Friday, 4 January 2019

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం


పేరు :శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
దేవనాగరి :श्री महाकालेश्वर ज्योतिर्लिंग
రాష్ట్రము :మధ్యప్రదేశ్
ప్రదేశము :ఉజ్జయిని
ప్రధానదైవం :మహాకాళేశ్వరుడు (శివుడు)
వెబ్‌సైటు :http://www.mahakaleshwar.nic.in


మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం “రుద్రసాగరం” సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని “స్వయంభువు”గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.

జ్యోతిర్లింగం
శివ పురానం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు, తమలో తము “నేను గొప్ప అంటే నేను గొప్ప” అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది. ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి, ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను. రెండు, కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు, బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు యేర్పరచిన “జ్యోతిర్లింగం” అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం “లింగము”. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలం లోని మల్లిఖార్జునుదు, ఉజ్జయిని లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారినాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాశిలోని కాశీ విశ్వనాథుడు, మాహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు.

దేవాలయ విశేషాలు
ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని “దక్షిణామూర్తి” అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో “ఓంకారేశ్వర మహాదేవ” విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి మరియు కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర మరియు తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. మూడవ అంతస్తులో గల “నాగచంద్రేశ్వర” విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెలుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి యున్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం (పవిత్ర సమర్పణ) ఇతర ఆలయా వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయ. మహాకాల్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడ్ని ఇక్కడ మహాకాల్గా కొలువై ఉండమని ప్రార్థించాడనీ, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణకథలు వినిపిస్తాయ.

భస్మ మందిరం
ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.

స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాధుని దర్శనం అయనంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మపూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మసానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణకథలూ ఉన్నాయ. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువునుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి “భస్మ హారతి” (అస్థికలు సమర్పణ) రొజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ రెండు గంటలపాటు ఆవుపేడ పిడకలను (cow dung cakes ) ఉపయోగించి నిర్వహిస్తారు. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.

ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మ హారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటంకాని, చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి వున్న నంది మంటపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక, సమీపంలో కూర్చుని దర్శనం చేసుకొంటారు.

భస్మ హారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనం ఇస్తాడు.ఈ భస్మ ఆరతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక మరియు మానవ జీవితంలో భస్మఆరతి దర్శనం పునర్జన హరణం.

మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తి పీఠం

18 మహా శక్తి పీఠములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

పురాణశాస్త్రం
పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి “అవంతిక” అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని “చంద్రసేనుడు” అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుదు. తన పూర్తికాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు (శ్రీకరుడు) రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు మరియు సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. అయన నిర్ఘాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్ర నదీ తీరంలో ప్రార్థనలు చేస్తాడు. రాజు దాడి చేసాడు మరియు విజయాన్ని సాధించాడు. బ్రహ్మ దేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కలిపించకుండా సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకొని శివ భక్తులపై దాడులు చేశారు.

శివుడు ఆయనభక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు మరియు వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు. అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారినుండి రక్షించాలని నిశ్చయించుకున్నాదు. ఆ రోజు నుండి మహాశివుడు లింలో మహాకాలునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించినవారికి మరణం మరియు వ్యాథుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపాడు.

చరిత్ర
ఈ దేవాలయ సముదాయం సుల్తాన్ షాస్-ఉద్-దీన్ (ఇలుత్మిష్) చే 1234-5 ప్రాంతంలో ఉజ్జయిని పై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడింది. ప్రస్తుత నిర్మాణం క్రీ.శ 1736 లో శ్రీమంత్ రానోజీరావు షిండే మహరాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పీష్వా బాజీరావు మరియు ఛత్రపతి షాను మహరాజ్ లచే నిర్మింపబదినది. తర్వాతి అభివృద్ధి మరియు నిర్వహణ శ్రీనాథ్ మహాడ్జి షిండే మహరాజ్ (మహాడ్జి ది గ్రేట్) చే జరిగింది.

1886 వరకు మహారాజ శ్రీమంత్ జయాజీ రావు సాహెబ్ షిండే ఆలిజాహ్ బహాదూర్ చే నిర్వహింపబడింది. స్వాతంత్ర్యం వచ్చిన పిదప ఈ దేవాలయం నిర్వహనను ఉజ్జయిని మ్యునిసిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలెక్టరు కార్యాలయం నిర్వహణలో కొనసాగుతుంది.

విశేషాలు
పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.జ్యోతిర్లింగ క్షేత్రాలు

జ్యోతిర్లింగ క్షేత్రాలు
జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి?


