. ఇందులో వేడి, చల్లని నీళ్ల కోసం రెండు ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన ఫౌంటెయిన్ల నుంచి సువాసనలతో నీరు ఎగసిపడేదట. రాణి నూర్జహాన్‌కోసం జహంగీరు జాస్మిన్‌ టవర్‌ను నిర్మిస్తే, షాజహాన్‌ దాన్ని ముంతాజ్‌కోసం కొత్త నమూనాతో పునర్నిర్మించాడట. ఇందులో పాలరాతి ఫిలిగ్రీ అద్భుతం. చివరిరోజుల్లో రాజ్యాధికారం కోసం జరిగిన అంతర్గతపోరులో కుమారుడు ఔరంగజేబు షాజహాన్‌ను ఇక్కడే గృహనిర్బంధం చేశాడు. ఇక్కడి నుంచే షాజహాన్‌ తాజ్‌మహల్‌ను చూస్తూ గడిపేవాడట. మీనామసీదు, మోతీమసీదులను కూడా చూసి మధుర, బృందావనాల్లోని దేవాలయాలను సందర్శించి గ్వాలియర్‌కు బయలుదేరాం.

గ్వాలియర్‌ కోటలో...
ముందుగా నగరంలోని సింధియాల జై విలాస్‌ ప్యాలెస్‌కు వెళ్లాం. దీన్ని 1874లో కోటి రూపాయల ఖర్చుతో కట్టారట. దీని విలువ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇందులో ప్రధానంగా చూడదగ్గది అతిపెద్ద భోజనాల బల్ల. దీనిమీద ఓ చిన్న వెండి రైలు తిరుగుతూ అతిథులకి కావలసిన బ్రాందీ, విస్కీ... వంటి పానీయాలూ సిగరెట్లూ సిగార్లూ అందజేస్తూ ఉంటుంది. తమకు కావలసినవి ఉన్న పెట్టె తమ ముందుకు వచ్చినప్పుడు ఎవరికి వారు తీసుకుంటారట. రెండోది దర్బార్‌ హాలు. ఇందులో 250 బల్బులు ఉన్న రెండు షాండియర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అతిపెద్ద క్రిస్టల్‌ షాండ్లియర్లు. దర్బార్‌ హాల్లో పరిచిన తివాచీ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. గోడలకీ కప్పుకీ వేసిన పూలూ లతల డిజైన్ల తాపడానికీ దాదాపు రెండు క్వింటాళ్ల బంగారం వినియోగించారట. ఇంకా ఈ భవనంలో అప్పట్లో రాజకుటుంబీకుల జీవనవిధానాన్ని తెలియజేసే వస్తువులతో కూడిన ప్రదర్శనశాల ఉంది. అక్కడి నుంచి గ్వాలియర్‌ కోటకు వెళ్లాం.

దీన్ని ఎప్పుడు నిర్మించారో తెలియదుకానీ ఆరో శతాబ్దం నాటికి ఇది ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వింధ్య పర్వతశ్రేణుల్లోని ఇసుకరాతితో నిర్మితమైనది. ఈ కోటను చూసి ‘హిందూస్తాన్‌ కోటల హారంలో ఇది మణిపూస వంటిది’ అని బాబర్‌ వ్యాఖ్యానించాడు. ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు భూమ్మీదా ఉన్నాయి. భూగర్భ అంతస్తులోకి గాలీవెలుతురూ దారాళంగా వచ్చేలా నిర్మించారు. అప్పట్లోనే అంతస్తుల మధ్య పరస్పర సమాచార మార్పిడికోసం ఇంటర్‌కమ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. గోడల్లో కనిపించకుండా ఏర్పాటుచేసిన గొట్టాల ద్వారా సంభాషించుకునేవారట. 11వ శతాబ్దం నుంచి ఇది పలువురి దురాక్రమణలకు గురయింది. 1568లో అక్బరు ఈ కోటను స్వాధీనం చేసుకుని రాజకీయ శత్రువులను ఉరితీసే ప్రదేశంగానూ మార్చాడు. తరవాత ఈ కోట గోహాద్‌ రాణాలూ మరాఠాలూ బ్రిటిషర్ల చేతులుమారి చివరకు సింధియాలకు దక్కింది. ఇందులో మాన్‌సింగ్‌ నిర్మించిన మన్‌ మందిర్‌ నిర్మాణశైలి చూడ్డానికి ఎంతో బాగుంది. కోటలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా సంగీతమహల్‌ వస్తుంది. దీనిపక్కనే నృత్యమందిర్‌ ఉంది. అందులో గోడలకు అద్దాలు తాపడం చేసి ఉండేవి. దీపాల వెలుగులో ఆ అద్దాలతోబాటు కళాకారుల దుస్తుల పైన కుట్టిన అద్దాలమీదా ఆ దీపకాంతి ప్రతిబింబించి మందిరమంతా వెలుగులతో నిండిపోయేదట. ఇందులోనే ఓ పక్కన గ్రంథాలయం ఉంది. భూగర్భంలో జలక్రీడలకోసం నీటికొలను ఉంది.

ఝాన్సీకోటలో..!
తరవాత ఝాన్సీలక్ష్మీబాయి బ్రిటిష్‌ సేనలతో పోరాడుతూ మరణించిన ప్రదేశంలో కట్టిన సమాధినీ ఝాన్సీకోటనీ చూసి ఓర్చాలోని రామరాజ దేవాలయం, రాధాకృష్ణుల ఆలయం, లక్ష్మీనారాయణ దేవాలయాలు చూసి వెనుతిరిగాం.