శివ భగవానుడికి నీల కాంత, శంకర, పరమాత్మ, కరుణాసాగర, భోలేనాద అని ఎన్నో పేర్లు. శివ భగవానుడు సాధారణంగా ఎదో ఒక రూపంలో ప్రతి ఇంతా పూజించబడతాడు. దేశంలో శివుడికి అనేక దేవాలయాలు కలవు. అయితే, హిందువులకు అత్యంత పవిత్రమైన శివ దేవాలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ పన్నెండు జ్యోతిర్లిన్గాలను చూస్తె, శివుడి కృపా కటాక్షాలు లభించి మోక్షం కూడా లభిస్తుందని హిందువుల నమ్మిక. సమయం తప్పక చేసుకొని జీవితంలో ఒకసారి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించి, శివుడి కృపకు పాత్రులు కండి. మరి హిందువులు ఇంత పవిత్రంగా భావించే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారత దేశంలో ఎక్కడెక్కడ వున్నయో పరిశీలిద్దాం.

సోమనాధ దేవాలయం
గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాధ దేవాలయం కలదు. ఈ దేవాలయం అనేక మార్లు విదేశీయుల దండయాత్రలకు గురి అయింది. అయినప్పటికీ దీనిని ఎప్పటికపుడు పునరుద్ధరించి, ఆలయ పవిత్రతలను కాపాడుతున్నారు.

మహా కాళేశ్వర
ద్వాదశ జ్యోత్లిర్లిన్గాలలో రెండవదైన మహాకాళేశ్వర లింగం మధ్యప్రదేశ్‌లోని అతి పురాతన పవిత్ర నగరమైన ఉజ్జయని దల్లి కలదు. స్వయంభూ లింగ రూపంలో మహా కాళేశ్వర దేఆలయం రుద్రా సాగర సరస్సు సమీపంలో కలదు.

ఓంకారేశ్వర దేవాలయం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవదైన ఓంకారేశ్వర దేవాలయం మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది సమీపంలో శివ పూరి అనే ద్వీపంలో కలదు. ఈ ద్వీపం హిందువుల పవిత్ర ఓం కార ఆకారంలో ఉండటంవలన, దీనికి ఓంకారేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ద్వీపంలో రెండు దేవాలయంలు కలవు. అవి ఒకటి ప్రనవనాడా ఓంకారేశ్వర టెంపుల్ మరియు రెండవది చిరాయు లేదా అమరనాధ అమరేశ్వర దేవాలయం. ఒక పురాణ కదా మేరకు ఒకే శివ లింగాని రెండు భాలుగా చేసి ఒకటి ఓంకారేస్వరుడి గాని మరొకటి అమరేస్వరుడి గాని ఏర్పడ్డాయని చెపుతారు.

కేదారనాధ దేవాలయం
కేదారనాధ దేవాలయం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణులలో మందాకినీ నది సమీపంలో కలదు. ఈ ప్రదేశంలోని అతి శీతల వాతావరణం కారణంగా, ఈ జ్యోతిర్లన్గాన్ని సంవత్సరంలో ఏప్రిల్ చివరి నుండి నవంబర్ నెల చివరి వరకు మాత్రమే సందర్శించ దగినది.

భీమ శంకర జ్యోతిర్లింగ
భీమ శంకర జ్యోతిర్లింగా టెంపుల్ మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఖేడ్ తాలూకాలో కలదు. ఈ టెంపుల్ భీమా నది సమీపంలో వుండటంచే, ఇక్కడి దేవుడికి భీమ శంకరుడనే నామం స్థిరపడింది.

కాశి విశ్వనాధ దేవాలయం
కాశి విశ్వనాధ దేవాలయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లేదా కాశి పట్టణంలో కలదు. ఇది హిందూ దేవాలయాలలో ప్రసిద్ధి చెందినా యాత్రా కేంద్రం.

త్రయంబకేశ్వర దేవాలయం
త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబక పట్టణంలో కలదు. ఇది అతి పురాతన ప్రసిద్ధ జ్యోతిర్లింగా దేవాలయంగా చెపుతారు. నాసిక్ పట్టణానికి 28 కి.మీ.ల దూరంలో కల త్రయంబకేశ్వర ద్వీపం భారత దేశంలో అతి పొడవైన గోదావరి నది పుటుక ప్రదేశం.

వైద్య నాద దేవాలయం
ఖచ్చితమైన ప్రదేశంపై ఇంకనూ వివాదం ఉన్నప్పటికీ, ఈ దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగడ్ పట్టణంలో కలదు. దీనిని కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగనిస్తారు.

నాగేశ్వర దేవాలయం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జాగేస్వర్‌లో కల నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఈ జ్యోతిర్లిన్గాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగనిస్తారు.

రామేశ్వరం
తమిళనాడులోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.

ఘుష్ మేస్వర్
రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఈ జ్యోతిర్లింగా దేవస్థానం కలదు. దీనిని పన్నెండవ, అంటే, చివి జ్యోతిర్లింగంగా పరిగనిస్తారు.

మల్లిఖార్జున దేవాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో కల శ్రీశైలంలోని మల్లిఖార్జున దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటై భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
Thursday, 3 January 2019

లంబసింగిమంచు కురిసే వేళలో
పొగమంచు అందాలను ఆస్వాదిద్దాం అలా అలా తాకే మంచు తుంపర్లు...
చుట్టూ దుప్పటిలా పరుచుకున్న పొగమంచు...
గడ్డ కట్టించే చలి...
కశ్మీర్‌ను తలపించే వాతావరణం...
చూస్తే ఎవరికైనా మనసు పులకరించకమానదు. హాయి హాయిగా శరీరం తేలిపోతూనే ఉంటుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ వాతావరణం మరెక్కడో లేదు. మన రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మన్యంలో నెలకొంది. అక్కడ కురుస్తున్న మంచు వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

విశాఖ మన్యంలో మండువేసవిలోనూ చల్లని వాతావరణం కనిపిస్తుంటుంది. శీతాకాలమైతే చెప్పనవసరమే లేదు. చలికి గజగజలాడాల్సిందే. చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇది సముద్రమట్టానికి సుమారు 3600అడుగుల ఎత్తులో ఉంది. చలికాలం మంచుదట్టంగా కమ్ముకుని వర్షం చినుకుల్లా కురుస్తుంది.  సూర్యకిరణాలు ఇక్కడ నేలను తాకే అవకాశాలు తక్కువ. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్యలో దట్టమైన పొగమంచు కప్పేసి ఉంటుంది. ఎముకలు కొరికే చలి, పొగమంచు వంటి సహజసిద్ధ ప్రకృతి సోయగాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, వంపులు తిరిగిన ఘాట్‌ రోడ్డు, కాఫీతోటలు, నీటివనరులు దర్శనమిస్తాయి. ఇది ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ స్ట్రాబెర్రి పండ్ల పెంపకాన్ని చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. సమీపంలోనే బ్రిటీష్‌ కాలం నాటి రూథర్‌పర్డ్‌ అతిథిగృహం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా శిథిలమైంది. లంబసింగి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పైనే ఆనాడు అల్లూరి సీతారామరాజు, తన బృందంతో దాడి చేసి ఆయుధాలను పట్టుకుని వెళ్ళిపోయారు. పర్యాటకులు తప్పనిసరిగా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం... అక్కడి నుంచి పాడేరు మీదుగా అరకు, బొర్రా గుహలను సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రాత్రి బస చేసేందుకు లంబసింగిలో ఎటువంటి వసతి సదుపాయాలు లేకపోవడంతో స్థానికులే వారికి భోజన, వసతి సదుపాయాలను సమకూరుస్తున్నారు. ఇటీవల కొందరు లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో చిన్నచిన్న రిసార్టులు ప్రారంభించారు. క్యాంప్‌ టెంట్లను ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. ఆరుబయట మంచులో క్యాంప్‌ ఫైర్‌ వెలిగించి టెంట్‌లో సేదతీరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకశాఖ రూ.8 కోట్లతో నిర్మిస్తున్న రిసార్ట్‌ పనులు మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డీవీఎమ్‌ ప్రసాద్‌ రెడ్డి చెప్పారు.


ఇలా చేరుకోవచ్చు

విశాఖపట్నం నుంచి చింతపల్లి మీదుగా భద్రాచలం బస్సులు ఉన్నాయి. మల్కాన్‌గిరి, వయా భద్రాచలం మీదుగా హైదరాబాద్‌ బస్సు కూడా రోజుకోసారి విశాఖ నుంచి వెళుతుంటుంది. వీటి ద్వారా చేరుకోవచ్చు. ఆరు గంటల ప్రయాణం. విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకుంటే అక్కడి నుంచి భద్రాచలం బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు చాలా ఉంటాయి.భిన్న భౌగోళిక పరిస్థితుల వల్లే

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే లంబసింగి భిన్నమైన భౌగోళిక స్వరూపంతో నిండి ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి 100 మీటర్లకు ఒక డిగ్రీ సాధారణ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ లెక్కన మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ 10 డిగ్రీలు తగ్గుతుంది. గాలిలో సాంద్రత తక్కువ కారణంగా ఇక్కడ పొగమంచు నేరుగా నేలను తాకకుండా చెట్ల ఆకులపై పడుతుంది. చుట్టూకొండలే ఉండడంతో పొగమంచు వేరే చోటుకు ప్రయాణించడానికి వీల్లేకుండా అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. అవన్నీ కలగలిపి ఉండటమే ప్రత్యేకత. తెలుగురాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నా అక్కడ మంచు, అడవుల ప్రభావం ఉండదు.

- డాక్టర్‌ డీవీ రమణారెడ్డి, ఏడీఆర్‌, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం